డెహ్రాడున్: కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో ఆ గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత మార్పిడులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు కిచ పోలీసులు.
ఉత్తర్ ప్రదేశ్, బరేలీకి చెందిన వికాస్ కుమార్, అంకిత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కిచలో కొంతమందిని బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని కిచ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్-3, సెక్షన్-5 ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈ మత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మతమార్పిడులను నిరోధించడానికే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారమే నిందితులపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో జూన్ 7న గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఒక అద్దె ఇంట్లో మూడు రోజులుగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని స్థానిక గ్రామ పెద్ద ఒకరు సమాచారమందించారు. మాకు అందిన వివరాల ప్రకారం శనివారమే కేసును నమోదు చేసి అదే రోజున వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు కిచ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ధీరేంద్ర కుమార్.
ఇది కూడా చదవండి: శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment