
సాక్షి, హైదరాబాద్: నగరంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. అయితే ఆదివారం ఉదయం 9 గంటలు.. కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ ప్రధాన రహదారి.. ప్రతి ఆదివారంలాగే రోడ్డుపై సండే మార్కెట్ నడుస్తోంది.. జనమంతా కొనుగోలు హడావుడిలో ఉన్నారు.. ఇంతలో పోలీసులు..
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వస్తున్నారు.. వెంటనే మార్కెట్‌ను ఎత్తేయాలన్నారు. ఇంకా టైం కాలేదుగా.. అప్పుడే పంపిస్తే.. ఎలా అమ్ముకునేది అంటూ వ్యాపారులు ప్రశ్నించారు.
వారు వినేలా లేకపోవడంతో పోలీసులు కాంటాలను కింద పడేశారు. లాఠీలు తీశారు.. మొత్తాన్ని ఖాళీ చేయించారు. ఇంతలో వాహనంలో సజ్జనార్ వచ్చారు.. లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment