ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా తీర్పు వెలువడిన వెంటనే జయ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మరోవైపు న్యాయస్థానం తీర్పుపై ఆమె సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జయలలితకు శిక్ష ఖరారు కావటంతో అన్నాడీఎంకేలో నిస్తేజం నెలకొంది. న్యాయస్థానం నాలుగేళ్లు శిక్ష వెలువరించటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్భాంత్రికి గురయ్యారు. మహిళా కార్యకర్తలతో పాటు జయ కేబినెట్లోని మంత్రులు కన్నీరు పెట్టుకున్నారు. తీర్పు వెలువడటంతో ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం కోర్టులోనే కంటతడి పెట్టారు.