సాక్షి,హైదరాబాద్:ఫేక్ కరెన్సీ తయారు చేస్తున్న అంతర్జాతీయ నేరగాడిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. ఈ విషయమై శుక్రవారం(జనవరి24) సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడారు.
‘ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ,పహాడి షరీఫ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే అంతర్జాతీయ నేరస్తుడు నవీన్‌కుమార్‌ను పట్టుకున్నారు. నవీన్ కుమార్ మహబూబ్‌నగర్ జిల్లావాసి.
నవీన్‌కుమార్ వద్ద నుంచి ఐదు లక్షల రూపాయల నకిలీ కరెన్సీ సీజ్ చేశాం. నవీన్ కుమార్ సివిల్ ఇంజినీరింగ్‌ల్ పాలిటెక్నిక్ చేశాడు. నిందితుని నుంచి ప్రింటర్,కరెన్సీ పేపర్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నాం. నకిలీ నోట్ల ప్రింట్‌కు కావాల్సిన పేపర్స్ కోల్‌కతా,గుజరాత్,విజయవాడలలో తీసుకుంటాడు’ అని సుధీర్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment