సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (రుడా) అడుగులు వేస్తోంది. ఆయా గ్రామాల్లో అందివస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజా ప్రయోజన, ఆరోగ్య రక్షణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పే పనులకు ప్రాధాన్యం ఇస్తోంది. మొక్కల పెంపకం, సంరక్షణతో పాటు గ్రామాల పేర్లను సూచించే నేమ్‌బోర్డులను అ«దునాతనంగా రూపొందించి ఏర్పాటు చేస్తోంది.
66 పనులకు రూ.26.84 కోట్ల నిధులు వ్యయం చేస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కొన్ని పనులు పురోగతిలో ఉండగా.. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి. రాజమహేంద్రవరాన్ని ఇప్పటికే సుందరంగా తీర్చిదిద్దిన రుడా తన పరిధిలోని గ్రామాలకు పట్టణ శోభను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పనులను రుడా వీసీ బాలస్వామి ఎప్పటికప్పుడు పర్యవేక్షిన్నారు.
సుందరీకరణ పనులు ఇలా..
రుడా పరిధిలో నిర్వహించే పనుల్లో సుందరీకరణ, వాకింగ్ ట్రాక్‌లు, రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్ బాడీ, బీచ్ ఫ్రంట్ నిర్వహణ పనులకు మొదటి ప్రాధాన్యత కల్పి స్తున్నారు. నియోజకవర్గాల వారీగా మచ్చుకుకొన్ని పరిశీలిస్తే..
అనపర్తి: బలభద్రపురంలో రూ.1.65 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రివిట్‌మెంట్‌తో కూడిన వాటర్ బాడీ పనులు పూర్తి చేసింది. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా నీటితో కూడిన పార్క్, వాకింగ్ ట్రాక్, ప్రజలు సేదతీరేందుకు పచ్చదనం పెంపొందించే పనులు ప్రారంభించింది.
కొవ్వూరు: గోష్పాద క్షేత్రం సమీపంలోని కొవ్వూరు కట్ట వెంబడి రివర్ ఫ్రంట్ రూపుదిద్ది భక్తులకు స్వాంతన కలిగించేందుకు కృషి చేస్తున్నారు. పచ్చదనం పెంపొందించి అందులో వివిధ జంతువుల నమూనా విగ్రహాలు వరద నీటికి తట్టుకునే స్థాయిలో తయారు చేస్తున్నారు. ఇందుకు రూ.కోటి వెచి్చంచనున్నారు. రూ.32.86 లక్షలతో అధునాతన విద్యుత్ స్తంభాలు, దీపాలు అమర్చనున్నారు. ‘ఐ–లవ్ కొవ్వూరు’ చిహ్నాన్ని సెల్ఫీ పాయింట్‌గా ఆధునీకరించనున్నారు.
గోపాపురం: దేవరపల్లి మెయిన్ రోడ్ నుంచి గోపాలపురం వరకు రూ.50 లక్షలతో సెంట్రల్ లైటింగ్ పనులు పురోగతిలో ఉండగా.. మరో మరికొన్ని టెండర్ స్టేజ్‌లో ఉన్నాయి.
నిడదవోలు: చిన్న కాశీ రేవు నుంచి గూడెం గేటు వరకు రహదారి నిర్మాణానికి రూ.కోటి వెచి్చంచనున్నారు.
రాజమహేంద్రవరం సిటీ: నగరంలో రూ.30 లక్షలతో జగనన్న ఉమెన్స్ హెవెన్, రూ.12 లక్షలతో ఆజాద్‌చౌక్, ఎల్‌ఈడీ లైట్లు, రూ.6 లక్షలతో పుష్కరఘాట్ వద్ద దుస్తులు మార్చుకునే గది నిర్మాణం పూర్తయింది. రూ.37.50 లక్షలతో జీఎన్‌టీ రోడ్డులో మొక్కల పెంపకం, కుండీలు, మొక్కల నిర్వహణ, రూ.2 కోట్లతో హెవలాక్ బిడ్జి వద్ద రంగుల విద్యుత్ దీపాలు, రూ.2 కోట్లతో కంబాలచెరువు పార్కులో మ్యుజికల్ ఫౌంటేన్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరికొన్ని టెండరు దశలో ఉన్నాయి.
రాజమహేంద్రవరం రూరల్: శాటిలైట్ సిటీ డి–బ్లాక్ వద్ద రూ.50 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం, రూ.38.50 లక్షలతో కోలమూరు వద్ద అప్పన్నచెరువు పార్క్ అభివృద్ధి, రూ.47.50 లక్షలతో ధవలేశ్వరం పాంచాయతీలో ఓపెన్ జిమ్, వాకింగ్‌ట్రాక్ పనులు టెండరు దశలో ఉన్నాయి.
కోనసీమజిల్లా: ఆత్రేయపురం వార్ఫ్ రోడ్డు వద్ద రూ.1.50 కోట్లతో రివర్ ఫ్రంట్, రూ.31 లక్షలతో రావులపాలెం జంక్షన్ వద్ద క్లాక్‌టవర్ అభివృద్ధికి టెండర్లు ఆహా్వనిస్తున్నారు. వాడపల్లి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.41.70 లక్షల వ్యయంతో ఆధ్యాతి్మకను సూచించే త్రిశంకు ఆకారంలో విద్యుత్ దీపాలు అమర్చే పనులు పురోగతిలో ఉన్నాయి.
రావులపాలెం: కొమర్రాజులంక గ్రామంలో రూ.50 లక్షలతో పార్క్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధికి టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
విస్తృతంగా సుందరీకరణ
పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశానికి అనుగుణంగా రుడా పరిధిలోని ప్రాంతాల్లో సుందరీకరణ, ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. స్థానికఎమ్మెల్యేల అభ్యర్థనల మేరకు, రుడా నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నాం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదన్న ప్రతిపక్షాలు బురదజల్లుతున్నాయి. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో చేపడుతున్న పనులను చూసైనా బుద్ధి వస్తుందని భావిస్తున్నాం. –మేడపాటి షర్మిలారెడ్డి, చైర్‌పర్సన్ రుడా
రాజానగరంలో ‘జిమ్’దాబాట్
రాజానగరం నియోజకవర్గంలో గాదరాడ, బూరగపూడి, శ్రీరంగపట్నం గ్రామాల్లో రూ.20.30 లక్షల వ్యయంతో యువతకు ఫిట్‌నెస్ పెంపొందించే జిమ్‌ల నిర్మాణం పూర్తయింది. విమాన ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ఎయిర్‌పోర్ట్ రోడ్డు వెంబడి ఉన్న సెంట్రల్ లైటెనింగ్ పోల్స్‌కు రూ.55 లక్షలతో ఎల్‌ఈడీ మోటిఫ్ ఏర్పాటు. రూ.2 కోట్లతో కోరుకొండ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్‌స్టాప్ పునరుద్ధరణకు మార్గం సుగమం కానుంది. పుణ్యక్షేత్రం వద్ద బర్డ్స్ పార్క్, ‘ఐ లవ్ రాజానగరం’, గ్రామ పేరు సూచించే సైన్‌బోర్డు పనులు టెండరు దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment