న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి ఇంధన వినియోగ డిమాండ్ తీవ్రతను తగ్గించుకునేలా తగిన చర్యలు తీసుకోగలిగితే ప్రపంచ ఎకానమీకి ఏటా 2 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లు ఆదా కాగలవని ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఒక నివేదికలో వెల్లడించింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు, గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి ఉపయోగపడగలవని పేర్కొంది. జనవరి 15–19 మధ్య దావోస్‌లో వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది.
కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీతో కలిసి తయారు చేసిన ఈ రిపోర్టు రూపకల్పనలో 120 మంది పైగా గ్లోబల్ సీఈవోలు సహాయ, సహకారాలు అందించారు. ప్రభుత్వాలు విధానపరంగా సరైన చర్యలు తీసుకుంటే వృద్ధి.. ఉత్పాదకతకు తో డ్పాటు లభించగలదని, కంపెనీలు నిధులను ఆదా చేసుకోగలవని, కాలుష్యకారక ఉద్గారాలను తగ్గించగలవని నివేదిక పేర్కొంది. ఫ్యాక్టరీ లైన్లను డిజైన్ చేయడంలో కృత్రిమ మేథను ఉపయోగించుకోవడం, విద్యుత్ వినియోగంలో సమర్ధతను మెరుగుపర్చుకోవడం, రవాణా వ్యవస్థను విద్యుదీకరించ డం మొదలైన చర్యలను పరిశీలించవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment