rachakonda commisionarate
-
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకాన్ని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. బాలాపూర్‌లో 24 గ్రాముల హెరాయిన్, మీర్పేట్లో 1.5 కేజీల ఓపీఎం, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైక్స్, మొబైల్స్ సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
TS: ఐపీఎస్‌ల బదిలీలు.. రాచకొండ సీపీ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త సీపీలు వీరే.. రాచకొండ సీపీ.. సుధీర్‌బాబు హైదరాబాద్ సీపీ.. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ సీపీ.. అవినాశ్ మహంతి తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరక్టర్.. సందీప్ శాండిల్యా మరోవైపు.. చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. -
రాచకొండ నుంచే మునుగోడు ‘కంట్రోల్’.. ప్రతి పోలింగ్ కేంద్రంలో..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్‌కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐటీ బృందాలను కూడా నియమించామని వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అదనపు సీపీ జి.సుధీర్‌బాబు, డీసీపీలు నారాయణరెడ్డి, శ్రీబాల, అదనపు డీసీపీ భాస్కర్, ఏసీపీ ఉదయ్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించినట్లు సీపీ భగవత్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఒక ఎస్ఐ ఇన్చార్జిగా ఉంటారన్నారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయని చెప్పారు. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించామని, ఆయా స్టేషన్లలో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించామని వివరించారు. భారీగా నగదు, బంగారం స్వాధీనం.. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద పోలీసు బృందాలు 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తుంటాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలలో రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, పోలింగ్ రోజున అక్రమంగా మద్యం విక్రయాలు, సరఫరా చేసిన వ్యక్తులకు జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. సెల్ఫీలు దిగొద్దు.. పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్ఫోన్లు నిషేధమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సీపీ భగవత్ హెచ్చరించారు. చదవండి: ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా -
మీ ఇంటికే వస్తాం..!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారులపై వేధింపులు పెరుగుతున్నాయి. స్కూలు, కాలేజీ, హాస్టల్, ఆఫీసు ఎక్కడపడితే అక్కడ ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వేధింపులూ ఆగడం లేదు. దీంతో రాచకొండ షీ టీమ్స్ ఒక అడుగు ముందుకేసింది. సున్నితమైన కేసులలో బాధితుల ఇంటికే వెళ్లి భరోసా ఇచ్చి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. బాధితులు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి ప్రాథమిక ఆధారాలను సేకరించి, నిందితులను జైలుకు పంపిస్తున్నారు. 3,273 కేసుల నమోదు.. రాచకొండ షీ టీమ్స్‌లో 7 బృందాలు, ఒక్కో బృందంలో ఐదుగురు పోలీసులు మొత్తం 35 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 292 కేసులు నమోదయ్యాయి. వీటిలో 123 ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 118 పెట్టీ, 51 కౌన్సిలింగ్ కేసులున్నాయి. ఆయా కేసులలో 310 మంది పోకిరీలను అరెస్టు చేశారు. వీరిలో 110 మంది మైనర్లు, 200 మంది మేజర్లున్నారు. అధికార హోదా, అంగబలం, రాజకీయ అండదండల ప్రలోభాలతో మహిళలు, విద్యారి్థనిలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించే ఎవరినైనా వదిలిపెట్టడం లేదు. ఉదయం 4 నుంచే డెకాయ్ ఆపరేషన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉదయం, రాత్రి సమయాలలో సినిమాలు, సీరియళ్ల చిత్రీకరణ జరుగుతుంటాయి. షూటింగ్స్ ముగించుకొని రాత్రి సమయాలలో ఇంటికి వెళుతున్న కళాకారులు, కాస్టింగ్ సిబ్బందిని స్థానికంగా పోకిరీలు వేధిస్తున్నట్లు రాచకొండ షీ టీమ్స్ దృష్టికి వచి్చంది. దీంతో ప్రత్యేక బృందాలతో ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కళాకారుల లాగే పోలీసులూ మఫ్టీలో తిరుగుతూ.. ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. దీంతో పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్, హయత్‌నగర్, వనస్థలిపురం వంటి మార్గాలలో పోకిరీల చేష్టలు తగ్గుముఖం పట్టాయి. – ఎస్కే సలీమా, రాచకొండ షీ టీమ్స్ డీసీపీ (చదవండి: చట్టానికి దొరక్కుండా ఆన్లైన్ గేమింగ్) -
telangana: ‘ఇల్లరికం’ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: ఇరు కుటుంబాల స్థితిగతులు, కాబోయే అత్తామామలకు మగ సంతానం లేకపోవడం ఇతరత్రా కారణాలతో కొందరు ఇల్లరికం వెళుతుంటారు. అంటే వివాహానంతరం పెళ్లికూతురు అత్తారింటికి వెళ్లిపోవడం కాకుండా రివర్స్‌లో పెళ్లికొడుకు అత్తారింటికి వెళ్లి అక్కడే స్థిరపడిపోతాడన్నమాట. అచ్చం ఇలాగే కాకపోయినా ఇల్లరికపుటల్లుడు మాదిరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఒకే జిల్లాలో పాతుకుపోతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ప్రారంభించిన తర్వాత పదోన్నతులు పొందిన అధికారులు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి ఉన్నా అలా జరగడం లేదు. జోన్‌లోని ఇతర జిల్లాల్లో పనిచేసే అవకాశం ఉన్నా వెళ్లకుండా అక్కడక్కడే పోస్టింగ్‌లు చేస్తూ స్థానికంగా లభించిన పట్టుతో అక్రమార్జనకు పాకులాడే నేపథ్యంలో వివాదాస్పదమవుతున్నారు. కొత్తగూడెంలోని పాల్వంచలో జరిగిన వనమా రాఘవేంద్రరావు తరహా వ్యవహారాలకు ఇలాంటి అధికారులే పరోక్ష కారణమన్నది బహిరంగ రహస్యం. సిఫారసులతో ఏళ్లకేళ్లుగా అక్కడే ఉంటున్న వీరు.. తమను సిఫారసు చేసిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, కుటుంబీకులు చేసే అరాచకాలకు అందదండలందిస్తున్నారు. 70 శాతం ఇదే రీతి... రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా కమిషరేట్లతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఇల్లరికపు అధికారులు వందల మంది ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు జోన్‌లోని తన స్వంత జిల్లా కాకుండా మిగిలిన ఏ జిల్లాలో అయినా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కానీ అనేకమంది సబ్ ఇన్స్పెక్టర్గా మంచి రెవెన్యూ ఉన్న జిల్లాలను ఎన్నుకోవడం.. అక్కడే రిటైర్మెంట్ దాకా పాతుకుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా 70 శాతం మంది పోలీస్ అధికారులు ఒకే జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్ ఆ తర్వాత డీఎస్పీగానూ పదోన్నతి పొంది మళ్లీ అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. రాష్ట్ర స్థాయి హోదాలో డీఎస్పీగా తన స్వంత డివిజన్ తప్ప ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉన్నా తాను గతంలో పని చేసిన జిల్లాలోనే తాను ఎస్ఐ, సీఐగా పనిచేసిన సబ్‌డివిజన్ డీఎస్పీగా/ఏసీపీలుగానే పనిచేస్తున్నారు. మరికొంత మంది అధికారులైతే ఏకంగా అదనపు ఎస్పీగా కూడా అదే జిల్లాలో ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయంపై గురి.. అక్రమాలకు దన్ను ఇలాంటి అధికారులు టౌన్‌కు గరిష్టంగా 20 కిలోమీటర్లు దూరంలోపే పోస్టింగ్ తీసుకుంటారు. పైగా కనీస ఆదాయం అంటే తమను సిఫారసు చేసినందుకు ఇచ్చిన సొమ్ముకు రెండు, మూడింతలు వచ్చే పోస్టింగ్‌లో మాత్రమే కొనసాగుతారు. కొంతమంది అధికారులు మైనింగ్ కార్యకలాపాలుండే ప్రాంతాల్లో వరుస పోస్టింగ్‌లు తెచ్చుకుంటారు. ఇంకొంత మంది ఇసుక దందా సాగే ప్రాంతాలను ఎంచుకొని మరీ ఆయా ఠాణాల్లోనే పనిచేస్తారు. ఇంకొంత మంది గ్యాబ్లింగ్, వ్యాపార నెలవారీ కమీషన్లు, వైన్స్, బార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇంకొంత మంది అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్ల కేంద్రంగా సాగే ఏరియా ఠాణాలను టార్గెట్ చేసుకొని పోస్టింగ్ పొందుతున్నారు. సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో సీఐ పోస్టింగ్‌కు సిఫారసు చేసేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులు తక్కువలో తక్కువ రూ.20 లక్షలు తీసుకుంటున్నారంటే, ఆ పోస్టులో చేరి వారెంత అక్రమార్జనకు, ఎన్ని అవకతవకలకు పాల్పడతారో అర్ధం చేసుకోవచ్చు. దెబ్బతింటున్న పోలీసింగ్... ఎప్పటిప్పుడు అధికారుల మార్పు జరిగితే విధులు అంకితభావంతో పాటు పారదర్శకంగా నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఒకే అధికారి ఏళ్ల పాటు స్టేషన్లు మార్చిమార్చి పోస్టింగ్‌లు చేయడం, పదోన్నతి తర్వాత మళ్లీ అదే అధికారి సూపర్విజన్ డ్యూటీలోకి రావడం ఇష్టారీతిన జరిగిపోతోంది వనమా రాఘవతో ముడిపడిన ఘటన వంటి ఉదంతాలకు ఇలాంటి అధికారుల వ్యవహారాలే పరోక్షంగా కారణమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్లో 42 మంది సెటిల్ ►ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ టౌన్ స్టేషన్లలో ఎస్ఐలుగా పనిచేసిన అధికారులే ఇప్పుడు సీఐలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ ఏసీపీ అధికారి గతంలో అక్కడే టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, రూరల్ సీఐగా పనిచేశారు. ఇలా 42 మంది అధికారులు ఈ జిల్లాలోనే సెటిల్ అయిపోయారు. వీరు స్టేషన్ మారడం మినహా మరో జిల్లాకు పోయి పనిచేసింది లేదు. ►ఉమ్మడి వరంగల్‌లోని హన్మకొండ, కాజీపేట, ఎల్కతుర్తి, పరకాల, మామునూర్, జనగాం, ఘన్పూర్, వర్ధన్నపేట మహబూబాబాద్, పాలకుర్తి, భూపాలపల్లి.. ఇలా సబ్ డివిజన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన అధికారులే ప్రస్తుతం ఏసీపీలుగా, క్రైమ్ అధికారులుగా, టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్ విభాగాల్లో అధికారులుగా పనిచేస్తున్నారు. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఖమ్మం టౌన్, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు ఆయాసర్కిల్స్/సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఆయా ప్రాంతాల్లోనే సీఐ, డీఎస్పీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 70% మంది ►ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ రూరల్, భైంసా, ఉట్నూర్ సబ్ డివిజన్లలో ఎస్ఐలుగా పనిచేసిన 70 శాతం మంది అధికారులు ఇప్పుడు అవే ప్రాంతాల్లో సీఐగా, ఆపై స్థాయి పోస్టింగుల్లో కొనసాగుతున్నారు. ► ఉమ్మడి నిజామాబాద్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలు, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్నూర్ సబ్‌డివిజన్, సర్కిల్లో ఎస్ఐలు, సీఐలుగా పనిచేసిన అధికారులు అక్కడే సీఐలు, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్నారు. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నల్లగొండ హెడ్‌క్వార్టర్‌లోని ఠాణాలు, కోదాడ, సూర్యాపేట, సాగర్, మాల్, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, హుజూర్నగర్, చిట్యాల, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి.. ఇలా పలు ఠాణాల్లో ఎస్ఐలుగా పనిచేసినవారు ఇప్పుడు సీఐలుగా, మరికొంత మంది డీఎస్పీలుగా అక్కడే పాతుకుపోయారు. ►ఉమ్మడి మహూబూబ్‌నగర్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలతో పాటు జడ్చర్ల, నారాయణపేట్, మక్తల్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అమన్‌గల్, అమ్రాబాద్, వనపర్తి, గద్వాల్, దేవరకద్ర.. ఇలా సర్కిల్/సబ్డివిజన్లలో 60 శాతం అధికారులు ఇంతకుముందు అక్కడక్కడ పనిచేసిన వారే. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తదితర సర్కిల్, సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఇప్పుడు అక్కడే సీఐగా, సీఐగా చేసిన వారు డీఎస్పీలుగా పనిచేస్తున్నారు. ► ఇక సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో ఒక పోలీస్‌స్టేషన్‌నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు మార్పు చెందుతున్నారు కానీ కమిషనరేట్‌ను వదిలీ మరో కమిషనరేట్ లేదా జిల్లాకు మాత్రం బదిలీ కావడం లేదు. ఇలా ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో 90 శాతం అధికారులు తొలినాళ్లలో అక్కడే పనిచేసి, పదోన్నతి తర్వాత కూడా అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. -
సైబర్ మోసాలకు గురయ్యారా? తక్షణం ఈ నంబర్‌కు కాల్ చేయ్యండి
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఇప్పటివరకు 50 సైబర్ నేరాలు జరిగాయి. ఆయా కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసులు రూ.68 లక్షలు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ హరినాథ్ తెలిపారు. కస్టమర్ కేర్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, ఫిష్పింగ్ కాల్స్, ఓటీపీ మోసాలు, హనీ ట్రాప్స్, గిఫ్ట్, పెట్టుబడి మోసాలు వంటి వివిధ ఆన్లైన్ మోసాలకు సంబంధించి కేసులు కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. విచారణ సమయంలో ఒక ఖాతా నుంచి అనేక ఇతర అకౌంట్లు, వ్యాలెట్లకు నిధుల బదిలీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని సంబంధిత బాధితుల ఖాతాల్లోకి తిరిగి రికవరీ చేపించారు. కొన్ని సందర్భాలలో బాధితులు మోసానికి గురయ్యామని తెలిసిన తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 155260కి ఫిర్యాదు చేయడంతో ఆయా బాధితుల ఖాతాను హోల్డ్‌లో ఉంచి.. నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దర్యాప్తు బృందాలు నిరంతరం విచారణ జరిపి బాధితులకు పోగొట్టుకున్న మొత్తాలను వాపస్ చేశారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఈ– మెయిల్స్ ద్వారా వచ్చే నకిలీ సందేశాలు, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. కేవైసీ అప్డేట్, కస్టమర్ కేర్ సర్వీస్ అంటూ అపరిచిత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకూడదని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్. హరినాథ్ సూచించారు. సైబర్ మోసాలకు గురైన తక్షణమే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 155260 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ అయ్యే అవకాశముందని తెలిపారు. చదవండి: ఆమె ఇంట అతడు.. భర్తకు విషయం తెలిసి.. -
మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ జోన్ పరిధిలో మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు ఎస్ఓటీ పోలీసుల చేతికి చిక్కినట్లు రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తెలంగాణకు హాషిష్ అయిల్ స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు, రూ.800నగదు, 3 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం లడ్డూ చోరీ వాటి మొత్తం విలువ రూ.9,80,800ఉంటుదని తెలిపారు. ఈ గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. మళ్లప్పగరి శ్రీకాంత్‌రెడ్డి(మెదక్), వెంకటేష్(సంగారెడ్డి), కొండలరావు(విశాఖ)లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. గ్యాంగ్‌లోని మరో సభ్యుడు వెంకట్రాజు(విశాఖ) పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరిపై రాజమండ్రిలో కేసు నమోదైనట్లు వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు నడిపి శిక్ష పడేలా చేస్తామని సీపీ తెలిపారు. -
పటిష్టంగా లాక్డౌన్.. 5,614 వాహనాలు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతుంది. లాక్డౌన్ నిబంధనలు పాటించనివారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్న పోలీసులు మూడు రోజుల్లోనే 5,614 వాహనాలను సీజ్ చేశారు. కాగా ఇవాళ ఒక్కరోజే దాదాపు రెండు వేల వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో మే 12 నుంచి లాక్డౌన్ అమల్లో ఉండగా.. ఇప్పటికవరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో లాక్డౌన్ మే 30 వరకు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీలు అంజనీ కుమార్, సజ్జనార్‌లు హెచ్చరించారు. కాగా తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3308 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 21 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 4723 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,04,970 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 42,959 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 3106 మంది మృతి చెందారు. చదవండి: కనిపించని శత్రువుతో సమష్టి యుద్ధం -
శభాష్ కవిత.. చంటిబిడ్డను ఎత్తుకొని విధులు
బీబీనగర్: చేతుల్లో చిన్నారితో ఉన్న ఈ మహిళా కానిస్టేబుల్ పేరు కవిత. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఈమె పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం బీబీనగర్‌లోని పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా.. ఓటేయడానికి వచ్చిన ఓ మహిళ.. పోలింగ్‌బూత్‌లోకి వెళ్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న కవితకు తన చేతుల్లోని చంటిబిడ్డను అప్పగించింది. తల్లి ఓటు వేసి వచ్చేవరకు కవిత ఆ చిన్నారిని ఏడవకుండా ఆడిస్తూ కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిం ది. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్.. ‘శభాష్ కవిత’ అంటూ అభినందించడంతో పాటు ఆమెకు రివార్డు ప్రకటించారు. Beyond call on duty, #WPCO Kavitha of @BibinagarPS taking care of a baby while her mother #Castingvote for TSLC elections at Polling Station 369 #ZPHS_Bibinagar. #CP_Rachakonda appreciated and announced #reward for her devotion towards #duty.@TelanganaDGP @TelanganaCOPs pic.twitter.com/LTp46RF96A — Rachakonda Police (@RachakondaCop) March 14, 2021 -
భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తాం
-
రాచకొండలో నకిలీ డాక్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నకిలీ డాక్టర్ హల్చల్ చేశాడు. తేజారెడ్డి అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి ఏకంగా పోలీసులకే మస్కా కొట్టి లాక్డౌన్ సమయంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్‌గా విధులు నిర్వర్తించాడు. అదే సమయంలో రాచకొండ పరిధిలోని పలువురు పోలీసులకు కరోనా మందులు కూడా అందించినట్లు తెలిసింది. అయితే తేజారెడ్డి వ్యవహారంపై పోలీసులకు అనుమానం రావడంతో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో బెంగుళూరులోనూ ఇదే తరహాలో అక్కడి పోలీసులను బురిడీ కొట్టించాడు. తాను ఒక ఐపీఎస్ ఆఫీసర్ నంటూ.. సీనియర్ ఐపీఎస్ కుమారుడినంటూ చెప్పుకుంటూ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ అందించేవాడు. ఈ కేసులో తేజారెడ్డిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తేజారెడ్డి హైదరాబాద్‌కు తన మకాం మార్చాడు. (చదవండి : మూగ ప్రేమజంట బలవన్మరణం) లాక్డౌన్ సమయంలో తేజారెడ్డి డాక్టర్ అవతారమెత్తి రాచకొండ పరిధిలోని కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో వలంటీర్‌గా విధులు నిర్వహించాడు. అంతేగాక తేజారెడ్డి పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ. 15 లక్షలకు పైగా రుణాలు తేజారెడ్డి ఎగ్గొట్టినట్లు తేలింది. మరోవైపు తేజారెడ్డి తన వ్యక్తిగత జీవితంలో.. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడు. తేజారెడ్డి తనపై వేధింపులకు గురి చేస్తున్నట్లు అతని రెండవ భార్య ఈ మధ్యనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా తేజారెడ్డి ఇటీవలే ఒక రౌడీషీటర్‌కు చెందిన వాహనానికి ప్రభుత్వ వాహనంగా స్టికర్ అంటించి తిరుగుతున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా తేజారెడ్డి జీవిత చరిత్ర బయటపడింది. -
లాక్డౌన్: ప్రయాణాలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కూలీలు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహ నిర్మాణ రంగంలో, మార్బుల్స్ షాపులలో, ఇటుక బట్టీలలో చాలా మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రంగాలు మూత పడటంతో ప్రస్తుతం పని లేకపోవడంతో వారంత సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా ఎవరూ కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని, కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికే భోజన సదుపాయం, వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: ఈటల) రోడ్డుపై కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కాబట్టి.. ఎవరూ కూడా ప్రయణాలు చేయొద్దని కమిషనర్ చెప్పారు. ఇక గృహ నిర్మాణంలో పని చేసే కార్మికులకు వారి బిల్డర్స్ అసోషియేషన్ వాళ్లే భోజన సదుపాయం, వసతిని కల్పిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నైనా, రాచకొండ కంట్రోల్ రూం నెంబర్ 9490617234 కు ఫోన్ చేసి చేయొచ్చన్నారు. అలాగే హెం క్వారంటైన్, కర్ఫ్యూ సమయంలో కొంతమంది బయటకు వస్తున్నారని.. అలా ఎవరూ రావొద్దన్నారు. ఒకవేళ వస్తే వారిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలా బయటికి వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలిస్తున్నామని కమిషనర్ తెలిపారు. (కరోనా పోరులో చాలా ముందే మేల్కొన్నాం!) -
‘అతడిపై హత్య కేసు కూడా ఉంది’
సాక్షి, హైదరాబాద్ : నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగలను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. దొంగల గ్యాంగ్‌కు నాయకుడిగా వ్యవహరిస్తున్న బాబ్లీ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... సెప్టెంబరు 4న కుషాయిగూడలోని నగల దుకాణంలో ఉన్న చోరీ జరిగిందని తెలిపారు. తెల్లవారుజామున షాపులో చొరబడ్డ దొంగలు వెండి మొత్తం దోచేశారని పేర్కొన్నారు. క్రైమ్‌సీన్ పరిశీలనలో భాగంగా దొరికిన ఓ బ్యాగ్ ద్వారా చోరీ కేసు ఛేదించామన్నారు. దొంగలను బిహార్‌కు చెందిన అరారి గ్యాంగ్‌గా గుర్తించామని... వారిని పట్టుకోవడంలో బిహార్ పోలీసుల సహకారం మరువలేనిదని ధన్యవాదాలు తెలిపారు. చోరీ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడిస్తూ....‘ చోరీ తరువాత దొంగల గ్యాంగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్‌కు బయల్దేరింది. వారి కోసం పట్నా, బిహార్ రాష్ట్రమంతా గాలింపు మొదలు పెట్టాము. రన్నింగ్ ట్రైన్లోనే వారిని పట్టుకునేందుకు ప్లాన్ చేశాము. అలా ధానాపూర్ రైల్వే స్టేషన్లో గ్యాంగ్‌ని పట్టుకున్నాము. గ్యాంగ్‌కి బాబ్లీ మహుమ్మద్ అనే వ్యక్తి లీడర్‌గా ఉన్నాడు. అతడిపై గతంలో హత్య కేసుతో పాటు అనేక ఇతర కేసులు ఉన్నాయి. మొత్తం రూ. 11 లక్షల 49 వేలు నగదు..11 తులాల బంగారం, చోరికి ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నాము. ఈ గ్యాంగ్ కీసరలో కూడా చోరికి పాల్పడ్డట్టు గుర్తించాము. గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశాము. హైదరాబాద్ వచ్చే ముందు కర్ణాటక, గోవాలో కూడా వీళ్లు తిరిగారు. నిజానికి జ్యూవెలరి షాపు యజమాని సెక్యూరిటీ విధానం వల్ల.. కేసును తొందరగా ఛేదించేందుకు అవకాశం దొరికింది అని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయవద్దని సీపీ మహేశ్ భగవత్ విఙ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 11వేల 9వందలకు పైగా గణేష్ విగ్రహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. నిన్నటి వరకు 9 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారని వెల్లడించారు. రాచకొండ పరిధిలోని 25 ప్రాంతాల్లో అన్ని శాఖ సమన్వయంతో నిమజ్జనం జరుగుతుందన్నారు. గురువారం బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆరు గంటలకు మొదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 250 సీసీటీవీ ఆధ్వర్యంలో మానిటరింగ్ జరుగుతుందని..మొత్తం 9 వేల కెమెరాలతో జియో ట్యాగింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 5060 సిబ్బంది గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారని సీపీ వెల్లడించారు. -
బాల్యానికి మూడుముళ్లు..!
