
సాక్షి, అమరావతి: చంద్రన్న బీమా పథకం పేరుతో ఓ యువకుడికి టోకరా ఇచ్చారు ఆన్ లైన్ కేటుగాళ్లు. అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానిపల్లికి చెందిన గురుప్రసాద్ అనే యువకుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘విజయవాడ చంద్రన్న బీమా వింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు లక్ష రూపాయల విడుదలయ్యింది. మీ అకౌంట్ నెంబర్‌తో పాటు ఏటీఎం డిటైల్స్ అందించాలి’ అని మోసగాళ్లు కోరారు. చంద్రన్న బీమా డబ్బులు వస్తాయని ఆశపడిన ఆ యువకుడు.. ఏటీఎం డిటైల్స్ అందించారు. అంతే తన అకౌంట్‌లోని 40 రూపాయలు మాయమయ్యాయని వాపోతున్నాడు బాధితుడు. మోసపోయానని తెలుసుకున్న గురుప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడు.