బంజారాహిల్స్(హైదరాబాద్): ‘సార్... ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో తిన్నది అరగడం లేదు.. మా ఇంట్లోవాళ్లందరికీ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే ఈనో ప్యాకెట్లు కొనేందుకు బయటకొచ్చా..’అంటూ ఓ వ్యక్తి పోలీసులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీవీఆర్ చౌరస్తా వద్ద సోమవారం చోటు చేసుకుంది.
లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బెక్‌మీద వచ్చాడు. బయటకు ఎందుకు వచ్చావని ప్రశ్నించగా, మందుల కోసం అంటూ సమాధానం ఇచ్చాడు. ఏం మందులు తీసుకున్నావు.. అని పోలీసులు అడిగారు. దీంతో ఆ యువకుడు బ్యాగులోంచి 50 ఈనో ప్యాకెట్లను తీసి చూపించాడు. ఎందుకు ఇన్ని తీసుకుని వెళ్తున్నావంటూ ప్రశ్నించగా, లాక్‌డౌన్ కారణంగా తనతో పాటు తన తండ్రి, సోదరుడు, భార్య ఇంట్లోనే ఉంటున్నామని, తిని కూర్చుంటుండటంతో అరగడం లేదని.. అందుకే ఈనో ప్యాకెట్లు తీసుకుని వెళ్తున్నానంటూ సమాధానమిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment