Mahendar Reddy
-
రాహుల్ గాంధీది ఏ కులం..?
-
కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించడమే: కొండ సురేఖ
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి కొండ సురేఖ అన్నారు. ఆంధ్ర వ్యక్తిని నియమించారని మాట్లాడటం చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. పదేండ్లు పాలన చేసిన వాళ్లు రెండు నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాల కాంట్రాక్టులను పెంచి పోషించినది కేసీఆరేనని అన్నారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ పాలనలో డీజీపీగా ఎందుకు పెట్టారు? అని నిలదీశారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇస్తే తప్పుపడుతున్నారు కానీ బీఆర్ఎస్ దళారులు సింగరేణిలో ఉద్యోగాలు పొందారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ చేశారా? లేక ఒకే రూమ్ లో కావాల్సిన వాళ్లకు పరీక్షా రాయించారా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదు.. తాము ఇస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి నిధులు, ఉద్యోగాలు ఎవరు తన్నుకుపోయారో అందరికి తెలుసని కొండ సురేఖ అన్నారు. సింగరేణిలో డిప్యూటేషన్, బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత దండుకున్నావ్.. లెక్కలు తీయాలా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని జోస్యం చెప్పారు. ఇదీ చదవండి: ‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’ -
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డి పైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని అన్నారు. కేసిఆర్ చేసిన పనులను తాము చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితువు పలికారు. సింగరేణిలో ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తోందని చెప్పారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను హైదరాబాద్ లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉండి కేసీఆర్‌ను ఇష్టానుసారం దూషిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లని డైరెక్టర్లను నియమించారని అన్నారు. తెలంగాణ కు నిరంతర కరెంట్ ఇవ్వడంలో ఆంధ్రవాళ్లు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారని ప్రశ్నించారు. మీలో పచ్చ రక్తం పారుతుంది కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీకి ఆంధ్ర అడ్వైసర్ ఎందుకు? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే గండ్ర పిటిషన్ -
టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి
-
TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మాహేందర్రెడ్డి
-
TS Election 2023: ‘పట్నం’ శిబిరంలో అలజడి.. పదవుల కోసం టికెట్ త్యాగం చేస్తారా..?
వికారాబాద్: తాండూరులో టికెట్ పంచాయితీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో మళ్లీ రచ్చమొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల సమరం సమీపిస్తుండడంతో పార్టీ అధిష్టానం సైతం బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది. తాండూరు నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయమై పట్నం మహేందర్‌రెడ్డి శిబిరంలో అలజడి మొదలయింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికే వస్తుందంటూ ధీమాతో ఉన్న ఆయన అనుచరుల్లో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. శనివారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. తాండూరు అసెంబ్లీ స్థానంలో పోటీ విరమించుకుంటే మంత్రి పదవితోపాటుగా రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్నారని నచ్చజెప్పారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆదివారం విషయం తెలుసుకున్న పట్నం వర్గీయులు మండల స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చే స్తూ ఆందోళన చెందుతున్నారు. అయితే పట్నం ఈ విషయమై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. జంబో జాబితా తర్వాతే నిర్ణయం.. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జంబో జాబితా బయటకు వచ్చాకే పట్నం మహేందర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరగణం అంటున్నారు. కాగా తాండూరు నుంచి టికెట్ రాకపోతే తన వెంట నడిచేవారెందరున్నారని ఆయన లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే కొంత మంది నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అనుకూలంగా ఉంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాలతో అన్నట్లు తెలిసింది. నియోజకవర్గ స్థాయిలో మహేందర్‌రెడ్డికి బలమైన కేడర్ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన వారికి టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో పైలట్ పేరు తొలి జాబితాలోనే వస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పదవుల కోసం టికెట్ త్యాగం చేస్తారా..? తాండూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఆరు సార్లు పోటీ చేయగా .. నాలుగు సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాండూరు నుంచే పోటీ చేస్తానంటూ ఆయన పలుమార్లు ప్రకటించారు. అయితే శనివారం బీఆర్ఎస్ పెద్దలతో జరిగిన చర్చల్లో పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు సతీమణి జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డిని రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఆయన నియోకవర్గ ముఖ్య నాయకుల అభిప్రా యం తీసుకుంటున్నారు. మరో రెండు మూడు రో జుల్లో తాండూరు అసెంబ్లీకి పోటీ చేస్తారా.. లేక పదవులతో సైలెంట్ అయిపోతారా అనేది స్పష్టత రానుంది. ఈ విషయమై పట్నం మహేందర్‌రెడ్డిని వివరణ కోరగా తాను తాండూరు అసెంబ్లీని వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోటీ చేయడం ఖాయమన్నారు. -
Telangana: డీజీపీ రేసులో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీస్ విభాగాధిపతిగా ఎవరు వస్తారన్న చర్చ పోలీస్ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమించనుందనే విషయానికి మరో వారంలో తెరపడనుంది. హెచ్ఓపీఎఫ్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) డీజీపీ రేసులో ఏసీబీ డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం వీరి ముగ్గురితోపాటు మరో సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌రతన్ సైతం ఉన్నట్టు సమాచారం. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం డీజీపీ ర్యాంకులో 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. సీఐడీ డీజీగా పనిచేసిన మరో సీనియర్ ఐపీఎస్ గోవింద్‌సింగ్ గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్‌కు డీజీ ర్యాంకు దక్కనుంది. అయితే, అందరిలోకి సీనియర్ అయిన ఉమేశ్ షరాఫ్ పదవీ కాలం 2023 జూన్‌తో ముగియనుంది. కేవలం ఆరు నెలల కాలమే ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పోలీస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన వారికి డీజీపీగా పదోన్నతి లభించింది. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. వారిద్దరు సైతం హైదరాబాద్ సీపీగా పనిచేస్తూ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ లెక్కన డీజీపీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో అంజనీకుమార్ గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేయగా, సీవీ ఆనంద్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ఎక్స్‌కేడర్ కోటాలో సీవీ ఆనంద్‌కు పదోన్నతి? సీఐడీ డీజీగా పనిచేసి ఇటీవల రిటైరైన గోవింద్ సింగ్ స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్‌కు డీజీ ర్యాంకులో పదోన్నతి దక్కింది. అయితే ప్రభుత్వం ఎక్స్‌కేడర్ కోటా కింద ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించవచ్చు. అలా సీవీ ఆనంద్ అడిషనల్ డీజీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందుతారు. లేదంటే ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న మహేందర్‌రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌కు డీజీ హోదా దక్కే అవకాశముంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రవిగుప్తా పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అదనపు డీజీపీ ర్యాంకులో ఉన్న వారిని సైతం డీజీపీ పోస్టులో నియమించే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ (ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీ) సైతం డీజీపీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమేశ్ షరాఫ్ (1989), అంజనీకుమార్ (1990), రవిగుప్తా (1990), రాజీవ్ రతన్ (1991), సీవీ ఆనంద్ (1991) పేర్లు యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీకి పంపినట్టు సమాచారం. ఇందులోంచి కేంద్రం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తే వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నారు. లేదంటే ముందుగా ఒకరిని ఇంచార్జి డీజీపీగా నియమించి, తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: అదే జరిగితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోక తప్పదా?!) -
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
-
మెడికల్ లీవ్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డీజీపీ మహేందర్‌రెడ్డి ఈనెల 18 నుంచి వచ్చే నెల 4 వరకు మెడికల్ లీవ్‌లో వెళ్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఆయన స్థానంలో ఇన్చార్జి డీజీపీగా ఏసీబీ డీజీ అంజనీకుమార్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సెలవు నుంచి వచ్చిన తర్వాత మహేందర్‌రెడ్డి డీజీపీగా తిరిగి బాధత్యలు స్వీకరిస్తారని అందులో వివరించారు. -
తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రం చేస్తాం : డిజిపి మహేందర్ రెడ్డి
-
సీరియస్‌గా ఉన్న డీజీపీ, వారే టార్గెట్
సాక్షి,కొమరం భీం (ఆదిలాబాద్): అసిఫాబాద్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ నిర్వహించారు. కేబీఎమ్ కమిటీ కార్యదర్శి భాస్కర్ నేతృత్వంలోని మావోయిస్టులే టార్గెట్‌గా పోలీసులు దీనిని చేపట్టారు. ఇటీవలే రెండు సార్లు మావోయిస్ట్‌లు తప్పించుకోవడంపై డీజీపీ మహేందర్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో డీజీపీనే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థిని సమీక్షిస్తున్నారు. పోలీస్ బాస్ డీజీపీతో పాటు అధికారులు, ఇంటెలిజెన్స్ బృందాలు నాలుగురోజులుగా అసిఫాబాద్‌లోనే మకాం వేశారు. చదవండి: మావోయిస్టులను గట్టి దెబ్బ కొడతాం: డీజీపీ -
వారి రెసిడెన్స్ ప్రూఫ్ తప్పనిసరి: డీజీపీ
-
‘కరోనా వైరస్’ రహిత తెలంగాణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మార్చే ప్రక్రియలో భాగంగా పోలీసుశాఖ నడుం బిగించింది. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి వారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించేవరకు ప్రతీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం వైద్యారోగ్య, రెవెన్యూ, మున్సిపల్ ఇతర అన్ని శాఖల సాయం తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రతీ పోలీసుస్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. తమ తమ ఠాణాల పరిధిలో ‘కరోనా’వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే గుర్తించాలని, వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందకముందే క్వారంటైన్‌కు తరలించాలని సూ చించారు. ప్రతీ ఎస్‌హెచ్‌వో ఈ పనిని పూర్తి బాధ్యతతో చేపట్టాలన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు జాబితా! ఇందుకోసం ‘కరోనా వైరస్’పాజిటివ్ ఉన్న వారి జాబితాలను ఇప్పటికే ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు అందజేశారు. ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో ప్రతీ ఎస్‌హెచ్‌వో ఈ జాబితాను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. పాజిటివ్‌గా తేలిన వారి పరిసర ప్రాంతాల్లో వైద్య తనిఖీలు, పారిశుద్ధ్య కార్యక్రమా లు, వారెవరిని కలిశారో, ఎక్కడెక్కడ తిరిగారో వంటి వివరాలు తెలుసుకునేందుకు మున్సి పల్, రెవెన్యూ ఇతర శాఖల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రతీ పోలీస్‌తమ స్టేషన్ పరిధిలో కరోనా వైరస్ కేసులు లే కుండా చేయడం తద్వారా రాష్ట్రాన్ని కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేయాలని డీజీపీ స్పష్టం చేశారు. -
కరోనాపై పోలీస్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. అన్ని జిల్లాల కమిషనర్లు,ఎస్పీలతో గురువారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఒక్కరోజే 8 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టాలని.. సభలు, సమావేశాలు, వివాహాలకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. నేడు సాయంత్రం ముఖ్యమంత్రి భేటీలో పోలీస్‌శాఖ తీసుకున్న నిర్ణయాలను చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’) -
ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంతో వాహనాదారులు బెంబేలెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. ట్రాఫిక్ ఉల్లంఘనపై విధిస్తున్న జరిమానాలతో తమ వాహనాలను బయటికి తీయడానికి కూడా వాహనదారులు భయపడుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెలువడుతున్ననేపథ్యంలో తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశానుసారం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ఇకపై హెల్మెట్, బండి ఇన్సురెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసెన్స్ లేని వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు విధించకుండా వాటిని వారితోనే కొనిచ్చే ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు పేర్కొన్నారు. ఇది మంచి ప్రయత్నం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. -
తెలంగాణలో 5శాతం నేరాలు తగ్గాయి: డీజీపీ
-
‘దాడి జరిగింది.. భద్రత కల్పించండి’
-
‘దాడి జరిగింది.. భద్రత కల్పించండి’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలకు భద్రత కల్పించాలని మాజీ ఎంపీ మధుయాష్కీ డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. డిసెంబర్ 6న తనపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, మరోనేత గూడూరు నారాయణరెడ్డిపై కూడా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కొందరు టార్గెట్ చేశారని కౌంటింగ్ రోజున కూడా భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని వెంటనే గన్మెన్లను కేటాయించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ నేతలు విజయశాంతి, పొన్నం ప్రభాకర్, గూడూరు నారాయణ రెడ్డి, మధుయాష్కీలకు భద్రత కల్పించాలని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మహేందర్ రెడ్డి బాధ్యులపై చర్యలు తీసుకుని, వారికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. -
‘కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాతంగా జరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయను శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 35,500 పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో 4 గంటలకు పోలింగ్ ముగిసిందన్నారు. ఈవీఎంలన్నింటినీ భారీ భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లో పెడుతున్నామని చెప్పారు. ఎన్నికలకు మూడు నెలల ముందే తెలంగాణ పోలీసులు టీమ్ వర్క్ చేసినట్టు వెల్లడించారు. ఎన్నికల సంఘం నిబంధనలు ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. కౌటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతంగా పోలింగ్: సీపీ అంజనీ కుమార్ హైదరాబాద్‌లో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగినట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ... సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. చివరి గంట కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో.. దాన్ని దృష్టిలో పెట్టుకుని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులను అలర్ట్ చేశామని అన్నారు. నగరంలో లక్షకు పైగా కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షించినట్టు వెల్లడించారు. -
వచ్చేది టీఆర్ఎస్ సర్కారే
సాక్షి, బషీరాబాద్: గులాబీ గూటికి వలసలు కొనసాగుతున్నాయి. బషీరాబాద్ మండలంలో పలు గ్రామాలు, తండాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నిత్యం పార్టీలో చేరుతున్నారు. బుధవారం కాశీంపూర్, మల్కన్‌గిరి, కొర్విచెడ్, ఎక్మాయి గ్రామాలకు చెందిన వందల మంది యువకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి యువత స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన యువతకు మున్ముందు పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. యువకులు టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఇంటింటికి తిరిగి తెలియజేయాలని సూచించారు. ప్రతీ కార్యకర్త ఈనెల రోజులు సైనికుళ్ల పనిచేయాలని సూచించారు. యువతే టీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అని వాఖ్యానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, జిల్లా రైతుసమితి సభ్యుడు అజయ్‌ప్రసాద్, రైతు సమితి మండల కోఆర్డినేటర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ సెల్ మండల నాయకుడు బన్సీలాల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, వడ్డే హన్మంతు, రవిప్రసాద్, రియాజ్, తుకారం తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ హయాంలోనే గొల్ల, కురుమలకు ప్రాధాన్యం
సాక్షి, తాండూరు టౌన్: గొల్ల, కురుమ, యాదవులను ఆదుకున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఆ సంఘం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొల్లకురుమలు మంత్రికి గొంగడి కప్పి, గొర్రె పిల్లను బహూకరించారు. అనంతరం మహేందర్‌రెడ్డి డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న కుల వృత్తులను పరిరక్షించేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. ఉపాధి లేక వలస పోతున్న వారికి ఉన్న ఊర్లోనే ఉపాధి చూపించేందుకు పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని తెలిపారు. గొల్ల, కురుమలకు గొర్రెలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వంపై విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. గొర్రెలు, బర్రెలు ఇచ్చింది విద్యార్థులు వాటిని కాస్తూ బతకమని కాదన్నారు. వారి తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకే జీవాలు, పాడి గేదెలు అందజేశామని స్పష్టంచేశారు. రాజకీయంగా కూడా గొల్ల, కురుమలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, లింగయ్యయాదవ్‌ను రాజ్యసభకు పంపిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికీ మటన్, చేపలు వంటివి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీన్ని అరికట్టేందుకే మన రాష్ట్రంలోనే వీటిని పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి ఆర్థిక పుష్టి సాధించేందుకే సీఎం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారని తెలిపారు. ఇంకా గొర్రెలు దక్కని వారికి తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తాండూరులో గొల్ల, కురుమలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇప్పటికే ఎకరా స్థలంతో పాటు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశామన్నారు. నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయా కుల సంఘాల వారు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేసి ప్రొసీడింగ్స్ ఇస్తే.. వాటిని చిత్తు కాగితాలని చెబుతున్న కొందరు నేతల మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ముందుస్తు ఎన్నికలు రాకపోతే ఈ సమాయానికి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తయ్యేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలికి, కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నాగారం నర్సింలు, టీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్, సాయిలుగౌడ్, గౌడి వెంకటేశం, కోహిర్ శ్రీనివాస్, పూజారి పాండు, వెంకటయ్య, శకుంతల, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సునీతారెడ్డి ప్రచారం
సాక్షి, యాలాల: జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి మంగళవారం నుంచి.. మంత్రి మహేందర్‌రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. 20 రోజుల పాటు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు మండలాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న యాలాల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మొదటి రోజు రాస్నం, ముద్దాయిపేట్, దేవనూర్, గోరేపల్లి, తిమ్మాయిపల్లి, బండమీదిపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు. మొదటి విడత పర్యటన పూర్తయిన తర్వాత డ్వాక్రా మహిళలతో మండల స్థాయి బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మార్నింగ్ వాక్‌లతో గిరిజన తండాలను సందర్శిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తన పర్యటనల్లో భాగంగా వివిధ పార్టీల నుంచి బలమైన నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారని పార్టీ నాయకుడొకరు తెలిపారు. -
మీ దీవెనలే.. గెలిపిస్తున్నాయి
సాక్షి, తాండూరు టౌన్: అన్నివర్గాల ప్రజల నుంచి అందుతున్న దీవెనలే ఇన్నేళ్లుగా తనను విజయ తీరాలకు చేరుస్తున్నాయని, తాండూరు ప్రజలకు సేవ చేయడమే తన జీవిత ఆశయమని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక భవానీ ఫంక్షన్ హాల్లో ఆదివారం గౌడ, ఈడిగ, గీత కార్మికుల ఆధ్వర్యంలో మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, గౌడ కులానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ధ్యేయమని తెలిపారు. నాలుగేళ్ల తమ పాలనలో అన్ని మతాలు, కులాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. గీత కార్మికులకు పింఛన్ల మంజూరు, కల్లు దుకాణాల లైసెన్స్‌ల జారీ, సొసైటీ ఏర్పాటులో అండగా నిలిచిందని చెప్పారు. గౌడ కులస్తులను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తాండూరులో గౌడ్ల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గాను గతంలోనే 2 ఎకరాల భూమి ఇచ్చామన్నారు. భవన నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశామని స్పష్టంచేశారు. ఈ నిధులు సరిపోకపోతే జెడ్పీ, ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారనే విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు పింఛను, చెట్టు పన్ను మాఫీ తదితర సహకారాలు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. ప్రజల దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ నేత విశ్వనాథ్‌గౌడ్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో గౌడ కులస్తులకు ఏనాడూ కాంగ్రెస్ పార్టీ గజం స్థలం ఇవ్వలేదని, ఆర్థికంగా ఆదుకున్న దాఖలాలు కూడా లేవని విమర్శించారు. అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్ మాట్లాడుతూ.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే గౌడ్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి చేయూతనివ్వాలని కోరారు. అలాగే ఎక్సైజ్ దాడులను, బెల్టు షాపులను అరికట్టాలన్నారు. అంతకు ముందు పట్టణంలో గౌడ కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యాద కృష్ణమూర్తి, కరణం పురుషోత్తంరావు, నారాయణరెడ్డి, రాందాసు, రవిగౌడ్, సాయిలుగౌడ్, హరిగౌడ్, నారాయణగౌడ్, సంతోష్‌గౌడ్, వరప్రసాద్‌గౌడ్, రాకేష్‌గౌడ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికం
మొయినాబాద్: కాంగ్రెస్ 48 ఏళ్లు, టీడీపీ 15 ఏళ్లు పాలించి తెలంగాణకు ఏం ఒరగబెట్టాయని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని పూర్తిగా ముంచేందుకు ఒక్కటయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికమన్నారు. మొయినాబాద్‌లో శనివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రోడ్ షో నిర్వహించారు. మొయినాబాద్‌లో పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం మహమూద్ అలీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లో టీడీపీ అడ్డుకుందని.. అలాంటి పార్టీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని తెలిపారు. పథకాలే గెలిపిస్తాయి: రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను మళ్లీ గెలిపిస్తాయని ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లలో అనేక మందికి అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఐటీ శాఖ ద్వారా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో ఐటీ పరిశ్రమలు వస్తుండడంతో యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. మరోసారి టీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి కాలె యాదయ్యను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు యాదయ్య, పెంటయ్య, నాయకులు సిద్దయ్య, నర్సింహ్మరెడ్డి, శ్రీహరి, రవూఫ్, భీమేందర్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, శ్రీనివాస్, జయవంత్, బాల్‌రాజ్, మల్లేశ్, ఆంజనేయులు, కృష్ణ, సత్తిరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు. -
ప్రగతికి పరుగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాలుగున్నరేళ్ల ‘ప్రగతి నివేదన’కు సభాస్థలి సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల సమరానికి వేదికగా భావిస్తున్న ఈ సభను గులాబీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసిన మరుక్షణం నుంచే సభా ప్రాంగణం ఆగమేఘాల మీద రూపుదిద్దుకుంటోంది. టీఆర్ఎస్ నాయకగణం కొంగరకలాన్‌లోనే తిష్టవేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడ పర్యటించిన సీఎం కేసీఆర్.. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి నలువైపులా కనీసం 20 మార్గాలు ఉండాలని సూచించారు. దీంతో శనివారం సభాస్థలికి నలుదిక్కులా ఉన్న లింకురోడ్లను పరిశీలించి మార్గాల అభివృద్ధిపై మంత్రి మహేందర్‌రెడ్డి బృందం మార్గనిర్దేశం చేసింది. మరోవైపు ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి కొంగరకలాన్‌కు వెళ్లే ఇరుకైన మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన రెండు వరుసల రహదారిగా విస్తరించే పనులు చేపట్టారు. ఇంకోవైపు సభా ఆవరణను పూర్తిగా చదును చేశారు. వందలాది జేసీబీ, హిటాచీలు, డోజర్లను వినియోగిస్తూ 1600 ఎకరాలను మైదానంగా తీర్చిదిద్దుతున్నారు. రూట్ మ్యాప్‌పై కమిషనర్ కసరత్తు సభాస్థలిని శనివారం రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సందర్శించారు. సభకు అనుసంధానం చేసే మార్గాలపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు సాధ్యమైనంత త్వరగా బహిరంగ సభకు చేరుకోవడం.. సభ పూర్తయ్యాక అదేస్థాయిలో నిష్క్రమించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడంతో కొత్త రోడ్ల అభివృద్ధిపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో చర్చించారు. 25 లక్షల మంది రానున్నందున భద్రతాలోపాలు తలెత్తకుండా ఆదివారం నుంచే ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచే తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వేదిక వెనకభాగంలో హెలిపాడ్, వీఐపీలకు ప్రత్యేక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. లక్షలాదిగా తరలివచ్చే వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి అనుగుణంగా ప్రైవేటు భూములను కూడా వినియోగించుకుంటోంది. ఈ మేరకు తాత్కాలికంగా రోడ్లు, పార్కింగ్ కోసం గుర్తించిన భూముల రైతుల సమ్మతి తీసుకుంటోంది. నష్టపరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. నేతల హడావుడి.. ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి అధికార పార్టీ నేతల తాకిడి పెరిగిపోయింది. పనులను పర్యవేక్షించేది కొందరైతే.. హడావుడి చేసి ముఖ్యనాయకుల చూపులో పడేందుకు మరికొందరు ప్రయత్నిస్తుండడంతో సభాస్థలి వద్ద సందడి నెలకొంది. కొందరు నేతలు ఏకంగా మందీమార్బలంతో హంగామా సృష్టిస్తుండడం కనిపించింది. కాగా, శనివారం పర్యటించిన వారిలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, చల్లా మాధవరెడ్డి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పార్కింగ్ కోసం 900 ఎకరాలు ఇబ్రహీంపట్నంరూరల్: సభకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే ప్రతినిధులకు అనువుగా ఉండేలా పార్కింగ్ స్థలాలను శనివారం గుర్తించారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. 9 పార్కింగ్ స్థలాలకు గాను 900 ఎకరాల భూమి సరిపోతుందని వెల్లడించారు. 20 వేల బస్సులు, 50 వేల ఫోర్ వీలర్స్ వాహనాలను నిలిపేలా స్థలాలు కేటాయించారు. రాచకొండ సీపీ మహేష్బాగవత్, జాయింట్ సీపీ, డీసీపీ ప్రకాష్‌రెడ్డిలు కలిసి ఎమ్మెల్సీ శంభీపూరి రాజుతో చర్చించారు. 12 అప్రోచ్ రోడ్ల నిర్మాణం .. సభకు ఇరువైపులా 12 రోడ్లు ఉంటే సులభంగా ఎక్కడి వారు అక్కడికి చేరుకునేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలికి ఇప్పటికే నాలుగు రోడ్లు ఉన్నాయి. మెయిన్‌రోడ్డు నుంచి కొంగరకలాన్ వరకు ఉన్న రోడ్డును డబుల్ రోడ్డు చేస్తున్నారు. శ్రీశైలం హైవే ప్యాబ్‌సీటీ నుంచి మరో రోడ్డు వేయనున్నారు. ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి మరో రెండు రోడ్లు, హెలిపాడ్ వరకు ఒక రోడ్డు వేయాలని నాయకులు సూచించారు. కలెక్టరేట్ ముందు నుంచి కొంగరకలాన్ తండా వరకు రోడ్డు వేయాలని మంత్రులు సూచించారు. కలెక్టరేట్ 100 ఫీట్ల రోడ్డు నుంచి నేరుగా ఔటర్ రింగ్‌రోడ్డును కలుపుతూ 200 ఫీట్లతో మరో పెద్ద రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించారు. చెట్లు తీసి మరో చోట నాటి.. సభ స్థలంలో ఇబ్బందికరంగా ఉన్న వేప చెట్లను నరికి వేయకుండా వేర్లతో పాటు తవ్వి టీఎస్ఐఐసీ భూముల్లో పాతాలని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సిబ్బందిని అదేశించారు. దీంతో చెట్లను తొలగించి ఇతర ప్రాంతాల్లో నాటుతున్నారు. -
డీజీపీ టు ఇన్స్పెక్టర్స్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ చరిత్రలో మొదటిసారి డీజీపీ మహేందర్‌రెడ్డి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఒకేసారి రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, డీఎస్పీ/ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలు, కమిషనర్లతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన టెక్నాలజీతో ఒకేసారి 1,000 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే టీఎస్‌కాప్ ఆన్లైన్ ద్వారా డీజీపీ అధికారులతో సమీక్షించారు. పోలీస్‌శాఖ ప్రవేశపెట్టిన ఏకరూప పోలీసింగ్‌లో టెక్నాలజీ పరంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలు, వాటి నిర్వహణ, అమలులో వస్తున్న సమస్యలు తదితరాలపై సుమారు 700 మంది అధికారులతో డీజీపీ ఆరా తీశారు. అలాగే స్టేషన్ నిర్వహణలో అమలు చేస్తున్న వర్టికల్ విధానాలపై ప్రతీ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ అధికారి, సిబ్బంది వారివారి విధులను పని ఒత్తిడి లేకుండా నిర్వహించేందుకు వర్టికల్ విధానం ఉపయోగపడుతుందని, వర్టికల్ విధానం అమల్లో సబ్ఇన్స్పెక్టర్ నుంచి ఎస్పీ వరకు ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. యాప్స్ పనితీరు, ప్రజలకు ఎంత సేపట్లో సేవలందుతున్నాయి.. సేవల జాప్యంలో కారణాలేంటన్న విషయాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలలేమిపై దృష్టికి తీసుకురండి.. స్టేషన్లలో సౌకర్యాలలేమి, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలియజేసి పరిష్కరించుకోవాలని డీజీపీ పోలీస్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటుతో ప్రజలకు మెరుగైన సేవలందించడంలో వెనుకాడొద్దని దిశానిర్దేశం చేశారు. స్టేషన్లలో కేసుల దర్యాప్తులో సాంకేతికతను ఉపయోగించుకొని చేధించాలని, పెండింగ్ కేసులపై మానిటరింగ్ అధికారులైన ఏసీపీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలి ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో అవి కీలకపాత్ర పోషిస్తాయని డీజీపీ చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కాలనీ అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర రంగాల వారితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. -
ఆర్టీసీకి జవసత్వాలు: మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారవాణాకు గుండెకాయలా ఉన్న టీఎస్ఆర్టీసీకి జవసత్వాలు కల్పించేందుకే నిపుణుల కమిటీని వేసినట్లు రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడి బస్‌భవన్‌లో మంత్రి అధ్యక్షతన నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. సమాశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, నిపుణుల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సంస్థలోని లోపాల అధ్యయనానికి, సమూల మార్పులకు, లాభాలబాట పట్టించేందుకు కమిటీ పలు సూచనలు చేస్తుందని పేర్కొన్నారు. నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన ఆర్టీసీని బలోపేతం చేయడం, కాలానుగుణం గా మార్పులు చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం తదితర విషయాల్లో చేపట్టాల్సిన సంస్కరణల గురించి కమిటీ సిఫారసు చేస్తుందని చెప్పారు. త్వరలోనే కమిటీ సభ్యులు సీఎంను కలవనున్నట్లు తెలిపారు. చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థను రుణభారం నుంచి గట్టెక్కించేందుకే కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు. సునీల్‌శర్మ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్లో సింగిల్ టికెట్ విధానంతో మెట్రో– ఆర్టీసీని అనుసంధానించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నామన్నారు. సంస్థ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ కార్మికుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కమిటీ సభ్యులు ఏమన్నారంటే..? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు సురక్షితమైన రవాణాను కోరుకుంటున్నారని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆధునిక, ఆకర్షణీయమైన బస్సులను నడపాలన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో డిమాం డ్కు సరిపడా బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సురక్షిత ప్రయాణమంటే ఆర్టీసీ అనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికీ ఉన్నందున దాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజలు అధిక చార్జీలు వెచ్చించి ఆటోలు, క్యాబ్‌ల్లో రక్షణ లేని ప్రయాణం చేస్తున్నారని వాపోయారు. ప్రైవేటు రంగ పోటీని తట్టుకునేందుకు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. -
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఇరిగేషన్, అగ్నిమాపక శాఖ, ఇతర విభాగాలతో సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. అవసరమైనచోట గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందివ్వాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ముందుగానే అక్కడి నుంచి ప్రజలను తరలించే ప్రయత్నం చేయాలన్నారు. -
కేరళ ప్రజలకు అండగా రాష్ట్ర మంత్రులు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చారు. తమ వంతు సహాయంగా నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి ప్రకటించారు. నెల జీతాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా పంపనున్నట్లు మంత్రులు తెలిపారు. పెన్షనర్లు సైతం... కేరళ బాధితులకు తమ వంతు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి ముందుకు వచ్చింది. రాష్ట్రంలోని 2.56 లక్షల మంది పెన్షర్లు ప్రతి ఒక్కరు రూ.100 చోప్పున కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి అధ్యక్షుడు రమణాచారి ఒక ప్రకటనలో తెలిపారు. -
అన్నపూర్ణగా తెలంగాణ
శంకర్పల్లి (రంగారెడ్డి): రానున్న రోజుల్లో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగపురంలో ఆదివారం రైతులకు బీమా బాండ్లను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రూ.17వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. 65 ఏళ్లు పాలించిన నేతలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 4 ఏళ్లలో సాధించి చూపించామని అన్నారు. త్వరలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించలేదని, మన రాష్ట్రంలో మాత్రం రూ.12 వేల కోట్లు రైతు సంక్షేమం కోసం కేటాయించినట్లు వివరించారు. సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు. గతంలో రైతులు వ్యవసాయం చేస్తే ఆర్థికంగా చితికిపోవడమే తప్పా లాభం ఉండేది కాదని, నేడు రైతులు పండించిన పంటలను సర్కారు మద్దతు ధరకు మార్కెట్లో కొనుగోలు చేస్తోందని తెలిపారు. దీంతోపాటు పెట్టుబడికి అవసరమైన డబ్బులను ప్రభుత్వమే భరిస్తూ ఎకరాకు రూ.4వేల చొప్పున అందిస్తోందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 60 కోట్లు ఉండగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర బడ్జెట్ రూ. లక్ష 74 వేల కోట్లకు చేరుకుందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రకటించారని తెలిపారు. గతంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేటు సాధించిందన్నారు. భూరికార్డుల ప్రక్షాళనతో ఎవరి భూమి ఎంత ఉందోననే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని, తద్వారా రైతులందరికీ మేలు కలిగిందన్నారు. రాబోయే రైతులు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో సమస్యలు పరిష్కారయ్యే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కయిన రైతు ప్రమాదవశాత్తు మృతిచెందితే కుటుంబానికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుభీమా పథకాన్ని రూపొందించిందన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా రైతుల మేలుకోసమేనన్నారు. రంగారెడ్డి జిల్లాలో లక్షా 23 వేల మందికి, చేవెళ్ల నియోజకర్గంలో 35,601మంది రైతులకు బీమా బాండ్లు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ప్రవీణ్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు గోవిందమ్మగోపాల్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, ఆశోక్‌కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గోపాల్, వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు నీటి కష్టాలు దూరం
కొడంగల్ (రంగారెడ్డి): మహిళల కన్నీటి కష్టాలను దూరం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ శివారులోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో మిషన్ భగీరథ ట్రయల్ రన్‌ను ఆయన అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని అన్నారు. 283 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా జలాలను కొడంగల్‌కు రప్పించి ప్రజలకు సరఫరా చేస్తామని చెప్పారు. మిషన్ భగీరథలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.2 వేల కోట్లు, కొడంగల్‌కు రూ.267 కోట్లు ఖర్చుచేసి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేసి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రత్యేకంగా ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో అమలుచేయని విధంగా కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. మహిళలు తాగునీటి కోసం పొలాల దగ్గరకు వెళ్లకుండా తమ ఇంట్లోనే ధీమాగా కుళాయి వద్ద నీళ్లను పట్టుకోవచ్చని చెప్పారు. ఈనెల 13న కొడంగల్ మురహరి ఫంక్షన్ హాల్లో రైతులకు ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల తర్వాత రెండో విడత రైతు బంధు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పంద్రాగస్టు నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేస్తారని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 229 టీమ్‌లు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మాజీ జెడ్పీటీసీలు ఏన్గుల భాస్కర్, కృష్ణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోడల రాంరెడ్డి, మండల రైతు సమాఖ్య అధ్యక్షుడు వన్నె బస్వరాజ్, మధుయాదవ్, మోహన్‌రెడ్డి, ప్రహ్లాద్‌రావు, మహిపాల్ ఉన్నారు. -
కదిలించిన ‘సాక్షి’ కథనం
తాండూరు : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు తక్షణమే రూ.20 లక్షలు మంజూరు చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ‘మంత్రి ఇలాఖా.. కాలేజీ ఇలాగా?’శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించారు. బుధవారంరాత్రి తాండూరులో బస చేసిన మంత్రి గురువారం ఉదయం నియోజకవర్గంలోని 12 గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ‘సాక్షి’ కథనాన్ని చూసి స్పందించారు. పంచాయతీల ప్రారంభోత్సవాలను వాయిదా వేసుకుని వెంటనే తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. అప్పటికే మున్సిపల్ చైర్పర్సన్ సునీతాసంపత్, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బెంచీలను పక్షం రోజుల్లో సమకూరుస్తామని, అందుకోసం రూ.20 లక్షలను వెంటనే మంజూరు చేస్తామని అన్నారు. అదనపు తరగతి గదులను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ‘సాక్షి’కథనం విద్యార్థుల సమస్యకు దర్పణం పట్టిందన్నారు. నూతన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలున్నా ‘సాక్షి’కథనం చూడగానే మధ్యలోనే వెనుదిరిగి ఇక్కడికి వచ్చానని చెప్పారు. విడతలవారీగా కళాశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. -
మంత్రి ఇలాఖా.. కాలేజీ ఇలాగా?
తాండూరు: అది మంత్రి ఇలాఖా. అక్కడ ఓ జూనియర్ కాలేజీ ఉంది. 1950లో ఏర్పాటైన ఆ కళాశాల దినదిన ప్రవర్థమానమై రెండు వేలకుపైగా విద్యార్థులతో కళకళలాడుతోంది. ఇక్కడ 25 మంది అధ్యాపకులు ఉన్నారు. వారిలో ఒక్కరే ప్రభుత్వ అధ్యాపకుడు. మిగతావారంతా కాంట్రాక్ట్ లెక్చరర్లే. బెంచీలు సరిపడా లేక చాలా మంది కింద కూర్చొనే పాఠాలు వింటున్నారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు కిక్కిరిసిపోతున్నారు. ఇదీ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని జూనియర్ కళాశాల దుస్థితి. వికారాబాద్ జిల్లాలోని తాండూరు కాలేజీలో 2,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో సెక్షన్లో 180 మంది విద్యార్థులున్నారు. వీరికి సరిపడా తరగతి గదులూ, బెంచీలూ లేవు. కింద కూర్చున్న వారికి బోర్డు కనిపించకపోవడంతో అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థం కావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా జూనియర్ కళాశాల విద్యకు గ్రహణం వీడలేదు. ప్రభుత్వ కళాశాలలను మరింత బలోపేతం చేశామని అధికారులు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. గుణాత్మక విద్య అందడం లేదు. కాలేజీ దుస్థితిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మిషన్ భగీరథ దేశానికే ఆదర్శం
పరిగి: మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని జాపర్‌పల్లిలో నిర్మించిన మెయిన్ గ్రిడ్ ట్రయల్ రన్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. అంతకుముందు గ్రామంలోని అంబేడ్కర్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జాపర్‌పల్లి నుంచి తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు రూ,1,100 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆనందం వ్యక్తంచేశారు. త్వరలోనే ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతుందని స్పష్టంచేశారు. మహిళల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా అనేక పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి తిరుగులేదని తెలిపారు. ఆయనతో పాటు రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొప్పుల మహేశ్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. మానవ హక్కుల సంఘం కృషి అభినందనీయం... తాండూరు: హక్కుల పరిరక్షణకు.. మానవ హక్కుల సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరులోని సమద్ ఫంక్షన్హాల్లో ఆదివారం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఫోరం ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కుల సంఘం ఏర్పాటుచేసి ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. పౌర హక్కులకు భంగం కలిగితే మానవ హక్కుల సంఘాలు కాపాడతాయన్నారు. ప్రజలు సేవాభావాలను అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అంతర్జాతీయ పీస్ అంబాసిడర్ ఎం.ఎ.నజీబ్ మాట్లాడుతూ.. దేశంలో కులమతాలకతీతంగా మెలిగినప్పుడే శాంతి స్థాపన సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ సునీత, అసోషియేషన్ చైర్మన్ ఎం.ఎ.ముజీబ్ పటేల్, హైకోర్టు న్యాయవాది కదర్‌ఉన్నీసా, వెల్ఫేర్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు గులాం ముస్తఫా పటేల్, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ జుబేర్‌లాల, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్, మాజీ కౌన్సిలర్ ముక్తర్ తదితరులు ఉన్నారు. -
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం
సాక్షి, వికారాబాద్: అక్రమ మైనింగ్‌కు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపాలని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన చాంబర్లో శనివారం ఆయన జిల్లా అధికారులతో మైనింగ్, మినరల్స్, హరితహారం తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి తదితరాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నవాబుపేట, ధారూరు, యాలాల, బషీరాబాద్, పరిగి తదితర మండలాల్లో ఇసుక, ఇతర మైనింగ్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. అక్రమార్కులతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా రోడ్లు దెబ్బతింటున్నాయని మంత్రి చెప్పారు. అక్రమ మైనింగ్, రవాణా విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించరాదని సూచించారు. అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్‌తో పర్యావరణ సమత్యులం దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిట్ల గడువు పూర్తయినా ఇంకా కొందరు అక్రమంగా గనులను తవ్వడం, ఒకచోట పర్మిట్లు తీసుకొని మరోచోట తవ్వకాలు చేపట్టడం వంటివి చేస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్మిట్ తీసుకున్న విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలను నిర్వస్తున్న వారిపై నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో గనుల ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 150 కిలోమీటర్ల మేర రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిని నాణ్యతా ప్రమాణాలతో బాగు చేయాలంటే రూ.35 కోట్లు అవసరమవుతాయన్నారు. జిల్లాలో మైనింగ్‌పై ఏటా ప్రభుత్వానికి రూ.47.81 కోట్ల ఆదాయం వస్తుందని, ఇందులో మైనింగ్ ప్రభావిత గ్రామాలకు 30 శాతంమేర నిధులను అందించనున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. గనుల ప్రభావిత ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ ప్రాంతాల్లో రెండేసి చొప్పున ఆరు డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను అందించాలని సూచించారు. జిల్లాలో 125 మైనింగ్ లైసెన్సులు రెన్యూవల్ దశలో ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. మైనింగ్ నిధులతో జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ స్థలంలో రూ.2.5 కోట్ల వ్యయంతో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆడిటోరియం నిర్మించే ప్రతిపాదనలకు మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వానికి వచ్చే మైనింగ్ ఆదాయాన్ని అన్ని ప్రాంతాలకు ఇవ్వాలని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న బయో మరుగుదొడ్లు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయన్నారు. వీటి స్థానంలో సాధారణ మరుగొదొడ్లను నిర్మించేందుకు అనుమతించాలని సూచించారు. కలెక్టర్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. మైనింగ్‌కు సంబంధించి ఇప్పటికే 40 ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు జీపీఎస్‌తో అనుసంధానం చేశామని తెలిపారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు సంజీవరావు, రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, జేసీ అరుణకుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జాన్సన్, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం
బషీరాబాద్(తాండూరు) : తెలంగాణ సీఎంగా మరో ఇరవై ఏళ్ల పాటు కేసీఆరే ఉంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతుబంధు పథకం కొనసాగుతుందని చెప్పారు. కలెక్టర్ ఉమర్ జలీల్‌తో కలిసి వికారాబాద్ జిల్లాలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నవల్గ, పర్వత్‌పల్లి, నావంద్గి గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులు, పాసుపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. ఏడాదికి రెండు సార్లు చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నుంచి రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే జీవిత బీమా ప్రీమియం చెల్లిస్తుందని ప్రకటించారు. దీనిద్వారా అకాల మరణం పొందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుందని చెప్పారు. వ్యవసాయానికి అవసరమైన ప్రధాన వనరులు.. సాగునీరు, విద్యుత్తు, పెట్టుబడి సాయాన్ని సీఎం సమకూరుస్తారని చెప్పారు. కష్టపడి పనిచేసి పైకి రావాలని రైతులకు పిలుపునిచన్చారు. వ్యవసాయ రంగాన్ని దేశానికే ఆదర్శంగా చేయబోతున్నామని అన్నారు. నవల్గలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి ని ఎడ్ల బండిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అతిపెద్ద పథకం... కలెక్టర్ జలీల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రైతుబంధు అతి పెద్దదన్నారు. రైతులు సీఎంకు అండగా నిలువాలని సూచించారు. చెక్కులు వచ్చి పాసు పుస్తకాలు రాని రైతులు పాత పుస్తకాలపై తహసీల్దార్ సంతకం తీసుకొని బ్యాంకుకు వెళితే చెక్కులు డ్రా అవుతాయని వివరించారు. నవల్గ పర్యటనకు వచ్చిన మంత్రికి రైతులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామ మాజీ సర్పంచ్ నర్సిములు, రైతు సమన్వయ సమితి సభ్యులు మంత్రిని ఎడ్లబండిపై సమావేశం వరకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కరణం పురుషోత్తంరావు, ఎంపీపీ కరుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కళావతి, పీఎసీఎస్ చైర్మన్ అనంత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, మండల ప్రత్యేక అధికారి జాకబ్, తహసీల్దార్ వెంకటయ్య, సర్పంచులు పల్లె వీరేశం, మాణిక్యమ్మ, జయమ్మ, ఎంపీటీసీ నరేష్ చౌహన్, జిల్లా రైతుసమితి సభ్యుడు అజయ్‌ప్రసాద్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, పీఎసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, నవల్గ మాజీ సర్పంచ్ డి.నర్సిములు, గ్రామ కోఆర్డినేటర్లు మాధవి, పద్మ, రవిప్రసాద్, టీఆర్ఎస్ కార్యదర్శి అబ్దుల్ రజాక్, యువజన నాయకులు రియాజ్, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ రాజురెడ్డి, వీఆర్ఓలు రాఘవేందర్‌రెడ్డి, అనిల్, ఏఈ కృష్ణ, ఏఈఓ పవన్ పాల్గొన్నారు. -
అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
మొయినాబాద్(చేవెళ్ల) : గ్రామాల అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు వందశాతం అందించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 4 గ్రామాల్లో అమలు చేసిన కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా మొయినాబాద్ మండలం చిలుకూరు మహిళా ప్రాంగణం ఆవరణలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. పొగలేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం వంటగ్యాస్ కనెక్షన్ ఇస్తుందన్నారు. రేషన్ కార్డులతో సంబందం లేకుండా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు. గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం కింద జిల్లాలోని నాగిరెడ్డిగూడ, గోపులారం, ముకునూర్, లింగారావుపల్లి గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో వంటగ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు, ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీ చేయడంతోపాటు ప్రతి ఇంటికి ఎల్ఈడీ బల్బులు అందజేసినట్టు చెప్పారు. నాలుగు గ్రామాల్లోనే కాకుండా త్వరలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో మహిళలు భాగస్వాములు కావాలన్నారు. మహిళా సంఘాలకు రూ.21.46 కోట్ల బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు అందజేస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ యువకులకు ఉపాధి కోసం రుణాలు ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మొయినాబాద్ మండలంలోని 6 మంది రైతులకు ట్రాక్టర్లు, ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఉపాధి కోసం కార్లు, ఇతర సామగ్రి అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యా దయ్య, స్థానిక సర్పంచ్ గున్నాల సంగీత, జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, ఎంపీపీ అనిత, వైస్‌ఎంపీపీ పద్మమ్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పాటి జగన్మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, జెడ్పీ సీఈఓ రాజేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ ప్రశాంత్‌కుమార్, ఏపీడీ ఉమారాణి, ఎంపీడీఓ సుభాషిణి, తహసీల్దార్ నాగయ్య, ఎంపీటీసీ పెంటయ్య, సర్పంచ్‌లు కలిశెట్టి సంధ్య, మల్లేష్‌యాదవ్, సుధాకర్‌యాదవ్, బాలమణి, ఉపసర్పంచ్ నర్సింహగౌడ్, నాయకులు సంగెరి మల్లేష్, శ్రీహరి, గున్నాల గోపాల్‌రెడ్డి, బాల్‌రాజ్, జయవంత్ పాల్గొన్నారు. -
రాష్ట్ర డీజీపీగా ఎం.మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమర్థుడిగా పేరు పొందిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పోలీస్ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. -
వీడనున్న ‘తోహాస్’ అక్రమాల గుట్టు
సాక్షి, హైదరాబాద్ : ట్రక్ పార్కింగ్‌కు కేటాయించిన స్థలాన్ని తప్పుడు పత్రాలతో ప్రైవేటు గోదాములకు లీజుకిచ్చిన వ్యవహారంలో ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దర్జాగా ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటుపరం చేసేందుకు దాని నిర్వాహకులే బరితెగించినా చూసీచూడనట్టు పోయిన రవాణాశాఖ అధికారులు దానిపై కేసు నమోదుకు సిద్ధపడ్డారు. కేసు నమోదుకు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం రవాణా మంత్రి సమీక్ష నిర్వహించారు. గత కాం గ్రెస్ ప్రభుత్వం పెద్ద అంబర్‌పేటలోని హెచ్ ఎండీఏ స్థలాన్ని ట్రక్ పార్కింగ్ కోసం రవాణాశాఖకు కేటాయించింది. దీన్ని ‘ట్రక్ ఆపరేటర్స్ హైవే ఎమినిటీస్ సొసైటీ(తోహాస్)’ పేరుతో నిర్వహిస్తున్నారు. దీన్ని నేరుగా రవాణాశాఖ కాకుండా తోహాసే పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహణ బాధ్యతలు చూసే ఓ కీలక వ్యక్తి తప్పుడుపత్రాలతో ఆ స్థలంలో ప్రైవేటు గోదాముల ఏర్పాటుకు తెరతీశాడు. దీని వెనక పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. అది ప్రభుత్వ భూమి అయినందున అధికారుల నిఘా కచ్చితంగా ఉండాలి. దీనిపై ఫిర్యాదుల వచ్చినా సకాలంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. -
నేడో రేపో ఐపీఎస్‌ల బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమై నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ నగర కమిషనర్ సహా ఇతర కీలక స్థానాల్లో బదిలీలుంటాయని తెలిపాయి. మహేందర్‌రెడ్డి డీజీపీగా నియమితులవడంతో గత నవంబర్ నుంచి నగర కమిషనర్ బాధ్యతలను అదనపు కమిషనర్ శ్రీనివాస్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానంలో పోలీసు అకాడమీ డైరెక్టర్ జితేందర్‌ను నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అదే పోస్టుకు అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్న అంజనీకుమార్‌ను సీఐడీ అదనపు డీజీపీగా, అదనపు కమిషనర్ స్వాతి లక్రాను సైబరాబాద్ కమిషనర్‌గా, హోంశాఖ కార్యదర్శిగా గోపికృష్ణ లేదా గోవింద్‌సింగ్‌ను, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యాను నియమించే అవకాశం ఉందని తెలిసింది. జిల్లాల ఎస్పీలనూ పూర్తిస్థాయిలో మార్చనున్నట్లు తెలిసింది. వరంగల్ కమిషనర్ సుధీర్‌బాబును హైదరాబాద్ రేంజ్ డీఐజీగా బదిలీ చేస్తారని, ఆ స్థానంలో రవివర్మ లేదా ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీందర్‌ను నియమిస్తారని సమాచారం. రీజియన్ ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రలనూ కీలక విభాగాలకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శాంతి భద్రతల అదనపు సీపీగా పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డిని, హౌజింగ్ ఎండీగా అదనపు డీజీపీ సంతోష్‌మెహ్రాను, డీఎస్ చౌహాన్‌ను వరంగల్ కమిషనర్‌గా, అనిల్‌ను నార్త్‌జోన్ ఐజీగా నియమించనున్నట్లు సమాచారం. శాంతి భద్రతల అదనపు డీజీపీ పోస్టులో ఐజీ ర్యాంకు అధికారిని నియమించనున్నారు. జాబితా కొలిక్కి వచ్చిందని, 49 మంది అధికారులతో కూడిన బదిలీ జాబితా 2 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
ట్రాఫిక్ కమాండ్ & కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ సాంకేతికమయం అవుతోంది. టెక్నాలజీ సహాయంతో నేరాలను నిరోధించడానికి, కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప పోలీసింగ్ అమలు చేయాలని నిర్ణయించామని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాలు, పోలీసు కమిషనరేట్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లను ఆయన బుధవారం ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ ‘బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ఆధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి దీని నిర్మాణం పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, కమిషనరేట్లను అనుసంధానించి సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని చెప్పారు. ‘హైదరాబాద్ కమిషనరేట్‌లో ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఏర్పాటు చేశాం. తొలుత ఇక్కడ అమలులోకి తీసుకువచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేస్తాం. లోపాలు బయటపడితే వాటిని సరిచేసి ఐసీసీసీ అందుబాటులోకి వచ్చేనాటికి పక్కాగా రూపొందిస్తాం’అని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేయడానికి టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లోని పోలీసులకు శిక్షణ ఇచ్చే బాధ్యతల్ని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు అప్పగిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని శాంతిభద్రతలకు నిలయంగా మార్చి పెట్టుబడులకు కేంద్రాన్ని చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఈ అంశంలో 1.66 లక్షల కెమెరాలను ఏర్పాటు చేయించిన హైదరాబాద్ కమిషనరేటే మిగిలిన వాటికి ఆదర్శం’అని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్చార్జి పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావుతోపాటు మూడు కమిషనరేట్ల అధికారులు పాల్గొన్నారు. -
సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు
సాక్షి, హైదరాబాద్: జంపన్న లాగే మిగతా మావోయిస్టు నేతలు కూడా లొంగిపోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్న, ఆయన భార్య రజితను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులతో సైద్ధాంతికంగా విభేదించి జంపన్న దంపతులు లొంగిపోయారని చెప్పారు. జంపన్న అసలు పేరు జినుగు నరసింహారెడ్డి అని, మహబూబ్‌నగర్ జిల్లా తొర్రూర్ మండలం చర్లపాలెం ఆయన స్వస్థలమని డీజీపీ వెల్లడించారు. 1984లో మల్లేపల్లిలో ఐటీఐ చదివేటప్పుడు మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఉద్యమంలోకి వెళ్లారని చెప్పారు. 33 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశారని, అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారని వివరించారు. జంపన్నపై 100 కేసులు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలోనే 51 కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మారుతున్న సామాజిక మార్పులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ మారడం లేదు కాబట్టి ఉద్యమం నుంచి జంపన్న బయటకు వచ్చారన్నారు. జంపన్న భార్య రజిత వరంగల్ గ్రామీణం జిల్లా వాసి అని, 2009లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ.5 లక్షలు రివార్డు ఉందని.. ఈ మొత్తాన్ని వీరిద్దరికీ ఇస్తేస్తామన్నారు. జంపన్న, రజిత జనజీవన సవ్రంతిలో కలిసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. సైద్ధాంతికంగా విభేదించి లొంగిపోయారు -
మీ భద్రత చర్యలు భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేపట్టిన భద్రత చర్యలు భేష్ అని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా కితాబిచ్చారు. సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన కేథరిన్.. సదస్సు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వం తరఫున ఓవైపు చార్మినార్, మరోవైపు యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉన్న మెమెంటోను ప్రదానం చేశారు. భేటీలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్, కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు. -
మీ భద్రత చర్యలు భేష్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేపట్టిన భద్రత చర్యలు భేష్ అని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా కితాబిచ్చారు. సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన కేథరిన్.. సదస్సు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వం తరఫున ఓవైపు చార్మినార్, మరోవైపు యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉన్న మెమెంటోను ప్రదానం చేశారు. భేటీలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, పీఅండ్ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్, కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు. -
ఉట్నూర్ ఘటనపై సీఎంకు డీజీపీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, హస్నాపూర్‌లలో ఆదివాసీలు, లంబాడీల మధ్య జరిగిన ఘర్షణకు కారణాలు, తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. శనివారం తన చాంబర్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన డీజీపీ... దాడుల ఘటనకు కారకులైన, ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులపై కేసుల నమోదు తదితర అంశాల గురించి అదనపు డీజీపీ అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్చంద్లతో చర్చించారు. అలాగే నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, ప్రత్యేక పర్యవేక్షకులుగా వెళ్లిన చౌహాన్, అనిల్‌కుమార్, కరీంనగర్ రేంజ్ డీఐజీ, ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాసులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడమే ఘర్షణకు ప్రధాన కారణమని జిల్లా ఎస్పీతోపాటు ఉన్నతాధికారులు డీజీపీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులు, వాటి నియంత్రణకు తీసుకున్న చర్యలను ఐజీ నాగిరెడ్డి డీజీపీకి వివరించినట్లు సమాచారం. సోషల్ మీడియా ద్వారా ఘటనకు సంబంధించిన దుష్ప్రచారం ఎక్కువగా జరిగినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఉట్నూర్‌లో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఇతర జిల్లాలకు పాకకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నియంత్రించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఘటన జరిగిన ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 23 పికెట్లు, 16 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఓ నివేదికను సీఎం కేసీఆర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి అందించినట్లు తెలియవచ్చింది. -
‘కాళేశ్వరం’ సందర్శించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటన జరపనున్నారు. ఇటీవలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు అన్ని అనుమతులూ వచ్చాయి. దీంతో పనులను మరింత వేగవంతం చేసేందుకు సీఎం క్షేత్ర పర్యటనకు వెళుతున్నారు. వరసగా మూడు రోజులపాటు ఈ ప్రాజెక్టు పరిధిలోని వివిధ పనులను ఆయన పరిశీలించనున్నారు. ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు, ఇంజనీరింగ్ నిపుణులు, సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఒక బృందంగా మూడు హెలికాప్టర్లలో బుధవారం బయలు దేరనున్నారు. బుధవారం (6వ తేదీ) సాయంత్రం 3.40 గంటలకు సీఎం కరీంనగర్‌కు బయలుదేరి 4.40 గంటలకు చేరుకుంటారు. ఆరోజు సీఎం ఉత్తర తెలంగాణభవన్‌లో బస చేయనున్నట్లు సమాచారం. మరునాడు (గురువారం) ఉదయం 10 గంటలకు బయలుదేరి తుపాకులగూడెం బ్యారేజీని చేరుకుంటారు. అక్కడ పనులను పరిశీలించిన అనంతరం 10.40 గంటలకల్లా మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. తర్వాత 11.20కి కన్నెపల్లి పంప్‌హౌజ్ పనులను చూస్తారు. 12.20కి అన్నారం బ్యారేజీ, 12.40కి సిరిపురం పంప్‌హౌజ్‌లను సందర్శిస్తారు. సిరిపురం పంప్ హౌజ్ వద్దనే సీఎంకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం 2 గంటలకు సుందిళ్ల బ్యారేజీ, 3.30 గంటలకు గోలివాడ పంప్‌హౌజ్ పనులను పర్యవేక్షిస్తారు. గురువారం రాత్రి ఎన్టీపీసీలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు నందిమేడారంలో ప్రాజెక్టు పనులను చూసి, 12.30కి రామడుగు పంప్‌హౌజ్, సర్జ్‌పూల్ పనులను పరిశీలిస్తారు. అక్కడే సీఎంకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశం ముగిశాక 3.40 గంటలకు మిడ్‌మానేరును పరిశీలించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సీఎం స్వయంగా పనులు పరిశీలించే చోట హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం పనులను ప్రత్యక్షంగా చూసేందుకు సీఎం పర్యటిస్తారని కొద్దిరోజులుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పరిధిలోని సున్నితమైన ప్రాంతాలను, ప్రాజెక్టు స్థలాలను ఇటీవలే రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా సందర్శించి వచ్చారు. ఆయన పర్యటన తరువాతే సీఎం పర్యటన ఖరారైనట్లు చెబుతున్నారు. -
రెండు చోట్లే ఇవాంకా పర్యటన
-
రెండు చోట్లే ఇవాంకా పర్యటన
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు విశిష్ట అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌లో హెచ్ఐసీసీ, ఫలక్‌నుమా రెండు చోట్ల మాత్రమే పర్యటించే అవకాశం ఉందని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా అధికారుల నుంచి వచ్చిన అధికారిక సమాచారం ప్రకారం ఆమె షెడ్యూల్లో మరో ప్రాంతం లేదన్నారు. ప్రధాని మోదీ, ఇవాంకా రాక, జీఈఎస్ సదస్సు, అధికారిక విందుల నేపథ్యంలో అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ఆ ఇద్దరి పర్యటనలూ ఇలా.. ఇవాంకా మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెస్టిన్ హోటల్‌కు వెళ్లడంతో పాటు హెచ్ఐసీసీలో జరిగే జీఈఎస్‌లో పాల్గొంటారు. అనంతరం తాజ్ ఫలక్‌నుమాలో విందుకు హాజరవుతారు. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడ బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని మియాపూర్ వెళ్లి మెట్రో రైలును ప్రారంభిస్తారు. అక్కడి నుంచి జీఈఎస్‌కు.. ఆపై ఫలక్‌నుమాకు వెళ్తారు. విందు ముగిసిన తర్వాత అదే రోజు రాత్రి శంషాబాద్ నుంచి తిరిగి వెళ్తారు. ఇవాంకా మాత్రం బుధవారం సాయంత్రం వరకు నగరంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ విభాగాల నుంచి 10,400 మంది పోలీసుల్ని కేటాయించారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్.. జీఈఎస్‌కు సంబంధించిన ప్రధాన కంట్రోల్ రూమ్‌ను హెచ్ఐసీసీలో సైబరాబాద్ పోలీసుల అధీనంలో ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలు, ఫలక్‌నుమాల్లోనూ కంట్రోల్ రూమ్స్ ఉండనున్నాయి. వీటన్నింటినీ అనుసంధానిస్తూ డీజీపీ కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుంది. మరోవైపు సామాన్యులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, ఓఆర్‌ఆర్‌లను ఎక్కువగా వినియోగించనున్నారు. ప్రధానికి సంబంధించి ఫలక్‌నుమా, శంషాబాద్ విమానాశ్రయం తప్ప మిగతా టూర్ అంతా హెలికాప్ట్టర్‌లో జరుగుతుంది. ఆయా చోట్లకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రముఖులూ ఉండటంతో ట్రాఫిక్‌కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. -
జిల్లాలపై కొత్త డీజీపీ దృష్టి
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రం.. ఆపై కొత్త జిల్లాలు.. ఈ క్రమంలో త్వరితగతిన ఎస్పీలుగా పదోన్నతులు పొందిన కొందరు జూనియర్ ఐపీఎస్ అధికారులు చేసిన కొన్ని పనులు ఇటీవల మొత్తం పోలీస్ శాఖను ఒత్తిడికి గురిచేశాయి. అలాంటి అనాలోచిత చర్యలకు చెక్‌పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి పోలీసు శాఖ అనుభవజ్ఞులైన అధికారులను రంగంలోకి దించింది. సిరిసిల్లా జిల్లాలో జరిగిన నేరెళ్ల ఘటన తర్వాత పోలీస్ శాఖ మూడేళ్లలో సాధించిన ఘనత కొంత దెబ్బతిన్నా మళ్లీ పట్టాలు ఎక్కేందుకు కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి కార్యాచరణ రూపొందించే పనిలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నేర నియంత్రణ, ఆధునీకరణే ప్రధానం.. జిల్లాల వారీగా, ముఖ్యంగా కొత్త జిల్లాల్లో పోలీస్ శాఖ పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని నూతన డీజీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తవడంతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలేంటి? ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? వాటికి కారణాలు, నియంత్రణకు చేపట్టిన చర్యలు.. తదితర అంశాలపై డీజీపీ పూర్తి స్థాయిలో ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఆధునీకరణకు సంబంధించి స్టేషన్ల నిర్వహణ, ఎస్ఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల పనితీరు, డీఎస్పీలు చేస్తున్న పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం ఎంతవరకు ఉందన్న అంశాలపై డీజీపీ దృష్టి సారించే అవకాశాలున్నాయి. డీపీఓలు, సిబ్బందిపై దృష్టి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్(డీపీఓ)ల నిర్మాణాలు, వాటి డిజైన్ల ఖరారు, నూతన కమిషనరేట్ల నిర్మాణం, సిబ్బంది కొరత, టెక్నాలజీ వినియోగం.. ఇలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ప్రారంభించాలని మహేందర్‌రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో పరిస్థితులపై నివేదికలివ్వాలని ఐజీలు నాగిరెడ్డితోపాటు స్టీఫెన్ రవీంద్రను డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. ఈ నివేదికల ఆధారంగా జిల్లాల పోలీసింగ్‌లో తీసుకురావాల్సిన మార్పులపై మహేందర్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
గణేష్ చందాలంటూ దౌర్జన్యం చేస్తే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఎవరైనా గణేష్ ఉత్సవాల నిర్వహణకు చందాల పేరుతో దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. మరోపక్క గణేష్ ఉత్సవాల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడాన్ని కమిషనర్ నిషేధించారు.అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని, వచ్చే నెల 5వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉండే ఈ నిషేధాజ్ఞలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
‘మైనార్టీ బాలికలకు ఉత్తమ విద్య’
హైదరాబాద్: మైనార్టీ బాలికలకు ఉత్తమ విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ మండలం చింతల్మెట్లో మైనార్టీ బాలికల వసతి గృహాన్ని మంత్రి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్ విజయ ఉన్నారు. -
‘సర్దార్‌నగర్ మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా’
షాబాద్: సర్దార్‌నగర్ మార్కెట్‌ను రంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన శేరిగూడెం వెంకటయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ జిల్లాలోనే పెద్ద కమిటీ అని అన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా పాలక మండలి పని చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. -
మహేందర్ రెడ్డి కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు
నవాబుపేట: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన టీఆర్ఎస్వీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అకాల మరణం తీరని లోటని మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మహేందర్‌రెడ్డి కుటుంబీకులను గురువారం వారు తిమ్మారెడ్డిపల్లిలో పరామర్శించారు. పార్టీ తరఫున రూ.10 లక్షల చెక్కును వారికి అందజేశారు. మహేందర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. కాగా, రెండు నెలల క్రితం వికారాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేందర్‌రెడ్డి చనిపోయారు. -
'సమ్మె విరమించండి, 43% ఇస్తే ప్రజలపై భారం'
నిజామాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విరమించాలని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిట్‌మెంట్‌పై సబ్ కమిటీ వేస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే ప్రజలపై భారం పడుతుందని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా పలుచోట్ల పోలీసుల ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి, సబ్ కమిటీ వేస్తాం: మహేందర్ రెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఫిట్‌మెంట్‌పై సబ్ కమిటీ వేస్తామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. -
అంబేడ్కర్ స్ఫూర్తితో సంక్షేమ పథకాలు
హైదరాబాద్ సిటీ: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన అంబేడ్కర్ స్ఫూర్తితో బడుగులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పి. మహేందర్‌రెడ్డి చెప్పారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులు కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాతకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఉద్యమ ఫలితంగానే నేడు రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రభుత్వానికి అధినేతగా సీఎం కేసీఆర్ బడుగుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం బడ్జెట్లో రూ.8 వేల కోట్లు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీకి రూ. 1,000 కోట్లు, కల్యాణలక్ష్మి పథకం కోసం రూ. 157 కోట్లు కేటాయించినట్లు మహేందర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో హొం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. -
ప్రవేశ పన్ను తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనిది: గడ్కరీ
హైదరాబాద్: ఏపీ వాహనాలపై పన్ను వేయడం అనేది తెలంగాణ రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గడ్కరీతో ఈ ఉదయం సమావేశమై ఆర్టీసి విభజనపై చర్చించారు. అనంతరం మంత్రులు ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు డ్రై పోర్టు కోసం కేంద్ర కృషి చేస్తుందని గడ్కరీ చెప్పారు. భారత్‌లో జల రవాణా మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలపై రోడ్ టాక్స్ విధించినట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. ఏపీ అధికారుల వల్లే ఆలస్యమైందన్నారు. రాష్ట్రం విడిపోయినందువల్లే అక్కడి వాహనాలపై పన్ను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అప్పుడే వేయాల్సింది... కొత్త రాష్ట్రమని టైమిచ్చాం..
హైదరాబాద్ : నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలకు రోడ్డు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి వాహనాలకు ట్యాక్స్ వేయాల్సిందని అయితే కొత్త రాష్ట్రం కావటంతో కొంత సమయం ఇచ్చామన్నారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టే అక్కడి వాహనాలకు ట్యాక్స్ వేస్తున్నామన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన ఎంట్రీ ట్యాక్స్(ప్రవేశ పన్ను)తో రాకపోకలు స్తంభించాయి. మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
నగరంలో నిషేధాజ్ఞల పొడిగింపు
హైదరాబాద్ : నగరంలో కొనసాగుతున్న నిషేదాజ్ఞల గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ, సచివాలయం చుట్టుపక్క ప్రాంతాలలో పోలీసు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు, ధార్నలు, రాస్తారోకోలు, ప్రసంగాలే చేయరాదని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. -
పోయిన వాహనాలను గుర్తించే యాప్
చోరీకి గురైన వాహనాలను గుర్తించేందుకు ఓ యాప్ రూపొందించారు. స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే ఈ యాప్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేరస్తులను అదుపులోకి తీసుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని మహేందర్ రెడ్డి చెప్పారు. ఇంజన్ నెంబరు, ఛాసిస్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు.. ఇలా వీటిలో ఏ ఒక్క వివరం ఆధారంగా సెర్చ్ చేసినా కూడా ఈ యాప్ ద్వారా వాహన యజమాని వివరాలు తెలుస్తాయని ఆయన తెలిపారు. -
నిరుపేదలకు అండగా ఉంటాం
మంత్రి మహేందర్‌రెడ్డి హామీ దుండిగల్: నిరుపేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ మండలం మల్లంపేట గ్రామంలో రూ.8 కోట్లతో బీటీ రోడ్డు, రూ.13.5 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో కోట్లాది రూపాయల నిధులతో ఆర్అండ్ బి రోడ్లు వేస్తున్నామన్నారు. చెరువుల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. కుత్బుల్లాపూర్ మండలంలో త్వరలోనే బస్‌డిపో ఏర్పాటు చేస్తామన్నారు. సూరారం కాలనీ 107 సర్వే నెంబరులోని 60 గజాల స్థలాల సమస్యలపై కలెక్టర్‌తో చర్చిస్తామని, కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. మల్లంపేట సర్పంచ్ అర్కల అనంత స్వామి ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, బి.ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, ఎమ్మార్వో కృష్ణ, ఎండీఓ కె.అరుణ, టీఆర్ఎస్ నేతలు శంభీపూర్‌రాజు, కొలన్ హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కావలి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ ప్రసంగాన్ని అడ్డంకులు మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రసంగిస్తూ ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా తెలంగాణ లోనూ అభివృద్ధి జరగాలని అనడంతో టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్..అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎంపీ వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బంగారు తెలంగాణ ను నిర్మిస్తారంటూ పేర్కొన్నారు. కాగా ఎంపీ ప్రసంగించే ముందు జై తెలంగాణ నినాదం చేసి ప్రసంగించాలని దుండిగల్ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ పట్టుబట్టారు. ఇక కుత్బుల్లాపూర్ మండలంలోని పలు సమస్యలపై మంత్రి మహేందర్‌రెడ్డికి ఎంపీపీ, సర్పంచ్‌లు విన్నవించారు. -
హ్యాపీ ఇండియా ఉత్పత్తులు ప్రారంభం
బంజారాహిల్స్: హ్యాపీ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా వ్యక్తిగత సేవలను అందించేందుకు రూపొందించిన ‘బిజీబాయ్స్. ఇన్’ వెబ్‌సైట్‌ను రాష్ట్ర రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా హ్యాపీ ఇండియాలో భాగమైన డాక్టర్ శైలూస్ పేరుతో ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను ఆవిష్కరించారు. అంతేకాకుండా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ సేవలను పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని కోరారు. ఇది అందరికీ ఉపయోగపడే వెబ్సైట్ అన్నారు. ప్రముఖ ఆడిటర్ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ వెబ్సైట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించనున్నారని, నాణ్యమైన సరుకులను సకాలంలో సరసమైన ధరలలో అందించవచ్చని పేర్కొన్నారు. వినియోగదారుల వద్దకే టెక్నాలజీని ఉపయోగించి ఈ సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాలినేని శీనయ్య, సుచిరిండియా చైర్మన్ కిరణ్, చలసాని శ్రీనివాస్, రుద్రరాజు పద్మరాజు, హ్యాపీ ఇండియా చైర్మన్ శైలజానాథ్, సీఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కౌన్సెలింగ్‌పై సుప్రీం తీర్పును అమలుచేస్తాం: టీ సర్కారు
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీం తీర్పును అమలుచేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌లో ఏ విద్యార్ధులైనా పాల్గొనవచ్చని, ఫీజులు మాత్రం తెలంగాణ విద్యార్ధులకే చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ విద్యార్ధులకు అక్కడి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకనే చంద్రబాబు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని, తెలంగాణలో జరిగే సర్వే గురించి టీడీపీ నేతలకెందుకని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోటీ పడలేకనే టీడీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని అన్నారు. ఆంధ్రా మంత్రులు హైదరాబాద్‌లోనే ఉండి పాలనను ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. -
ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు టౌన్: ఎన్నికలకు ముందు ముస్లింలకు ఇచ్చిన హామీ ప్రకారం 12శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరు పట్టణంలో మంగళవారం ఉదయం చెన్‌గేష్‌పూర్ రోడ్డులోని ఈద్గా మైదానానికి చేరుకున్న ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి మహేందర్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ముస్లింలకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత సామరస్యత పాటిస్తూ ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని అన్నారు. పేద ముస్లింలకు, విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తుందన్నారు. పలు అభివృద్ధి పనుల నిమిత్తం ముస్లింలకు రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, మున్సిపల్ కమిషనర్ గోపయ్య, సీపీఎం నాయకులు జనార్దన్‌రెడ్డి, టీడీపీ నాయకులు నరేష్, కాంగ్రెస్ నాయకులు అఫు, శ్రీనివాసాచారి, రాములు, టీఆర్ఎస్ నాయకులు కొట్రిక వెంకటయ్య, అబ్దుల్ రవూఫ్, సంపత్, అమిత్, అయ్యూబ్‌ఖాన్, రవిగౌడ్, న రేందర్, సురేందర్‌రెడ్డి తదితరులు ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బందోబస్తును పరిశీలించిన ఎస్పీ సామూహిక ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ రాజకుమారి ఈద్గా మైదానం వద్దకు చేరుకుని బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పారిశ్రామిక జిల్లాగా మారుస్తా జిల్లాను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక జిల్లాగా మారుస్తానని రాష్ర్ట రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ లో పరిశ్రమలు స్థాపించాలనుకునే పారిశ్రామిక వేత్తలకు స్వాగతిస్తున్నామన్నారు. తాండూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉందని, నూతన పరిశ్రమల స్థాపనకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. విప్రో, టాటా, ఇన్ఫోసిస్ తదితర ఐటీ పారిశ్రామికవేత్తలకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారన్నారు. పరిశ్రమల స్థాపన జరిగితే నిరుద్యోగం తగ్గుతుందన్నారు. రంజాన్, బోనాల పండుగ ఒకే నెలలో రావడం శుభసూచకమన్నారు. వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి జీవించాలన్నారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి చెప్పారు. -
స్కూలు బస్సు ఘటనపై ఎవరేమన్నారు...
క్రాసింగ్‌ల వద్ద గేట్ల ఏర్పాటుకు చర్యలు: హరీశ్‌రావు నర్సాపూర్: తెలంగాణలోని రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటుచేసి రక్షణ చర్యలు చేపడతామని, ఇందుకోసం కేంద్రానికి సహకరిస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గురువారం రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బస్సులను పరిశీలించాలి: మహేందర్‌రెడ్డి రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం కాకముందే వారి బస్సులను పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరిపిస్తామన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది: నాయిని రైలు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల చికిత్స కోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. హైలెవల్ కమిటీతో విచారణ జరపాలి: కిషన్‌రెడ్డి హైలెవల్ కమిటీతో విచారణ జరిపించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ట్రాక్టర్ డ్రైవర్‌తో బస్సు నడిపించిన వారిపైచర్యలు తీసుకోవాలన్నారు. ఇది రైల్వేశాఖ చేసిన హత్యే: చాడ వెంకట్‌రెడ్డి రైలు స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థులను బలితీసుకోవడం రైల్వేశాఖ చేసిన హత్యేనని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. రైల్వే తప్పిదంతోనే..: మాజీ మంత్రి గీతారెడ్డి రైల్వే తప్పిదమని రాష్ట్ర మాజీమంత్రి గీతారెడ్డి ఆరోపించారు. ఇది దురదృష్టకర సంఘటనని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల్లో తాత్కాలిక గేటు ఏర్పాటు: కలెక్టర్ మాసాయిపేట వద్ద రెండు రోజుల్లో తాత్కాలిక గేటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మెదక్‌జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి మెదక్ జిల్లా మాసాయిపేట ఘటనపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. హృదయవిదారకం: మండలి చైర్మన్ స్వామిగౌడ్ విద్యార్థుల మృతి హృదయ విదారకమని, మనసును కలచి వేస్తున్నదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగాఢ సంతాపం: కోదండరాం విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. రైల్వేగేట్లు ఏర్పాటుచేయాలి: పవన్‌కల్యాణ్,జనసేన అధ్యక్షుడు రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వేగేట్లు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని పెంచాలి. కేంద్రం రూ.10 లక్షలివ్వాలి: మంత్రి ఈటెల రాజేందర్ రైల్వే శాఖ ప్రకటించిన రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చాలా తక్కువ. దీన్ని రూ.పది లక్షలకు పెంచాలి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చులతో వైద్య సేవలందిస్తున్నాం. ఎక్స్‌గ్రేషియా పెంచాలి: టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచాలి. మానవతా ధృక్పథంతో కడుపుకోత తీర్చే విధంగా సహాయ చర్యలు ఉండాలి. దుర్ఘటన కలచివేసింది: జానా నల్లగొండ: మెదక్ జిల్లా మాసాయిపేట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. సర్కారీ బడుల వైఫల్యానికి మూల్యం: బండారు సర్కారీ బడుల వైఫల్యానికి చిన్నారుల ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చిందని లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండారు రామ్మోహన్రావు పేర్కొన్నారు. మూసాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంటే, సమీపంలోని ప్రైవేటు పాఠశాలలకు మాత్రం 7 వేల మంది వెళ్తున్నారన్నారు. ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ పొంగులేటి సాక్షి, న్యూఢిల్లీ: కాపాలా లేని రైల్వే క్రాసింగ్‌ల కారణంగా ఏటా దేశవ్యాప్తంగా వేలాదిమంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మాసాయిపేట దుర్ఘటన అంశాన్ని ఆయన లోక్‌సభ జీరో అవర్‌లో లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బస్సు ప్రమాదంలో విద్యార్థులు దుర్మరణం పాలవడంపై విచారం వ్యక్తం చేశారు. -
రూ.80 కోట్లతో కొత్త బస్సులు
* అధికారులతో సమీక్షలో మంత్రి మహేందర్‌రెడ్డి * వోల్వో కంపెనీ నుంచి కొంటున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ అప్పుడే ఓ అడుగు ముందుకేసి ఒక్కోటి రూ.కోటి విలువైన అత్యాధునిక బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని వోల్వో కంపెనీ నుంచి కొనుగోలు చేయబోతోంది. ఇప్పటి వరకు ఈ తరహా బస్సులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే నడుస్తున్నాయి. మన ఆర్టీసీ తొలి విడతగా జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రూ.80 కోట్ల వ్యయంతో 80 బస్సులను కొనబోతోంది. ఈ వ్యయంలో కేంద్రం 35 శాతం, ఆర్టీసీ 50 శాతం, రాష్ట్రం 15 శాతం భరించనుంది. గురువారం సాయంత్రం బస్‌భవన్‌లో జరిగిన సమీక్ష అనంతరం ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. కాగా, బెంగళూరును ఆదర్శంగా తీసుకుని వోల్వో బస్సుల కొనుగోలుకు ముందుకు వస్తున్న సర్కారు తీరుపై విమర్శలు వస్తున్నాయి. అక్కడ వోల్వోలు నష్టాలు కురిపించడంతో ఈ బస్సుల కొనుగోలును నిలిపివేయడం గమనార్హం. రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు తెలంగాణలో రవాణా వసతి లేని 1300 గ్రామాలకు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్టు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఇందుకు ఆయా గ్రామాలకు రోడ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా 21 డిపోలను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నామని చెప్పారు. ముంబైలో సిటీ బస్సులు నడుపుతున్న తీరును పరిశీలించి ఆ విధానాలను హైదరాబాద్‌లో ప్రారంభిస్తామన్నారు. -
సెల్‌టవర్ ఎక్కి హల్చల్
ఇబ్రహీంపట్నం రూరల్: పింఛన్లు పెంచాలని ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వీహెచ్పీఎస్ నాయకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. అదే సమయంలో మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇబ్రహీపట్నం పర్యటన ఉండడంతో పోలీ సులు ఉరుకులు పరుగులు పెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు పింఛన్లు పెంచాలంటూ ఐదు రోజులుగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీహెచ్పీఎస్ హయత్‌నగర్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మంత్రి, ఎంపీల పర్యటన నేపథ్యంలో పోలీసులు హైరానా పడ్డారు. ఎంత నచ్చజెప్పినా దిగేందుకు గోవర్ధన్ ససేమిరా అన్నాడు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ వచ్చి హామీ ఇస్తేనే దిగుతానని పట్టుబట్టాడు. దీంతో నాలుగు గంటల పాటు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. చివరికి పర్యటన ముగించుకుని మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ నర్సయ్యగౌడ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. వీహెచ్పీఎస్ నాయకులు అందె రాంబాబు, కాళ్ల జంగయ్య తదితరులు వారి కాన్వాయ్కి అడ్డు తగిలారు. పింఛన్ల పెంపుపై స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లపై స్పష్టత ఇచ్చారని, దీనిపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో గోవర్ధన్ టవర్ నుంచి కిందికి దిగివచ్చాడు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
మాపై గురుతర బాధ్యత ఉంది
తెలంగాణ పునర్నిర్మాణంలో కలిసికట్టుగా పనిచేయాలి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఇబ్రహీపట్నం రూరల్: 60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరి.. సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తమపై గురుతర బాధ్యత వుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంగేటి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధి గురించి దేశంలోని అన్ని వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా శ్రమించాల్సి ఉందన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణలో తొలిగా అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు తాము తప్పకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్తున్న 100 సింగపూర్ సిటీలను తెలంగాణలోనూ నిర్మించుకునే సత్తా మనకుందన్నారు. ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకుంటే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమేనన్నారు. ప్రతీ గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పట్నం పెద్ద చెరువులో నీటిని నింపి ఈ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని అన్ని రకాలా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా ప్రతీ గ్రామానికి తాగునీరు అందించి ఇక్కడి ప్రజల దాహార్తిని తీరుస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటైన కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. పలు ఐటీ కంపెనీల రాకతో ఇబ్రహీంపట్నంకు మహర్దశ వచ్చింద ని, రైతులు భూముల్ని ఇప్పుడే అమ్ముకోవద్దని సూచించారు. పాలమూరు- జూరాల నుంచి నీటిని తరలించి పట్నం పెద్ద చెరువును నింపేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ పాలుపంచుకోవాలన్నారు. పార్టీ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, సామల రంగారెడ్డి, జేపీ శ్రీనివాస్‌రావు, డబ్బీకార్ శ్రీనివాస్, బర్ల జగదీశ్ యాదవ్, బోసుపల్లి గణేశ్, మండల ప్రధానకార్యదర్శి కావలి లక్ష్మణ్, పలు గ్రామాల నాయకులు దోర్నాల మల్లేశ్, గొరిగె క్రిష్ణ, మాయిని అమర్నాథ్, మడుపు గోపాల్, బోసుపల్లి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ టీం రెడీ!
తెలంగాణ సీఎస్‌గా రాజీవ్‌శర్మ, డీజీపీగా అనురాగ్ శర్మ.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా టీపీ దాస్ * ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపు పూర్తయ్యాకే ఉత్తర్వులు * కొందరి రిలీవింగ్, డెప్యుటేషన్లకు కేంద్రం ఆమోదం తప్పనిసరి *మోడీ ప్రమాణ స్వీకారం తర్వాతే పరిశీలన సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కార్యాలయ బృందం కూర్పు ను పూర్తి చేశారు. అధికారుల కేటాయింపుకు సంబంధించిన కసరత్తు మాత్రమే మిగిలింది. ప్రత్యేకించి కేం ద్ర సర్వీసు అధికారుల పంపిణీకి ప్రధాని ఆమోదం, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కొందరి రిలీవింగ్, డెప్యుటేషన్లకు కేంద్రం ఆమోదం వంటి కసరత్తుకు సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. చురుగ్గా వ్యవహరించిన రాజీవ్‌శర్మ రాష్ట్ర తొలి ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా రాజీవ్‌శర్మ నియుక్తులు కానున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఈయన మన రాష్ట్ర కేడర్లోనే ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. సీఎస్‌గా రాజీవ్శర్మకన్నా 1979 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి చందనాఖన్ పేరు బలంగానే వినిపించినా కేసీఆర్ చివరలో మనసు మార్చుకుని రాజీవ్‌శర్మ వైపే మొగ్గు చూపారు. పైగా ఆమె నియామకానికి కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుపడవచ్చునని పలువురు ఐఏఎస్ అధికారులు కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. నాగిరెడ్డి, నర్సింగరావు పేర్లను కూడా పరిశీలించినా.. వారికి ఇప్పుడప్పుడే సీఎస్ కేడర్ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని నర్సింగరావును తన కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. నాగిరెడ్డికి ఇంకేదైనా మంచి పోస్టు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్ర తొలి డీజీపీగా అనురాగ్‌శర్మ పేరు ఖరారైంది. ఈయన కూడా 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్‌కు చెందిన టీపీదాస్, అరుణ బహుగుణ పేర్లను కూడా కే సీఆర్ పరిశీలించారు. అయితే ప్రస్తుతం పోలీస్ అకాడమీ డీజీగా ఉన్న అరుణ బహుగుణ డీజీపీ పోస్టుపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదని సమాచారం. ఇక టీపీ దాస్ కూడా సీనియరే అయినందున ఆయనను తెలంగాణ హోం ముఖ్యకార్యదర్శిగా కొనసాగిస్తే సరిపోతుందనే అభిప్రాయానికి వచ్చారు. హైదరాబాద్ కమిషనర్‌గా మహేందర్‌రెడ్డి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగర కమిషనర్‌గా ప్రస్తుతం రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న 1986 బ్యాచ్ ఐపీఎస్ ఎం.మహేందర్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. ఈయన నియామకంపై ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండబోవని భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఐజీ శివధర్‌రెడ్డి, యాంటీ నక్సలైట్ వింగ్ ఎస్ఐబీ చీఫ్‌గా సజ్జనార్ సేవలను వినియోగించుకోవాలని కే సీఆర్ నిర్ణయించారు. 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి ప్రస్తుతం విశాఖపట్నం సీపీగా ఉన్నారు. కేంద్ర హోం శాఖలోనే పనిచేస్తున్న గోపాల్‌రెడ్డిని కూడా తన బృందంలోకి ఎంపిక చేసుకున్నారు. తన ఓఎస్డీగా రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. అయితే సీఎస్, డీజీపీ పేర్లను మాత్రం గవర్నర్‌కు మౌఖికంగా తెలిపినట్లు తెలిసింది. అధికారిక కసరత్తు బాకీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ ఐఏఎస్, ఐపీఎస్ తదితర కేంద్ర సర్వీసు అధికారుల పంపిణీని ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇంకా పూర్తిచేయలేదు. ఈ కమిటీ ప్రతిపాదనలపై ప్రధాని మోడీ సంతకం చేశాక గానీ కసరత్తు పూర్తయ్యే అవకాశం లేదు. సోమవారం మోడీ ప్రమాణస్వీకారం పూర్తయ్యాకే ఆ ఫైల్ పరిశీలనకు వస్తుంది. పైగా ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్నందున రాజీవ్‌శర్మ, గోపాలరెడ్డిలను కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేయాల్సి ఉంటుంది. సీఎంవో కార్యదర్శిగా ఎంపిక చేసిన గోపాలరెడ్డి మధ్యప్రదేశ్ కేడర్‌లో ఉన్నారు. ఈయన్ని తెలంగాణకు డెప్యుటేషన్‌పై పంపించటానికి కూడా కేంద్ర ఆమోదం తప్పనిసరి. అలాగే ఓఎస్డీగా నియమితులయ్యే రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ప్రావిడెంట్ ఫండ్ ప్రాంతీయ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈయననూ తెలంగాణ సర్వీస్‌కు డిప్యుటేషన్‌పై కేంద్రం ఆమోదం మేరకే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం కోల్ ఇండియా సీఎండీగా ఉన్న నర్సింగరావు ఆ బాధ్యతల నుంచి రిలీవై, తెలంగాణలో చేరటానికి కనీసం నెలకుపైగా సమయం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అధికారిక ప్రక్రియలు పూర్తయ్యాకే వీరి నియామకాలపై ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఢిల్లీకి కేసీఆర్ త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టనున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో ఆయన ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. కేసీఆర్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా వెళ్లారు. మోడీతో సోమవారం కేసీఆర్ భేటీ కానున్నారు. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు వంటి వాటిపై సంబంధిత రంగాల ముఖ్యులతో కేసీఆర్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ కలెక్టర్‌తో భేటీ: ఇదిలా ఉండగా, కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనాను కలుసుకున్నారు. అరగంటసేపు ఆయనతో పలు అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌కు పలు వర్గాల నుంచి అభినందనల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమకారులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపార సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ జిల్లా ప్రజలతో కేసీఆర్ నివాసం ఆదివారం జనసంద్రాన్ని తలపించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముస్లిం, ధార్మిక సంఘాల నేతలు, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు, పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీలు, అభిమానులు కేసీఆర్‌ను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. -
మునిసిపాలిటీల్లో గ్రీన్ చానల్
సాక్షి, కర్నూలు: అధికారుల అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడక్కర్లేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర్లేదు. పత్రాలన్నీ పక్కాగా ఉంటే.. ఏడు రోజుల్లోనే అనుమతి లభిస్తుంది. బిల్టర్లు, డెవలపర్లే కాదు.. సామాన్యులూ అనుమతులు పొందొచ్చు. పురపాలక సంఘాలు అందించే సేవల్లో పారదర్శకతను తీసుకొచ్చే సరికొత్త విధానానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. నెలాఖరులోగా జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తోపాటు ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నంద్యాల మునిసిపాలిటీల్లో ఆరంభమయ్యే ‘గ్రీన్ చానల్’పై సాక్షి కథనం.. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి ఇప్పటి వరకు కార్యాలయం చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. సమస్య చేతపట్టుకొని.. శ్రమకోర్చి వచ్చినా.. కుంటిసాకులతో అధికారులు, సిబ్బంది పనుల్లో తీవ్ర జాప్యం చేసేవారు. సామాన్యుడి నుంచి బడాబాబులు వరకు ఎంతవారైనా అనుమతులు విషయంలో అధికారుల ముందు ‘మా పని ఎంత వరకు వచ్చిందం’టూ ప్రాథేయపడాల్సి వచ్చేది. వారి దయాదాక్షిణ్యాల మీద అనుమతులు అధారపడేవి. ఇలాంటి ఇబ్బందులు నివారించేందుకు గ్రీన్ చానల్ విధానం అమలుకు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఇటీవలే ప్రారంభించిన ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో అమలుకు మంత్రి యోచిస్తున్నారు. మునిసిపాలిటీల్లో రెవెన్యూ, ఇంజనీరింగ్, ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య విభాగాలకు దీనిని వర్తింపజేశారు. ఈ విధానం కింద నిర్ధేశించిన సేవల్లో జాప్యం జరిగితే అధికారి నుంచి అపరాధ రుసుం పొందే వీలుంటుంది. ప్రతి సమస్య పరిష్కారంలో జాప్యానికి రోజువారీ చార్జీలను వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. పని చేస్తుంది ఇలా... గ్రీన్‌చానల్ వల్ల భవన నిర్మాణ అనుమతులకు రోజుల తరబడి నిరీక్షణ అవసరం ఉండదు. ఇకపై వారం రోజుల్లో ఎలాంటి అనుమతులైన అమోదమా? తిరస్కారమా? అన్న వివరాలు తెలుస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా భవన నిర్మాణ అనుమతులు పొందేటప్పుడు దరఖాస్తుదారుడు సమర్పించాల్సిన వివరాలను తెలియజేస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలి, ఫీజు, నిర్ణీత రుసుం వసూలు తదితర వివరాలు అందిస్తోంది. భవన నిర్మాణ వివరాలు, అనుమతులు, బ్యాంకు లింకేజీ వివరాలను సూచిస్తూ గ్రీన్ చానల్ కేంద్రం ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుడు సంబంధిత డాక్యుమెంట్లతో గ్రీన్‌చానల్ సిబ్బంది వద్దకు వెళితే.. నిబంధనల ప్రకారం దస్త్రాన్ని రూపొందిస్తారు. నిన్నటివరకు ప్రణాళిక విభాగం అధికారులు నిర్వహించే ప్రాథమిక పరిశీలను వీరే పూర్తి చేస్తారు. అనంతరం ఆ దస్త్రాన్ని ప్రణాళిక విభాగ అధికారులు సూపర్ చెక్ చేస్తారు. ఇలా వారం రోజుల్లోగా దరఖాస్తు ఆమోదమా లేక తిరస్కారమా స్పష్టం చేస్తారు. ఆమోదిస్తే వెంటనే అందుకు సంబంధించిన ఫీజులు వసూలు చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలిన, అనుమతులు జారీ పూర్తవుతుంది. తొలివిడతలో పట్టణ ప్రణాళిక విభాగానికి గ్రీన్ చానల్‌ను అనుసంధానం చేయనున్నారు. సేవలు సులభం పురపాలక సంఘాల్లో గ్రీన్ చానల్ అమలుతో సేవల్లో పారదర్శకత ఉంటుంది. వేగంగా దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ధ్రువపత్రాలు జారీ ఉంటుంది. అలాగే మునిపిపాలిటీల్లో ఆదాయమూ పెరిగే అవకాశం ఉంది. - మురళికృష్ణ, పురపాలక ప్రాంతీయ సంచాలకులు -
వచ్చారు..వెళ్లారు
ఒంగోలు కలెక్టరేట్, చీరాల, పర్చూరు, ఇంకొల్లు, న్యూస్‌లైన్: జిల్లాను గత నెలలో కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పంటలన్నీ దెబ్బతిన్నాయి. మనుషుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. వరద ఉధృతిలో పశువులు కొట్టుకుపోయాయి. వందల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. భారీ వర్షాలకు ఆదుకోవలసిన జిల్లా మంత్రి మహీధరరెడ్డి మొహం చాటేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. 26 రోజుల తరువాత బుధవారం జిల్లాలో అడుగుపెట్టిన కేంద్ర బృందంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ దానిలో కొంత కుదించారు. చివరకు కొన్నిరకాల పంటలను చూసి బాగున్నాయంటూ బృంద సభ్యులు కామెంట్ చేశారు. కేంద్ర బృందం తీరును చూసిన రైతులు, అధికారులు విస్మయానికి గురయ్యారు. చీరాల మండలం బూర్లవారిపాలెంలో మొదలైన పర్యటన ఒంగోలులో అధికారులతో నిర్వహించిన సమీక్షతో ముగిసింది. కేంద్ర ఆంతరంగిక సంయుక్త కార్యదర్శి శంభుసింగ్ నేతృత్వంలో ఆర్పీ సింగ్, ఎం రమేష్కుమార్లు బృందం చీరాల, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు ప్రాంతాల్లో పర్యటించింది. చీరాల మండలం బూర్లవారిపాలెం సాయినగర్ కాలనీలో బండి ఓబులేసు అనే చేనేత కార్మికుడి ఇంటిని సందర్శించింది. మగ్గం గుంటలో నీరు నిలిచి ఉండటాన్ని గమనించింది. ఆ కార్మికుడి పేరు రాసుకొని అక్కడ నుంచి నిష్ర్కమించింది. వాస్తవానికి చీరాలలోని తోటవారిపాలెం చేనేతకాలనీ, మార్కండేయ కాలనీల్లో చేనేత గుంటల్లో నీరు నిలిచిపోయాయి. వాటివైపు బృందం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తరువాత చీరాల - కారంచేడు రోడ్డులో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించింది. భారీ వర్షాలకు చీరాల తరచుగా ముంపునకు గురికావడానికి కారణమైన రొంపేరు డ్రైనేజీని సందర్శించింది. కాలువ నుంచి సముద్రంలోకి వరద నీరు వెళ్లాల్సి ఉండగా, సముద్రం నుంచి పోటు వచ్చి ముంపునకు దారితీస్తోందని స్థానికులు కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. వారు చెప్పిందంతా విని అక్కడ నుంచి బృందం కారంచేడు బాట పట్టింది. కారంచేడులో భారీ వర్షాలకు వరి పూర్తిగా దెబ్బతింది. దాంతో రైతులు తిరిగి నాట్లు వేసుకున్నారు. దానిని చూసిన శంభుసింగ్ ‘విత్తే దశలో ఉందికదా.. మళ్లీ నాట్లు వేసుకోవచ్చు కదా’ అని ఉచిత సలహా ఇవ్వడంతో పక్కనే ఉన్న అధికారులు, రైతులు విస్తుపోయారు. కారంచేడులోని కొమ్మమూరు కాలువ గండ్లను కేంద్ర బృందం పరిశీలించింది. అక్కడ నుంచి పర్చూరు మండలంలో పర్యటించింది. పోతుకట్ల వద్ద చెరువుకు పడిన గండ్లు పరిశీలించింది. తిమ్మరాజుపాలెంలో భారీ వర్షాలకు పత్తి దెబ్బతినడంతో రైతులు వాటిని తీసివేశారు. కొన్ని మొక్కలు అలాగే ఉంచేశారు. అవి పచ్చగా ఉండటంతో పత్తి పచ్చగా బాగుంది కదా అని మరోమారు వ్యాఖ్యానించారు. అక్కడ నుంచి ఇంకొల్లు మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. కోతకు గురైన వాగు, వంకాయలపాడులో మిర్చి పొలాలను పరిశీలించింది. అనంతరం ఒంగోలుకు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం చెరువుకట్టను సందర్శించి , నేరుగా ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకొంది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పవర్ పాయింట్ ప్రజంటేషన్లో నష్టం వివరాలను తెలుసుకుంది. బలరాం కాలనీవైపు కన్నెత్తి చూడలేదు ఒంగోలులో భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే కాలనీల్లో బలరాం కాలనీ ముందు వరుసలో ఉంటుంది. ఆ కాలనీని కేంద్ర బృందం సందర్శిస్తుందని షెడ్యూల్లో ప్రకటించారు. బృందం వస్తుండటంతో కార్పొరేషన్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్డుపక్కన బ్లీచింగ్ చల్లించారు. ముంపునకు కారణమయ్యే పోతురాజు కాలువ బ్రిడ్జి వద్ద చిన్న బ్యానర్ కట్టారు. కొంతమంది అధికారులతోపాటు మీడియా కూడా బృందం కోసం ఎదురు చూసింది. అయితే కేంద్ర బృందం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
పీఛేముడ్..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : గ్రేటర్లో శివారు పంచాయతీల విలీనంపై ఉద్యమిస్తామని బీరాలు పలికిన తెలుగు తమ్ముళ్లు వెనక్కి తగ్గారు. గురువారం నుంచి నిరవధిక నిరాహారదీక్షలు చేపడతామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించిన నేతలు.. తర్వాత చూద్దామని తుస్సుమనిపించారు. తెలుగుదేశం పార్టీ నేత ల్లో నెలకొన్న అంతర్గత పోరే ‘దీక్ష’ల వాయిదాకు కారణంగా కనిపిస్తోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో 35 పంచాయతీలను కలపడం, మైనింగ్ జోన్, హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్, ఏపీఐఐసీ భూ సేకరణను నిరసిస్తూ గురువారం నిరవధిక దీక్షకు దిగుతానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో మేలుకొన్న టీడీపీ ముఖ్యనేతలు కిషన్‌రెడ్డి పోరాటానికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మరీ నిరవధిక దీక్షలో తాము కూడా పాల్గొంటామని తేల్చిచెప్పిన నేతలు తాజాగా వెనక్కి తగ్గారు. ఆందోళన కార్యక్రమాలకు కొన్నాళ్లు పుల్‌స్టాప్ పెడదామనే అంశాన్ని తెరమీదకు తె చ్చారు. గురువారం పంచాయతీల విలీనంపై హైకోర్టు కీలక నిర్ణయం వెల్లడించనున్న నేపథ్యంలో తీర్పును పరిశీలించిన తర్వాత ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే, జిల్లా కమిటీతో సంప్రదించకుండానే పంచాయతీల విలీనం సహా.. పలు సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్న మంచిరెడ్డికి సొంత పార్టీలోనే చుక్కెదురైంది. ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లో మైనింగ్ జోన్, ఏపీఐఐసీ భూసేకరణతో వేలాది మంది రైతులు రోడ్డున పడుతున్నారని, అదే సమయంలో జిల్లా ఉనికికి భంగం కలిగేలా గ్రేటర్ పరిధిని విస్తరిస్తుండడాన్ని నిరసించాలని నిర్ణయిస్తే సొంత పార్టీ నాయకులే మోకాలడ్డడంపై ఆయన వర్గీయుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిరవధిక దీక్షతో కిషన్‌రెడ్డికి ఎక్కడ క్రెడిట్ వస్తుందోననే బెంగతోనే తాము కూడా దీక్షలో పాల్గొంటామని ప్రకటనలు చేసిన వైరివర్గం.. ఇప్పుడు అర్ధంతరంగా దీక్షలను వాయిదా వేద్దామని సూచించడం వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. ఆందోళన పథంలో.. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జిల్లా టీడీపీలో స్తబ్ధత నెలకొంది. తెలంగాణకు అనుకూలంగా మనం లేఖ ఇచ్చినందునే రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చినప్పటికీ, జిల్లా నేతలు ఆ దిశగా ముందడుగు వేయడంలేదు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల తెలంగాణ అంశంపై పార్టీ నాయకులు ఆచితూచి అడుగేస్తున్నారు. కొన్నాళ్లుగా సీనియర్ల మధ్య కొనసాగుతున్న అభిప్రాయభేదాలు కూడా పార్టీని పలచన చేస్తున్నాయి. ఈ తరుణంలోనే పలువురు నాయకులు టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆర్నెల్ల క్రితం జరిగిన సహకార ఎన్నికల్లోనూ దిగువస్థాయి నేతల కృషి వల్ల మెజార్టీ సొసైటీలను గెలుచుకున్నప్పటికీ, ముఖ్య నేతల మ్యాచ్‌ఫిక్సింగ్‌తో అధికారపార్టీ డీసీసీబీ, డీసీఎంఎస్‌ను ‘చే’జిక్కించుకుంది. ఇలా పార్టీలో జరుగుతున్న కోవర్టు ఆపరేషన్లు నిలువరించే ప్రయత్నం పార్టీనేతలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రకటనతో డీలాపడ్డ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు పంచాయతీల విలీనాన్ని, తదితర అంశాలను అనువుగా మలుచుకోవచ్చని మంచిరెడ్డి ఎత్తు వేశారు. పంచాయతీల విలీనంపై అధికారపార్టీ సహా అన్నిపార్టీలు వ్యతిరేకిస్తున్నందున ఈ అంశంపై ప్రజల్లోకి వెళితే మంచి మైలేజీ దొరుకుతుందని భావించారు. మంచిరెడ్డి ఆలోచనకు తొలుత తలూపిన పార్టీ ఎమ్మెల్యేలు.. చివరి నిమిషంలో చెయ్యిచ్చారు. ప్రజాసమస్యలను అందిపుచ్చుకోవాల్సిన సమయంలో క్రెడిట్ పాకులాటలో పార్టీ నేతలు వాయిదా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుండగా, పంచాయతీల విలీనంపై గురువారం ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశమున్నందున దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తెలిపారు.