ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
Published Sat, Aug 27 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
– ఆటో వర్కర్స్ యూనియన్ డిమాండ్
విజయవాడ(గాంధీనగర్) :
ఆటో రంగంపై ఆధారపడి జీవనం గడుపుతున్న ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి డిమాండ్ చేశారు. హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో ఆటో వర్కర్స్‌యూనియన్ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రవాణా రంగం ఆటుపోటులను ఎదుర్కొంటుందన్నారు. డీజిల్, ఆటో విడిభాగాలు ధరలు పెరిగిపోయి కార్మికుల జీననం దుర్భరంగా మారిందన్నారు. ఆటోకార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే కొత్త చట్టాలు తెచ్చి కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్‌కే బాషా, ఆత్మారాము, పటేల్ శ్రీనివాసరెడ్డి, జి.జనార్దన్, సాయి, మేఘనాథ్, సాంబయ్య, కె.శ్రీను, జానీ పాల్గొన్నారు.
Advertisement