73 గ్రామాలు.. 568 కిలో మీటర్లతో ‘నుడా’ మాస్టర్‌ ప్లాన్‌.. | Telangana Government Approved NUDA Master Plan Know The Full Details | Sakshi
Sakshi News home page

‘నుడా’ మాస్టర్‌ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం.. ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాల జాబితా ఇదే!

Published Sun, Feb 27 2022 11:52 AM | Last Updated on Sun, Feb 27 2022 4:04 PM

Telangana Government Approved NUDA Master Plan Know The Full Details - Sakshi

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) మాస్టర్‌ ప్లాన్‌ దాదాపు ఖరారైంది. 73 గ్రామాలను కలుపుకొని మొత్తం 568.32 చదరపు కిలోమీటర్ల మేర నుడా పరిధిలోకి తీసుకొచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ను ఖరారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్లాన్‌కు డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు శనివారం ఆమోదం తెలిపారు. నుడా పరిధిలోకి తీసుకొచ్చిన గ్రామాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. అభ్యంతరాలను నుడా కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించాక నుడా పరిధిని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. 



నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌తో కలిపే నుడా పరిధిని ఖరారు చేశారు. తొమ్మిది విలీన గ్రామాలను కలిపి 318.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కార్పొరేషన్‌ మాస్టర్‌ప్లాన్‌ను మూడేళ్ల క్రితమే రూపొందించారు. కానీ, ఆ తర్వాత 73 గ్రామాలను కలిపి నుడాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తొలుత రూపొందించిన కార్పొరేషన్‌ మాస్టర్‌ప్లాన్‌ను కలుపుకొని నుడా బృహత్‌ ప్రణాళికను తయారు చేశారు. కార్పొరేషన్‌ మాస్టర్‌ప్లాన్‌ పరిధి (318.50 చ.కి.మీ.)కి తోడు నగర పాలక సంస్థ వెలువల ఐదు కిలోమీటర్ల రేడియల్‌ విస్తీర్ణం (249.82 చదరపు కి.మీ.)తో కలిపి నుడా మాస్లర్‌ప్లాన్‌ పరిధిని ఖరారు చేశారు. 
(చదవండి: మెను ఏదైనా నోరు ఊరాల్సిందే.. అట్లుంటది టేస్ట్‌ మరి!)

నుడా మాస్టర్‌ ప్లాన్‌లోకి వచ్చిన గ్రామాలివే.. 
నిజామాబాద్‌ రూరల్‌ మండలం(19 గ్రామాలు): ధర్మారం(ఎం), ధర్మారం(టి), గుండారం, రామ్‌నగర్, శాస్త్రినగర్, శ్రీనగర్, జలాల్‌పూర్, కేశాపూర్, కొండూరు, లక్ష్మాపూర్, మల్కాపూర్‌(ఎ), మల్కాపూర్‌(ఎం), మల్లారం, చక్రధర్‌నగర్‌(టి), గాంధీనగర్, ముత్తకుంట, లింగితండా, పాల్దా, తిర్మన్‌పల్లి 
డిచ్‌పల్లి మండలం(10 గ్రామాలు): అమృతపూర్, దేవ్‌నగర్‌క్యాంపు, ఆరేపల్లి, బర్ధీపూర్, ధర్మారం(బి), మెంట్రాజ్‌పల్లి, నాక తండాా, వెస్లీనగర్‌ తండాా, ముల్లంగి(ఐ), నడిపల్లి 
మాక్లూర్‌ మండలం(13 గ్రామాలు): అమ్రాద్, అమ్రాద్‌ తండాా, బొంకన్‌పల్లి, చిన్నాపూర్, మదన్‌పల్లి, సట్లాపూర్‌ తండాా, మాక్లూర్‌ కింద తండా, సింగంపల్లి తండా, మామిడిపల్లి, ముల్లంగి(బి), వడ్డేటిపల్లి, సింగంపల్లి 
మోపాల్‌ మండలం(11 గ్రామాలు): కంజర, ఒడ్డెర కాలనీ, కులాస్‌పూర్, కులాస్‌పూర్‌ తండా, ముదక్‌పల్లి, గుడి తండా, శ్రీరామ్‌నగర్‌(టి), మోపాల్, న్యాల్‌కల్, సిర్‌పూర్, ఠానాకుర్దు 
నవీపేట మండలం(8 గ్రామాలు): అబ్బాపూర్‌(ఎం), అభంగపట్నం, స్టేషన్‌ ఏరియా, అనంతగిరి, ధర్మారం(ఏ), మహంతం, మోకన్‌పల్లి, నారాయణపూర్‌ 
ఎడపల్లి మండలం(10గ్రామాలు):– జైతాపూర్, జంలం, ఎం.ఎస్‌.సీ.ఫారం, జానకంపేట, కుర్నాపల్లి, మల్లాపహాడ్, మంగల్‌పహాడ్, పోచారం, ఠాణాకలాన్, బాపునగర్‌  
రెంజల్‌ మండలం(1): దూపల్లి 
వర్ని మండలం(1): మాలాయిపూర్‌ 

నుడాకు సరిహద్దు గ్రామాలు.. 
ఉత్తరం: ధరియాపూర్, నవీపేట, కమలాపూర్, పోతంగల్, జన్నేపల్లి, మెట్‌పల్లి, గొట్టిముక్కల, వెంకటాపూర్, కల్లెడ, గుత్ప 
దక్షిణం: డిచ్‌పల్లి, ఘన్‌పూర్, దూస్‌గాం, చిన్నాపూర్, బాడ్సి, మంచిప్ప, కాల్పోల్, బాజిదాపూర్, ఫారెస్టు ఏరియా, చింతకుంట 
తూర్పు: మిట్టాపల్లి, బీబీపూర్‌ తండా, సుద్దపల్లి, యానంపల్లి, పుప్పాలపల్లి, సికింద్రాపూర్, మాదాపూర్, మునిపల్లి 
పడమర: మోస్రా, అమ్దాపూర్, ఇబ్రహీంపూర్, ఎరాజ్‌పల్లి, ఎడపల్లి, ఏఆర్‌పీ క్యాంపు, బ్రాహ్మణపల్లి, కల్యాపూర్, రెంజల్‌   
(చదవండి: ఫాంహౌస్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రకాశ్‌ రాజ్‌ భేటీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement