ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా నిర్థారణ అయిన నేపథ్యంలో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు.
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా నిర్థారణ అయిన నేపథ్యంలో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బస్సు సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తులు దాడులుకు పాల్పడుతూ ....బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు.
కాగా తమిళనాడులోని పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు పాక్షికంగా బంద్ పాటిస్తున్నారు. కాగా తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు.ఇక అన్నాడీఎంకే కార్యాలయం వద్ద అత్యంత్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధి నివాసంతో పాటు డీఎంకే కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.