సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కూలీలు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహ నిర్మాణ రంగంలో, మార్బుల్స్ షాపులలో, ఇటుక బట్టీలలో చాలా మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రంగాలు మూత పడటంతో ప్రస్తుతం పని లేకపోవడంతో వారంత సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా ఎవరూ కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని, కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికే భోజన సదుపాయం, వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: ఈటల)
రోడ్డుపై కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కాబట్టి.. ఎవరూ కూడా ప్రయణాలు చేయొద్దని కమిషనర్ చెప్పారు. ఇక గృహ నిర్మాణంలో పని చేసే కార్మికులకు వారి బిల్డర్స్ అసోషియేషన్ వాళ్లే భోజన సదుపాయం, వసతిని కల్పిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నైనా, రాచకొండ కంట్రోల్ రూం నెంబర్ 9490617234 కు ఫోన్ చేసి చేయొచ్చన్నారు. అలాగే హెం క్వారంటైన్, కర్ఫ్యూ సమయంలో కొంతమంది బయటకు వస్తున్నారని.. అలా ఎవరూ రావొద్దన్నారు. ఒకవేళ వస్తే వారిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలా బయటికి వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలిస్తున్నామని కమిషనర్ తెలిపారు. (కరోనా పోరులో చాలా ముందే మేల్కొన్నాం!)
Comments
Please login to add a commentAdd a comment