ఐపీఎల్‌ ఫైనల్‌.. సీపీ కీలక ప్రెస్‌మీట్‌ | CP Mahesh Bhagavat Press Meet On IPL Final Match in Hyderabad | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌.. సీపీ కీలక ప్రెస్‌మీట్‌

Published Sat, May 11 2019 11:50 AM | Last Updated on Sat, May 11 2019 2:02 PM

CP Mahesh Bhagavat Press Meet On IPL Final Match in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ బందోబస్తు  విషయమై ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో స్టేడియం లోపల, పరిసరాల్లో 300 కెమెరాలు ఏర్పాటు చేసి.. నిత్యం పర్యవేక్షిస్తామని, ఇందుకోసంస్టేడియం లోపల ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,850 మంది పోలీసులతో మ్యాచ్‌కు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

పార్కింగ్ సంబంధించిన వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ప్రేక్షకుల రద్దీ దృష్టిలో ఉంచుకొని రాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నారని తెలిపారు. స్టేడియం, పిచ్ అంత ఇప్పటికే తనిఖీ చేశామని, నిషేధిత వస్తువులను ఎవ్వరూ మైదానంలోకి తీసుకుసరావొద్దని సూచించారు. హెల్మెట్, పవర్ బ్యాంక్, సిగరెట్లు, లాప్టాప్, మద్యం, తినే ఆహార పదార్థాలతోపాటు బయటినుంచి తీసుకొచ్చే వాటర్‌ బాటిళ్లను సైతం లోపలికి అనుమతించమని వెల్లడించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని, అన్ని ప్రవేశద్వారాల వద్ద చెకింగ్ పాయింట్స్ ఉంటాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement