జయ రాజకీయ జీవితంపై నీలినీడలు
బెంగళూరు : సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ద్రవిడ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు సంబంధించి కోర్టు తీర్పుతో జయ రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జయలలిత ముఖ్యమంత్రి హోదాతో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోనున్నారు. దీంతో పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా పోయింది. కాగా అనర్హత వేటు పడిన తొలి సీఎంగా జయలలిత రికార్డుల్లోకెక్కారు. ఇక రాజకీయ జీవితంలో ఏనాడు వెనక్కు తిరిగి చూడని జయలలిత జీవితం ఇలా జైలు పాలు కావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.