న్యూఢిల్లీ: ఈమధ్య తీవ్ర దుమారం రేపిన మతమార్పిడుల అంశంపై రాజ్యసభలో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. మతమార్పిడుల అంశాన్ని సభలో చర్చించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పట్టుపడుతుండగా..అందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో చోటు చేసుకున్న మతమార్పిడి అంశంపై మరోసారి దుమారం చెలరేగడంతో రాజ్యసభ తిరిగి రెండు గంటల వరకూ వాయిదా పడింది.
క్వశ్చన్ అవర్ లో సస్పెన్షన్ పై సభకు ఇప్పటికే నోటీస్ ఇచ్చామని, ఇది దేశంలోనే చాలా కీలక అంశమైనందున దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. కాగా, ప్రభుత్వం మాత్రం చర్చకు నిరాకరిస్తుంది. డిసెంబర్ 17 వ తేదీన ఇదే అంశం లిస్ట్ అయ్యి ఉన్నందున అప్పటివరకూ మతమార్పిడి అంశం చర్చ సబబు కాదని ప్రభుత్వం పేర్కొంది.