ముంబై: గిగ్ వర్కర్లకు(తాత్కాలిక పనివారు/సంప్రదాయ వ్యవస్థకు వెలుపల చేసేవారు/రెగ్యులర్ రోల్స్ కాకుండా ఒప్పందం మేరకు చేసేవారు)మే నెలలో డిమాండ్ 22 శాతం పెరిగింది. ప్రధానంగా విక్రయాలు, మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. క్వెస్ కార్ప్‌కు చెందిన స్టార్టప్ టాస్క్‌మో తన తొలి ‘టాస్క్‌మో గిగ్ ఇండెక్స్’ (టీజీఐ) నివేదికను విడుదల చేసింది.
కరోనా మహమ్మారి తర్వాత భారతీయ కంపెనీలు గిగ్ వర్కర్ల కోసం, ప్రాజెక్టు ఆధారిత తాత్కాలిక ఉద్యోగుల కోసం ఎక్కువగా చూస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. బిజినెస్ డెవలప్‌మెంట్, క్షేత్రస్థాయిలో విక్రయాలు, చివరి వరకు చేరుకోవడం, డిజిటల్ ప్రచారం, బ్రాండ్ ప్రచారానికి గిగ్ వర్కర్లపైనే కంపెనీలు ఎక్కువగా ఆధార పడుతున్నాయి. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో వీరికి డిమాండ్ మూడొంతులు పెరిగింది. క్విక్ కామర్స్‌లో 300 శాతం (వేగంగా డెలివరీ చేసేవి), హెల్త్‌టెక్‌లో 250 శాతం, ఫిన్‌టెక్‌లో 200 శాతం, ఈకామర్స్‌లో 198 శాతం చొప్పున గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగిందని ఈ నివేదిక తెలియజేసింది. 2022 జనవరి-మే నెల మధ్య ధోరణలను ఈ నివేదికలో టాస్క్‌మో వివరంగా ప్రస్తావించింది. తన ప్లాట్‌ఫామ్‌లో మే నెలలో 60వేల మంది గిగ్ వర్కర్లు పేర్లను నమోదు చేసుకున్నట్టు టాస్క్‌మో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment