Chandranna Bima scheme
-
చంద్రన్న బీమా పేరుతో ఆన్లైన్ మోసం
-
‘చంద్రన్న బీమా’ నుంచి కాల్.. లక్ష పేరిట టోకరా!
సాక్షి, అమరావతి: చంద్రన్న బీమా పథకం పేరుతో ఓ యువకుడికి టోకరా ఇచ్చారు ఆన్ లైన్ కేటుగాళ్లు. అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానిపల్లికి చెందిన గురుప్రసాద్ అనే యువకుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘విజయవాడ చంద్రన్న బీమా వింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు లక్ష రూపాయల విడుదలయ్యింది. మీ అకౌంట్ నెంబర్‌తో పాటు ఏటీఎం డిటైల్స్ అందించాలి’ అని మోసగాళ్లు కోరారు. చంద్రన్న బీమా డబ్బులు వస్తాయని ఆశపడిన ఆ యువకుడు.. ఏటీఎం డిటైల్స్ అందించారు. అంతే తన అకౌంట్లోని 40 రూపాయలు మాయమయ్యాయని వాపోతున్నాడు బాధితుడు. మోసపోయానని తెలుసుకున్న గురుప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడు. -
బతికుండగానే చంపేశారు!
చిత్తూరు ,గుడిపాల: బతికుండగానే ఓ వ్యక్తిని అధికారులు ముందుగానే చనిపోయినట్లు రికార్డులకు ఎక్కించారు. తీరా అతను చనిపోయిన తరువాత చంద్రన్న బీమా కోసం కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. తమ రికార్డుల్లో అతను ఎన్నడో చనిపోయినట్లు ఉందని చెప్పడంతో కంగుతిన్నారు. వివరాలు.. మొగరాళ్లపల్లె దళితవాడకు చెందిన ధైర్యనాథన్(50) మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా గుండెపోటుకు గురై చనిపోయాడు. కుటుంబ సభ్యులు స్థానిక సంఘమిత్రకు ఫోన్లో సమాచారమిచ్చినా ఆమె స్పందించకపోవడంతో చంద్రన్న బీమా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. ఇతను ఎప్పుడో చనిపోయినట్లు తమ వద్ద రికార్డుల్లో ఉందని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. దీనిపై గుడిపాల వెలుగు కార్యాలయంలో సంప్రదించారు. చంద్రన్న బీమా బాండు వచ్చిందని, అయితే ధైర్యనాథన్ చనిపోయినట్లు సంఘమిత్ర రాతపూర్వకంగా చెప్పడంతో చంద్రన్న బీమా నుంచి అతని పేరు తొలగించారన్నారు. బతికి ఉన్న వ్యక్తిని ముందుగానే ఎలా చంపేస్తారని, చంద్రన్నబీమా రాకపోవడం ఏమిటని వారిని ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం కరువైంది. సంఘమిత్రపై పలు ఆరోపణలు పేయనపల్లె, మొగరాళ్లపల్లె పంచాయతీలకు సంబంధించి పేయనపల్లె వాసి నాగభూషణం సంఘమిత్రగా వ్యవహరిస్తోంది. సంఘంలోని గ్రూపు సభ్యులకు బ్యాంక్ లోన్ తీసిస్తే మామూళ్లు ఇవ్వాలని, లేకుంటే లోన్‌కూడా తీసివ్వదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మొగరాళ్లపల్లె పంచాయతీకి కొత్త సంఘమిత్రను ఎంపికచేస్తే ఆమె అధికార బలంతో ఆ పోస్ట్‌ను కూడా తీయించి ఇన్చార్జ్గా వ్యవహరిస్తోందనే ఆరోపణ వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో కూడా పసుపు–కుంకుమ డబ్బులను కూడా సభ్యులకు ఇవ్వకుండా స్వాహా చేసిందని డ్వాక్రా మహిళల ఆరోపణ. చంద్రన్న బీమాకు సంబంధించి డబ్బులు స్వాహా చేసి మనిషి బతికుండగానే చనిపోయినట్లు చెప్పి ఇలా చేయడం శోచనీయమని మండిపడుతున్నారు. విషాదంలో కుటుంబం ధైర్యనాథన్ మృతితో అతని కుటుంబం వీధిన పడింది. మృతుడికి ప్రియదర్శిని(9వ తరగతి), మాలతి (7వ తరగతి) కుమార్తెలు ఉన్నారు. ధైర్యనాథన్ మృతితో వారి కుటుంబానికి ఆర్థిక సాయంగా చంద్రన్న బీమా కింద రూ.2లక్షలు వస్తుందనుకుంటే సంఘమిత్ర తీరు వలన ఆ కుటుంబ పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది. -
టీడీపీ నేత ఘరానా మోసం
విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం): అధికారం ఉంటే ఏపనైనా చేయచ్చు. గిరిజనులైనా, ఇతరులైనా..ముప్పై సంవత్సరాల వయస్సులో భర్త చనిపోయాడు. అత్తా మామలతో పాటు ఇద్దరు ఆడపిల్లలను పోషించాలి. భర్త చనిపోయిన కారణంగా చంద్రన్న బీమాగా రూ.2 లక్షలు వచ్చింది. ఈ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని భావించిందా గిరిజన మహిళ. కానీ వచ్చిన సొమ్ముపై కన్నేసిన ఓ టీడీపీ నాయకుడు అమాయక గిరిజనురాలిని మాయచేసి రూ.లక్షను గెద్దలా తన్నుకుపోయాడు. వివరాల్లోకి వెళితే పాతమల్లంపేట పంచాయతీ శివారు అచ్చియ్యపేట గ్రామానికి చెందిన కెల్లా శివ(30) గత నవంబర్ 2018లో చనిపోయాడు. ఆయనకు చంద్రన్న బీమాగా రూ.1,95,000 భార్య వెంకటలక్ష్మి పేరున గొలుగొండ ఎస్బీఐలోని అకౌంట్లో జమచేశారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకుడు, వైస్ ఎంపీపీ తండ్రి గెడ్డం నానాజీ గిరిజనులకు గేలం వేశాడు. నీకు బీమా సొమ్ము వచ్చిందని, ఈ సొమ్ము నేను కృషి చేయడం వల్లనే వస్తోందని, నేను డబ్బులు మార్చి ఇస్తానని అమాయక గిరిజనురాలైన వెంకటలక్ష్మి, ఆమె తల్లి పార్వతిని గొలుగొండలోని బ్యాంకుకు తీసుకొచ్చాడు. విత్‌డ్రా వోచర్‌పై సంతకాలు పెట్టించి రూ.1,90,000 డ్రాచేశాడు. అందులో లబ్ధిదారైన వెంకటలక్ష్మికి రూ.90 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్ము తర్వాత వస్తుందని నమ్మబలికాడు. అంతే కాకుండా బ్యాంకు పాస్‌బుక్, ఆధార్‌కార్డు, డెత్ సర్టిఫికెట్స్‌ను తనతో తీసుకుపోయాడు. ఈ వ్యవహారం 3 డిసెంబర్ 2018న జరిగింది. అయితే విషయం తెలియని గిరిజనులు మిగతా రూ.లక్ష వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శుక్రవారం బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా మొత్తం నగదును ఆరోజే తీసుకున్నట్టుగా తెలియడంతో లబోదిబోఅంటూ గిరిజనురాలు నెత్తీనోరు బాదుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని గ్రామంలో వివరించింది. తనకు న్యాయం చేయాలని విన్నవించింది. విషయం తెలుసుకున్న మోసగాడు నానాజీ ఫోన్ స్విచ్ఆఫ్ చేసి ఆజ్ఞాతంలోకి పోయాడు. దీనిపై బాధితురాలు గిరిజన సమైక్య మండలికి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. టీడీపీ నాయకుడు చేసిన మోసంపై సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి అయ్యన్నకు శనివారం ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది. మొత్తం సొమ్ము జమ చేశాం ఈ విషయమై బీమా మిత్ర వెంకటలక్ష్మిని సంప్రదించగా నామినీ పేరున రూ.1,95,000 ఆమె అకౌంట్లో జమచేయడం జరిగిందని, నాయకులు ఏం చేశారో తనకు తెలియని చెప్పారు. -
ఇదీ..‘చంద్రన్న బీమా’ చోద్యం!
చిత్తూరు, పెద్దతిప్పసముద్రం: అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఈమె పరిస్థితి. అధికారుల అలసత్వం కారణంగా ఈ అమాయక మహిళ గత రెండేళ్లుగా ఐకేపీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎలాంటి న్యాయం జరగలేదు. వివరాల్లోకి వెళితే మండలంలోని పులికల్లు పంచాయతీ వీరగంగన్నగారిపల్లికి చెందిన వై. వెంకట్రమణ, సరస్వతి దంపతుల కుమారుడు రమేష్ బెంగళూరులో ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ పులికల్లులోని నాగేశ్వరస్వామి ఆలయంలో తల దాచుకుని జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో కుటుంబ యజమాని వై.వెంకట్రమణ అనారో గ్యం కారణంగా 2017 అక్టోబర్ 4న మృతి చెందాడు. చంద్రన్న బీమా ద్వారా దహన సంస్కారాలకు రూ.5 వేల నగదు ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సి వున్నా ఇంతవరకు అధికారులు నయా పైసా కూడా అందజేయలేదు. పలుమార్లు ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరిగినా ఈమె గోడు పట్టించుకునే నాథులే కరువయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చంద్రన్న బీమా సొమ్ము మంజూరు చేసి న్యాయం చేయాలని బాధితురాలు సోమవారం ఐకేపీ ఏపీఎం మధుశేఖర్ బాబుకు విన్నవించింది. -
అన్నన్నా.. ఇంత దగానా?
సాక్షి, విజయవాడ: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ‘చంద్రన్న’ పేరు జోడించి, పథకాన్ని తామే ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ గొప్పలు చెప్పుకున్నారు. తీరా పథకం అమలులో మాత్రం అంతా చతికిలపడ్డారు. ప్రభుత్వం పథకాన్ని సమర్థంగా అమలు చేయకుండా నిర్వీర్యం చేసి లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. చంద్రన్న బీమా అమలులోకి రావడంతో గతంలో ఉన్న జనశ్రీ బీమా యోజనా కూడా వినియోగించుకోలేకపోతున్నామని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదుతో కలిపి.. 2016లో చంద్రన్న బీమాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. టీడీపీ సభ్యత్వంతో కలిపి చంద్రన్న బీమాను టీడీపీ నేతలు చేయించారు. వాస్తవంగా చంద్రన్న బీమా పథకానికి ఏడాదికి రూ.15 చెల్లిస్తే అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు, చిరు వ్యాపారస్తులకు, దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి బీమా సౌకర్యం ఉంటుంది. అయితే టీడీపీ నాయకులు అతి తెలివి ఉపయోగించి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే బీమా అని ప్రచారం చేశారు. అనేక మంది టీడీపీ సభ్యత్వం తీసుకుని బీమా వచ్చిందని మురిసిపోయారు. అయితే పార్టీ సభ్యత్వం పూర్తి చేసిన అధికార పార్టీ నాయకులు.. ఆ తర్వాత బీమా సంబంధించి పేర్లు నమోదుపై శ్రద్ధ తీసుకోలేదు. దీనికి తోడు చంద్రన్న బీమా నమోదు సాఫ్ట్వేర్ సరిగా పనిచేయకపోవడంతో అనేక మంది పేర్లు నమోదు కాలేదు. ఇదీ పథకం.. చంద్రన్న బీమాలో పేరు నమోదు చేయించుకుంటే సహజ మరణమైతే రూ.2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. బీమా సొమ్ముతోపాటు ఆయా కుటుంబాల్లో 8, 9, 10, ఇంటర్ చదివే పిల్లలకు ఏడాదికి రూ.1200 స్కాలర్షిప్లు వస్తాయి. అయితే చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండి నష్ట పరిహారం ఎక్కువగా ఇవ్వాల్సి రావడంతో కొత్తవారిని చేరనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. నమోదు కాని వారు 12,000 మందిపైనే.. విజయవాడలో సుమారు 40 వేల మంది షాపు ఎంప్లాయీస్, కార్మికులు, చిరు వ్యాపారస్తులు ఉంటారు. వీరి అందరికి చంద్రన్న బీమా వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం నగరంలో 12వేల మంది ఈ బీమా పరిధిలోకి రాలేదని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడ బీసెంట్‌రోడ్డులోని ఒక షాపింగ్‌మాల్‌లో పనిచేసే ఉదయ్‌కుమార్ గత నవంబర్‌లో చనిపోయారు. ఆయన చంద్రన్న బీమాకు దరఖాస్తు చేసి.. రుసుం సైతం చెల్లించారు. బీమా మాత్రం రాలేదు. అదేమంటే ఆయన పేరునమోదు కాలేదని అధికారులు ఆయన కుంటుంబ సభ్యులకు సెలవిచ్చారు. అలాగే బందరు రోడ్డులోని ఒక వస్త్రాల దుకాణంలో బాల తిరుపతమ్మ కుంటుంబ సభ్యులదీ ఇదే పరిస్థితి. ఆమె ప్రమాదవశాత్తూ ఇటీవల చనిపోయింది. చంద్రన్న బీమా సొమ్ము రాలేదు. ఆమె పేరు కూడా నమోదు కాలేదని అధికారులు చెప్పారు. విజయవాడలో అసంఘటిత రంగంలో పనిచేసే అనేక మంది కార్మికుల కుటుంబాలదీ ఇదే ఆవేదన. పేర్లు నమోదు చేయించినా, కనిపించవు.. ఒకవేళ పేర్లున్నా.. నగదు సకాలంలో రాదు.. కొత్తగా ఎంట్రికీ అనుమతులుండవు. ఇదీ చంద్రన బీమా కథ. అందరికీ న్యాయం చేయాలి.. నగరంలో అనేక వేలమంది చంద్రన్న బీమా కింద నమోదు కాలేదు. సభ్యత్వ నమోదుతో కలిపి చేయడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. ఈ సారి బీమా అధికారులతో బీసెంట్ రోడ్డు, బందరురోడ్డు, ఏలూరు రోడ్లల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి అందరి పేర్లు నమోదు చేయించాలి. అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.– వెంకటేశ్వరరావు, షాప్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు -
చెత్త కుప్పలో ‘చంద్రన్న బీమా’
గుంటూరు, తెనాలి రూరల్: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చంద్రన్న బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టగా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ‘చంద్రన్న’ పేరు జోడించి, పథకాన్ని తామే ప్రవేశపెట్టినట్టు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ గొప్పలు చెప్పుకున్నారు. అంత హడావిడి చేసిన ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు అందాల్సిన బీమా కార్డులు తెనాలి పట్టణంలో చెత్తకుప్పలో దర్శనమిచ్చాయి. స్థానికులు గుర్తించి 210 కార్డులను అధికారులకు అందించారు. వందల కార్డులు పట్టణ మారీసుపేట మఠం బజారులో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు ముందు రోడ్డు వెంబడి గార్బేజ్ కలెక్షన్ పాయింట్ ఉంది. చెత్త కుండీ వద్ద కొందరు కార్డులను ఏరుకుంటుండడాన్ని ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గమనించి, 210 కార్డులను అధికారులకు అందజేశాడు. అప్పటికే కొన్ని వందల కార్డులు గుర్తు తెలియని వారు తీసుకెళ్లారు. చంద్రన్న బీమాకు రూ.15 ప్రీమియం చెల్లించి కార్డు తీసుకోవాలి. 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి సహజ మరణమైతే రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారికి రూ. 30 వేలు చెల్లిస్తారు. మరణించిన పాలసీ దారుడి కుటుంబానికి రూ.ఐదు వేలు తక్షణ సాయం కింద ఇస్తారు. ప్రమాదవశాత్తు మరణం, పూర్తి అంగవైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షలు చెల్లిస్తారు. కార్మికుల పిల్లలు 9, 10 తరగతులు, ఇంటర్, ఐటీఐ చదివే వారికి(ఇద్దరు పిల్లలకు)రూ. 