
'ఆమెకు అంత శిక్ష పడుతుందనుకోలేదు'
చెన్నై : తమిళనాడులో రెండు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కేంద్రాన్ని కోరారు. జయలలితకు జైలుశిక్ష నేపథ్యంలో తమిళనాడు అగ్నిగుండంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సామాన్య వ్యక్తిగానే జయలలితపై ఫిర్యాదు చేశానని సుబ్రమణ్యం స్వామి అన్నారు.
జయలలితకు అంత శిక్ష పడుతుందని తాను కూడా ఊహించలేదన్నారు. సామాన్యుడు కూడా అవినీతి, అక్రమాలను ప్రశ్నించవచ్చనే దానికి ఈ కేసు ఉదాహరణ అన్నారు. తనపై చాలా దాడులు జరిగాయని అయినా తాను భయపడలేదని సుబ్రమణ్యం స్వామి తెలిపారు. ఇక జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్లేనని ఆయన అన్నారు. అంతకు ముందు సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్లో జయలలిత జైలుకే ...జేజే అంటూ ట్విట్ చేశారు.