bangalore special court
-
విచారణ చేపట్టండి
బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఉదంతంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు రంగం సిద్ధమైంది. సిద్ధరామయ్యను విచారించాలని లోకాయక్త పోలీసులకు బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలిచి్చంది. దీంతో సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసు విచారణను లోకాయుక్త పోలీసులు మొదలుపెట్టనున్నారు. సిద్ధూ భార్యకు ప్రభుత్వ వెంచర్లలో 14 ప్లాట్లను అక్రమంగా కేటాయించారన్న ఫిర్యాదుల మేరకు సిద్ధూపై విచారణకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధూ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయడం, ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం బెంగళూరు ప్రత్యేక కోర్టు జడ్జి సంతోశ్ గజానన్ భట్ ఆదేశాలిచ్చారు. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచి్చన ఫిర్యాదు మేరకు మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎంపీల సంబంధిత కేసులను విచారించే ఈ కోర్టు తదుపరి చర్యలకు ఆదేశాలిచి్చంది. మూడు నెలల్లోగా అంటే డిసెంబర్ 24వ తేదీకల్లా సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమరి్పంచాలని జడ్జి సూచించారు. ముఖ్యమంత్రిపై ఉన్న ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పెషల్ కోర్టుకు ఆగస్ట్ 19న తాము ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాజాగా ఉపసంహరించుకోవడంతో స్పెషల్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇవ్వడానికి వీలు కల్గింది. ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి, పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామి, స్వామికి ఈ భూమిని అమ్మిన దేవరాజులను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. విచారణను ఎదుర్కోవడానికి సిద్ధం దర్యాప్తు మొదలుపెట్టాలని లోకాయుక్తకు ఆదేశాలు రావడంపై సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఎలాంటి దర్యాప్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని గతంలోనే చెప్పా. ఎలాంటి దర్యాప్తునకు నేను భయపడను. చట్టప్రకారం పోరాటానికి నేను సిద్ధం. కోర్టు ఉత్తర్వుల కాపీలో ఏముందో చదివాక మళ్లీ మాట్లాడతా’’ అని సిద్ధరామయ్య అన్నారు. -
తీర్పు అమ్మకు సానుకూలమా
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ భవిష్యత్తు మరో 24 గంటల్లో తేలిపోనుంది. జయ చేసుకున్న అప్పీలుపై ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడ నుండగా, తీర్పు సారాంశం ఎలా ఉంటుందోనని రాష్ట్రమంతా టెన్షన్ నెలకొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి:18 ఏళ్లపాటూ నడిచిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు గత ఏడాది విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానాపై జయ కర్నాటక హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అమెతోపాటూ ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న శశికళ, ఇళవరసి, మాజీ దత్తపుత్రుడు సుధాకర్లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా పడింది. జనవరి 5వ తేదీన అప్పీలుపై విచారణ ప్రారంభం కాగా మార్చి 11 వ తేదీ వరకు న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో వాదోపవాదాలు సాగాయి. మార్చి 18 వ తేదీలోగా విచారణ ముగించి తీర్పుచెప్పాలని సుప్రీం కోర్టు గతంలోనే కర్నాటక హైకోర్టును ఆదేశించి ఉంది. అయితే అత్యంత కీలకమైన కేసు కాబట్టి తీర్పు వెల్లడిలో మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి సుప్రీంకు లేఖ రాశారు. ఈ అభ్యర్థనను మన్నించిన సుప్రీం కోర్టు మే 12వ తేదీలోగా తీర్పు చెప్పేలా గడువును పొడిగించింది. ఈ గడువు ముగిసిపోతున్న దశలో తీర్పు చెప్పేందుకు కర్నాటక హైకోర్టు సిద్దమైంది. ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటలకు జయ కేసులో తీర్పు చెప్పనున్నట్లు కర్నాటక హైకోర్టు శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. 11న రాష్ట్రవ్యాప్తంగా పూజలు ః తీర్పు తేదీ ఖరారైన నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఊహాగానాల్లో పడిపోయాయి. అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన మిన్నంటింది. కోర్టు తీర్పు జయకు అనుకూలంగా రావాలని ప్రార్థిస్తూ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర శనివారం పూజలు నిర్వహించారు. అలాగే తీర్పు వెలువడే 11 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు నిర్ణయించారు. పార్టీ అనుబంధ న్యాయవాదుల సంఘం సభ్యులు బెంగళూరుకు పయనం అవుతున్నారు. తీర్పు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటించినపుడు ఆందోళనలు, రాస్తారోకోలు, బస్సుల ధ్వంసాలు చోటుచేసుకున్నాయి. 11 వ తేదీన తీర్పు అమ్మకు సానుకూలమా, ప్రతికూలమా అనే మీమాంసలో ముందు జాగ్రత్త చర్యలకు పోలీస్ యంత్రాంగం సిద్ధం అవుతోంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ముమ్మురమైన వాహనాల తనిఖీకి చేపట్టనున్నారు. ఈనెల 12 వ తేదీతో జయకు మంజూరైన బెయిల్ గడువు ముగుస్తుంది. కర్నాటక హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సంతోషమే, ప్రతికూలంగా వస్తే వెంటనే బెయిల్ పొడిగింపు దరఖాస్తును సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఒక న్యాయవాది తెలిపాడు. -
జయలలిత.. ఎగిసి పడిన కెరటం!
-
జయ రాజకీయ జీవితంపై నీలినీడలు
బెంగళూరు : సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ద్రవిడ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు సంబంధించి కోర్టు తీర్పుతో జయ రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జయలలిత ముఖ్యమంత్రి హోదాతో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోనున్నారు. దీంతో పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా పోయింది. కాగా అనర్హత వేటు పడిన తొలి సీఎంగా జయలలిత రికార్డుల్లోకెక్కారు. ఇక రాజకీయ జీవితంలో ఏనాడు వెనక్కు తిరిగి చూడని జయలలిత జీవితం ఇలా జైలు పాలు కావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
చాలాకాలం తర్వాత కారు డోర్ తీసిన జయ
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక్కసారిగా...అధికార దర్పం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ మందీ మార్భలంతో దర్జాగా కారు ఎక్కే ఆమె.. చాలా సంవత్సరాల తర్వాత సొంతంగా తానే కారు డోరు తీసుకోవటం విశేషం. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జయలలిత వెలువలికి వచ్చి తన సొంత కారులో డోర్ లాక్ చేసుకుని చాలాసేపు లోపలే కూర్చుండిపోయారు. జయ..తన నిచ్చెలి శశికళతో కొద్దిసేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా బెంగళూరు పోలీసులు పలుమార్లు కారు డోర్లు తట్టి వెలుపలకి రావాలని సూచించారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు న్యాయస్థానం నాలుగేళ్ల జైలుతో పాటు, వందకోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా వైద్య పరీక్షల నిమిత్తం జయలలితను బెంగళూరులోని జయదేవ ఆస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్యేగా జయలలితపై అనర్హత వేటు!
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడింది. ఈ అనర్హత వేటు తక్షణమే అమల్లోకి రానుంది. శనివారం బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆమె సీఎం పదవికి అనర్హురాలు కానుంది. దీంతో పాటు ప్రజాప్రాతినిధ్యం చట్ట ప్రకారం ఆమె ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తాజా తీర్పుతో ఆమె పదేళ్ల పాటు రాజకీయ జీవితానికి దూరంగా ఉండనుంది. ఆమెకు నాలుగేళ్ల శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానాను కోర్టు విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి.1996లో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి ఆమెపై దర్యాప్తు చేయాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు చేపట్టాల్సిందిగా కోర్టు ఆదేశించినా.. దర్యాప్తుకు మాత్రం సుదీర్ఘ సమయం పట్టింది. -
'ఆమెకు అంత శిక్ష పడుతుందనుకోలేదు'
చెన్నై : తమిళనాడులో రెండు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కేంద్రాన్ని కోరారు. జయలలితకు జైలుశిక్ష నేపథ్యంలో తమిళనాడు అగ్నిగుండంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సామాన్య వ్యక్తిగానే జయలలితపై ఫిర్యాదు చేశానని సుబ్రమణ్యం స్వామి అన్నారు. జయలలితకు అంత శిక్ష పడుతుందని తాను కూడా ఊహించలేదన్నారు. సామాన్యుడు కూడా అవినీతి, అక్రమాలను ప్రశ్నించవచ్చనే దానికి ఈ కేసు ఉదాహరణ అన్నారు. తనపై చాలా దాడులు జరిగాయని అయినా తాను భయపడలేదని సుబ్రమణ్యం స్వామి తెలిపారు. ఇక జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్లేనని ఆయన అన్నారు. అంతకు ముందు సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్లో జయలలిత జైలుకే ...జేజే అంటూ ట్విట్ చేశారు. -
జయను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా తీర్పు వెలువడిన వెంటనే జయ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మరోవైపు న్యాయస్థానం తీర్పుపై ఆమె సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జయలలితకు శిక్ష ఖరారు కావటంతో అన్నాడీఎంకేలో నిస్తేజం నెలకొంది. న్యాయస్థానం నాలుగేళ్లు శిక్ష వెలువరించటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్భాంత్రికి గురయ్యారు. మహిళా కార్యకర్తలతో పాటు జయ కేబినెట్లోని మంత్రులు కన్నీరు పెట్టుకున్నారు. తీర్పు వెలువడటంతో ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం కోర్టులోనే కంటతడి పెట్టారు. -
జయలలిత జీవిత ప్రయాణమిదీ!
-
జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
బెంగళూరు : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానా విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. మరోవైపు జయలలితకు శిక్ష ఖరారైన నేపధ్యంలో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధినేత్రికి శిక్ష పడటాన్ని జీర్ణించుకోలేని అన్నాడీఎంకె కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. దీంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి. జయలలిత ఆస్తుల కేసులో గత 18 ఏళ్ల నుంచి మొత్తం 358 మందిని కోర్టు విచారించింది. -
జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
-
బెంగళూరు కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్
బెంగళూరు : బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ రెడ్డి 144 సెక్షన్ విధించారు. జయ అక్రమాస్తుల కేసు విచారణకు నగర శివార్లలోని పరప్పన ఆగ్రహార జైలు ఆవరణలో....తాత్కాలిక కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జయలలితను దోషిగా నిర్థారించిన కోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయి. కాగా నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు దగ్గర భారీగా బలగాలు మోహరించాయి. -
శశికళ, ఇళవరసి, సుధాకరన్ దోషులే
బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె స్నేహితురాలు శశికళను కూడా న్యాయస్థానం దోషిగా నిర్థారించింది. వీరిద్దరితో పాటు పెంపుడు కుమారుడుసుధాకరన్, ఇళవరసిలు కూడా దోషులుగా తేల్చినట్లు ఎస్పీపీ భవానీ సింగ్ తెలిపారు. జయలలితను బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. పురచ్చితలైవిగా, అమ్మగా పేరొందిన జయలలిత 1991లో మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 43 ఏళ్ల వయసులోనే సీఎం పగ్గాలు స్వీకరించిన జయలలిత 96 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో జయలలిత భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో నాటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి జయలలితపై ఫిర్యాదు చేశారు. -
జయ కేసు: ట్విట్టర్లో ఎవరేమన్నారు?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో పలువురు స్పందించారు. ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఒకప్పుడు లక్స్ ప్రకటనలతో అందరికీ సుగంధాన్ని పంచిన జయ.. ఇప్పుడు జైల్లో అవే సుగంధాలను పంచుతారేమోనని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా ఆమెను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. Now JJ will smell and admire the interiors of jail cells. @Swamy39 @jagdishshetty @arundharhoney @vijay_rajan pic.twitter.com/43oC5g8c99 — Wandering Wolf (@WanderingWolf2) September 27, 2014 Thanks to freedom movement, going to jail is a qualification for our politicians. For whatever reason. #OnlyInIndia @vvsnair @minhazmerchant — Baba Leopard Singh (@Leopard212) September 27, 2014 Hey political pundits,u remember this? “Ordinance to shield convicted leaders is complete nonsense, tear it up:Rahul” http://t.co/JR93HLbgCv — sachin bahad (@sachinbahad) September 27, 2014 TN people should start looking for options beyond Amma & Ayya ..... unfortunately there are alternatives available i guess — Naveen (@emanin) September 27, 2014 Why is police not forcing dispersal of agitated and angry cadre from outside Poes Garden? #Amma #jayaverdict pic.twitter.com/LdRzZXmt4P — Uma Sudhir (@umasudhir) September 27, 2014 @mswami Karma pays back peduliarly.She is overpunished for crimes whichis miniscule compared toother politicians but paying for bigger sins — Global Indian (@sivashiv) September 27, 2014 Public prosecutor asks for 7 years jail for #Jayalalithaa. Defence pleads for her age and health to be taken into account #Jayaverdict — T S Sudhir (@Iamtssudhir) September 27, 2014 #Jayalalithaa disqualified as MLA, loses Chief Ministership instantly; as a pointer, the National Flag on her car has been removed #THJAYA — dinesh surya (@BooDinesh143) September 27, 2014 Law and order goes for a toss in Tamil Nadu as JJ sentence is awaited. #Jayaverdict #Jayalalithaa — Chandra R. Srikanth (@chandra86) September 27, 2014 It took #18years to prove TN CM #Jayalalithaa guilty of corruption. 18 years -Right to get Law. #jayaverdict. — Arunkumar Alagesan (@ArunzTwit) September 27, 2014 #Jaya life is an example for wrong friendship, but her Army will keep increasing & she will come Much Bigger Next time. Nw, "I'm Waiting" — @kamaljii (@kamaljii) September 27, 2014 Oh when will Mayawati and Mulayam follow in the giant heavy footsteps of Jaya?!?? Oh when??? — SUHEL SETH (@suhelseth) September 27, 2014 10 years back in Nov 2004,#Jaya got Kanchi Shankracharya arrested on Diwali day. Diwali is around d corner&deer she goes. Karma spares noone — Ankita Thakur (@Ankitaaa_) September 27, 2014 -
సుబ్రమణ్యంస్వామి ఇంటిపై రాళ్లదాడి
చెన్నై : అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రెచ్చిపోయారు. సుబ్రమణ్యం స్వామి ఇంటిపై అన్నాడీఎంకే కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. అలాగే డీఎంకే పార్టీ కార్యాలయంలో పాటు, ఆపార్టీ ముఖ్య నేతల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సుబ్రమణ్యం ఫొటోను కాల్చివేయటంతో పాటు, చెప్పుల దండలు వేసి తమ నిరసనలు తెలుపుతున్నారు. అలాగే కరుణానిధి నివాసంపై రాళ్లదాడికి యత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తమిళనాడు మొత్తం భారీగా పోలీసులు మోహరించారు. ఇక కడలూరు, మధురై, సేలం, శ్రీరంగంలో బంద్ పరిస్థితులు నెలకొన్నాయి. -
జయ కేసు విచారణకు 18 ఏళ్లు.. ఎందుకు?
జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ సుదీర్ఘంగా 18 సంవత్సరాల పాటు పట్టింది. తమిళనాడులోనే విచారణ జరిగితే అది సవ్యంగా సాగదని, అందువల్ల వేరే రాష్ట్రంలో విచారించాలని డీఎంకే పట్టుబట్టడమే ఇందుకు ప్రధాన కారణం. డీఎంకే వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించడంతో.. కేసును బెంగళూరుకు మార్చారు. నిందితులు కూడా లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు కేసు ముగింపు దశకు వచ్చేస్తుందన్న సమయంలో ముఖ్యమంత్రికి ఏకంగా 1339 ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ కూడా ఆలస్యానికి కారణాలే. బెంగళూరు కోర్టుకు కేసును బదిలీ చేయడానికే ఆరేళ్ల సమయం పట్టేసింది. 76 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు. వాళ్లందరినీ ఒకసారి అప్పటికే క్రాస్ ఎగ్జామిన్ చేసేశారు. వాళ్లలో 64 మంది ప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగారు. తమతో బలవంతంగా సాక్ష్యం చెప్పించారన్నారు. ఈ 18 ఏళ్లలో కేసు విచారణకు జయలలిత కేవలం రెండంటే రెండేసార్లు హాజరయ్యారు. ఒక సందర్భంలో అయితే.. ప్రాసిక్యూషన్ నిందితులతో చేతులు కలిపిందని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. దాంతో ఒక్కసారిగా వ్యవస్థ మొత్తం ఉలిక్కిపడింది. అలా విచారణకు సుదీర్ఘ కాలం పట్టేసింది. -
డీఎంకే కార్యకర్తల సంబరాలు
చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్థారణ కావడంతో డీఎంకే సంబరాలు చేసుకుంటోంది. 1996లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే జయలలితపై ఆరోపణలకు సంబంధించి అప్పటి అధికార పార్టీ డీఎంకే విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు పట్టువదలకుండా పోరాడిన కరుణానిధి పార్టీ... ఇప్పుడు పురచ్చితలైవి దోషిగా నిర్దారణ కావడంతో ఆనందంలో తేలిపోతోంది. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నివాసంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. కాగా గత రెండు ఎన్నికల్లో అన్నాడీఎంకే చావుదెబ్బ తిన్న డీఎంకే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. 2011 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత ధాటికి కరుణానిధి పార్టీ బొక్కబోర్లా పడింది. అంతేకాకుండా అమ్మ పథకాలతో ప్రజల్లో పరపతి పెంచుకుంటున్న జయలలితను దీటుగా ఎదుర్కొనేందుకు కూడా డీఎంకేకు బలం సరిపోవడం లేదు. ఇలాంటి స్థితిలో పార్టీని కాపాడుకుంటూ, ప్రజలకు చేరువయ్యేందుకు ఇప్పుడు డీఎంకేకు ఓ బలమైన ఆయుధం దొరికినట్లు అయింది. జయలలిత అక్రమాలకు పాల్పడినట్లు కోర్టే స్వయంగా పేర్కొనందున ఇప్పుడు అదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి మళ్లీ మద్దతు సంపాదించాలనేది డీఎంకే నేతల ఎత్తుగడగా తెలుస్తోంది. ఇక కోర్టు జయను దోషిగా తేల్చటంతో డీఎంకే కార్యకర్తులు సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. -
తమిళనాడులో హై అలర్ట్, కేబుల్ ప్రసారాలు బంద్
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా నిర్థారణ అయిన నేపథ్యంలో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బస్సు సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తులు దాడులుకు పాల్పడుతూ ....బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. కాగా తమిళనాడులోని పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు పాక్షికంగా బంద్ పాటిస్తున్నారు. కాగా తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు.ఇక అన్నాడీఎంకే కార్యాలయం వద్ద అత్యంత్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధి నివాసంతో పాటు డీఎంకే కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నన్ను హింసించడానికే కేసులు: జయ
బెంగళూరు : తనను హింసించేందుకే ఈ కేసులు పెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అన్నారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని జయ తెలిపారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆమె ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను బెంగళూరు స్పెషల్ కోర్టు దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పు వెలువడనుంది.