1200 స్కాలర్షిప్ కింద ఇస్తారు. ఈ పథకానికి సంబంధించి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. సాధికార సర్వే ఆధారంగా ప్రీమియంను రెండేళ్లు ప్రభుత్వమే చెల్లించింది. లబ్ధిదారుల నుంచి రూ.30 వసూలు చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. అయితే కార్డులు అంద జేసి డబ్బులు వసూలు చేయాలన్నారు. ఈ డబ్బు కట్టేందుకూ ప్రజలు ఆసక్తి కనబర్చకపోవడం, రెండేళ్లు పూర్తవడంతో మూడో ఏడాది ప్రభుత్వం ఉచితంగా అందరికీ ప్రీమియం చెల్లించింది. నిర్లక్ష్యానికి నిదర్శనం చంద్రన్న బీమా తమ పేరిట ఉందీ లేనిదీ ఇప్పటికీ తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. లబ్ధిదారులందరికీ కార్డులు పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. పురపాలక సంఘంలో మెప్మా విభాగం ఆధ్వర్యంలో చంద్రన్న బీమా ప్రీమియం చెల్లింపులు(ప్రారంభంలో), కార్డుల అందజేత జరుగుతుంది. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో మొక్కుబడిగా కొందరికి కార్డులను ప్రజాప్రతినిధులు చేత ఇప్పించి, మిగిలిన వాటి పంపిణీ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. వారు కార్డులను అందజేయడంలో తాత్సారం చేయడం, పర్యవేక్షించుకోవాల్సిన మెప్మా సిబ్బంది పట్టనట్టు వ్యవహరించడంతో లబ్ధిదారులకు కార్డులు చేరలేదు. పట్టణంలో 90 శాతం మందికి కార్డులు అందలేదని తెలుస్తోంది. ఇప్పుడు చెత్త కుప్పలో కార్డులు దర్శనమివ్వడంపై ఆర్భాటంగా ప్రచారం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు బీమా కార్డులు లబ్ధిదారులకు తప్పనిసరిగా అందించాలి. చెత్తకుప్పలో పడేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇందుకు సంబంధించిన బాధ్యులెవరో విచారించి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు వ్యక్తుల వద్దకు ఎందుకు వెళ్లాయో విచారిస్తాం.కె.శకుంతల, మున్సిపల్ కమిషనర్ -
ఆయన మాటలకు నేనూ మోసపోయా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని అందరినీ మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రధాని మాటలకు తానూ మోసపోయానని ఆయన అన్నారు. ప్రధాని మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. అనుభవంలేని వాళ్ళు నేనే పాలిస్తా అంటూ రోడ్డు ఎక్కారని చెప్పుకొచ్చారు. ఏటీఎంలలో డబ్బులులేని పాలన దేశంలో సాగుతోందని కేంద్రాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. మన డబ్బులు మనం తీసుకోవాలంటే క్యూలో నిలబడేలా చేశారని అన్నారు. ఇడ్లీపై కూడా 18శాతం టాక్స్ వేస్తారా, ఇది దారుణమని అన్నారు. ప్రధానమంత్రి మైక్ తీసుకుంటే.. ఎవరూ ఆయనను ఆపలేరని, ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. ‘మా ప్రభుత్వం ఎన్నో చేస్తోంది. వేరే వారి మాటలు నమ్మకండి. నేను వేసిన రోడ్ల మీదే నడుస్తూ.. నన్నే విమర్శిస్తున్నారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘చంద్రన్న బీమా పథకం మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. అసంఘటిత కార్మికుల కుటుంబాల కష్టాలే తనను ఈ పథకం పెట్టేలా చేశాయని అన్నారు. ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి డ్వాక్రా సంఘాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్మికశాఖ కమిషనర్ వర ప్రసాద్, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్‌ను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. -
బీమా నగదు అందడం లేదు..
పీసీపల్లి: తన కుమారుడు డెంగీ జ్వరంతో గత ఆరు నెలల క్రితం మరణించాడని, నేటికీ చంద్రన్న బీమా అందలేదని అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బీమనాథం రమాదేవి ప్రజా సంకల్పయాత్రలో సోమవారం జగన్‌ను కలిసి విన్నవించింది. తన కుమారుడు ఈశ్వర్‌రెడ్డి 32 ఏళ్లకే మరణించాడని.. తమను ఆదుకోవాలని జగన్‌కు తెలియచేసింది. సుబాబుల్‌కు గిట్టుబాటు ధర లేదు కందుకూరు రూరల్: కష్టించి పండించిన సుబాబుల్‌కు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తోందని.. వెంటనే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని వెంకటాపురానికి చెందిన మాగులూరి రాజగోపాలరెడ్డి వైఎస్ జగన్‌కు విన్నవించారు. గత సంవత్సరం రూ. 3,600 ఉన్న సుబాబుల్ ధర ఈ సంవత్సరం రూ. 2,500 పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జామాయిల్ గతంలో రూ. 2,200 పలకగా ఈ ఏడాది రూ. 1,500 కూడా రాలేదని వాపోయారు. -
చంద్రన్న భీమా.. ఏదీ భీమా?
-
వచ్చే ఎన్నికల్లోగా 12 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలోని పేదలకు 12 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర మిషన్, ఎన్టీఆర్ గ్రామీణ గృహ ప్రవేశాలు, చంద్రన్న బీమా పథకాల అమలుపై సోమవారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. తన మనవడు దేవాన్ష్‌తో కలసి సీఎం తొలుత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిసందర్భంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన లక్ష ఇళ్లకు.. గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ. 16 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఒకే రోజు లక్ష గృహప్రవేశాలతో దేశంలోనే రాష్ట్రం ఒక చరిత్ర సృష్టించిందన్నారు. ఎక్కడా పైసా అవినీతి లేకుండా ఈ ఇళ్లను నిర్మించామన్నారు. ఇల్లు, బిల్లు మంజూరు చేసే విషయంలో ఎవరైనా లంచం అడిగితే 1100 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చేస్తున్నామని, ఆ ఫొటోలు అప్లోడ్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వచ్చే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు లక్ష, వచ్చే జూన్ 8వ తేదీన మరో లక్ష ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ప్రపంచానికి మహాత్ముడు ఆదర్శం.. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. గాంధీజీ ఒక మహానాయకుడే కాదు ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహాశక్తి అని కొనియాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకున్నారన్నారు. చరిత్ర ఉన్నంత కాలం మహాత్ముణ్ణి ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుందన్నారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కడు పేదరికాన్ని అనుభవిస్తూ విద్యాభ్యాసం చేశారని చెప్పారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన 91 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావును బాబు సత్కరించారు. -
చంద్రన్న బీమా చేయించారు ఆన్లైన్ చేయడం మరిచారు
♦ మృతిచెందిన కుటుంబానికి బీమా డబ్బు కోసం చైర్మన్ దృష్టికి ♦ వందలాది మంది లబ్ధిదారులది ఇదే పరిస్థితి ప్రొద్దుటూరు టౌన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న బీమా లబ్ధిదారులను ఆన్లైన్ చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. పట్టణంలోని స్వయంసేవక్ రోడ్డులో నివాసం ఉంటున్న భోగాల గురివిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు 2016 ఆగస్టు 21న చంద్రన్న బీమా చేయించుకున్నారు. ఇందుకు ఇంటి వద్దకు వచ్చిన సిబ్బంది రూ.15 కట్టించుకొని రసీదు నంబర్ 30374ను ఇచ్చారు. అప్పటి నుంచి వివరాలను ఆన్లైన్లో పొందుపరచలేదు. సోమవారం గురివిరెడ్డి అనారోగ్యంతో మృతి గురివిరెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. చంద్రన్న బీమా కట్టిన రసీదును తీసుకొని మృతిని కుటుంబసభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆరా తీశారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బీమా సొమ్ము ఇప్పించాలని కోరారు. రసీదు నంబర్, వివరాలను ఆన్లైన్లో చూసిన సిబ్బంది వివరాలను పొందుపరచలేదని తేల్చారు. ఏడాది దాటినా ఇంత వరకు బీమా కట్టించుకున్న వారి వివరాలను ఆన్లైన్లో పొందుపరచక పోవడం చూస్తుంటే మున్సిపల్ అధికారుల పనితీరు అర్థం అవుతోంది. ఆన్లైన్లో లేని వందలమంది వివరాలు ఈ విధంగా వందలాది మంది వివరాలను మున్సిపల్ అధికారులు ఆన్లైన్లో ఎక్కించనట్లు తెలుస్తోంది. చంద్రన్న బీమా రూ.15 కట్టించుకొని వివరాలను ఆన్లైన్లో ఎక్కించడానికి మొదట రెవెన్యూ సిబ్బందిని నియమించింది. వీరి నుంచి మెప్మా ఆర్పీలను, సీఓలకు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది వందలాది మంది వివరాలను ఆన్లైన్లో ఎక్కించకుండా కేవలం డబ్బు కట్టించుకొని రసీదులు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ విచారణ జరిపితే ఆన్లైన్లో లేని లబ్ధిదారుల వివరాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం సాధారణంగా మృతి చెందిన వారికి చంద్రన్న బీమా రూ.30వేల నుంచి రూ. 2లక్షలకు పెంచినట్లు ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్, పీడీ దృష్టికి సమస్య జరిగిన విషయంపై బాధిత కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్ కచ్చితంగా బాధిత కుటుంబసభ్యులకు బీమా సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని పీడీకి చెప్పారు. ఏది ఏమైనా ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాలు ఎక్కించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
జనరిక్ మందుల పంపిణీకి ఇంటింటా సర్వే
ఏలూరు (ఆర్ఆర్ పేట) : జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి జనరిక్ మందులు అందించేందుకు వారి వివరాలను ఇంటింటా తిరిగి సేకరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో డీఆర్డీఏ అధికారుల సమావేశంలో జనరిక్ మందుల విక్రయాలు, చంద్రన్న బీమా పథకం అంశాలపై కలెక్టర్ సమీక్షిం చారు. జిల్లాలో ఏటా రూ.వెయ్యి కోట్లు విలువైన మందుల అమ్మకాలు జరుగుతున్నాయని, డ్వాక్రా గ్రూపుల ఆధ్వర్యంలో జిల్లాలో 200 జనరిక్ మందుల షాపులు ఏర్పాటు చేసి కనీసం రూ.200 కోట్ల మందులను విక్రయించేస్థాయికి చేరేలా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ డాక్టర్లు బ్రాండెడ్ బదులు జనరిక్ మందులనే ప్రిస్కిప్షన్‌లో రాసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసులు, మెప్మా పీడీ డాక్టర్ ఎన్.ప్రకాశరావు పాల్గొన్నారు. ఆర్ఆర్ ప్యాకేజీపై అవగాహనకు గ్రామ సభలు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు చెల్లించే ఆర్ ఆర్ ప్యాకేజీ పునరావాస కార్యక్రమాలపై అవగాహన కలిగించడానికి ఈనెల 30 నుంచి జూన్ 12 వరకు 19 గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, తదితర అంశాలపై ఐటీడీఏ పీఓ షాన్‌మోహన్‌తో కలెక్టర్ చర్చించారు.నిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కలిగించడానికి విస్తృతమైన చర్చ జరపాలని షాన్మోహన్ను కలెక్టర్ ఆదేశించారు. 30న టేకూరు, చీడూరు, 31న కొరుటూరు, శివగిరి, జూన్ 1న సిరివాక, తెల్లదిబ్బలు, 2న తూటిగుంట, 3న పల్లవూరు, పైడాకులమామిడి, 5న సరుగుడు, యర్రవరం, 6న కొత్తూరు, 7న కొత్తమామిడిగొంది, మాధాపురం, 8న ములగలగూడెం, గాజులగొంది, 9ప వాడపల్లి, 10న తల్లవరం, 12న కోండ్రుకోట గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. జేసీ పి.కోటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న పాల్గొన్నారు. -
'ఏ హోటల్లో చూసినా బాల కార్మికులే'
-
బీరాల బీమా !
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న బీమా పథకం జిల్లాలో బీరాల బీమాగా మారింది. ఆచరణలో చతికిల పడింది. లబ్ధిదారుల ప్రీమియం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో జమ కాకపోవడంతో 94,620 మంది బీమాకు దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఈ పథకంలో ప్రీమియం మొత్తంలో రూ.270 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. లబ్ధిదారులు కేవలం రూ.15 చెల్లిస్తే సరిపోతుంది. అయితే అధికారుల అశ్రద్ధ, లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వల్ల 94వేల 620 మంది చెల్లించాల్సిన బీమా ప్రీమియం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు జమ కాలేదు. నమోదు ఘనం జిల్లా వ్యాప్తంగా తొలుత చంద్రన్న బీమా పథకానికి 14లక్షల 21వేల 322 మంది పేర్లను నమోదు చేసినట్టు అధికారులు ఘనంగా ప్రకటించారు. వీరంతా తమ వాటా ప్రీమియం రూ.15 చొప్పున చెల్లిస్తే రూ.2 కోట్ల 13లక్షల 19వేల 830 గ్రామీణాభివృద్ధి సంస్థకు జమ కావాలి. కానీ రూ. కోటి 99లక్షల 527 మాత్రమే జమ అయిందని అధికారులు చెబుతున్నారు. అంటే ఇంకా 14లక్షల 19వేల 303 రావాల్సి ఉంది. ఈలెక్కన 94వేల 620 మంది నుంచి ప్రీమియం రాలేదన్నమాట. ప్రీమియం కట్టారా.. మాయమయ్యాయా! ప్రీమియం జమ కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి స్మార్ట్‌పల్స్ సర్వే చేసిన సమయంలోనే ప్రీమియం మొత్తాలను లబ్ధిదారుల వద్ద నుంచి సర్వే సిబ్బంది వసూలు చేశారు. ఇప్పటివరకూ జమైన ప్రీమియం సొమ్ములు కూడా ఇలా వచ్చినవే. అయితే ఎప్పుడో వసూలు చేసిన ఈ డబ్బులు ఇంకా జమకాకపోవడం, అధికారికంగా లబ్ధిదారులకు బీమా పత్రాలు అందిచకపోవడం చూస్తుంటే నిజంగా వారి వద్ద నుంచి వసూలు కాలేదా, లేక వసూలు అయినా జమకాలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీమియం సొమ్మును సర్వే సిబ్బందికి అప్పగించడం, దీనిని పర్యవేక్షించే నాథుడు లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. 30 వరకే గడువు ఈ పథకానికి బీమా ప్రీమియం చెల్లించే గడువు ఈ నెల 30 లోగా పూర్తికానుంది. దీంతో 94వేల మంది ప్రీమియం సొమ్ములు జమ కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 30లోగా అవి జమ కాకపోతే వారంతా బీమాకు దూరమయ్యే పరిస్థితి. ఉపయోగాలివీ.. చంద్రన్న బీమా పథకం ప్రకారం.. బీమాదారులు సహజంగా మరణిస్తే రూ.15వేలు, ప్రమాదవశాత్తూ మరణించినా, శాస్వత వైకల్యం పొందినా రూ.5లక్షలు, పాక్షిక వైకల్యం కలిగితే రూ.3.6లక్షలు ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. బీమాదారుల పిల్లలకు ఏడాదికి రూ.1200 ఉపకార వేతనంగా తొమ్మిదోతరగతి నుంచి ఇంటరీ్మడియెట్ వరకూ చెల్లించనున్నారు. క్లెయిమ్‌ల పరిష్కారం ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2వేల 438 మంది వివిధ ప్రమాదాల వల్ల బీమా పరిష్కారానికి క్లెయిమ్చేశారు. వారిలో 2వేల 122 మందికి క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. ఇంకా 316 మంది క్లెయిమ్‌లు పరిష్కారం కావాల్సి ఉంది. రూ.50 కోట్లు చాలదు ఆయిల్‌పామ్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ.50కోట్లు సరిపోవు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. టన్నుకు కనీసం రూ.9వేల పైబడి ధర వస్తేనే గిట్టుబాటవుతుంది. ఎరువులపై సబ్సిడీ పెంచాలి. గెలల ధరను స్థిరీకరించాలి. – గడ్డమణుగు సత్యనారాయణ, ఆయిల్‌పామ్ రైతు -
నిబంధనల వ్యథ.. చంద్రన్న బీమా కథ!
⇒ నమోదైన లబ్ధిదారులు 16.57 లక్షలు ⇒ బీమా చెల్లించాల్సింది 3,004 మందికి ⇒ ఇప్పటి వరకు చెల్లించింది 2084 కుటుంబాలకు.. పల్స్ సర్వేలో వివరాలు సక్రమంగా లేకపోవటంతో ఇక్కట్లు బందరు మండలం చిరివెళ్లపాలెంలో ఓ యువకుడు ట్రాక్టర్ ఢీకొని గత ఏడాది నవంబరులో మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. బాధిత కుటుంబానికి చంద్రన్న బీమా నేటికీ అందలేదు. ఈ ఒక్క సంఘటనే కాదు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ పరిస్థితి లబ్ధిదారులను వేదన పెడుతోంది. చంద్రన్న బీమా పథకంలో నిబంధనల మోత నిరుపేదల మతిపోగొడుతోంది. ఒక్కోసారి ఒక్కో రకం రూల్ అని చెబుతూ బాధితులతో ఆటలాడుకుంటున్నారు. పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం లబ్ధిదారులకు శాపంగా మారింది. మచిలీపట్నం : అసంఘటిత రంగంలో పనిచేసే బాధిత కార్మికులకు చంద్రన్న బీమా సకాలంలో అందక ఆవేదన పెడుతోంది. ప్రభుత్వం రకరకాల నిబంధనలు విధిస్తుండటంతో బీమా సొమ్ము కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. 2016 అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ పథకం రాష్ట్రంలో ప్రారంభమైంది. జిల్లాలో ఇప్పటి వరకు 16.57 లక్షల మంది ఈ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పటి వరకు 3,004 మంది వివిధ కారణాలతో మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2,084 మందికి బీమా సొమ్మును చెల్లించినట్లు వెలుగు ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. వీటిలో 139 ప్రమాదం కారణంగా మరణించిన కేసులు, సహజ మరణాలు 1943, పాక్షికంగా వికలాంగులైన వారు ఇద్దరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు మరణించిన వారికి బీమా సొమ్ము అందించటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆధార్‌కార్డు ఆన్లైన్ కాకపోవటం, రేషన్‌కార్డులో తప్పులు దొర్లటం, ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజాసాధికార సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం, పల్స్ సర్వే ఇంకా పూర్తికాకపోవటం తదితర కారణాలతో మృతుల కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము సకాలంలో చేతికి అందని పరిస్థితి నెలకొంది. రెండు బీమా కంపెనీల ద్వారా నగదు చెల్లింపులు.. డ్వాక్రా సంఘాలు, కార్మిక సంఘాలతో పాటు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పల్స్ సర్వే సమయంలోనూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల నుంచి చంద్రన్న బీమా ప్రీమియంగా రూ.15 వసూలు చేశారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఆమ్ ఆద్మీ బీమా యోజన (ఏఏబీవై) ద్వారా సహజ మరణం పొందితే రూ.30 వేలు, ప్రమాదంలో మరణించినా, పూర్తి అంగవైకల్యానికి గురైనా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.3,62,500 ఇవ్వాలి. మృతుని కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే ఇద్దరికి ఏడాదికి రూ.1200 స్కాలర్షిప్ అందించాల్సి ఉంది. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) ద్వారా 60 నుంచి 70 ఏళ్ల వయసుఉన్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4.25 లక్షలు, పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.3.25 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు లైఫ్ ఇన్సూరె న్స్ కార్పొరేషన్ ద్వారా రూ.75 వేలు ముందస్తుగా చెల్లించటంలో ఇబ్బంది ఉండటం లేదు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రూ.4.25 లక్షలు చెల్లించే సమయంలోనే నిబంధనలతో జాప్యం జరుగుతోందని వెలుగు అధికారులు చెబుతున్నారు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు సంబంధిత కుటుంబం వద్దకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్న తరువాతే ఈ మొత్తాన్ని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. -
మరో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు
-
మరో మూడు ఉడాలు
అనంతపురం, కర్నూలు, కాకినాడ కేంద్రంగా ఏర్పాటు ⇒ చంద్రన్న బీమా కింద అదనంగా రూ.30 వేలు ⇒ అర్బన్ ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణం ⇒ మద్యం షాపుల లైసెన్సు ఫీజుల తగ్గింపు ⇒ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో మూడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ఉడా)ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. అలాగే ‘చంద్రన్న బీమా’ కింద కార్మికులకు అదనంగా రూ.30 వేల పరిహారమివ్వాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► మాతృమూర్తిపై గౌరవం పెంపొందేలా ‘అమ్మకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం. ► అనంతపురం కేంద్రంగా 3,098.46 చదరపు కిలోమీటర్ల పరిధిలో అనంతపు రం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 177 గ్రామాలు. ► తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా 2,215.50 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటు. దీని పరిధిలో 6 మున్సిపాల్టీలు, 26 మండలాల్లోని 280 గ్రామాలు. ► కర్నూలు కేంద్రంగా 2,414.69 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 111 గ్రామాలు. వీటి ఏర్పాటు నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయం. ► ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద అర్బన్ ప్రాంతాల్లో 3 కేటగిరీల్లో 1,20,106 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం. ► అగ్రిగోల్డ్‌కు కీసరలో ఉన్న 350 ఎకరాలు, విజయవాడలోని 8 వాణిజ్య ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కోర్టు ను అభ్యర్థించాలని నిర్ణయం. కోర్టుల్లో లేని అక్షయ గోల్డ్, బొమ్మరిల్లు, కేశవరెడ్డి సంస్థల వివాదాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు ఆదేశం. ► ఏపీ సైబర్ సెక్యూరిటీ విధానం–2017కు ఆమోదం. ► ఈ విద్యా సంవత్సరం నుంచి సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ తదితర కోర్సులను ప్రవేశపెడుతూ పాఠ్యాంశాల్లో మార్పు చేయా లని నిర్ణయం. 2017–18ను ఇ–ప్రగతి సంవత్సరంగా పరిగణించాలని తీర్మానం. ► ఎస్టీ విద్యార్థుల కోసం విజయవాడలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి. ► అమిటీ, విట్, సెంచూరియన్, ఎస్ఆర్ఎం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా అంగీకార లేఖలకు సంబంధించిన సవరణలకు ఆమోదం. ► విభజన చట్టం తర్వాత రాష్ట్రం బయట తలెత్తిన సమస్యల పరిష్కారానికి సంబంధించిన మంత్రుల బృందానికి బదులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన జీవోకు ఆమోదం. ► మద్యం షాపుల లైసెన్సు ఫీజును వందలో 25 శాతానికి తగ్గించాలని నిర్ణయం. కేంద్రానికి చెల్లించే సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు ఈ విధానానికి ఆమోదం. తగ్గించిన ఫీజును అదనపు ఛార్జీల పేరుతో మళ్లీ లైసెన్సుదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయం. ‘పతంజలి’ ఆయుర్వేద సంస్థకు 172 ఎకరాలు ► విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలోని 172.84 ఎకరాలను పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కేటాయిం చేందుకు గానూ ఏపీఐఐసీకి అనుమతి. ఆహార, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకరం రూ.3 లక్షల చొప్పున కేటాయించేలా నిర్ణయం ► చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరులోని 100 ఎకరాల భూమిని వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎకరం రూ.1.50 లక్షల చొప్పున కేటాయించేలా ఏపీఐఐసీకి అనుమతి. -
మెప్మాలో కీచకులు
పేట్రేగుతున్న కామాంధులు ఎవరికీ చెప్పలేక కుమిలిపోతున్న మహిళలు తిరుపతి సెంట్రల్: మెప్మాలో కీచకలు తిష్టవేశారు. ఆర్థిక వెతలనే ఆసరాగా చేసుకుని మహిళలను లైంగిక వైధింపులకు గురిచేస్తున్నారు. మాటవినకపోతే బ్యాంక్ నుంచి తీసుకున్న లింకేజీ రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి చేయిస్తున్నారు. అదీ కుదరకపోతే పైఅధికారులతో ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత జిల్లా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇవిగో సాక్షాలు తిరుపతిలోని జానకిరామ సమాఖ్యలో అన్నపూర్ణ సంఘం సభ్యురాలు, స్పందన మాజీ కార్యదర్శిగా పనిచేసిన ఓ మహిళ మెప్మా ద్వారా ఏడాది క్రితం బ్యాంక్ నుంచి లింకేజీ రుణం తీసుకుని ‘సుగుణ డ్వాక్రా క్యాంటీన్ ’ ఏర్పాటు చేశారు. ఇటీవల కంటి ఆపరేషన్ కోసం రెండు నెలలు క్యాంటీన్ మూసివేశారు. బ్యాంకు రుణం సకాలంలో చెల్లించలేకపోయారు. మెప్మాలో ఆదుకునే వారు కరువయ్యారు. మెప్మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ మిషన్ కో–ఆర్డినేటర్ నుంచి వేధింపులు.. అసభ్యకర మాటలు, బ్యాంక్ అధికారుల ఒతిళ్లు ఎక్కువయ్యాయి. వీటిని ఖండించాల్సిన ఓ సీవో స్థాయి మహిళ కూడా సదరు అధికారి ‘చెప్పినట్టు’ నడుచుకోవాలి.. అంటూ వేధింపుల్లో భాగమైందని బాధిత మహిళ వారం కిత్రం మీడియా ఎదుట బోరుమన్నారు. ఇదిలావుండగా సంఘంలోని ఓ మహిళా సభ్యురాలు కుమార్తెకు ఉద్యోగం తీసిచ్చినందుకు సదరు అధికారి ఆ సభ్యురాలిని రాత్రి 8గంటలకు ‘లీలామహల్ సెంటర్’కు రావాలనడంతో ఆమె అవాక్కయినట్టు సమాచారం. ఇలాంటి సంఘటనలపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన చేయి అభయ హస్తమేనట ప్రభుత్వం అందించే స్కాలర్షిప్లు, చంద్రన్న బీమా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. చంద్రన్నబీమా చేసి ఎవరైనా చనిపోతే రూ.30 వేలకు రూ.1,000, రూ.1లక్ష బ్యాంక్ లోను తీసిస్తే రూ.10వేలు కమీషన్ ఇచ్చుకోవాల్సిందే. సదరు అధికారి సంతకం ఉంటేనే లోను ఇచ్చేలా బ్యాంకు అధికారులను సైతం మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. మెప్మాలో ఓ ‘పెద్ద’ సారు తన వెనకుండారని, ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యే అల్లుడు చూసుకుంటారని సదరు అధికారి తరచూ అంటుండేవాడని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇప్పటికే చంద్రన్న బీమా పేరుతో సంఘంలో సంబంధం లేని వారి నుంచి దాదాపు రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. స్కాలర్షిప్లను సైతం తన జేబులో వేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. విచారించి చర్యలు తీసుకుంటాం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడం నేరం. అలాంటివి మెప్మాలో జరిగే అవకాశం లేదు. ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. తిరుపతిలో జరుగుతున్న సంఘటనపై విచారణ చేయిస్తా. తప్పు చేసినట్టు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. –నాగపద్మజ, జిల్లా పథక సంచాలకులు, మెప్మా -
‘పథకాల తొలగింపు సరికాదు’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇటీవల చంద్రన్న బీమా పేరుతో అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులో ఉన్న పథకాల ను దూరం చేస్తోందని, ఇది సరికాదని ప్రగతి శీల భవన ఇతర కార్మిక సంఘం హెచ్చరిం చారు. ఈ మేరకు సోమవారం నగరంలో కార్మి క శాఖ కార్యాలయం వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈ సంఘం జి ల్లా అధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2008లో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బో ర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే కార్మికుల కోసం జనశ్రీయోజన, జనధన్, అభయహస్తం లాంటి బీమా పథకాలతో పాటు ఏపీ లేబర్ వెల్ఫేర్ బో ర్డు, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నారుు కాబట్టి చంద్రన్న బీమాతో ఒరిగేదేమీ లేదని మండి పడ్డారు. ఈ సందర్భంగా కార్మికశాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చారు.ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, నేతింటి నీలంరాజు, జి.లక్ష్మణరావు, కె.కమల, బి.భాస్కరరావు, పి.శ్రీరాములు, ముద్దాడ కృష్ణ, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ నిధి స్వాహా
-కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం -దారిమళ్లిన రూ.250 కోట్ల సంక్షేమ నిధి - చంద్రన్న బీమాలో విలీనానికి యత్నాలు -ప్రభుత్వ రంగ సంస్థల బకాయి రూ.150 కోట్లు ఆకివీడు : తాజ్‌మహల్‌కు రాళ్లెత్తింది ఎవరో తెలియదు కానీ దాని నిర్మాణం వెనుక కార్మికుల శ్రమ ఎంతో దాగి ఉంది. అటువంటి కార్మికుల శ్రమనూ ప్రభుత్వం దోచుకుంటోంది. కార్మిక సంక్షేమ నిధిలో నిల్వ ఉన్న రూ.1,300 కోట్లు శ్రామికుడి శ్రేయస్సు కోసం ఉపయోగపడటంలేదు. ఆరుగాలం కష్టించి పనిచేసిన కార్మికుడు ప్రమాదవశాత్తూ చనిపోతే అతనికి అందాల్సిన బీమా సొమ్ము సకాలంలో అందడంలేదు. కోట్లకు కోట్లు పేరుకుపోతున్న సంక్షేమ నిధిని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధిని వినియోగించకుండా ఇతర అవసరాలకు తరలిస్తుంది. ఇటీవల రాష్ట్రంలో వివిధ అవసరాల నిమిత్తం రూ.250 కోట్లు బదలాయించారు. వేసవిలో మజ్జిగ సఫరాకూ కార్మిక సంక్షేమ నిధినే ప్రభుత్వం వినియోగించింది. చట్టానికి తూట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టానికి తూట్లు పొడుస్తోంది. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలోకి విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కార్మికులకు బీమాగా చెల్లించే నిధి రూ.80 వేలను రూ.30 వేలకు కుందించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంక్షేమ నిధిని పెంచుతూ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మెమో విడుదల చేసిందని కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1.72 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జిల్లాలో 1.72 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. వీరిలో అధిక శాతం చదువుకున్న నిరుద్యోగులే ఉన్నారు. దీనిలో 85 లక్షల మంది మహిళా కార్మికులున్నారు. కూలి ధర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో భవన నిర్మాణ పనులు తగ్గిపోవడంతో పని దినాలు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదల, రద్దు నోట్ల ప్రభావం భవన నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంపై పడింది. దీంతో కార్మికులకు పనులు తగ్గిపోయాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక అమ్మకాలపై ఆంక్షలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇటీవల ఇసుకపై ఆంక్షలు ఎత్తివేసినా ఇసుక మాఫియాతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ బకాయి రూ.150 కోట్లు సంక్షేమ నిధికి ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయి రూ.150 కోట్లు పైబడే ఉంది. వివిధ కట్టడాలు, వంతెనలు, సీసీ రోడ్లు, ఆనకట్టలు, ప్రభుత్వ భవనాలు వంటి వాటి నుంచి ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈ పన్నును చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. కార్మికుల చెంతకు చేరని క్లైయిమ్లు నిర్మాణ సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా, గాయపడినా వాటికి క్లైయిమ్లు చెల్లించాల్సి ఉంది. దీనికోసం కార్మికుల బంధువులు లేబర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 16 మంది సహాయ కార్మికశాఖ అధికారులున్నప్పటికీ ఆయా గ్రామాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన రికార్డులు పూర్తి చేయడానికి ఘటనా స్థలాలకు వెళ్లడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌కు కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధిని చంద్రన్న బీమాలోకి విలీనం చేయాలనే యోచనపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. త్వరలోనే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని రాష్ట్ర సంఘం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. కేంద్ర పథకానికి రాష్ట్రం తూట్లు కేంద్ర పభుత్వం అమలు జరిపే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఈ పథకాన్ని చంద్రన్న బీమాలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కార్మిక సంక్షేమ నిధిని ఇతర అవçసరాలకు తరలించడం దారుణం. ప్రమాద బీమా రూ.5 లక్షలు ఉండగా దానిని తగ్గించేందుకు మెమో జరీ చేయడం విడ్డూరంగా ఉంది. నారపల్లి రమణారావు, జిల్లా కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంఘం రూ.2.50 కోట్లు చెల్లించాం భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్లి తమ ఏఎల్ఓలు క్లయిమ్‌లు రాస్తారు. రెన్యూవల్స్ కూడా చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు 1150 మంది కార్మికులకు రూ.2.50 కోట్లు సంక్షేమ నిధులు చెల్లించాం. భవన నిర్మాణ కార్మికులు తమ సభ్యత్వాలను ప్రతి రెండేళ్లకొకసారి రెన్యూవల్ చేయించుకోవాలి. రెండేళ్లు పూర్తయిన తరువాత రెన్యూవల్ చేయించుకోకపోతే సభ్యత్వం రద్దవుతుంది. ఎన్.రామారావు, జిల్లా కార్మిక శాఖాధికారి, ఏలూరు -
సంక్షేమ నిధి స్వాహా
-కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం -దారిమళ్లిన రూ.250 కోట్ల సంక్షేమ నిధి - చంద్రన్న బీమాలో విలీనానికి యత్నాలు -ప్రభుత్వ రంగ సంస్థల బకాయి రూ.150 కోట్లు ఆకివీడు : తాజ్‌మహల్‌కు రాళ్లెత్తింది ఎవరో తెలియదు కానీ దాని నిర్మాణం వెనుక కార్మికుల శ్రమ ఎంతో దాగి ఉంది. అటువంటి కార్మికుల శ్రమనూ ప్రభుత్వం దోచుకుంటోంది. కార్మిక సంక్షేమ నిధిలో నిల్వ ఉన్న రూ.1,300 కోట్లు శ్రామికుడి శ్రేయస్సు కోసం ఉపయోగపడటంలేదు. ఆరుగాలం కష్టించి పనిచేసిన కార్మికుడు ప్రమాదవశాత్తూ చనిపోతే అతనికి అందాల్సిన బీమా సొమ్ము సకాలంలో అందడంలేదు. కోట్లకు కోట్లు పేరుకుపోతున్న సంక్షేమ నిధిని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధిని వినియోగించకుండా ఇతర అవసరాలకు తరలిస్తుంది. ఇటీవల రాష్ట్రంలో వివిధ అవసరాల నిమిత్తం రూ.250 కోట్లు బదలాయించారు. వేసవిలో మజ్జిగ సఫరాకూ కార్మిక సంక్షేమ నిధినే ప్రభుత్వం వినియోగించింది. చట్టానికి తూట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టానికి తూట్లు పొడుస్తోంది. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలోకి విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కార్మికులకు బీమాగా చెల్లించే నిధి రూ.80 వేలను రూ.30 వేలకు కుందించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంక్షేమ నిధిని పెంచుతూ జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మెమో విడుదల చేసిందని కార్మిక సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1.72 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు జిల్లాలో 1.72 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులున్నారు. వీరిలో అధిక శాతం చదువుకున్న నిరుద్యోగులే ఉన్నారు. దీనిలో 85 లక్షల మంది మహిళా కార్మికులున్నారు. కూలి ధర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో భవన నిర్మాణ పనులు తగ్గిపోవడంతో పని దినాలు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదల, రద్దు నోట్ల ప్రభావం భవన నిర్మాణ ముడి సరుకుల ధరలు పెరగడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంపై పడింది. దీంతో కార్మికులకు పనులు తగ్గిపోయాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇసుక అమ్మకాలపై ఆంక్షలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇటీవల ఇసుకపై ఆంక్షలు ఎత్తివేసినా ఇసుక మాఫియాతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ బకాయి రూ.150 కోట్లు సంక్షేమ నిధికి ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయి రూ.150 కోట్లు పైబడే ఉంది. వివిధ కట్టడాలు, వంతెనలు, సీసీ రోడ్లు, ఆనకట్టలు, ప్రభుత్వ భవనాలు వంటి వాటి నుంచి ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఈ పన్నును చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. కార్మికుల చెంతకు చేరని క్లైయిమ్లు నిర్మాణ సమయంలో కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించినా, గాయపడినా వాటికి క్లైయిమ్లు చెల్లించాల్సి ఉంది. దీనికోసం కార్మికుల బంధువులు లేబర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 16 మంది సహాయ కార్మికశాఖ అధికారులున్నప్పటికీ ఆయా గ్రామాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన రికార్డులు పూర్తి చేయడానికి ఘటనా స్థలాలకు వెళ్లడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌కు కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధిని చంద్రన్న బీమాలోకి విలీనం చేయాలనే యోచనపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. త్వరలోనే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని రాష్ట్ర సంఘం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. కేంద్ర పథకానికి రాష్ట్రం తూట్లు కేంద్ర పభుత్వం అమలు జరిపే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఈ పథకాన్ని చంద్రన్న బీమాలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కార్మిక సంక్షేమ నిధిని ఇతర అవçసరాలకు తరలించడం దారుణం. ప్రమాద బీమా రూ.5 లక్షలు ఉండగా దానిని తగ్గించేందుకు మెమో జరీ చేయడం విడ్డూరంగా ఉంది. నారపల్లి రమణారావు, జిల్లా కార్యదర్శి, భవన నిర్మాణ కార్మిక సంఘం రూ.2.50 కోట్లు చెల్లించాం భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదం ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్లి తమ ఏఎల్ఓలు క్లయిమ్‌లు రాస్తారు. రెన్యూవల్స్ కూడా చేస్తారు. జిల్లాలో ఇప్పటి వరకూ సుమారు 1150 మంది కార్మికులకు రూ.2.50 కోట్లు సంక్షేమ నిధులు చెల్లించాం. భవన నిర్మాణ కార్మికులు తమ సభ్యత్వాలను ప్రతి రెండేళ్లకొకసారి రెన్యూవల్ చేయించుకోవాలి. రెండేళ్లు పూర్తయిన తరువాత రెన్యూవల్ చేయించుకోకపోతే సభ్యత్వం రద్దవుతుంది. ఎన్.రామారావు, జిల్లా కార్మిక శాఖాధికారి, ఏలూరు -
పథకం కేంద్రానికి బాజా చంద్రన్నది
–నేటి నుండి చంద్రన్న భీమా –జిల్లాలో 12లక్షల 30వేల మంది లబ్ధిదారుల –గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభం –లాంఛనంగా నేడు బాండ్ల పంపిణీ –ఏలూరు (మెట్రో) అసంఘటిత రంగ కార్మికుల జీవితాలకు భద్రత కల్పించేందుకు ఉద్ధేశించిన చంద్రన్న భీమా గాంధీ జయంతి సందర్భంగా నేటి నుండి ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధానిలో దీన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోనూ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ అధికారులు, కార్మిక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి భధ్రత లేకపోవడంతో ప్రమాదవశాత్తూ మతి చెందితే కుటుంబాలు ఆర్ధిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఇలాంటి కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే మూడు పథకాలను విలీనం చేసి చంద్రన్న భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో సభ్యులను చేర్చే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రజాధికారిత సర్వేలో గుర్తింపు ః ప్రజాధికారిత సర్వే జరుగుతున్న తరుణంలో చంద్రన్న భీమా పథకానికి అర్హులను గుర్తించేలా ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. జిల్లాలో శుక్రవారం నాటికి 12లక్షల 30వేల మందిని గుర్తించి వారికి కనీస ప్రీమియంగా నిర్ధారించిన రు.15లను లబ్ధిదారుని వద్ద నుండి వసూలు చేస్తూ ప్రభుత్వం చేర్పించింది. వీరందరికీ అక్టోబరు 2వ తేదీ నుండి భీమా అమలులోకి వస్తుంది. ఇదిలా ఉండగా మరో వీరిలో ఇప్పటికే 10లక్షల 92వేల మంది బ్యాంకు ఖాతాలను భీమాలకు అనుసంధానం చేసుకున్నారు. ఇంకా లక్షా 38వేల మంది బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు బాజాలు ః వాస్తవానికి ఈ భీమా పథకం చంద్రబాబు సర్కారుది కానే కాదు. ఈ పథకం ఇప్పటికే ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రదానమంత్రి సురక్ష భీమా యోజన, ఆమ్ ఆద్మీ పథకం ఈ మూడు పథకాలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న భీమాగా నామకరణం చేసి బాజాలు కొట్టుకుంటుంది. పథకం ప్రయోజనాలు ఇవీ ః – భీమా పథకం ద్వారా నమోదైన సభ్యుల్లో ఎవరికైనా సహజ మరణం సంభవిస్తే రు.30వేలు భీమా సొమ్మును కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. – ప్రమాద వశాత్తూ మతి చెందితే కుటుంబ సభ్యులకు రు.5లక్షలు భీమా సొమ్మును చెల్లిస్తారు. – ఏదైనా ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం సంభవించిన వారికి రు.5లక్షలు చెల్లిస్తారు. – పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 3.75లక్షలు బాధిత కుటుంబానికి చెల్లిస్తారు. నేడు బాండ్ల పంపిణీ ః జిల్లాలో సుమారు 600 మంది లబ్ధిదారులకు నేడు కార్మిక శాఖ, గ్రామీణాభివద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బాండ్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సిఆర్ఆర్ కళాశాలలో లాంఛనంగా నేడు ప్రారంభించి బాండ్లను లబ్ధిదారులకు అందిస్తారు. లాంఛనంగా నేడు ప్రారంభం కె.శ్రీనివాస్, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ కార్మికశాఖ, డిఆర్డిఎ శాఖలు సంయుక్తంగా నేడు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా నేడు 600 మందికి భీమా బాండ్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. అక్టోబరు 10వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు బాండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతోంది. -
పేదల సంక్షేమమే ధ్యేయం
– చంద్రన్న బీమా ప్రారంభోత్సవంలో మంత్రి గంటా కడప రూరల్ : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక మేడా కన్వెక్షన్ హాలులో చంద్రన్న బీమా పథకాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమాను కేవలం రూ. 15తో కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ బీమా కారణంగా రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది, జిల్లాలో ఆరు లక్షల మందికి పైగా కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రమాదంలో మరణించినా, పూర్తిగా అంగవైకల్యం కలిగినా రూ. 5 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరుగుదొడ్లు లేని సమాజానికి విలువ లేదు : జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ మరుగుదొడ్లు లేని సమాజానికి విలువ లేదని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతోపాటు సర్పంచులు చొరవ చూపాలన్నారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి మాట్లాడుతూ చంద్రన్న బీమాను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా ఎస్సీ కార్పొరేషన్, జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆస్తుల రూపంలో ఆటోలు, మోపెడ్, ఐస్‌బాక్సులు, వలలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, నాయకులు దుర్గాప్రసాద్, సుభాన్‌బాషా, హరిప్రసాద్, మాజీమంత్రులు బ్రహ్మయ్య, రామసుబ్బారెడ్డి, విజయజ్యోతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీలక్షి, జిల్లా మత్స్యశాఖ ఏడీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా తనను కార్యక్రమానికి ఆహ్వనించకుండా అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించారని డిప్యూటీ మేయర్ అరీఫుల్లా ఆరోపించారు. -
'పేదలను చంద్రన్న బీమాలో చేర్పించండి'
► రంజాన్ తోఫా కోసం రూ.35 కోట్లు ► జిల్లా ఇన్చార్జి మంత్రి పల్లె విజయనగరం: జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం జెడ్పీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్నవారిని చంద్రన్న బీమా పథకంలో చేర్పించాలని సూచించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.3 లక్షలు అందించేందుకు ఈ బీమా ఉపకరిస్తుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రంజాన్‌ను ముస్లింల గౌరవార్థం రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నామని మంత్రి పల్లె అన్నారు. ముస్లిం మైనార్టీలకు కేవలం రంజాన్ తోఫా మాత్రమే కాకుండా సంక్రాంతి కానుకను కూడా అందిస్తామన్నారు. ఈ డబుల్ ధమాకా రాష్ట్రం లోని 11 లక్షల కుటుంబాలకు వర్తింపజేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధ్యయనం చేశామని, వీటిని సంరక్షిస్తామని చెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, పోలీస్ సూపరింటెండెంట్ సభ్యులుగా కమిటీలను ఏర్పా టు చేశామని తెలిపారు. ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తాయన్నారు. రాష్ట్రంలోని మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న 5వేల మంది ఇమామ్‌లు, మౌజాన్లకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
ప్రెస్‌అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అనంతపురం సెంట్రల్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు అన్నారు. నవ్యాంధ్రలో తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. బుధవారం డ్వామా హాలులో మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులు ఉన్నత విలువలు అలవర్చుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్రిడిటేషన్ జర్నలిస్టులకు రూ. 2.50 లక్షల వరకూ ఉచిత వైద్యం సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పింఛన్ అందించేందుకు కమిటీ వేస్తున్నామని తెలిపారు. చంద్రన్న బీమా పథకాన్ని కూడా వర్తింపజేస్తామన్నారు. -
కేంద్ర నిధులతో ‘చంద్రన్న బీ(ధీ)మా’
కేంద్ర పథకానికి మార్పులతో..సీఎం పేరిట రాష్ట్రంలో శ్రీకారం..! సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకంలో స్వల్ప మార్పులు చేసి ‘చంద్రన్న బీమా’ పేరుతో రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దేశంలో బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ రూ. 12లు చెల్లిస్తే రెండు లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ నుంచి ప్రధాన మంత్రి బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర పథకంలో స్వల్పమార్పులు చేసి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అసంఘటిత కార్మికులకు రూ. 5 లక్షల వరకు ఉచిత బీమా అందజేసే ‘చంద్రన్న బీమా’ పథకాన్ని ప్రారంభించనుంది. ప్రధాన మంత్రి బీమా పథకానికి కార్మికులు చెల్లించాల్సిన రూ. 12 ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడంతో పాటు అదనంగా వారి పేరుతో ఈ పథకం ద్వారా మరో రూ. 3 లక్షలకు రాష్ట్రమే బీమా కల్పిస్తోంది. మరోపక్క ఇప్పటికే రాష్ట్రంలో ఆమ్ఆద్మీ పథకంలో బీమా సౌకర్యం పొందుతున్న 24 లక్షల మందిని వచ్చే ఏడాది నుంచి కొత్త పథకం పరిధిలోకి తీసుకొస్తారు. మొత్తంగా ఆగస్టు నుంచి ప్రారంభించే ఈ పథకం ద్వారా దాదాపు కోటి మంది అసంఘటిత కార్మికులకు రూ.ఐదు లక్షల వంతున ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వ పథకానికి చెల్లించాల్సిన డబ్బులు కలుపుకొని ఒక్కొక్కరి పేరిట రూ. 135ల మేర రాష్ట్ర ప్రభుత్వం బీమా సంస్థలకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ‘సెర్ప్’ ద్వారా అమలు చేయాలని ఆలోచన సాగుతోంది. ఆ శాఖ కమిషనర్ వరప్రసాద్ శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఆగస్టు 15వ తేదీ నుంచి పథకం ప్రారంభించాలని కసరత్తు జరుగుతోంది. -
కార్మికులకంటే కష్టపడుతున్నా..!
♦ రాష్ట్రం అభివృద్ధి చెందేవరకు కేంద్రం ఆదుకోవాలి ♦ పరిశ్రమల్లో తనిఖీలకు ఆన్లైన్ విధానం ♦ చంద్రన్న బీమా పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి సాక్షి, విజయవాడ: కార్మికుల కంటే తానే ఎక్కువ కష్టపడుతున్నానని, ఎండల్లో 18 గంటలు కష్టపడుతున్న మొదటి కార్మికుడిని తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం విజయవాడ ఎ కన్వెన్షన్ సెంట ర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘చంద్రన్న బీమా పథకాన్ని’ బాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాలుగైదు గంటలు ఎక్కువ అందరూ కష్టపడాలని ఆదేశించారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో తమ పార్టీ మంత్రులు ఉన్నారే తప్ప పదవులు ఆశించి కాదని తెలిపారు. రాష్ట్రంలో 15 కార్మిక చట్టాలు ఉన్నాయని, ఒకే రిజిస్ట్రేషన్ కింద ఈ చట్టాలకు సంబంధించిన అనుమతులన్నీ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు ఆన్లైన్ విధానం అమలు చేస్తామని చెప్పారు. వివిధ పరిశ్రమలు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వారి పరిశ్రమలు వద్దనే ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ప్రమాదం వల్ల మరణించినా, పూర్తి అంగవైకల్యం సంభవించినా రూ.5 లక్షల మేర బీమా సొమ్మును వారి కుటుంబ సభ్యులకు అందచేస్తామని చెప్పారు. పాక్షిక అంగవైక్యం కలిగితే రూ.3,62,500 వరకు అంగవైకల్యస్థాయిని బట్టి చెల్లిస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి చంద్రన్న బీమా పథకం అమలులోకి వస్తుందని వివరించారు. అనంతరం పథకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. -
'కార్మికుల కంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా'
విజయవాడ: కార్మికుల కంటే తానే ఎక్కువ కష్టపడుతున్నాననీ, ఎండలో 18 గంటలు కష్టపడుతున్నానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలో చంద్రన్న బీమా పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో సమానంగా 3 నుంచి 4 గంటలు ఎక్కువ కష్టపడాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని నిన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు స్పందించిన చంద్రబాబు కేంద్రమంత్రి అలా అనడం సరికాదన్నారు. ఆ రోజు రాజ్యసభలో పదేళ్లు ప్రత్యేక హోదా అడిగారని గుర్తు చేశారు. విభజన చట్టం హమీల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నామన్నారు. మంత్రి పదవుల కోసం తాను రాజీ పడుతున్నానడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు.