Mahesh Bhagavat
-
రేవంత్ ఇంటికి తెలంగాణ డీజీపీ.. భద్రత పెంపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ విజయంతో హస్తం పార్టీ శ్రేణులు వేడుక సంబురాలు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌ను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ను కలిసిన వారిలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ ఉన్నారు. కాంగ్రెస్ విజయం నేపథ్యంలో ఆయనను అభినందించినట్టు తెలుస్తోంది. ఇక, రేవంత్ రెడ్డికి భద్రతను కూడా పెంచారు. మరోవైపు.. కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో రేవంత్ ఇంటికి చేరుకున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. *BREAKING* టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్#Revanthreddy pic.twitter.com/kwEBYPdduM — Yashwanth Reddy🇮🇳 (@Yashwanthgarla1) December 3, 2023 అంతకుముందు రేవంత్ రెడ్డి ట్వీట్ ఇది.. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j — Revanth Reddy (@revanth_anumula) December 3, 2023 -
33 రోజుల్లో.. 1000 మొబైల్ ఫోన్లు
సాక్షి, హైదరాబాద్ః చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టేందుకు అమల్లోకి తెచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలిస్తోంది. గత నెల ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నూతన పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. 60 మంది ట్రైనర్లకు తొలుత ఈ పోర్టల్ వాడకంపై శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ పోర్టల్ విధానంతో సోమవారం వరకు అంటే 33 రోజుల్లో వెయ్యి మొబైల్ ఫోన్ల జాడను గుర్తించడంతోపాటు వాటిని తిరిగి ఫోన్ల యజమానులకు అందించారు. వీటిలో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో 149, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 91, కామారెడ్డి జిల్లా పరిధిలో 79 మొబైల్ ఫోన్ల జాడ కనిపెట్టినట్టు సీఈఐఆర్ నోడల్ అధికారి, సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మొత్తం 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర పౌరులెవరైనా తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్టయితే దగ్గరలోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి సీఈఐఆర్ విధానంలో ఫిర్యాదు చేయవచ్చని మహేశ్ భగవత్ సూచించారు. ఇది కూడా చదవండి: GO 111: మాస్టర్‌ప్లాన్ ఇప్పట్లో లేనట్టే! -
హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ రోజులు: రోడ్లన్నీ వెలవెల
సాక్షి, హైదరాబాద్: మళ్లీ లాక్డౌన్ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ప్రస్తుతం రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో హైదరాబాద్ రోడ్లు మళ్లీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన రోడ్లతో పాటు గల్లీ రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. కరోనా విజృంభణతో హైకోర్టు మొట్టికాయలు వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కర్ఫ్యూ అమలును పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డులో మహేశ్ భగవత్, కూకట్‌పల్లిలో సజ్జనార్ కర్ఫ్యూ అమలును పర్యవేక్షించారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఎల్బీనగర్ నాగోల్, ఉప్పల్, జెన్ పాక్ట్ వద్ద రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట, కూకట్పల్లి, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ స్పష్టంగా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుండడంతో ప్రజలు ఎవరూ బయటకు రాలేదు. అక్కడక్కడ ప్రజలు బయటకు రాగా పోలీసులు నిలువరించి వివరాలు సేకరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. వైద్యం, ఆహారం, మీడియా తదితర రంగాలకు సంబంధించిన వారిని వదిలిపెట్టారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఫొటోలు -
కర్ఫ్యూ సమయంలో కొంతమంది బయటకు వస్తున్నారని..
