welfare board
-
ఆర్టీసీలో సంక్షేమ బోర్డులు
గోదావరిఖనిటౌన్ (రామగుండం): ఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి అడుగులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ సంస్థ సూచనల మేరకు బస్ డిపోలలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశారు. సంక్షేమ బోర్డులో ఎంపిక చేసిన సభ్యులతో ప్రతీ వారం సమావేశం నిర్వహించి డిపో విధులు నిర్వహిస్తు ఉద్యోగులతో వారి సమస్యలపై సమావేశమవుతారు. సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో వెంటనే చర్యలు తీసుకోవడం ఈ బోర్డల లక్ష్యం. డిపోకు ఐదుగురు సభ్యలను నియమిస్తారు. డిపో మేనజర్ ఈ కమిటీకి ముఖ్య అధికారిగా వ్యవహరిస్తారు. ఇద్దరు కార్మికులు, డిపో గ్యారేజీ ఇన్చార్జి, డిపో ట్రాఫిక్ ఇన్చార్జి ఇలా మోత్తం ఐదుగురు సభ్యులు ప్రతీవారం సమావేశమై డిపో విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌ల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తారు. సమావేశం ఇలా..... ప్రస్తుతం ఆర్టీసీ డిపో నియమించిన సంక్షేమ కమిటీ అన్ని విషయాలలో కీలకంగా పని చేస్తుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించిన విషయాలకు ప్రధాన్యత ఉంటుంది. ఆర్టీసీ పని చేస్తున్న ఉద్యోగుల విధుల కేటాయింపు, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవులు, ఇతర అంశాలపై చర్చలు జరుపుతారు. ఏమైన సమస్యలు ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సంస్థ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ఉద్యోగులకు మరింత మేలు జరిగే విధంగా ఎలాంటి అంశాలనైన ఈ సమావేశంలో పొందుపర్చవచ్చు. వారానికోరోజు, నెలలో నాలుగు రోజు లు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నెలకు ఒక్కసారి జిల్లా ఆర్ఎం కార్యాలయంలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేస్తారు. రెండు నెలలకోసారి జోనల్ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్ స్థాయిలో మూడు నెలలకు ఒక్కసారి సమస్యలు పరిష్కరిస్తారు. జిల్లాలో ఇలా... జిల్లాలో గోదావరిఖని, మంథని బస్ డిపోలు ఉన్నాయి. గోదావరిఖని బస్ డిపోలో 129 బస్సు ఉండగా, 640 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మంథని డిపోలో 92 బస్సులు ఉండగా 310 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గోదావరిఖని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. ఎ.కొంరయ్య 2. బి.నారాయణ 3. వి.ఇందిరాదేవి 4. మాధవి 5. డీకే.స్వామి మంథని సంక్షేమ బోర్డు సభ్యులు.. 1. డీఆర్.రావు 2. విజయ్‌కుమార్ 3. బేగం 4.పార్వతమ్మ 5. సడవలయ్య డిపోలలో ఫిర్యాదు బాక్సులు.. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన అనంతరం బస్ డిపోలో సూచనల కోసం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రతీ ఉద్యోగి ఈ ఫిర్యాదు బాక్స్‌ను వినియోగించుకోవచ్చు. ప్రతీ కార్మికుని సెవులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్టీసీ సంస్థ కోసం సూచించే ప్రతి అంశాన్నీ ఈ ఫిర్యాదు బాక్స్‌లో వేయవచ్చు. వారంలో జరిగే సమావేశంలో ఈ బాక్స్‌ను తెరిచి ప్రతీ కార్మికుడి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం ఈ బాక్స్ లక్ష్యం. క్షేత్రస్థాయి అంశాలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లాస్థాయిలో జరిగే సమావేశంలో ప్రతిబింబింపజేస్తారు. మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు సంక్షేమ బోర్డులో భాగంగా డిపోలలో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ల కోసం, మహిళ అధికారుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు, సౌకర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక సౌకర్యాలను, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ కోసం ఆర్టీసీలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. దీని కోసం బస్ డిపోలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేశాం. ప్రతీ ఉద్యోగి వారివారి సమస్యలను, సంస్థ అభివృద్ధి కోసం ఇచ్చే సూచనలు స్వీకరించి ప్రతీవారం పరిష్కరిస్తాం. దీంతో డిపోలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. – వెంకటేశ్వర్లు, గోదావరిఖని డిపో మేనేజర్ -
వారికి రిలీఫ్‌లు లేవు: ఆర్టీసీ ఎండీ
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లపాటు ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పటంతో కొత్తగా ఏర్పడ్డ డిపో సంక్షేమ మండళ్ల సభ్యులకు రిలీఫ్‌లు కేటాయించకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే అదనంగా సిబ్బంది సమస్యల పరి ష్కారం కోసం దృష్టి సారించాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు. ఈ సంక్షేమ మండళ్లు అందుబాటులోకి వచ్చి నెలరోజులు గడిచినందున, వాటి నిర్వహణలో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని, తగు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటుగా మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు సాధారణ శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్‌భవన్‌లో మంగళవారం జరిగిన కరీంనగర్ జోన్ పరిధిలోని డిపో మేనేజర్లు, అకౌంట్స్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని సునీల్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొందరు డిపో మేనేజర్లు, సంక్షేమ మండళ్ల సభ్యులు తమకు విధులు లేకుండా రిలీఫ్‌లు కేటాయించాలని కోరుతున్న విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మందిని మించి సభ్యులున్నం దున, వారికి రిలీఫ్‌లు ఇస్తే సంస్థపై ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. రోజు కాసేపు మాత్రమే సిబ్బంది సమస్యలపై దృష్టి సారిస్తే సరిపోతుందని, ఇందుకు పెద్దగా సమయం పట్టనందున ప్రత్యేకంగా రిలీఫ్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
పేరుకు బడిపంతులు చేతల్లో బానిస
దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్ధలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వేల పాఠశాలలు, కళాశాలలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు. అందులో ఎవరు చదువు చెబుతున్నారు. వారి అర్హతలు ఏమిటి, వారికి ఇస్తున్న వేతనాలు ఏమిటి, వారి జీవన ప్రమాణాలు ఏమిటని ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం విషాదకరం. ఈ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ముగిసిం దంటే చాలు ఉన్న ఉపాధ్యాయులు వచ్చే సంవత్సరం కొనసాగుతారో లేదో తెలియని దుస్థితి. కొత్త విద్యాసంవత్సరం ఉద్యోగంలో కొనసాగాలంటే విధిగా 50 మంది విద్యార్థులను తాను పని చేస్తున్న పాఠశాలల్లో అడ్మిషన్లు చేయించాలి. అలా చేయకపోతే ఉద్యోగం ఊడినట్లే లెక్క. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల జీవితాలు దుర్భరమైన పరిస్ధితుల్లో ఉన్నాయి. విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి 12 నెలల ఫీజులు యాజమాన్యం వసూలు చేస్తున్నారు. కానీ అక్కడే పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం 10 నెలలే వేతనాలు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో వేలాది పాఠశాలలు, వందలాది ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో లక్షలాదిమంది అధ్యాపక, అధ్యాపకేతర పనిలో ఉన్నారు. వీరిని సరుకుగా మార్చి వేల కోట్లు లాభాలు చేకూర్చే వ్యాపారంగా మార్చారు. భావి భవిష్యత్ నిర్మాతలను తయారు చేసే గురువులకు కడుపులు పస్తు పెడితే ఏ అలోచనతో వారు విద్యార్థులకు చదువు చెబుతారో కూడా అర్ధం చేసుకోని స్థాయికి వ్యవస్థ దిగజారింది.ప్రైవేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న లక్షల మంది బోధన, భోధనేతర సిబ్బందిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరిలో 70 శాతానికి పైగా ఈఎస్ఐ, పీఎఫ్ విధానం అమలు కావటం లేదు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు హెల్త్ కార్డులను ఇవ్వాలి. అప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది. – ఎస్. నూర్‌మహమ్మద్ మొబైల్ : 94900 98057 -
