► రంజాన్ తోఫా కోసం రూ.35 కోట్లు
► జిల్లా ఇన్‌చార్జి మంత్రి పల్లె
విజయనగరం: జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం జెడ్పీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులకు భూసార పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఐదు ఎకరాలలోపు భూమి ఉన్నవారిని చంద్రన్న బీమా పథకంలో చేర్పించాలని సూచించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యం కలిగితే రూ.3 లక్షలు అందించేందుకు ఈ బీమా ఉపకరిస్తుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రంజాన్‌ను ముస్లింల గౌరవార్థం రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నామని మంత్రి పల్లె అన్నారు. ముస్లిం మైనార్టీలకు కేవలం రంజాన్ తోఫా మాత్రమే కాకుండా సంక్రాంతి కానుకను కూడా అందిస్తామన్నారు. ఈ డబుల్ ధమాకా రాష్ట్రం లోని 11 లక్షల కుటుంబాలకు వర్తింపజేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధ్యయనం చేశామని, వీటిని సంరక్షిస్తామని చెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, పోలీస్ సూపరింటెండెంట్ సభ్యులుగా కమిటీలను ఏర్పా టు చేశామని తెలిపారు. ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షిస్తాయన్నారు. రాష్ట్రంలోని మసీదుల్లో విధులు నిర్వహిస్తున్న 5వేల మంది ఇమామ్‌లు, మౌజాన్‌లకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
'పేదలను చంద్రన్న బీమాలో చేర్పించండి'
Published Tue, Jul 5 2016 10:23 AM | Last Updated on Sat, Jul 28 2018 5:42 PM
Advertisement
Advertisement