రాష్ట్రంలో కొత్తగా మరో మూడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఉడా)ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. అలాగే ‘చంద్రన్న బీమా’ కింద కార్మికులకు అదనంగా రూ.30 వేల పరిహారమివ్వాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.