Urban Development Authority
-
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
MUDA scam: సిద్ధూ మెడకు ‘ముడా’ ఉచ్చు
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్యతనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీవిచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గేప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త‘లుక్’మనేలా
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (రుడా) అడుగులు వేస్తోంది. ఆయా గ్రామాల్లో అందివస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజా ప్రయోజన, ఆరోగ్య రక్షణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పే పనులకు ప్రాధాన్యం ఇస్తోంది. మొక్కల పెంపకం, సంరక్షణతో పాటు గ్రామాల పేర్లను సూచించే నేమ్‌బోర్డులను అ«దునాతనంగా రూపొందించి ఏర్పాటు చేస్తోంది. 66 పనులకు రూ.26.84 కోట్ల నిధులు వ్యయం చేస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కొన్ని పనులు పురోగతిలో ఉండగా.. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి. రాజమహేంద్రవరాన్ని ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దిన రుడా తన పరిధిలోని గ్రామాలకు పట్టణ శోభను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పనులను రుడా వీసీ బాలస్వామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిన్నారు. సుందరీకరణ పనులు ఇలా.. రుడా పరిధిలో నిర్వహించే పనుల్లో సుందరీకరణ, వాకింగ్ ట్రాక్‌లు, రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్ బాడీ, బీచ్ ఫ్రంట్ నిర్వహణ పనులకు మొదటి ప్రాధాన్యత కల్పి స్తున్నారు. నియోజకవర్గాల వారీగా మచ్చుకుకొన్ని పరిశీలిస్తే.. అనపర్తి: బలభద్రపురంలో రూ.1.65 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్ బాడీ పనులు పూర్తి చేసింది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా నీటితో కూడిన పార్క్, వాకింగ్ ట్రాక్, ప్రజలు సేదతీరేందుకు పచ్చదనం పెంపొందించే పనులు ప్రారంభించింది. కొవ్వూరు: గోష్పాద క్షేత్రం సమీపంలోని కొవ్వూరు కట్ట వెంబడి రివర్ ఫ్రంట్ రూపుదిద్ది భక్తులకు స్వాంతన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పచ్చదనం పెంపొందించి అందులో వివిధ జంతువుల నమూనా విగ్రహాలు వరద నీటికి తట్టుకునే స్థాయిలో తయారు చేస్తున్నారు. ఇందుకు రూ.కోటి వెచి్చంచనున్నారు. రూ.32.86 లక్షలతో అధునాతన విద్యుత్ స్తంభాలు, దీపాలు అమర్చనున్నారు. ‘ఐ–లవ్ కొవ్వూరు’ చిహ్నాన్ని సెల్ఫీ పాయింట్‌గా ఆధునీకరించనున్నారు. గోపాపురం: దేవరపల్లి మెయిన్ రోడ్ నుంచి గోపాలపురం వరకు రూ.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ పనులు పురోగతిలో ఉండగా.. మరో మరికొన్ని టెండర్ స్టేజ్‌లో ఉన్నాయి. నిడదవోలు: చిన్న కాశీ రేవు నుంచి గూడెం గేటు వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి వెచి్చంచనున్నారు. రాజమహేంద్రవరం సిటీ: నగరంలో రూ.30 లక్షలతో జగనన్న ఉమెన్స్ హెవెన్, రూ.12 లక్షలతో ఆజాద్‌చౌక్, ఎల్ఈడీ లైట్లు, రూ.6 లక్షలతో పుష్కరఘాట్ వద్ద దుస్తులు మార్చుకునే గది నిర్మాణం పూర్తయింది. రూ.37.50 లక్షలతో జీఎన్టీ రోడ్డులో మొక్కల పెంపకం, కుండీలు, మొక్కల నిర్వహణ, రూ.2 కోట్లతో హెవలాక్ బిడ్జి వద్ద రంగుల విద్యుత్ దీపాలు, రూ.2 కోట్లతో కంబాలచెరువు పార్కులో మ్యుజికల్ ఫౌంటేన్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్: శాటిలైట్ సిటీ డి–బ్లాక్ వద్ద రూ.50 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం, రూ.38.50 లక్షలతో కోలమూరు వద్ద అప్పన్నచెరువు పార్క్ అభివృద్ధి, రూ.47.50 లక్షలతో ధవలేశ్వరం పాంచాయతీలో ఓపెన్ జిమ్, వాకింగ్‌ట్రాక్ పనులు టెండరు దశలో ఉన్నాయి. కోనసీమజిల్లా: ఆత్రేయపురం వార్ఫ్ రోడ్డు వద్ద రూ.1.50 కోట్లతో రివర్ ఫ్రంట్, రూ.31 లక్షలతో రావులపాలెం జంక్షన్ వద్ద క్లాక్‌టవర్ అభివృద్ధికి టెండర్లు ఆహా్వనిస్తున్నారు. వాడపల్లి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.41.70 లక్షల వ్యయంతో ఆధ్యాతి్మకను సూచించే త్రిశంకు ఆకారంలో విద్యుత్ దీపాలు అమర్చే పనులు పురోగతిలో ఉన్నాయి. రావులపాలెం: కొమర్రాజులంక గ్రామంలో రూ.50 లక్షలతో పార్క్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి టెండర్లు ఆహ్వానిస్తున్నారు. విస్తృతంగా సుందరీకరణ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశానికి అనుగుణంగా రుడా పరిధిలోని ప్రాంతాల్లో సుందరీకరణ, ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. స్థానికఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు, రుడా నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదన్న ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో చేపడుతున్న పనులను చూసైనా బుద్ధి వస్తుందని భావిస్తున్నాం. –మేడపాటి షర్మిలారెడ్డి, చైర్పర్సన్ రుడా రాజానగరంలో ‘జిమ్’దాబాట్ రాజానగరం నియోజకవర్గంలో గాదరాడ, బూరగపూడి, శ్రీరంగపట్నం గ్రామాల్లో రూ.20.30 లక్షల వ్యయంతో యువతకు ఫిట్నెస్ పెంపొందించే జిమ్‌ల నిర్మాణం పూర్తయింది. విమాన ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ఎయిర్పోర్ట్ రోడ్డు వెంబడి ఉన్న సెంట్రల్ లైటెనింగ్ పోల్స్‌కు రూ.55 లక్షలతో ఎల్ఈడీ మోటిఫ్ ఏర్పాటు. రూ.2 కోట్లతో కోరుకొండ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్ పునరుద్ధరణకు మార్గం సుగమం కానుంది. పుణ్యక్షేత్రం వద్ద బర్డ్స్ పార్క్, ‘ఐ లవ్ రాజానగరం’, గ్రామ పేరు సూచించే సైన్‌బోర్డు పనులు టెండరు దశలో ఉన్నాయి. -
73 గ్రామాలు.. 568 కిలో మీటర్లతో ‘నుడా’ మాస్టర్ ప్లాన్..
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) మాస్టర్ ప్లాన్ దాదాపు ఖరారైంది. 73 గ్రామాలను కలుపుకొని మొత్తం 568.32 చదరపు కిలోమీటర్ల మేర నుడా పరిధిలోకి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్లాన్‌కు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు శనివారం ఆమోదం తెలిపారు. నుడా పరిధిలోకి తీసుకొచ్చిన గ్రామాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. అభ్యంతరాలను నుడా కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించాక నుడా పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌తో కలిపే నుడా పరిధిని ఖరారు చేశారు. తొమ్మిది విలీన గ్రామాలను కలిపి 318.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్ మాస్టర్‌ప్లాన్‌ను మూడేళ్ల క్రితమే రూపొందించారు. కానీ, ఆ తర్వాత 73 గ్రామాలను కలిపి నుడాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తొలుత రూపొందించిన కార్పొరేషన్ మాస్టర్‌ప్లాన్‌ను కలుపుకొని నుడా బృహత్ ప్రణాళికను తయారు చేశారు. కార్పొరేషన్ మాస్టర్‌ప్లాన్ పరిధి (318.50 చ.కి.మీ.)కి తోడు నగర పాలక సంస్థ వెలువల ఐదు కిలోమీటర్ల రేడియల్ విస్తీర్ణం (249.82 చదరపు కి.మీ.)తో కలిపి నుడా మాస్లర్‌ప్లాన్ పరిధిని ఖరారు చేశారు. (చదవండి: మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్ మరి!) నుడా మాస్టర్ ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాలివే.. ► నిజామాబాద్ రూరల్ మండలం(19 గ్రామాలు): ధర్మారం(ఎం), ధర్మారం(టి), గుండారం, రామ్‌నగర్, శాస్త్రినగర్, శ్రీనగర్, జలాల్పూర్, కేశాపూర్, కొండూరు, లక్ష్మాపూర్, మల్కాపూర్(ఎ), మల్కాపూర్(ఎం), మల్లారం, చక్రధర్నగర్(టి), గాంధీనగర్, ముత్తకుంట, లింగితండా, పాల్దా, తిర్మన్‌పల్లి ► డిచ్పల్లి మండలం(10 గ్రామాలు): అమృతపూర్, దేవ్నగర్క్యాంపు, ఆరేపల్లి, బర్ధీపూర్, ధర్మారం(బి), మెంట్రాజ్‌పల్లి, నాక తండాా, వెస్లీనగర్ తండాా, ముల్లంగి(ఐ), నడిపల్లి ► మాక్లూర్ మండలం(13 గ్రామాలు): అమ్రాద్, అమ్రాద్ తండాా, బొంకన్పల్లి, చిన్నాపూర్, మదన్‌పల్లి, సట్లాపూర్ తండాా, మాక్లూర్ కింద తండా, సింగంపల్లి తండా, మామిడిపల్లి, ముల్లంగి(బి), వడ్డేటిపల్లి, సింగంపల్లి ► మోపాల్ మండలం(11 గ్రామాలు): కంజర, ఒడ్డెర కాలనీ, కులాస్పూర్, కులాస్పూర్ తండా, ముదక్పల్లి, గుడి తండా, శ్రీరామ్‌నగర్(టి), మోపాల్, న్యాల్కల్, సిర్పూర్, ఠానాకుర్దు ► నవీపేట మండలం(8 గ్రామాలు): అబ్బాపూర్(ఎం), అభంగపట్నం, స్టేషన్ ఏరియా, అనంతగిరి, ధర్మారం(ఏ), మహంతం, మోకన్‌పల్లి, నారాయణపూర్ ► ఎడపల్లి మండలం(10గ్రామాలు):– జైతాపూర్, జంలం, ఎం.ఎస్.సీ.ఫారం, జానకంపేట, కుర్నాపల్లి, మల్లాపహాడ్, మంగల్పహాడ్, పోచారం, ఠాణాకలాన్, బాపునగర్ ► రెంజల్ మండలం(1): దూపల్లి ► వర్ని మండలం(1): మాలాయిపూర్ నుడాకు సరిహద్దు గ్రామాలు.. ► ఉత్తరం: ధరియాపూర్, నవీపేట, కమలాపూర్, పోతంగల్, జన్నేపల్లి, మెట్పల్లి, గొట్టిముక్కల, వెంకటాపూర్, కల్లెడ, గుత్ప ► దక్షిణం: డిచ్పల్లి, ఘన్పూర్, దూస్‌గాం, చిన్నాపూర్, బాడ్సి, మంచిప్ప, కాల్పోల్, బాజిదాపూర్, ఫారెస్టు ఏరియా, చింతకుంట ► తూర్పు: మిట్టాపల్లి, బీబీపూర్ తండా, సుద్దపల్లి, యానంపల్లి, పుప్పాలపల్లి, సికింద్రాపూర్, మాదాపూర్, మునిపల్లి ► పడమర: మోస్రా, అమ్దాపూర్, ఇబ్రహీంపూర్, ఎరాజ్‌పల్లి, ఎడపల్లి, ఏఆర్పీ క్యాంపు, బ్రాహ్మణపల్లి, కల్యాపూర్, రెంజల్ (చదవండి: ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రకాశ్ రాజ్ భేటీ!) -
పట్టణాభి'వృద్ధి' లేకున్నా మరొకటి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే మరొక సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది. ఉన్న వాటికే దిక్కు లేకుంటే.. కొత్త సంస్థల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఏం ఉంటుందనే అభిప్రాయం వినపడుతోంది. ఆయా సంస్థల కార్యాలయాల్లో కనీసం ఫర్నీచర్ లేని పరిస్థితులు ఉన్నాయని అధికార పార్టీకి చెందిన చైర్మన్, పాలకమండలి సభ్యులుగా నియమితులైన వారే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నాయకులకు రాజకీయ ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం వినపడుతోంది. సిబ్బంది ఉండదు.. నిధులు ఉండవు.. రాష్ట్రంలో అనంతపురం, గోదావరి, కర్నూలు, మచిలీపట్నం, నెల్లూరు, తిరుపతి, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలతో పాటు ఏపీ సీఆర్డీఏ, విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. వీటికితోడు కొత్తగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఒకటి, రెండు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు మినహా ఎక్కడా పరిస్థితులు సానుకూలంగా లేవు. 2016లో ఏర్పాటైన నెల్లూరు, కర్నూలు, అనంతపురం, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు ప్రభుత్వం ఇంత వరకు పూర్తిస్థాయి సిబ్బందిని సైతం నియమించలేదు. వాటికి చైర్మన్లుగా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకులు పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల వరకు ప్రత్యేక చాంబర్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అనేక సార్లు కలసి పట్టణాభివృద్ధి సంస్థలకు నిధుల కొరత వేధిస్తోందని గోడు వెళ్లబోసుకున్నారు. ఎట్టకేలకు 2017లో ఒక్కో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రూ. 50 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే టౌన్‌ప్లానింగ్, ఎస్టేట్, ఇంజినీరింగ్ వంటి ముఖ్య విభాగాలకు సిబ్బంది కొరత వెన్నాడుతోంది. అక్కడి పట్టణాభివృద్ధి సంస్థల్లో అసలు పని ఉండటం లేదని తెలుసుకున్న అధికారులు, ఉద్యోగులు అక్కడ పని చేయడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఎవరినైనా ప్రభుత్వం నియమించినా, ఆ అధికారి డబ్బులు ఖర్చు చేసుకుని మరీ అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పలుకుపడి ముందు ‘ప్రకాశం’ పక్కకు.. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో పాటు ప్రకాశం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కూడా అధికారులు ప్రతిపాదనలను రూపొందించారు. అయితే ఏలూరు అథారిటీ ఏర్పాటులో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సీఎం వద్ద తనకున్న పలుకుబడితో దాన్ని వెంటనే ఏర్పాటు చేయించుకున్నారని చెబుతున్నారు. ఏలూరు నగరపాలక సంస్ధతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలను కలిపి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణాభివృద్ధి సంస్థలకు నిధుల కొరత వెన్నాడుతోన్న నేపథ్యంలో ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థకు కూడా అవే సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రకాశం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదనలు మాత్రం ప్రభుత్వం వద్ద పరిశీలనలోనే ఉండిపోయిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ కారణాలతో అథారిటీ మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని నాలుగు నెలల క్రితం ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించినా.. సిబ్బంది నియామకం ఇంకా జరగలేదు. చైర్మన్‌గా నియమితులైన టీడీపీ సీనియర్ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్‌కు ఇప్పటివరకు ప్రత్యేక కార్యాలయమే ఏర్పాటు కాలేదు. దీని ఏర్పా టు వెనుక రాజకీయపరమైన అంశం ఇమిడి ఉందనే విమర్శలు పార్టీలో లేకపోలేదు. పెడన సీటును ఆశిస్తున్న వేదవ్యాస్‌ను ఆ పోటీ నుంచి తప్పించేందుకే సీఎం చంద్రబాబు హడావుడిగా మచిలీపట్నం అథారిటీని ఏర్పా టు చేసి, ఆయన్ను చైర్మన్‌గా నియమించారని రాజకీయ వర్గాల్లో వినప డుతోంది. ఇలా టీడీపీ నాయకులకు రాజకీయ పునరావాసం కోసం ఈ అథారిటీలను ఉపయోగిం చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కరీంనగరం స్వర్గధామం
నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం: సీఎం కేసీఆర్- శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు- హైదరాబాద్ తరహాలో కమాండ్ కంట్రోల్ సెంటర్- 4 లక్షల మొక్కలతో హరితహారం.. మానేర్ రివర్ ఫ్రంట్ ఏర్పాటు- స్వర్గధామంలా నివాస గృహాలు నిర్మిస్తామని వెల్లడి- వెంటనే రూ.25 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు- తొలి ఇంటిని తానే కొనుగోలు చేస్తానన్న కేసీఆర్సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నగర అభివృద్ధికి శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ వద్ద మానేరు రివర్ ఫ్రంట్ సుందరీకరణకు బడ్జెట్లో కేటాయించిన రూ.506 కోట్లలో రూ.25 కోట్లను బుధవారం విడుదల చేశారు. కరీంనగర్ అభివృద్ధి అంశంపై సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రగతి భవన్లో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.మంత్రులు హరీశ్‌రావు, ఈటల, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ ఎస్పీ సింగ్, పలువురు ఉన్నతా ధికారులు, కరీం నగర్ జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీసు కమిషన రేట్లున్న పట్టణాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.అద్భుతంగా తీర్చిదిద్దుతాంమానేరు రివర్ ఫ్రంట్‌ను 90 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేస్తామని.. ఉత్తర తెలం గాణకు మకుటంగా, అత్యంత సుందరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. విశాలమైన పచ్చిక బయళ్లు, యోగా కేంద్రాలు, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ ఏర్పాటు చేస్తామని, నదికి అభిముఖంగా స్వర్గధామంగా ఉండేలా నివాస గృహాలు నిర్మిస్తామని చెప్పారు. అందులో మొదటి గృహాన్ని తానే కొనుగోలు చేస్తానని, రెండో గృహాన్ని మంత్రి ఈటెల కొనుగోలు చేస్తారని తెలిపారు. రివర్ ఫ్రంట్‌ను మొదట చేగుర్తి లింగాపూర్ వరకు, రెండో దశలో వేగురుపల్లి వరకు సుందరీకరిస్తామని.. వెంటనే ఈ పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నదికి ఇరువైపులా పొడవుగా పెరిగే మొక్కలు నాటాలని సూచించారు.హరిత హారానికి భారీగా విరాళాలుకరీంనగర్లో హరితహారానికి భారీగా విరాళాలు ఇచ్చేందుకు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ముందు కొచ్చారు. ఎంపీ వినోద్‌కుమార్ రూ.50 లక్షలు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు రూ.50 లక్షలు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రూ.50 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి తదితరులు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఖర్చు చేస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి వెల్లడించిన నిర్ణయాలివీ..► కరీంనగర్‌కు అభివృద్ధి ప్రణాళిక తయారీ, అమలు కోసం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. నగరంలో వివిధ రంగాల పరిస్థితిని అధ్యయనం చేసి బ్లూప్రింట్ తయారు చేసే బాధ్యత మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు అప్పగింత.► పదిన్నర కిలోమీటర్ల పొడవున్న లోయర్ మానేరు డ్యామ్ కట్టపై మొక్కల పెంపకం. డ్యామ్ మీద టూరిస్టు స్పాట్, వ్యూపాయింట్, రెస్టారెంట్ ఏర్పాటు, కాటేజీల నిర్మాణం. రూ.40 కోట్లతో డ్యామ్ సుందరీకరణ పనులు.► నగరంలో పచ్చదనం పెంచేందుకు రూ.10 కోట్లతో స్పెషల్ డ్రైవ్. ఇందుకోసం కరీంనగర్లో హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అదే రోజున నగరవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటుతారు. పచ్చదనం పెంపు కార్యక్రమ పర్యవేక్షణకు ఐఎఫ్ఎస్ అధికారి వి.ఆంజనేయులుకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు.► కరీంనగర్లో మరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు. అవసరమైన చోట రోడ్ల వెడల్పు. ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు బస్‌బేల నిర్మాణం. ప్రస్తుత పోలీసు కార్యాలయ ప్రాంగణంలో కొత్త పోలీస్ కమిషనరేట్ నిర్మాణం. హైదరాబాద్ తరహాలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లేర్పాటు.► ప్రస్తుతం కలెక్టరేట్ ఉన్న చోట పదెకరాల విస్తీర్ణంలో నూతన కలెక్టరేట్, జిల్లా పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్ భవనాల రీమోడలింగ్. అక్కడే కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు.► కరీంనగర్ చుట్టూ ఉన్న రహదారులను లింక్ చేసి ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు.► పదెకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో కరీంనగర్ కళాభారతి నిర్మాణం. 500, 1200 మంది పట్టే సామర్థ్యంతో రెండు వేర్వేరు హాళ్ల ఏర్పాటుకు నిర్ణయం.► నగరంలో రూ.25 కోట్లతో ఐదు చోట్ల శాకాహార, మాంసాహార మార్కెట్ల ఏర్పాటు. గజ్వేల్‌లో నిర్మించిన తరహాలో ఏసీ సౌకర్యంతో పాటు పరిశుభ్ర మార్కెట్ల నిర్మాణం.► నాలుగు చోట్ల ఖనన వాటికలు (బరియల్ గ్రౌండ్స్), మరో నాలుగు చోట్ల దహన వాటికలు (క్రిమటోరియమ్స్) ఏర్పాటు. -
మరో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు
-
మరో మూడు ఉడాలు
అనంతపురం, కర్నూలు, కాకినాడ కేంద్రంగా ఏర్పాటు ⇒ చంద్రన్న బీమా కింద అదనంగా రూ.30 వేలు ⇒ అర్బన్ ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణం ⇒ మద్యం షాపుల లైసెన్సు ఫీజుల తగ్గింపు ⇒ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ఉడా)ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. అలాగే ‘చంద్రన్న బీమా’ కింద కార్మికులకు అదనంగా రూ.30 వేల పరిహారమివ్వాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► మాతృమూర్తిపై గౌరవం పెంపొందేలా ‘అమ్మకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం. ► అనంతపురం కేంద్రంగా 3,098.46 చదరపు కిలోమీటర్ల పరిధిలో అనంతపు రం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 177 గ్రామాలు. ► తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా 2,215.50 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటు. దీని పరిధిలో 6 మున్సిపాల్టీలు, 26 మండలాల్లోని 280 గ్రామాలు. ► కర్నూలు కేంద్రంగా 2,414.69 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 111 గ్రామాలు. వీటి ఏర్పాటు నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయం. ► ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద అర్బన్ ప్రాంతాల్లో 3 కేటగిరీల్లో 1,20,106 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం. ► అగ్రిగోల్డ్‌కు కీసరలో ఉన్న 350 ఎకరాలు, విజయవాడలోని 8 వాణిజ్య ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కోర్టు ను అభ్యర్థించాలని నిర్ణయం. కోర్టుల్లో లేని అక్షయ గోల్డ్, బొమ్మరిల్లు, కేశవరెడ్డి సంస్థల వివాదాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు ఆదేశం. ► ఏపీ సైబర్ సెక్యూరిటీ విధానం–2017కు ఆమోదం. ► ఈ విద్యా సంవత్సరం నుంచి సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ తదితర కోర్సులను ప్రవేశపెడుతూ పాఠ్యాంశాల్లో మార్పు చేయా లని నిర్ణయం. 2017–18ను ఇ–ప్రగతి సంవత్సరంగా పరిగణించాలని తీర్మానం. ► ఎస్టీ విద్యార్థుల కోసం విజయవాడలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి. ► అమిటీ, విట్, సెంచూరియన్, ఎస్ఆర్ఎం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా అంగీకార లేఖలకు సంబంధించిన సవరణలకు ఆమోదం. ► విభజన చట్టం తర్వాత రాష్ట్రం బయట తలెత్తిన సమస్యల పరిష్కారానికి సంబంధించిన మంత్రుల బృందానికి బదులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన జీవోకు ఆమోదం. ► మద్యం షాపుల లైసెన్సు ఫీజును వందలో 25 శాతానికి తగ్గించాలని నిర్ణయం. కేంద్రానికి చెల్లించే సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు ఈ విధానానికి ఆమోదం. తగ్గించిన ఫీజును అదనపు ఛార్జీల పేరుతో మళ్లీ లైసెన్సుదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయం. ‘పతంజలి’ ఆయుర్వేద సంస్థకు 172 ఎకరాలు ► విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలోని 172.84 ఎకరాలను పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కేటాయిం చేందుకు గానూ ఏపీఐఐసీకి అనుమతి. ఆహార, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకరం రూ.3 లక్షల చొప్పున కేటాయించేలా నిర్ణయం ► చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరులోని 100 ఎకరాల భూమిని వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎకరం రూ.1.50 లక్షల చొప్పున కేటాయించేలా ఏపీఐఐసీకి అనుమతి. -
త్వరలో ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’!
దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు 24 జిల్లా కేంద్రాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ‘నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ సమ్మిట్’లో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే ఇతర నగరంలో లేనివిధంగా హైదరాబాద్‌లో తొలిసారిగా ‘క్లీన్ ఎయిర్ అథారిటీ’ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. దీని ఏర్పాటుతో గాలి, నీరు తది తర కాలుష్యాలు లేకుండా ప్రజలు స్వచ్ఛమైన, నాణ్యమైన జీవన విధానాన్ని కొనసాగించవచ్చన్నారు. జపాన్‌లోని టోక్యో నగరంలో మాత్రమే ఇలాంటి అథారిటీ ఉందని, దాని స్ఫూర్తితోనే దీన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. శుక్రవారం ఇక్కడి హోటల్ మారియట్‌లో జరిగిన ‘నేషనల్ అర్బన్ డెవలప్మెంట్ సమ్మిట్’లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. ఈ అథారిటీ ఏర్పాటులో భాగంగా గ్రేటర్‌లోని దాదాపు 1,160 రెడ్, ఆరెంజ్ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలిస్తామన్నారు. కాలుష్యం నగర ప్రజలకు పెద్ద సమస్య అని, పరిశ్రమల తరలింపుతో ఆ సమస్య పరిష్కారం కానుందన్నారు. దేశంలోని ఆయా నగరాలు అమలు చేస్తున్న వినూ త్న, ప్రయోజనకరమైన విధానాలన్నింటినీ క్రోడీకరించి, ఇతర నగరాలకు తెలియజేస్తే బాగుంటుందని సూచించారు. మూడున్నర లక్షల జనాభా ఉన్న నగరాలను, కోటి జనా భా ఉన్న నగరాలను ఒకే గాటన కట్టే స్మార్ట్‌సిటీస్ కాన్సెప్ట్ బాగాలేదని అభిప్రాయపడ్డారు. 50 % పెరగనున్న అర్బన్ జనాభా.. తెలంగాణలో ప్రస్తుతం 42 శాతం ఉన్న అర్బన్ జనాభా రాబోయే 15 ఏళ్లలో 50 శాతానికి పెరగనుందని కేటీఆర్ చెప్పారు. నగరాలు ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయని, ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థల అభివృద్ధికీ ఇవి కీలకమన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ట్రాఫిక్, తాగునీరు, సీవరేజి, పారిశుధ్యం తదితరమైనవి ప్రధాన సమస్యలంటూ వీటి పరిష్కారానికి తగిన స్మార్ట్ సొల్యూషన్స్ అవసరమన్నారు. అంతర్గత వనరుల ద్వారా ఆదాయం.. తమిళనాడులో ఐదు వేల జనాభా దాటితే మున్సిపాల్టీగా మారుస్తున్నారని, అది మనకు సరిపడదన్నారు. మున్సిపాల్టీలుగా మారితే కేంద్రం నుంచి వచ్చే నిధులు, కొన్ని స్కీమ్‌లు వర్తించవన్నారు. రోడ్లు, చెరువులు, పారిశుధ్య నిర్వహణ తదితరమైనవి స్థానిక సంస్థల ప్రాథమిక విధులని, వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు అంతర్గత వనరుల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను ఆలోచిం చాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ పరిపాలన శాఖ సెక్రటరీ నవీన్‌మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమం డలి ఎండీ దానకిషోర్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డితోపాటు దేశంలోని వివిధ నగరాలకు చెందిన ఉన్నతాధికారులు ఆయా అంశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్‌పై ప్రసంగించారు. 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు హైదరాబాద్‌ను క్లీన్, గ్రీన్‌గానే కాక లివబుల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగాణలోని ఆయా ప్రాం తాలను సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు 24 జిల్లా కేంద్రాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిఇంటికీ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ ఇచ్చేందుకు తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు చెప్పారు. -
మహర్దశ
► పట్టణాభివృద్ధి సంస్థలుగా రెండు కార్పొరేషన్లు! ► మాస్టర్‌ప్లాన్ అమలు ► కనీస సదుపాయాల మెరుగు ► ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం అభివృద్ధిలో జిల్లాకు మహర్దశ పట్టనుంది.కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లుపట్టణాభివృద్ధి సంస్థలుగా ఏర్పాటు కానుండడంతో జిల్లా స్వరూపమే మారనుంది. మాస్టర్‌ప్లాన్, లేఔట్‌తోపాటు సౌకర్యాల కల్పన మెరుగుపడనుంది. పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా కార్పొరేషన్లకు ఆదేశాలు అందాయి. కరీంనగర్ కార్పొరేషన్ : రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా 70 కిలోమీటర్ల వ్యవధిలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ రెండు నగరాలు పట్టణాభివృద్ధి సంస్థలుగా అభివృద్ధి చెందే అరుదైన అవకాశం దక్కనుంది. పట్టణ ప్రాంతాలు ఇరుకుగా మారకుండా విస్తరించాలనే ఉద్ధేశంతో కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా), రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(రుడా) పేరుతో అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. పట్టణాలకు అతి చేరువలో ఉన్న గ్రామాలను కలుపుతూ ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి సంస్థలను తీర్చిదిద్దాలని హైదరాబాద్‌లో శనివారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇందుకు కావాల్సిన అన్ని వనరులపై దృష్టిపెట్టాలని, ఆ దిశగానే ప్రతిపాదనలు తయారు చేసి నివేదికలు పంపించాలని ఆదేశించింది. మెరుగుపడనున్న వసతులు కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థల పరిధిలోని చుట్టూ 10 నుంచి 15 కిలోమీటర్ల వైశాల్యంలో ఉండే గ్రామాలను కలుపుతూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కచ్చితమైన నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో ఇప్పటికే వేములవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా)ను ప్రతిపాదించారు. దీంతోపాటు రెండు కార్పొరేషన్ల పరిధిలో మెరుగైన ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చే ప్రాంతాల్లో మాస్టర్‌ప్లాన్ అమలు, మౌలిక వసతుల మెరుగుదలకు పెద్దపీట వేస్తారు. అర్బన్ ప్రాంతాల ఏర్పాటు ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారమే... ►అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కిందకు వచ్చే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల మాదిరిగానే కచ్చితమైన నిబంధనలు అమలవుతాయి. ►అర్బన్ డెవలప్మెంట్ కింద రెసిడెన్షియల్ జోన్లు, కమర్షియల్ జోన్లు, ఇండస్ట్రియల్ జోన్లుగా విభజిస్తారు. ►మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు ఏర్పాటు చేస్తారు.పట్టణాలకు అతి సమీపంలో ఉన్న పల్లెల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడడం, మాస్టర్‌ప్లాన్ లేక సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అర్బన్ డెవలప్మెంట్లో పట్టణాలు, పల్లెలకు తేడా లేకుండా డెరైక్టర్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోకి తీసుకువస్తారు. ►లేఅవుట్లకు, నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ►అథారిటీ అమలైతే ఒక పద్ధతి ప్రకారం పల్లెలు కూడా అభివృద్ధి చెందుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రతిపాదనల తయారీకి కసరత్తు అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోకి వచ్చే గ్రామాలు, వాటి వైశాల్యం, జనాభా ప్రాతిపదికన ప్రత్యేక సర్వే నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం స్థానిక సంస్థల్లోని టౌన్ ప్లానింగ్, జిల్లా టౌన్‌ప్లానింగ్ విభాగాల సహకారం తీసుకోవాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల మేయర్లతో సమావేశం నిర్వహించి చక్కటి ప్రతిపాదనలు పంపించాలని సమావేశంలో సూచించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు వారం రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేసి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
33 మండలాలు, 680 గ్రామాలతో నుడా
నుడా (నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 33 మండలాలు, వాటి పరిధిలోని 680 గ్రామాలను ‘నుడా' పరిధిలోకి తెస్తూ ప్రతిపాదనలకు రూపకల్పన చేశారు. భారీస్థాయిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు సమగ్రాభివృద్ధిలో భాగంగా ‘నుడా'ను ఏర్పాటు చేయడానికి వీలుగా సన్నాహాలు చేస్తున్నారు. నెల్లూరు సిటీ : జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్, నగర పంచాయతీ అయిన నాయుడుపేట, ఆత్మకూరు, గూడూరు, కావలి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలను కలుపుతూ ‘నుడా'ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవే, రైల్వేలైన్, సముద్రతీరాలకు దగ్గరగా ఉండి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలపనున్నారు. నెల్లూరు నగరానికి పరిసర ప్రాంతాలైన తొమ్మిది మండలాలతో ముందుగా ‘నుడా’ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలను తయారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 33 మండలాలతో కూడిన నుడాను ఏర్పాటుచేసే విధంగా ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. దీంతో అధికారులు డెవలప్మెంట్ ప్రాంతాలైన 33 మండలాలను కలుపుకుని ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులు ‘నుడా’ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. 33 మండలాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. మరిన్ని మండలాలు కలిపే అవకాశం ఉంది. 33 మండలాలివే.. కోవూరు, బుచ్చి, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, నెల్లూరు రూరల్, మనుబోలు, విడవలూరు, కొడవలూరు, కావలి, జలదంకి, బోగోలు, అల్లూరు, దగదర్తి, గూడూరు, సైదాపురం, చిల్లకూరు, ఓజిలి, వెంకటగిరి, బాలాయపల్లి, నాయుడుపేట, పెళ్లకూరు, చిట్టమూరు, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, వాకాడు, కోట, ఆత్మకూరు, సంగం, చేజర్ల. నుడాలో కలవని 13 మండలాలు (మేజర్ పంచాయతీలు) డక్కిలి, రాపూరు, కలువాయి, అనంతసాగరం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు, కలిగిరి, అనుమసముద్రం, ఏస్‌పేట. ఈ 13 మండలాల్లో అభివృద్ధి తక్కువగా ఉందనే ఉద్దేశంతో వీటిని రూరల్ ఏరియాగా డెవలప్మెంట్ చేయనున్నారు. నగర పరిధిలో రింగ్‌రోడ్డు నగర పరిధిలోని దాదాపు 60 కిలోమీటర్ల మేర రింగ్‌రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రవాణాకు అంతరాయం లేకుండా ఉంటుంది. కోవూరు మండలం హైవే నుంచి మైపాడురోడ్డు, బుజుబుజునెల్లూరు, కొత్తూరు మీదుగా పొదలకూరురోడ్డు వరకు రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు: విశాఖపట్టణం- ఉడా తిరుపతి - తుడా పుట్టపర్తి - పుడా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరిని కలిపి - వీజీటీఎం పాలకవర్గం: ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 13 మంది సభ్యులతో ‘నుడా’ పాలకవర్గం ఏర్పాటు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 కింద 15 మంది సభ్యులతో కూడిన ‘నుడా’ను ఏర్పాటు చేయాలి. చైర్మన్- ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తి. వైస్ చైర్మన్- చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సభ్యులు-ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ముగ్గురు జిల్లాకు చెందిన వారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల నుంచి గెలుపొందిన ఐదుగురు సభ్యులు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసర్. ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు వ్యక్తులు. -
పంచాయతీల అధికారాలకు కత్తెర
‘వీజీటీఎం’పై పురపాలక తాజా ఉత్తర్వులు 826 గ్రామాల్లోనూ నిలిచిపోనున్న భవన నిర్మాణాల అనుమతులు రాజధాని నిర్మాణంలో భాగంగానే నిర్ణయమని సర్కారు వెల్లడి ఇప్పటికే లేఔట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఉత్తర్వులు హైదరాబాద్: విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా) పరిధిలో గ్రామ పంచాయతీలు ఇకపై ఎలాంటి అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి విధించింది. భవనాలు, కట్టడాలకు సంబంధించి అనుమతులిచ్చే అధికారం గ్రామ పంచాయతీల నుంచి తొలగించి వీజీటీఎంకు బదలాయించింది. విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపధ్యంలో.. ఉడా పరిధిలో కొత్త లేఔట్లకు అనుమతి ఇవ్వకుండా నిలిపివేస్తూ ఇటీవలే సర్కారు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వీజీటీఎం పరిధిలో భూములకు సంబంధించిన ఎలాంటి క్రయవిక్రయాలు ఉండకూడదని రిజిస్ట్రేషన్ల శాఖకూ ఆదేశాలు వెళ్లాయి. తాజాగా ఉడా పరిధిలోని గ్రామ పంచాయతీల అధికారాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని నిర్మాణ అవసరాల నిమిత్తం ఈ జీవో జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉడా పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతాల్లోని పంచాయతీల గ్రామ కంఠాల ప్రాంతాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఈ గ్రామాల్లో అభివృద్ధి, భూముల వినియోగం, భవనాల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో పంచాయతీలకు అధికారాలు ఉండవని తెలిపారు. ఇకపై అక్కడి భూముల వ్యవహారాలను ఉడా పర్యవేక్షిస్తుంది. 2009లో వీజీటీఎం ఉడా పరిధిలోని గ్రామాలకు కొన్ని అధికారాలను బదలాయించారు. ఇప్పుడు ఆ అధికారాలను మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి భూములు సేకరించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ 1975 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. మొత్తం 826 గ్రామాలకు కత్తెర... వీజీటీఎం పరిధిలో అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 52 మండలాల్లో మొత్తం 826 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయా గ్రామ పంచాయతీలే నిర్ణయించేవి. అధికారాల్లో భాగంగా.. 3,000 చదరపు గజాల లోపు లేఔట్లకు అనుమతులు పంచాయతీలే నిర్ణయించేవి. బైఫర్కేషన్ ఆఫ్ ల్యాండ్.. అంటే ఉదాహరణకు 400 గజాల లోపు స్థలం ఒకరి పేరు మీదనే ఉంటే దాన్ని రెండుగా విభజించి అనుమతులు ఇచ్చే అధికారం ఉండేది. 1,000 చదరపు మీటర్ల లోపు స్థలాలకు రెండస్థుల (జీ ప్లస్ టు) వరకూ భవనాలకు పంచాయతీలే అనుమతులు ఇచ్చేవి. ఇకపై ఈ అధికారాలకు కత్తెర పడింది. రాజధాని నిర్మాణానికి భూసేకరణ పూర్తయి, ఉడా తిరిగి అధికారాలు బదిలీ చేసేవరకూ ఆయా పంచాయతీల్లో ఎలాంటి అభివృద్ధి పనులకూ నిర్ణయాలు తీసుకోలేరు. కేవలం వీజీటీఎం ఉడా పరిధిలో మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయంతో పంచాయతీల పరిధిలోనూ భవన నిర్మాణాల అనుమతులు, లేఔట్ల అనుమతులు భారీగా ఆగిపోనున్నాయి. ఓవైపు అధికారాలు వికేంద్రీకరించాలని, పంచాయతీలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టి వాటి బలోపేతానికి కృషి చేయాలని కేంద్రం చెప్తోంది. అయితే వీజీటీఎం పరిధిలో గ్రామాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలు భవన నిర్మాణాలకు గానీ, లేఔట్లకు గానీ అనుమతులు ఇస్తే రాజధాని నిర్మణానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
ఉడాకు సిబ్బంది కావలెను!
