four years imprisonment
-
తీర్పుపై మురళీధర్ రావు స్పందన
-
‘బీజేపీకి సంబంధం లేదు’
ఢిల్లీ: తమిళనాడులో జరుగుతున్న సంక్షోభానికి, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్ మురళీధర్ రావు తెలిపారు. శశికళ నటరాజన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి సుప్రీంకోర్టు తీర్పు క్లీన్ పాలిటిక్స్ దిశగా గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా సర్వోన్నత న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అదేవిధంగా శశికళకు రూ.10 కోట్ల జరిమానా విధించింది. ఈ నేపధ్యంలో వారం రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. -
శశికళ దోషి: సుప్రీంకోర్టు తీర్పు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. వెంటనే ఆమె లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఇక అసలు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అన్నది లేకుండా పోయింది. పన్నీర్ సెల్వానికి కూడా ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధమైనట్లు భావించాలి. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయినట్లయింది. ఏ నేరంలోనైనా శిక్ష అనుభవిస్తే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన ఉండటంతో.. ఇప్పుడు ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినా, ఎన్నికయ్యే అవకాశం లేదు కాబట్టి ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పూర్తిగా పోయాయి. -
జయ రాజకీయ జీవితంపై నీలినీడలు
బెంగళూరు : సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ద్రవిడ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు సంబంధించి కోర్టు తీర్పుతో జయ రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జయలలిత ముఖ్యమంత్రి హోదాతో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోనున్నారు. దీంతో పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా పోయింది. కాగా అనర్హత వేటు పడిన తొలి సీఎంగా జయలలిత రికార్డుల్లోకెక్కారు. ఇక రాజకీయ జీవితంలో ఏనాడు వెనక్కు తిరిగి చూడని జయలలిత జీవితం ఇలా జైలు పాలు కావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
చాలాకాలం తర్వాత కారు డోర్ తీసిన జయ
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక్కసారిగా...అధికార దర్పం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ మందీ మార్భలంతో దర్జాగా కారు ఎక్కే ఆమె.. చాలా సంవత్సరాల తర్వాత సొంతంగా తానే కారు డోరు తీసుకోవటం విశేషం. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జయలలిత వెలువలికి వచ్చి తన సొంత కారులో డోర్ లాక్ చేసుకుని చాలాసేపు లోపలే కూర్చుండిపోయారు. జయ..తన నిచ్చెలి శశికళతో కొద్దిసేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా బెంగళూరు పోలీసులు పలుమార్లు కారు డోర్లు తట్టి వెలుపలకి రావాలని సూచించారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు న్యాయస్థానం నాలుగేళ్ల జైలుతో పాటు, వందకోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా వైద్య పరీక్షల నిమిత్తం జయలలితను బెంగళూరులోని జయదేవ ఆస్పత్రికి తరలించారు.