‘పథకాల తొలగింపు సరికాదు’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఇటీవల చంద్రన్న బీమా పేరుతో అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులో ఉన్న పథకాల ను దూరం చేస్తోందని, ఇది సరికాదని ప్రగతి శీల భవన ఇతర కార్మిక సంఘం హెచ్చరిం చారు. ఈ మేరకు సోమవారం నగరంలో కార్మి క శాఖ కార్యాలయం వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఈ సంఘం జి ల్లా అధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2008లో రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బో ర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇప్పటికే కార్మికుల కోసం జనశ్రీయోజన, జనధన్, అభయహస్తం లాంటి బీమా పథకాలతో పాటు ఏపీ లేబర్ వెల్ఫేర్ బో ర్డు, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉన్నారుు కాబట్టి చంద్రన్న బీమాతో ఒరిగేదేమీ లేదని మండి పడ్డారు. ఈ సందర్భంగా కార్మికశాఖ అధికారికి వినతిపత్రం ఇచ్చారు.ఈ ధర్నా కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, నేతింటి నీలంరాజు, జి.లక్ష్మణరావు, కె.కమల, బి.భాస్కరరావు, పి.శ్రీరాములు, ముద్దాడ కృష్ణ, ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
– ఆటో వర్కర్స్ యూనియన్ డిమాండ్ విజయవాడ(గాంధీనగర్) : ఆటో రంగంపై ఆధారపడి జీవనం గడుపుతున్న ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి డిమాండ్ చేశారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్లో ఆటో వర్కర్స్‌యూనియన్ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రవాణా రంగం ఆటుపోటులను ఎదుర్కొంటుందన్నారు. డీజిల్, ఆటో విడిభాగాలు ధరలు పెరిగిపోయి కార్మికుల జీననం దుర్భరంగా మారిందన్నారు. ఆటోకార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే కొత్త చట్టాలు తెచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్కే బాషా, ఆత్మారాము, పటేల్ శ్రీనివాసరెడ్డి, జి.జనార్దన్, సాయి, మేఘనాథ్, సాంబయ్య, కె.శ్రీను, జానీ పాల్గొన్నారు. -
సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి
కాసిపేట, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే పునరుద్ధరించాలని, కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం సోమగూడెం కొమురయ్య భవన్లో నిర్వహించిన సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్మాణ రంగంలో 60లక్షల మంది కార్మికులు ఉన్నారని, వీరి సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలు, నష్టపరిహారం, చదువులు, పింఛన్, వైద్య సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం 1996లో సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ఆదేశాలిచ్చిందని చెప్పారు. 2007లో కమిటీ ఏర్పాటు చేసి పారదర్శకత లేకుండా అధికారులను చైర్మన్‌గా నియమించి నామమాత్రంగా బోర్డు నిర్వహిస్తున్నారని తెలిపారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్మిక సంఘాలను బాధ్యులుగా చేస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. కార్మికులు, కుటుంబ సభ్యులకు ఆస్పత్రి సౌకర్యం కల్పించే పథకం అమలు చేయాలని పేర్కొన్నారు. రూ.పది లక్షలకు పైగా వ్యయంతో చేపట్టే నిర్మాణాలకు ఒక శాతం చొప్పున సెస్ వసూలు చేసి రూ.1350 కోట్లు సంక్షేమ బోర్డుకు సమకూర్చిందని పేర్కొన్నారు. ఆ నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వం రూ.438 కోట్లు ఇతర అవసరాలకు వెచ్చించిందని ఆరోపించారు. అంతకుముందు కార్యాలయం ఎదుట పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి పోశం. ప్రధాన కార్యదర్శి గజంగుల రాజు, నియోజకవర్గ ఇన్చార్జి దాగం మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి అంకులు, నాయకులు కల్వల లక్ష్మణ్, రమేష్ పాల్గొన్నారు.