Uttarakhand Assembly
-
Uttarakhand Ucc Bill: యూసీసీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. హిందువుల కోడ్ అయిన యూసీసీని ముస్లింలతో పాటు ఇతర మతాల వాళ్లకు వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్‌లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్)ను ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్ సింగ్ యూసీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించడంపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. వదరలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్ సింగ్‌కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతే టార్గెట్ -
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
డెహ్రాడూన్: అత్యంత కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. యూసీసీ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మంగళవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అధికార బీజేపీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మంగళవారమే చర్చ, ఓటింగ్ జరగాల్సి ఉండగా, విపక్షాల నిరసనల వల్ల అది సాధ్యం కాలేదు. చర్చ జరగకుండానే బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్ష ఎమ్మెల్యే యశ్పాల్ ఆర్య మండిపడ్డారు. యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఒకటి రెండు రోజుల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. సభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో బిల్లు ఆమోదం పొందడం, గవర్నర్ సంతకంతో చట్టంగా మారడం లాంఛనమేనని చెప్పొచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలవుతోంది. అక్కడ పోర్చుగీసు పాలనా కాలంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఏముంది? ► ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్ పౌరులకు ఈ బిల్లు వర్తిస్తుంది. ► గిరిజన వర్గాల ప్రజలను బిల్లు నుంచి మినహాయించారు. ► భారత రాజ్యాంగంలోని పార్ట్–21 కింద తమ హక్కుల రక్షణ పొందుతున్న వ్యక్తులకు, సమూహాలకు కూడా మినహాయింపు ఉంటుంది. ► సహజీవనాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధంగా గుర్తింపు లభిస్తుంది. ► వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఒకే చట్టం అమలు చేస్తారు. ► మతాలతో సంబంధం లేకుండా బహుభార్యత్వంపై నిషేధం అమలవుతుంది. ఒక్కరు ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ► ఎవరి మతాచారం ప్రకారం వారు వివాహం చేసుకోవచ్చు. ► సహజీవనం చేసే స్త్రీపురుషుల వయసులు వరుసగా 18, 21 ఏళ్లకు పైబడి ఉండాలి. ► సహజీవనం ప్రారంభించిన తర్వాత నెల రోజులలోపు ప్రభుత్వ రిజి్రస్టార్‌కు సమాచారం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే వారికి ఆరు నెలల దాకా జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. ► సహజీవనంపై రిజిస్ట్రార్‌కు తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ► సహజీవనం సాగిస్తున్న మహిళను పురుషుడు వదిలేస్తే బాధితురాలు కోర్టును ఆశ్రయించవచ్చు. అతడి నుంచి జీవనభృతి పొందవచ్చు. ► పెళ్లి కాని జంటల మధ్య సహజీవనాన్ని అరికట్టేలా బిల్లులో పలు కీలకాంశాలు జోడించారు. -
మతమార్పిడులు చేస్తే జైలుకే.. ఇద్దరు అరెస్టు
డెహ్రాడున్: కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో ఆ గ్రామ సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మత మార్పిడులకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు కిచ పోలీసులు. ఉత్తర్ ప్రదేశ్, బరేలీకి చెందిన వికాస్ కుమార్, అంకిత్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కిచలో కొంతమందిని బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారని కిచ పోలీసులకు అందిన సమాచారం ప్రకారం ఉత్తరాఖండ్ మత స్వేచ్ఛ చట్టంలోని సెక్షన్-3, సెక్షన్-5 ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈ మత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మతమార్పిడులను నిరోధించడానికే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారమే నిందితులపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిచ ప్రాంతంలోని సోనేరా బెంగాలీ కాలనీలో జూన్ 7న గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఒక అద్దె ఇంట్లో మూడు రోజులుగా మతమార్పిడులకు పాల్పడుతున్నారని స్థానిక గ్రామ పెద్ద ఒకరు సమాచారమందించారు. మాకు అందిన వివరాల ప్రకారం శనివారమే కేసును నమోదు చేసి అదే రోజున వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని అన్నారు కిచ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ధీరేంద్ర కుమార్. ఇది కూడా చదవండి: శరద్ పవార్ కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు -
వామ్మో రెండు కొండ చిలువలు
డెహ్రాడూన్: పంట పొలాల్లో పనిచేసేందుకు వెళ్లిన రైతులకు భయానక అనుభవం ఎదురైంది. అక్కడ సుమారు 10 అడుగుల పొడవు గల రెండు కొండ చిలువలు దర్శనమివ్వడంతో వారు బెంబేలెత్తిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పాములను పట్టి అడవిలో విడిచిపెట్టారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని గౌలాపర్ అనే ప్రాంతంలో సోమవారం జరిగింది. ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారి ఒకరు మట్లాడుతూ.. ఆ రెండు పైథాన్లు 10 నుంచి 12 అడుగుల పొడవు ఉన్నాయి. సీజన్ మారుతున్న సమయంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ రెండింటిని అడవిలో వదిలిపెట్టాం అని చెప్పుకొచ్చారు. ఇక పంట పొలాల్లో కొండ చిలువలను సురక్షిత పద్ధతిలో బంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు రెస్క్యూ టీం ధైర్యాన్ని కొనియాడుతుండగా.. మరికొందరు.. ఇది చాలా భయంకరంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే మిస్.. రావత్ గుండెల్లో రైళ్ల పరుగు?
డెహ్రాడూన్: బలపరీక్ష సమయంలో సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే కనిపించకుండా పోవడంతో ఉత్తరాఖండ్ పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి. ఎమ్మెల్యేలంతా ఒక చోట ఉండగా రేఖా ఆర్యా అనే ఎమ్మెల్యే మాత్రం టచ్ లో లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో రావత్ కు కాస్త కంగారు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుత దేశ రాజకీయాల్లో సంచనలం సృష్టించిన ఉత్తరాఖండ్ వ్యవహారానికి నేడు తెరపడనుంది. మరికొద్ది గంటల్లో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నేత, హరీశ్ రావత్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ పరీక్ష అనంతరం రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేక బీజేపీ వంతా అనే విషయం స్పష్టం కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ముస్సోరిలోని ఓ రిసార్ట్ లో ఉంచినట్లు సమాచారం. వీరంతా అసెంబ్లీకి గంట ప్రయాణం దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కడ బీజేపీ తమ పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేస్తుందోనన్న భయంతోనే వారిని ప్రత్యేకంగా రిసార్ట్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖా ఆర్యా మాత్రం తోటి ఎమ్మెల్యేలతో లేకుండా పోయారు. అసలు ఆమె టచ్ లోనే లేకుండా పోయినట్లు చెప్తున్నారు. కానీ, మరో కాంగ్రెస్ నేత శిల్పి అరోరా మాత్రం ఆర్యా కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నారని, ఆమె రావత్ కు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్తున్నారు. ఓ రకంగా నేడు బలపరీక్షలో రావత్ గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 70 మంది ఉండే ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలం 9 మందిపై అనర్హతతో 61కి పడిపోయింది. రావత్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 31 మంది బలం అవసరం. 9 మంది అనర్హులవడంతో 27కు పరిమితమైన కాంగ్రెస్‌కు ఇద్దరు బీఎస్పీ, ఒక యూకేడీ, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తుండడంతో రావత్ కూటమి బలం 33గా ఉంది. కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్యా అందుబాటులో లేకుండా పోవడంతో కాస్తంత ఉత్కంఠను తలపించనుంది. అయితే, హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు సమర్థన రావత్‌కు భారీగా ఊరటనిచ్చే అవకాశం ఉంది. కాగా, బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట మధ్య పరీక్ష నిర్వహిస్తారు. తనవైపు 34 మంది ఉన్నారని తప్పక గట్టెక్కుతామని రావత్ ఇప్పటికే చెప్పారు. అయితే, ఈ పరీక్ష పూర్తయ్యే వరకు రావత్ గుండెల్లో రైల్లు పరుగెత్తడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
ఉత్తరాఖండ్ అనర్హ ఎమ్మెల్యేలకు హైకోర్టులో భంగపాటు ♦ వారి ప్రవర్తనతో పార్టీ సభ్యత్వం వదులుకున్నట్లు రుజువైంది: హైకోర్టు ♦ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ♦ 61 మంది సభ్యులున్న అసెంబ్లీలో రావత్ వైపు 33 మంది నైనిటాల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో నేడు జరిగే బలపరీక్షలో ఓటేయాలనుకున్న 9 మంది అనర్హ ఎమ్మెల్యేల ఆశలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులతో ఆవిరయ్యాయి. స్పీకర్ అనర్హత ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వారు వేసిన పిటిషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. వెంటనే ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడా ఊరట దక్కలేదు. ఎమ్మెల్యేల రెండు పిటిషన్లను తిరస్కరించిన హైకోర్టు ... కావాలనుకుంటే చర్యల్ని పునఃసమీక్షించమంటూ స్పీకర్‌ను ఆశ్రయించవచ్చని సూచించింది. ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరకపోయినా తమ ప్రవర్తనతో స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారని, దీంతో ఫిరాయింపుల చట్టం కింద అనర్హులయ్యారని పేర్కొంది. సహజన్యాయసూత్రాల ప్రకారం స్పీకర్ నిర్ణయాన్ని పరిశీలించామని, రాజ్యాంగం పదో షెడ్యూల్2(1)(ఎ) పేరాలోని అంశాలు పిటిషనర్లకు వ్యతిరేకంగా ఉన్నాయని జడ్జి యూసి ధ్యానీ తన 57 పేజీల తీర్పులో చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి అనర్హ ఎమ్మెల్యేలు గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉదహరించారు. అవిధేయత ఫిరాయింపుల చట్టం కిందకురాదని, పదో షెడ్యూల్ కింద అవిధేయతకు ఫిరాయింపుల చట్టం వర్తించదని పేర్కొన్నారు. ‘పిటిషనర్లు తమ నేత, ప్రభుత్వం పట్ల అవిధేయత చూపడంతో పాటు, తమ చర్యలతో పార్టీని వదిలిపెట్టినట్లు రుజువైంది. అలాంటప్పుడు ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశామంటూ ఉమ్మడి వినతిపత్రంలో చెప్పకుండా ఉండాల్సింది. నేత ను, ప్రభుత్వాన్ని విడిచిపెట్టడానికి, పార్టీని విడిచిపెట్టడానికి మధ్య సన్నని గీత మాత్రమే తేడా’ అని కోర్టు పేర్కొంది. పార్టీ సభ్యత్వం వదులుకునే పరిస్థితి రానంత వరకూ అవిధేయత ఆమోదయోగ్యమేనంది. హైకోర్టు తీర్పు తో అనర్హ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది సీఎ సుందరం విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లారు. గత శుక్రవారం బలపరీక్షపై ఆదేశాలిచ్చిన బెంచ్‌నే ఆశ్రయించాలంటూ ఠాకూర్ సూచించారు. తర్వాత పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు మంగళవారం బలపరీక్షలో ఓటు వేసేందుకు అవకాశమివ్వాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. పర్యవేక్షక ఉత్తర్వుల సవరణ నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రావత్ ప్రభుత్వ బలపరీక్షను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి(అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాలు) పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత ఉత్తర్వుల ప్రకారం ముఖ్యకార్యదర్శి( అసెంబ్లీ) ఈ పరీక్షను పర్యవేక్షించాల్సి ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సంప్రదింపుల అనంతరం ముఖ్య కార్యదర్శి(అసెంబ్లీ) అంటూ ఎవరూ లేరని తెలియడంతో కేంద్రం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం స్పష్టత ఇస్తేనే పరీక్షను పర్యవేక్షిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పారని పిటిషన్లో కేంద్రం పేర్కొంది. మే 6 నాటి ఉత్తర్వుల్ని సవరించాలన్న పిటిషన్‌ను న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్‌ల ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు ఈ పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ముఖ్యకార్యదర్శిని అనుమతిస్తే బయటివ్యక్తులు అసెంబ్లీకి వచ్చినట్లవుతుందని, స్పీకర్ కింద పనిచేసే అసెంబ్లీ కార్యదర్శిని బలపరీక్ష పర్యవేక్షణకు అనుమతించాలని కోరింది. కోర్టు ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం ప్రతిపక్షాల నిరసనల మధ్యే 4 నెలల కాలానికి ఉత్తరాఖండ్ బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభ ఆమోదించింది. రావత్ గట్టెక్కే అవకాశాలు నేడు జరిగే అసెంబ్లీ బలపరీక్షలో రావత్ గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 70 మంది ఉండే ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలం 9 మందిపై అనర్హతతో 61కి పడిపోయింది. రావత్ ప్రభుత్వం గట్టెక్కాలంటే 31 మంది బలం అవసరం. 9 మంది అనర్హులవడంతో 27కు పరిమితమైన కాంగ్రెస్‌కు ఇద్దరు బీఎస్పీ, ఒక యూకేడీ, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తుండడంతో రావత్ కూటమి బలం 33గా ఉంది. బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉదయం 11 నుంచి ఒంటిగంట మధ్య పరీక్ష నిర్వహిస్తారు. తనవైపు 34 మంది ఉన్నారని తప్పక గట్టెక్కుతామని రావత్ చెప్పారు. -
10న ఉత్తరాఖండ్‌లో బలపరీక్ష