సాక్షి, యాదాద్రి : అధికార యంత్రాంగం చర్యలెన్ని చేపట్టినా జిల్లాలో బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు వెరసి చిరుప్రాయంలోనే అమ్మాయిలు పెళ్లిపీటలెక్కుతున్నారు. అందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కాలంలో రాచకొండ పోలీసులు, షీటీంలు, ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న బాల్య వివాహాలే నిదర్శనం. గుట్టుచప్పుడు కాకుండా.. జిల్లాలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండిన తర్వాత చేయాల్సిన వివాహాలు 13ఏళ్లకే చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు అడ్డుకుంటున్నా గుట్టుచప్పుడు కాకుండా వివాహాలు జరుగుతున్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కమిషనరేట్ పరిధిలో 51 బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకోగా ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్(ఎం), భువనగిరి, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు, చౌటుప్పల్, వలిగొండ ఇలా అన్ని మండలాల్లో నిత్యం ఏదో ఒక చోట బాల్య వివాహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బాల్య వివాహాలతో అనర్థాలు హైస్కూల్ స్థాయిలోనే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. వివాహ వయస్సు రాకముందే పెళ్లి చేయడంవల్ల వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. అంతేకాకుండా భార్య, భర్తల మధ్యన వివాదాలు తలెత్తి విడాకులకు దారితీస్తున్నాయి. బాల్యవివాహాలను తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు వివిధ కారణాలతో ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాలకు కారణాలు.. బాల్య వివాహాలు జరుగడం వెనక పలు సామాజిక కారణాలు ఉన్నాయి. మేనరికం, సమాజంలో బాలికల పట్ల జరుగుతున్న లైంగిక దాడులు, ప్రేమ పేరుతో వివాహాలు, మంచి సంబంధాలు పోతే దొరకవన్న ఆతృత, పేదరికం, నిరక్షరాస్యత వంటి అంశాలు బాల్య వివాహాలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై వివిధ శాఖల అధికారులు నిర్వహిస్తున్న ప్రచారం మొక్కుబడిగా కాకుండా విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. బాల్యవివా హాలకు సబంధించిన చట్టాలు, అతిక్రమిస్తే పడే శిక్షలు, చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల కలిగే అనర్థాలగురించి ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద బోర్డులపై రాయించాలి. 41 బాల్య వివాహాల అడ్డగింత రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 51బా ల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 41 ఉన్నాయి. 13ఏళ్ల నుంచి 17ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు వివాహాలు చేస్తుండగా అందిన సమాచారం మేరకు షీ టీం సభ్యులు, స్థానిక పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తక్షణమే స్పందించి ఘటనా స్థలాలకు వెళ్లి అడ్డుకున్నారు. వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలతోపాటు బాల్య వివాహాలు చేస్తే నేరమని ఇందుకు సహకరించిన కుటుంబ సభ్యులతోపాటు మధ్యవర్తులు అందరిపైన కేసులు నమోదవుతాయని వివరిస్తున్నారు. షీటీం రాకతో ఆగిన బాల్యవివాహం తుర్కపల్లి మండలం పెద్దతండాలో ఫిబ్రవరి 22న షీటీం పోలీసులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. 17 ఏళ్ల బాలికను 25ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. 23న వివాహాం జరగాల్సి ఉండగా సమాచారం అందుకున్న షీటీం సభ్యులు స్థానిక పోలీసుల సహకారంతో ముందు రోజే వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం వల్ల జరిగే నష్టాలను వివరించి పెళ్లిని అడ్డుకున్నారు. షీటీంలు అడ్డుకున్న బాల్య వివాహాలు ఇలా... రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో షీటీంలు ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకున్నాయి. భువనగిరి షీటీం ఆధ్వర్యంలో 28, చౌటుప్పల్ షీటీం 13, ఇబ్రహీంపట్నం షీ టీం 5, మల్కాజ్గిరి షీ టీం 3, ఎల్బీనగర్ షీ టీం 1, కుషాయిగూడ షీటీం1 మొత్తం 51 బాల్యవివాహాలను ఇటీవల కాలంలోనే అడ్డుకున్నారు. ఇందులో 13 ఏళ్ల వయస్సున్న రెండు, 14 ఏళ్ల వయస్సు మూడు, 15 ఏళ్ల వయస్సు 7, 16 ఏళ్ల వయస్సు 19, 17 ఏళ్ల వయస్సు 20 వివాహాలను అడ్డుకుని వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు నేరం బాల్య వివాహాలు చేయడం నేరం. అమ్మాయిల వయస్సు 18, అబ్బాయిల వయస్సు 21ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి. అంతకంటే లోపు వివాహాలు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. జరిమానా, జైలు శిక్ష రెండు విధించే అవకాశం ఉంది.వివాహం జరిపిన పెళ్లి పెద్ద నుంచి పురోహితుడు, పెళ్లికి హాజరైన వారందరిపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మైనర్ బాల, బాలికలు కచ్చితంగా చదువుకోవాలి. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100కు డయ ల్ చేయా లి. లేదా 9490617111 వాట్సాఫ్ నంబర్ 24గంటలు అందుబాటులో ఉంటుంది. –మహేశ్‌భగవత్, రాచకొండ సీపీ -
ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు
సాక్షి,మోత్కూరు(తుంగతుర్తి) : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా రాజకీయ ప్రచారం, స్వేచ్ఛగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం మోత్కూరు పోలీస్‌స్టేషన్‌ను భువనగిరి డీసీపీతో కలిసి సందర్శించారు. చౌటుప్పల్ ఏసీపీ బాపురెడ్డి, రామన్నపేట సీఐ ఎం.శ్రీనివాస్, స్థానిక ఎస్ఐ సీహెచ్.హరిప్రసాద్లతో ఎన్నికలకు సంసిద్ధత కావడంపై సమీక్షించారు. అనంతరం జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చాలా సున్నితంగా వ్యవహరిం చాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటిలో ఎలా వ్యవహరించాలని తమ సిబ్బందికి వివరించినట్లు తెలి పారు. ప్రజలు స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనేందుకు తమ శాఖ అన్నిరకాల బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
‘ప్రగతి నివేదన’కు ఇప్పటివరకు నో పర్మిషన్..!
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా, కొంగర కలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభకు పోలీసులు ఇప్పటివరకు అనుమతివ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. సభకు అనుమతిచ్చే విషయం రాచకొండ పోలీసు కమిషనర్ పరిశీలనలో ఉందని తెలిపింది. చట్టానికి లోబడే అనుమతిపై నిర్ణయం ఉంటుందని పేర్కొంది. సభ విషయంలో రాచకొండ కమిషనర్ ఏ ఉత్తర్వులు జారీ చేసినా వాటిని కోర్టు ముందు ఉంచుతామని పేర్కొంది. ప్రగతి నివేదన సభ వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అత్యవసర సర్వీసులకు విఘాతం లేకుండా డీజీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. ఈ వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు.. ప్రగతి నివేదన సభకు అనుమతి విషయంలో రాచకొండ పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని తమ ముందుంచేందుకు వీలుగా తదుపరి విచారణను సెప్టెంబర్ 7కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించి కొంగరకలాన్‌లో ప్రగతి నివేదన సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోందని, దాదాపు 25 లక్షల మందికిపైగా జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో సభకు ఇచ్చిన అనుమతులను చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిం చాలంటూ నడిగడ్డ పర్యావరణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సభ ఆదివారం కదా.. ఇబ్బందేంటి? ఈ సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.శశికిరణ్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడే పనిచేస్తోందన్నారు. ఇంత స్థాయిలో వస్తున్న జనం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. అత్యవసర సేవలకు కూడా విఘాతం కలిగే ప్రమాదం ఉందని, ఇవన్నీ పట్టించుకోకుండా పోలీసులు సభ నిర్వహణకు అనుమతినిచ్చారని తెలిపారు. ఈ సమయంలో సభ జరిగేది ఏ వారమని ధర్మాసనం అడగ్గా.. ఆదివారం అని శశికిరణ్ బదులిచ్చారు. అయితే ఇబ్బంది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజారక్షణ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని శశికిరణ్ విన్నవించారు. వారే కోర్టుకు వచ్చేవారు కదా..! ఈ సభకు అవసరమైన భూములను సంబంధిత భూ యజమానుల నుంచి బలవంతంగా తీసుకున్నారని వివరించారు. మరి బలవంతంగా తీసుకుని ఉంటే ఆ భూముల యజమానులే కోర్టుకు వచ్చే వారు కదా.. అని ధర్మాసనం ప్రశ్నించింది. సభ వల్ల అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ నుంచి స్పష్టత కోరింది. రాజధానికి వెలుపల 31 కిలోమీటర్ల దూరంలో సభ జరుగుతోందని శరత్‌కుమార్ కోర్టుకు నివేదించారు. ఈ సభ వల్ల హైదరాబాద్‌కు వచ్చే.. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఈ సభ వల్ల ఎవరికీ అసౌకర్యం, ఇబ్బంది కలగబోదని హామీ ఇస్తున్నట్లు నివేదించారు. జన సమీకరణే ప్రతి పార్టీ లక్ష్యం.. ‘ప్రతి రాజకీయ పార్టీ కూడా సభలు పెట్టుకుంటుంటాయి. ఆ సభలకు పరిమిత సంఖ్యలో జనం రావాలని ఏ పార్టీ అయినా చెప్పిందా.. భారీ జన సమీకరణ చేయడమే ప్రతి రాజకీయ పార్టీ లక్ష్యం.’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సభ జరిగే ప్రాంతం ఏ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వస్తుందని ధర్మాసనం ప్రశ్నించగా, రాచకొండ పరిధిలోకి వస్తుందని శరత్ చెప్పారు. -
పోలీస్ కమిషనర్‌గా ఆరేళ్ల బాలుడు
సాక్షి, హైదరాబాద్ : బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడి కోరికను తీర్చి హైదరాబాద్ పోలీసులు తమ సహృదయతను చాటుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన చాంద్ పాషా కుమారుడు ఇషాన్(6) గత కొద్దిరోజులుగా బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రెండో తరగతి చదువుతున్న ఇషాన్‌కి పోలీసులంటే చాలా ఇష్టం. దీంతో భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇషాన్ గురించి తెలుసుకున్న రాచకొండ పోలీసులు అతని కోరిక తీర్చేందుకు ముందుకొచ్చారు. ఒక్క రోజు కమిషనర్‌గా వ్యవహరించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం కమిషనర్ ఇషాన్‌కి పోలీసులు సెల్యూట్ చేశారు. అంతేకాకుండా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తన సీటులో కూర్చొబెట్టి మరి ఇషాన్ కోరిక తీర్చారు. -
మరో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం
హైదరాబాద్ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దన దాహానికి విద్యార్థులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. గడిచిన రెండేండ్లలో నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో నలభైమంది విద్యార్థుల ఆత్మహత్యలు మరువక ముందే మరో విద్యాసంస్థకు చెందిన విద్యార్థినుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో కుషాయిగూడలోని ఒమేగా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జెశ్వాని, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి ప్రజ్వల అనే విద్యార్థిని అదృశ్యం అయ్యారు. దీనితో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ బిడ్డల ఆచూకీ తెలపాలంటూ పోలీసులను ఆశ్రయించారు. సాయి ప్రజ్వల అనే విద్యార్థిని కళాశాల యాజమాన్యం వేధిస్తుందని ఆవేదనను వ్యక్తపరిచింది. దీంతో విద్యార్థునుల అదృశ్యంపై సందిగ్దత నెలకొంది. -
టీవీ నటిపై అత్యాచారం
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య ఉదంతం చల్లారక ముందే టీవీ నటిపై అత్యాచారం జరిగిన వ్యవహారం వెలుగులో రావడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో ఉంటూ టెలివిజన్ రంగంలో ఆర్టిస్టుగా రాణిస్తోన్న ఓ మహిళపై.. అనంతపురానికి చెందిన కీచకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రాచకొండ పోలీస్ కమిషర్ మహేష్ భగవత్‌కు బుధవారం రాత్రి ఫిర్యాదు అందింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్లో నివసించే టీవీ ఆర్టిస్టును.. అదే ప్రాంతంలో ఉంటోన్న అనంతపురం వాసి ఒకడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. మాట వినకుంటే అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు. ఈక్రమంలో నిందితుడు అనంతపురంలోని తన ఇంటికి బాధితురాలిని తీసుకెళ్లి నిర్బంధించాడు. అక్కడ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎలాగోలా కీచకుడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు నేరుగా హైదరాబాద్ వచ్చి.. తనపై జరిగిన అకృత్యాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు.. అనంతపురంలో నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.