చెన్నై : అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రెచ్చిపోయారు. సుబ్రమణ్యం స్వామి ఇంటిపై అన్నాడీఎంకే కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. అలాగే డీఎంకే పార్టీ కార్యాలయంలో పాటు, ఆపార్టీ ముఖ్య నేతల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సుబ్రమణ్యం ఫొటోను కాల్చివేయటంతో పాటు, చెప్పుల దండలు వేసి తమ నిరసనలు తెలుపుతున్నారు.
అలాగే కరుణానిధి నివాసంపై రాళ్లదాడికి యత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తమిళనాడు మొత్తం భారీగా పోలీసులు మోహరించారు. ఇక కడలూరు, మధురై, సేలం, శ్రీరంగంలో బంద్ పరిస్థితులు నెలకొన్నాయి.