దాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక్కసారిగా...అధికార దర్పం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది.
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక్కసారిగా...అధికార దర్పం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ మందీ మార్భలంతో దర్జాగా కారు ఎక్కే ఆమె.. చాలా సంవత్సరాల తర్వాత సొంతంగా తానే కారు డోరు తీసుకోవటం విశేషం. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జయలలిత వెలువలికి వచ్చి తన సొంత కారులో డోర్ లాక్ చేసుకుని చాలాసేపు లోపలే కూర్చుండిపోయారు.
జయ..తన నిచ్చెలి శశికళతో కొద్దిసేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా బెంగళూరు పోలీసులు పలుమార్లు కారు డోర్లు తట్టి వెలుపలకి రావాలని సూచించారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు న్యాయస్థానం నాలుగేళ్ల జైలుతో పాటు, వందకోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా వైద్య పరీక్షల నిమిత్తం జయలలితను బెంగళూరులోని జయదేవ ఆస్పత్రికి తరలించారు.