అప్పుడే వేయాల్సింది... కొత్త రాష్ట్రమని టైమిచ్చాం..
హైదరాబాద్ : నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలకు రోడ్డు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి వాహనాలకు ట్యాక్స్ వేయాల్సిందని అయితే కొత్త రాష్ట్రం కావటంతో కొంత సమయం ఇచ్చామన్నారు.
రాష్ట్రం విడిపోయింది కాబట్టే అక్కడి వాహనాలకు ట్యాక్స్ వేస్తున్నామన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన ఎంట్రీ ట్యాక్స్(ప్రవేశ పన్ను)తో రాకపోకలు స్తంభించాయి. మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.