సాక్షి, హైదరాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంతో వాహనాదారులు బెంబేలెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. ట్రాఫిక్ ఉల్లంఘనపై విధిస్తున్న జరిమానాలతో తమ వాహనాలను బయటికి తీయడానికి కూడా వాహనదారులు భయపడుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెలువడుతున్ననేపథ్యంలో తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశానుసారం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ఇకపై హెల్మెట్, బండి ఇన్సురెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసెన్స్ లేని వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు విధించకుండా వాటిని వారితోనే కొనిచ్చే ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు పేర్కొన్నారు. ఇది మంచి ప్రయత్నం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment