
డెహ్రాడూన్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు,ఐసీసీ ఛైర్మన్ జై షాపేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రియాంషు పంత్ (19) జై షా పేరు చెప్పి ఇక్కడి ఎమ్మెల్యే ఆదేశ్ చౌహాన్‌కు ఫోన్ చేశాడు.తనను అమిత్ షా కుమారుడు జై షాగా పరిచయం చేసుకొని పార్టీ కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ప్రశ్నించగా తమ మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో ఎమ్మెల్యే మోసగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు మొదలు పెట్టిన పోలీసులు మోసానికి పాల్పడుతున్న ప్రియాంశు పంత్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు.
అయితే నిందితుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా జై షా పేరుతో ఫోన్ చేసి డబ్బులిస్తే మంత్రి పదవులు ఇప్పిస్తానని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.విలాసవంతమైన జీవితం గడిపేందుకే పంత్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment