‘పథకాల తొలగింపు సరికాదు’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇటీవల చంద్రన్న బీమా పేరుతో అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులో ఉన్న పథకాల ను దూరం చేస్తోందని, ఇది సరికాదని ప్రగతి శీల భవన ఇతర కార్మిక సంఘం హెచ్చరిం చారు. ఈ మేరకు సోమవారం నగరంలో కార్మి క శాఖ కార్యాలయం వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈ సంఘం జి ల్లా అధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2008లో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బో ర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
ఇప్పటికే కార్మికుల కోసం జనశ్రీయోజన, జనధన్, అభయహస్తం లాంటి బీమా పథకాలతో పాటు ఏపీ లేబర్ వెల్ఫేర్ బో ర్డు, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నారుు కాబట్టి చంద్రన్న బీమాతో ఒరిగేదేమీ లేదని మండి పడ్డారు. ఈ సందర్భంగా కార్మికశాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చారు.ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, నేతింటి నీలంరాజు, జి.లక్ష్మణరావు, కె.కమల, బి.భాస్కరరావు, పి.శ్రీరాములు, ముద్దాడ కృష్ణ, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.