సిద్ధరామయ్య పాత్రపై 3 నెలల్లోపు నివేదిక ఇవ్వండి
లోకాయుక్త పోలీసులను ఆదేశించిన బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు.
సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది.
మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది.
విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం
దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment