'కార్మికుల కంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా' | doing hard work more than workers, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'కార్మికుల కంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా'

Published Sun, May 1 2016 2:57 PM | Last Updated on Sat, Jul 28 2018 5:42 PM

'కార్మికుల కంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా' - Sakshi

'కార్మికుల కంటే నేనే ఎక్కువ కష్టపడుతున్నా'

విజయవాడ: కార్మికుల కంటే తానే ఎక్కువ కష్టపడుతున్నాననీ, ఎండలో 18 గంటలు కష్టపడుతున్నానంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలో చంద్రన్న బీమా పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో సమానంగా 3 నుంచి 4 గంటలు ఎక్కువ కష్టపడాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని నిన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హెచ్‌పీ చౌదరి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు స్పందించిన చంద్రబాబు కేంద్రమంత్రి అలా అనడం సరికాదన్నారు.

ఆ రోజు రాజ్యసభలో పదేళ్లు ప్రత్యేక హోదా అడిగారని గుర్తు చేశారు. విభజన చట్టం హమీల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నామన్నారు. మంత్రి పదవుల కోసం తాను రాజీ పడుతున్నానడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement