మధ్యప్రదేశ్: వివాహం ద్వారా గానీ లేదా ఇతర తప్పుడు పద్ధతుల్లో మత మార్పిడికి పాల్పడడాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన మత స్వేచ్ఛ(ఫ్రీడం ఆఫ్ రిలిజియన్) బిల్లు 2020ని మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించిందని ఆ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చి చట్టరూపం దాలిస్తే, చట్ట ఉల్లంఘనకు అత్యధికంగా పదేళ్ళ జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. ఈ బిల్లు ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ ఆర్డినెన్స్, 2020ని పోలి ఉంది. మధ్య ప్రదేశ్‌లో ఇది అమలులోకి వస్తే దేశంలోనే కఠినతరమైన చట్టం అవుతుందని మిశ్రా తెలిపారు. ఈ చట్టం ఉల్లంఘించిన వారు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ జైలు శిక్ష, రూ. 50,000 జరిమానాకి అర్హులు. మతమార్పిడికి పాల్పడిన వ్యక్తి ఎస్సీ, ఎస్టీ, ౖమైనర్ అయితే, 2 నుంచి 10 ఏళ్ళ జైలు, రూ.50వేల జరిమానా విధించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment