
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ విజయంతో హస్తం పార్టీ శ్రేణులు వేడుక సంబురాలు చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఇంటికి డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌ను డీజీపీ మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్‌ను కలిసిన వారిలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ ఉన్నారు. కాంగ్రెస్ విజయం నేపథ్యంలో ఆయనను అభినందించినట్టు తెలుస్తోంది. ఇక, రేవంత్ రెడ్డికి భద్రతను కూడా పెంచారు. మరోవైపు.. కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో రేవంత్ ఇంటికి చేరుకున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు.
*BREAKING*
— Yashwanth Reddy🇮🇳 (@Yashwanthgarla1) December 3, 2023
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిగారిని కలిసిన డీజీపీ అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్#Revanthreddy pic.twitter.com/kwEBYPdduM
అంతకుముందు రేవంత్ రెడ్డి ట్వీట్ ఇది..
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు.
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023
శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j