న్యూఢిల్లీ: మతమార్పిడుల అంశంపై రాజ్యసభలో మరోసారి దుమారం చెలరేగింది. మంగళవారం మతమార్పిడుల అంశాన్ని సభలో చర్చించాలిన కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ అంశాన్ని ఇప్పుడు చర్చించడానికి ప్రభుత్వం నిరాకరిస్తుండటంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. ఎంతకీ కాంగ్రెస్ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సోమవారం కూడా మతమార్పిడిల అంశాన్ని చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.
కాగా, ప్రభుత్వం ఈ అంశాన్ని నేటి సభలో చర్చించడానికి నిరాకరిస్తుంది. డిసెంబర్ 17 వ తేదీన ఇదే అంశం లిస్ట్ అయ్యి ఉన్నందున అప్పటివరకూ మతమార్పిడి అంశాన్ని చర్చకు తీసుకురావడాన్ని సబబు కాదని ప్రభుత్వం వాదిస్తోంది.