120 మందికిగాను 58 మందే విధుల్లో పదిహేనేళ్లుగా పోస్టులు ఖాళీ రెండున్నర రెట్లు పెరిగిన ఉడా పరిధి కేటాయించిన పోస్టుల భర్తీతోపాటు అదనంగా 300 మంది అవసరం ప్రభుత్వానికి నివేదించిన ఉడా చైర్మన్ వణుకూరి సాక్షి, విజయవాడ : విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (వీజీటీఎం ఉడా)లో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉండడం, ఒకే ఉద్యోగి రెండు, మూడు రకాల విధులు నిర్వర్తించడం ఉడాలో కొన్నేళ్లుగా సాగుతోంది. ప్రభుత్వానికి జీతాలపరంగా ఖర్చు తగ్గినా.. సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఉడా ఆవిర్భావంలో కేటాయించిన సిబ్బందిలో దాదాపు 30 శాతం ఖాళీలను భర్తీచేయకపోవడం, మిగిలిన 30 శాతం మంది పదవీవిరమణ చేసినా వారి స్థానాల్ని భర్తీచేయలేకపోవడంతో సిబ్బంది కొరత సమస్య తీవ్రమయింది. దీనికితోడు ఇప్పుడు ఉడా పరిధి భారీగా పెరగడంతో కొత్త పోస్టుల అవసరం ఏర్పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో వీజీటీఎం ఉడా నూతన రాష్ట్రంలో అతిపెద్దదిగా నిలుస్తుంది. విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దదే. 1978లో అవిర్భవించిన ఉడా అప్పట్లో గుంటూరు, విజయవాడ, తెనాలి పట్టణాలకే పరిమితమైంది. కాలక్రమేణ విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు రెండు జిల్లాల్లోని తొమ్మిది మున్సిపాలిటీలు, 1400 గ్రామాల పరిధికి విస్తరించింది. 2012 వరకు ఉడా పరిధి కేవలం 1945 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అప్పట్లో ఉడా పరిధి, కార్యకలాపాలను ప్రామాణికంగా తీసుకుని మున్సిపల్ శాఖ 120 మంది సిబ్బంది నియామకాలకు వీలుగా పోస్టులు ఉడాకు కేటాయించింది. వారిలో 80 మందిని మాత్రమే తొలుత నియమించారు. ఆ తర్వాత నియామకాలు జరగకపోవడంతో ఖాళీలు అలాగే ఉన్నాయి. గడిచిన పదేళ్లలో సుమారు 30 మంది వరకు పదవీవిరమణ చేయడంతో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది సంఖ్య 58కు చేరింది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఇక్కడ అధికంగా పనిచేస్తున్నారు. గతంలో వైస్ చైర్మన్లుగా పనిచేసిన అధికారులు ఉద్యోగుల భర్తీకి ప్రయత్నించకుండా కేవలం కాంట్రాక్టు ఉద్యోగులతోనే నడిపించారు. ప్రస్తుతం ఉడాలో సుమారు 175 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. 2012 వరకు కేవలం 1945 చదరపు కిలోమీటర్లకే పరిమితమైన ఉడా పరిధి ఒక్కసారిగా 5113 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ఉడాకు ఆదాయం కూడా తగ్గిపోతోంది. ప్లానింగ్, ఇంజినీరింగ్, సిటిజన్ చార్టర్, ఎస్టేట్ విభాగం, ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం, పరిపాలన విభాగాలు ఉన్నాయి. ఉడా పరిధిలో దాదాపు మూడు వేలకుపైగా ప్రైవేట్ వెంచర్లు ఉన్నాయి. ఇవికాక అనధికారికంగా సుమారు ఐదు వేల ఎకరాల్లో ఉడా అనుమతిలేని వెంచర్లు ఉన్నాయి. ఉడా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకుని వారికి అపరాధరుసం విధించాల్సి ఉంటుంది. సిబ్బంది లేకపోవడంతో ఆ పని జరగడం లేదు. నూతన ప్రాజెక్టులు కాని, రన్నింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు వేగవంతం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. హుడాను పరిగణనలోకి తీసుకోండి.. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా)ను పరిగణనలోకి తీసుకుని, దానికి సిబ్బందిని కేటాయించిన విధంగానే వీజీటీఎం ఉడాకు కేటాయించాలని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి సిబ్బంది పెంపు ఆవశ్యకతను వివరించి మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరి వినతిపత్రం అందజేశారు. దీనిపై మున్సిపల్ శాఖ కొంత కసరత్తు ప్రారంభించిన తరుణంలో రాష్ట్ర విభజన జరగడం, ప్రభుత్వం మారడం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి బ్రేక్ పడినట్లయింది. నూతన రాష్ట్ర రాజధాని కచ్చితంగా వీజీటీఎం ఉడా పరిధిలోని ప్రాంతంలోనే ఏర్పాటవుతుందని అందరు విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో సిబ్బంది కొరత తీరకపోతే రాజధాని నిర్మాణంలో ఉడా క్రియాశీలక పాత్ర పోషించలేని పరిస్థితి తలెత్తుతుంది. గతంలో కంటే విస్తీర్ణం రెండున్నర రెట్లు పెరిగినందున.. కేటాయించిన సిబ్బంది సంఖ్యను రెండు రెట్లు పెంచాలని చైర్మన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరారు. అంటే ప్రస్తుతం ఉన్న సిబ్బందితో కలుపుకొని 420 వరకు పోస్టులు కావాలన్నమాట. నూతన సీఎంకు విన్నవిస్తాం నూతన రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఉడాకు పోస్టులు పెంచాలని కోరతాను. ముఖ్యమంత్రిగా పాలనపగ్గాలు చేపట్టిన తర్వాత సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళతాను. ఉడాను సీమాంధ్రలో అన్ని అంశాల్లో అగ్రగామిగా నిలపటమే నా ఎజెండా. ఆ దిశగా పనిచేస్తున్నాను. -వణుకూరి శ్రీనివాసరెడ్డి, చైర్మన్, వీజీటీఎం ఉడా -
తుడా కార్యదర్శిగా మాధవీలత
సాక్షి, నెల్లూరు: నెల్లూరు ఆర్డీవో కె. మాధవీలత తుడా (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) కార్యదర్శిగా తిరుపతికి బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. మాధవీలత తనకు తానుగా బదిలీపై వస్తున్నారు. నంద్యాల ఆర్డీవోగా పని చేస్తూ 2011, జూన్‌లో నెల్లూరుకు బదిలీపై వచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మల్‌కాట్‌పల్లికి చెందిన మాధవీలత తొలుత ఇక్రిశాట్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. ఆ తర్వాత 2007లో గ్రూప్-1లో మహిళల విభాగంలో స్టేట్ టాపర్‌గా నిలిచారు. ప్రొబెషనరీ పీరియడ్ కింద తొలుత రంగారెడ్డి డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. 2008 అక్టోబర్‌లో నంద్యాల ఆర్డీవోగా వెళ్లారు. ఆ తర్వాత నెల్లూరుకు వచ్చారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలో ఉన్నతాధికారుల అండదండలతో మొబైల్ రెవెన్యూ సర్వీసులను ఆమె ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా నేరుగా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకెళ్లి అక్కడికక్కడే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం ద్వారా మన్ననలు సైతం పొందారు. కడప జిల్లా సిద్దవటం మండలం కొత్తపల్లెకు చెందిన వెంకట్‌రామ్‌మునిరెడ్డి మాధవీలత భర్త. ఆయన నెల్లూరు ఏరువాక కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.