
రమేష్ ఆస్పత్రి వద్ద చంద్రబాబు కాన్వాయ్
తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం విజయవాడ వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరాదరణే ఎదురైంది.
పటమట(విజయవాడతూర్పు)/గన్నవరం(విమానాశ్రయం): తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం విజయవాడ వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరాదరణే ఎదురైంది.
ఆ పార్టీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పార్టీ ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీ కార్యకర్తలు, నాయకులు లేక వెలవెలబోయింది. జాతీయ రహదారి 16 వెంబడి రామవరప్పాడు రింగ్ నుంచి బెంజిసర్కిల్ మీదుగా బందరురోడ్డు వైపు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్‌లో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యేక రైళ్ల పొడిగింపు