-
లాక్డౌన్: ప్రయాణాలు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కూలీలు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలని కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గృహ నిర్మాణ రంగంలో, మార్బుల్స్ షాపులలో, ఇటుక బట్టీలలో చాలా మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని రంగాలు మూత పడటంతో ప్రస్తుతం పని లేకపోవడంతో వారంత సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అలా ఎవరూ కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని, కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికే భోజన సదుపాయం, వసతి సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: ఈటల) రోడ్డుపై కొందరు నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు కాబట్టి.. ఎవరూ కూడా ప్రయణాలు చేయొద్దని కమిషనర్ చెప్పారు. ఇక గృహ నిర్మాణంలో పని చేసే కార్మికులకు వారి బిల్డర్స్ అసోషియేషన్ వాళ్లే భోజన సదుపాయం, వసతిని కల్పిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే నైనా, రాచకొండ కంట్రోల్ రూం నెంబర్ 9490617234 కు ఫోన్ చేసి చేయొచ్చన్నారు. అలాగే హెం క్వారంటైన్, కర్ఫ్యూ సమయంలో కొంతమంది బయటకు వస్తున్నారని.. అలా ఎవరూ రావొద్దన్నారు. ఒకవేళ వస్తే వారిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలా బయటికి వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలిస్తున్నామని కమిషనర్ తెలిపారు. (కరోనా పోరులో చాలా ముందే మేల్కొన్నాం!) -
ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంతో వాహనాదారులు బెంబేలెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. ట్రాఫిక్ ఉల్లంఘనపై విధిస్తున్న జరిమానాలతో తమ వాహనాలను బయటికి తీయడానికి కూడా వాహనదారులు భయపడుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెలువడుతున్ననేపథ్యంలో తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశానుసారం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ఇకపై హెల్మెట్, బండి ఇన్సురెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసెన్స్ లేని వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు విధించకుండా వాటిని వారితోనే కొనిచ్చే ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు పేర్కొన్నారు. ఇది మంచి ప్రయత్నం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. -
ఆశ్చర్యపరుస్తోన్న రవి శేఖర్ నేర చరిత్ర
-
రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం
సాక్షి, హైదరాబాద్: గత నెల 23వ తేదీన హయత్‌నగర్ యువతి కిడ్నాప్‌కు పాల్పడిన రవి శేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘రవి శేఖర్ మే 23న విజయవాడ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని రైలు ఎక్కాడు. ఈ క్రమంలో రైలులో కర్ణాటక కోప్పల్కు చెందిన ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. చర్చి కట్టడానికి సాయం చేస్తానని మాయ మాటలు చెప్పి వారి ఇంటికి వెళ్లాడు. బళ్లారిలో తనకు రూ. 3 కోట్ల డబ్బు ఉందని.. వెళ్లి తీసుకొస్తానని చెప్పి.. వారి ఐ20 కారుతో ఉడాయించాడు’ అని తెలిపారు. ‘జూలై 21వ తేదీన రవి శేఖర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయ్యాడు. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పి డబ్బులు వసూలు చేసి.. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. జూలై 23న హయత్‌నగర్‌లో సోనిని కిడ్నాప్ చేశాడు. రవి శేఖర్ కోసం కడప, ఒంటిమిట్ట, తిరుపతిలో గాలించాము. 29 తేదీన నల్గొండ వాడపల్లిలో ఓ ఎరువులు దుకాణం దగ్గరికి వెళ్లి తనిఖీల పేరుతో రూ.80 వేల నగదుతో పరారయ్యాడు రవి శేఖర్. విజయవాడ వైపుగా వెళ్లాడని తెలియడంతో ఏపీ పోలీసులు సాయం తీసుకున్నాం. ఎనిమిది రోజుల తర్వాత జూలై 30న సోనిని వదిలేశాడు. అనంతరం అతడిని అరెస్ట్ చేశాం. రవి శేఖర్‌ను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు బాగా సహకరించారు’ అని భగవత్ తెలిపారు. అంతేకాక ‘రవి శేఖర్ మీద తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కలుపుకుని 65కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏపీలోనే ఇతడి మీద 50 కేసులు నమోదయ్యాయి. 2001 నుంచి రవి శేఖర్ నేరాలకు పాల్పడుతున్నాడు. 2006-2017 వరకూ తెలంగాణలో విజిలెన్స్ ఆఫీసర్, జడ్జీ కుమారుడిని, ఏసీబీ అధికారిని అంటూ మోసాలకు పాల్పడ్డాడు. 2014లో భువనగిరిలో పీడీఎస్‌లో అవకతవకలు అంటూ వెళ్లి షాప్ యజమానిని బెదిరించాడు. అనంతరం యజమాని భార్యతో బైక్ పైన ఉడాయించి, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయాడు. రెండు రోజులు తరువాత ఆమెను విడిచి పెట్టాడు’ అని భగవత్ తెలిపారు. రవి శేఖర్ డబ్బులు వసూలు చేయడమే కాక పాటు మహిళలను మోసం చేస్తున్నాడన్నారు. అంగన్వాడి వర్కర్స్‌ను ట్రాప్ చేసి మోసం చేశాడని తెలిపారు. బ్యాక్ డోర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ మోసం చేస్తున్నాడు. ఇలాంటి వారిని నమ్మవద్దు అని మహేష్ భగవత్ ప్రజలను కోరారు. -
ఐపీఎల్ ఫైనల్.. సీపీ కీలక ప్రెస్‌మీట్
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బందోబస్తు విషయమై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం లోపల, పరిసరాల్లో 300 కెమెరాలు ఏర్పాటు చేసి.. నిత్యం పర్యవేక్షిస్తామని, ఇందుకోసంస్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,850 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రేక్షకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారని తెలిపారు. స్టేడియం, పిచ్ అంత ఇప్పటికే తనిఖీ చేశామని, నిషేధిత వస్తువులను ఎవ్వరూ మైదానంలోకి తీసుకుసరావొద్దని సూచించారు. హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, లాప్టాప్, మద్యం, తినే ఆహార పదార్థాలతోపాటు బయటినుంచి తీసుకొచ్చే వాటర్ బాటిళ్లను సైతం లోపలికి అనుమతించమని వెల్లడించారు. ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, అన్ని ప్రవేశద్వారాల వద్ద చెకింగ్ పాయింట్స్ ఉంటాయని తెలిపారు. -
శ్రావణి హత్య.. పోలీసుల కీలక నిర్ణయం!
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు శ్రావణిని హత్య చేసింది ఎవరు? బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్ల అయ్యే పనేనా? ఈ దారుణానికి ఒడిగట్టడానికి వెనుక కారణాలేంటి అన్నది ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసినట్టు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కేసు దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించిన బొమ్మలరామారం ఎస్సై వెంకటేశ్‌పై శాఖపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. శ్రావణి హత్యకు సంబంధించి గ్రామస్తుల వద్ద ఏదైనా సమాచారం ఉంటే నేరుగా రాచకొండ పోలీసుల వాట్సాప్ నంబర్ 9490617111 సమాచారం ఇవ్వచ్చునని తెలిపారు. కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి, షీ టీమ్ అడిషనల్ డీసీపీ సలీమా, ఐటీ సెల్ అధికారులు ఉంటారని తెలిపారు. శ్రావణి పోస్ట్‌మార్టం అనంతరం ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. శ్రావణి ఊపిరాడక చనిపోయిందని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని తేలింది. దీంతోపాటు ఆమె ఎడమవైపు పక్కటెముకలు విరిగిపోయాయి. కుడివైపుపక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను చంపిన తర్వాత 25 అడుగుల లోతులోని బావిలోకి పైనుంచి పడేయడంతో పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. శ్రావణి మృతదేహం దొరికిన బావి వద్ద ఎండిన వరిగడ్డిని గుర్తించారు. బాలిక చనిపోయిన తర్వాత కాల్చివేయాలన్న ఆలోచనలో నిందితులు ఉన్నట్లు భావిస్తున్నారు. శ్రావణి హత్య సంఘటనపై ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు. శనివారం కూడా శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కోసం వెళ్తూ జాతీయ రహదారిపై మరోసారి రాస్తారోకో చేపట్టారు. ప్రజల ఆగ్రహంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. సీపీ మహేశ్‌భగవత్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను 24 గంటల్లో పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తానని హామీ ఇవ్వడంతో శ్రావణి అంత్యక్రియలు నిర్వహించారు. @cyberabadpolice @hydcitypolice @TelanganaDGP pic.twitter.com/sekttcEbwq — Rachakonda Police (@RachakondaCop) April 27, 2019 చదవండి: శ్రావణిని చంపిందెవరు? -
ఏర్పాట్లు పూర్తి.. నిర్భయంగా ఓటెయ్యండి
సాక్షి, హైదరాబాద్ : ఈరోజు సాయంత్రానికి తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. పోలింగ్ కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్‌లో తీసుకున్న భద్రతా చర్యల గురించి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్‌లు మీడియాకు వివరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భద్రత ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. సైబరాబాద్: ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఓటర్లను కోరారు. పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 13 నియోజకవర్గాల్లో శుక్రవారం రోజున జరిగే పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన సీపీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కమిషనరేట్ పరిధిలో 2867 పోలింగ్ కేంద్రాలు, 152 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లుపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు సైబరబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కోట్ల 29 లక్షల 25 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తిన 9490617444 నంబర్‌కు ఏ సమయంలోనైనా ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. రాచకొండ: రాచకొండ కమిషనరేట్‌లో 13 శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. సమస్యాత్మకమైన 214 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాల వద్ద 12000 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామన్నారు. 11 చెక్ పోస్టులు, 27 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని వివరించారు. హైదరాబాద్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటివరకు 27 కోట్ల 3 లక్షల 76 వేల రూపాయలు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల రోజు ప్రత్యేకంగా 518 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కోసమే ప్రత్యేకంగా 10 వేల సీసీ కెమెరాలు వినియోగిస్తున్నామన్నారు. అసాంఘికశక్తులతో పాటు రౌడీషీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు. -
'నాగోల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సెలింగ్ సెంటర్'
హైదరాబాద్: నగరంలోని నాగోల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సెలింగ్ సెంటర్‌ను సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినవారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ 2016 యాక్టను ప్రయోగిస్తామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10 వేల వరకు జరిమానా, 6 నెలల వరకూ జైలు శిక్ష విధిస్తారని మహేష్ భగవత్ వెల్లడించారు.