సుప్రీంకోర్టు ఆదేశం ♦ సింగిల్ ఎజెండాతో అసెంబ్లీని సమావేశపరచాలి ♦ ఓటింగ్ సమయంలో రాష్ట్రపతి పాలన రద్దు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈనెల 10న బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ (కాంగ్రెస్)కు విశ్వాస పరీక్ష ఉంటుందని స్పష్టంచేసింది. సస్పెన్షన్ వేటు పడిన 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత.. సభలో ఓటింగ్ జరిగే వరకు కొనసాగితే వారు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్దేశించింది. మంగళవారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ఈ ఒక్క ఎజెండాతోనే శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి బలపరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఆ రెండున్నర గంటలపాటు రాష్ట్రపతి పాలనను తాత్కాలికంగా నిలిపిఉంచాలని, ఆ సమయంలో రాష్ట్ర ఇన్చార్జిగా గవర్నర్ సాగాలని చెప్పింది. ఈమేరకు జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేల కేసు ఉత్తరాఖండ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో సుప్రీంకోర్టు వారిని ఓటింగ్‌కు దూరంగా ఉంచింది. అయితే హైకోర్టులో వారికి సానుకూలంగా వస్తే వారు ఓటింగ్‌కు హాజరవచ్చు. దీనిపై హైకోర్టులో శనివారం వాదనలు జరగనున్నాయి. మార్చి 18న ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం విషయంలో వివాదంతో రాష్ట్రంలో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. బలపరీక్ష నిర్వహణకు కేంద్రానికి అభ్యంతరం లేదంటూ అడ్వొకేట్ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు చెప్పారు. బలపరీక్ష కోసం సుప్రీం మార్గదర్శకాలను నిర్దేశించింది. అసెంబ్లీ ముఖ్యకార్యదర్శి పర్యవేక్షణలో విశ్వాసపరీక్ష నిర్వహించాలని, ఈ తంతు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని పేర్కొంది. ఓటింగ్ ఫలితాన్ని, వీడియో సీడీని ఈనెల 11న 10.30 గంటలకు తమకు సీల్డ్కవర్లో అందజేయాలని శాసనసభ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. అర్హులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనేలా, ఈ వ్యవహారం ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నిర్దేశించింది. విశ్వాస పరీక్ష మినహా సభలో ఎలాంటి అంశాన్నీ చర్చించడానికి వీల్లేదంది. సభలో తీర్మానానికి మద్దతిచ్చే వారు ఒకవైపు, వ్యతిరేకంగా ఉన్న వారు మరోవైపు కూర్చోవాలని చెప్పింది. మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి పాలనను పునరుద్ధరించాలంటూ ఏప్రిల్ 22న సుప్రీం జారీచేసిన ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ధర్మాసనం స్పష్టంచేసింది. అసెంబ్లీలో బలాబలాలు మొత్తం సభ్యులు: 70 బీజేపీ: 28 కాంగ్రెస్: 27 బీఎస్పీ: 2 స్వతంత్రులు: 3 ఠ యూకేడీపీ: 1 సస్పెన్షన్ వేటుపడినవారు: 9 (కాంగ్రెస్ రెబల్స్) (బీజేపీ ఎమ్మెల్యే బీఎల్ ఆర్య మార్చి 18న ద్రవ్యవినిమయ బిల్లు సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు) -
ఉత్తరాఖండ్‌లో సుప్రీం పర్యవేక్షణలో బలపరీక్ష?
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షను తన పర్యవేక్షణలో నిర్వహించే విషయమై సూచన ఇవ్వాలని అటార్నీ జనరల్(ఏజీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రద్దుచేసిన హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌పై విచారణను బుధవారానికి వాయిదావేసింది. విచారణ షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉండగా, న్యాయయూర్తులు దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం దీన్ని ఉదయం 10.30 గంటలకే చేపట్టింది. మధ్యాహ్నం 2గంటలకు జరగాల్సిన మెడికల్ ప్రవేశపరీక్షల విచారణలో జస్టిస్ శివకీర్తి సింగ్ భాగంగా ఉన్నందున ఉదయమే దీనిపై కొద్దిసేపు విచారించింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు అసెంబ్లీలో బలనిరూపణను తన పర్యవేక్షణలో నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని్ర ఏజీ ముకుల్ రోహత్గీని అడిగింది. దీనిపై బుధవారం సూచన ఇవ్వాలని చెప్పింది.