
పీసీపల్లి: తన కుమారుడు డెంగీ జ్వరంతో గత ఆరు నెలల క్రితం మరణించాడని, నేటికీ చంద్రన్న బీమా అందలేదని అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బీమనాథం రమాదేవి ప్రజా సంకల్పయాత్రలో సోమవారం జగన్‌ను కలిసి విన్నవించింది. తన కుమారుడు ఈశ్వర్‌రెడ్డి 32 ఏళ్లకే మరణించాడని.. తమను ఆదుకోవాలని జగన్‌కు తెలియచేసింది.
సుబాబుల్‌కు గిట్టుబాటు ధర లేదు
కందుకూరు రూరల్: కష్టించి పండించిన సుబాబుల్‌కు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తోందని.. వెంటనే గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని వెంకటాపురానికి చెందిన మాగులూరి రాజగోపాలరెడ్డి వైఎస్ జగన్‌కు విన్నవించారు. గత సంవత్సరం రూ. 3,600 ఉన్న సుబాబుల్ ధర ఈ సంవత్సరం రూ. 2,500 పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జామాయిల్ గతంలో రూ. 2,200 పలకగా ఈ ఏడాది రూ. 1,500 కూడా రాలేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment