Private buses
-
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. సిటీలోకి భారీ వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిషేధిస్తూ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ♦ ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. ♦లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామాగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. ♦ డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యా హ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. ♦ ప్రైవేట్ బస్సులు కేవలం రాత్రి 10 నుంచి ఉ. 8 గంటల మధ్యనే నగరంలో ప్రయాణించాలి. ♦ అత్యంత నెమ్మదిగా నడిచే కేటగిరీకి చెందిన చేతితో తోసే బళ్లు, వివిధ రకాలైన జంతువులు లాగే బళ్లు, సైకిల్ రిక్షాలు, ట్రాక్టర్లు తదితరాల సంచారాన్ని నగరంలోని కీలకమైన 61 టూర్లలో నిషేధించారు. ♦ భవన నిర్మాణ, కూలి్చవేత వ్యర్థాలను తరలించే వాహనాల్లో 2 నుంచి 6 టన్నుల మధ్య బరువు కలిగినవి ఉ. 11.30 నుంచి సాయంత్రం 5, రా త్రి 10 నుంచి ఉదయం 9 మధ్య సంచరించాలి. ♦ వీటిలో 10 టన్నులు అంతకంటే ఎక్కువ బరువుతో కూడిన వాహనాలు కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. -
బస్సులు ఫుల్, చార్జీలు డబుల్
కర్ణాటక: రాష్ట్రంలో ఆర్టీసీ కోసం కొత్తగా 5,675 కొత్త బస్సులు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. శనివారం సీఎం నివాస కార్యాలయం కృష్ణాలో రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. బడ్జెట్లో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.500 కోట్లు కేటాయించాం, కొనుగోలు ప్రక్రియనే త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం శక్తి వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరిగింది, రద్దీని తట్టుకొనేలా బస్సులను అందుబాటులోకి తేవాలన్నారు. వాహన తనిఖీల ద్వారా రూ.83 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో రవాణా, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి పాల్గొన్నారు. బనశంకరి: దసరా పండుగ నేపథ్యంలో ప్రజలు స్వంత ఊర్ల బాటపట్టగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు టికెట్ బుకింగ్ ధరలు గణనీయంగా పెరిగాయి. లగ్జరీ/ ఏసీ బస్ చార్జీలు రెట్టింపు అయ్యాయి. బెంగళూరు మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాంతినగరలో గల కేఎస్ఆర్టీసీ బస్టాండులు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రైవేటు బస్సులు యజమానులు సైతం ఎక్కువ సంఖ్యలో సర్వీసులు నిర్వహించారు. సొంతూర్లకు నగరవాసులు దసరా వల్ల శనివారం నంచి మంగళవారం వరకూ వరుసగా సెలవులు రావడంతో ఐటీ, బీటీ, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సొంతూళ్ల బాటపట్టారు. లక్షలాది మంది బస్సులు, క్యాబ్‌లు, సొంత కార్లలో బయల్దేరడంతో నగరంలో ప్రధాన రోడ్లలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలామంది శుక్రవారం సాయంత్రమే కుటుంబసమేతంగా బయలుదేరి వెళ్లారు. అలాగే మైసూరు రోడ్డు, తుమకూరురోడ్డు, హోసూరు, అనేకల్ రోడ్లలో ట్రాఫిక్రద్దీ ఏర్పడింది. బెంగళూరులో మెజస్టిక్, మైసూరు రోడ్డు, శాటిలైట్ బస్టాండు, శాంతినగర, జయనగర బస్టాండ్లు కిటకిటలాడాయి. సాధారణ బస్సుల్లో సీట్ల కోసం తొక్కిసలాట ఏర్పడింది. రైళ్లు సైతం ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. అలాగే తిరిగి వచ్చేవారి కోసం అక్టోబరు 24 నుంచి 29 మధ్య ఇతర నగరాల నుంచి బెంగళూరుకు ప్రత్యేక బస్సులు వేశారు. టికెట్‌పై రూ. వెయ్యి వరకూ పెంపు శనివారం ఉదయం నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు చైన్నె, కేరళ, హైదరాబాద్‌కు ఎక్కువ ప్రయాణాలు మొదలయ్యాయి. టికెట్ ధరను రూ.500 నుంచి 1000 పెంచారు. పండుగ సాకుతో బస్సుల యజమానులు దోచేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. ప్రైవేటు బస్సుల్లో బెంగళూరు నుంచి కొచ్చికి టికెట్ చార్జి రూ.3,500 , హైదరాబాద్ –బెంగళూరు, ముంబై–బెంగళూరుకు రూ.3,500గా నిర్ణయించారు. పండుగలకు ఊళ్లకు వెళ్లనివారు కొడగు, చిక్కమగళూరు, ఊటి, మైసూరు, పుదుచ్చేరి తదితర టూర్లకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి ఒకరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్య ప్యాకేజీలు ఉన్నట్లు ట్రావెల్‌ఏజెంట్లు తెలిపారు. -
ప్రయాణికుల్లేక.. ప్రైవేటు బస్సులు వెలవెల.. కారణం ఇదే
చిక్కబళ్లాపురం: ఉచిత ప్రయాణ వసతి పథకంతో మహిళలందూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ప్రైవేటు బస్సులు వెలవెలపోతున్నాయి. మహిళలు రాష్ట్ర పరిధిలో ఎక్కడినుంచైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం శక్తి యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉచిత ప్రయాణ సదుపాయంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. మహిళలు ప్రైవేటు బస్సులపై కన్నెత్తి చూడటం లేదు. దీంతో ప్రైవేటు బస్సులు బస్టాండ్లలో ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు టాప్ సర్వీస్‌లతో నడిచిన తమ బస్సులు ఇప్పుడు బోసిపోయాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్షన్లు లేకపోతే తమకు జీతాలు రావని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు. ఇక యజమానులు మాట్లాడుతూ కలెక్షన్లు పడిపోతే తమ బస్సులను గుజరీకి పంపాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం. -
ప్రకాశం జిల్లా: 9 బస్సులు దగ్ధం
-
అగ్ని ప్రమాదం: 9 బస్సులు దగ్ధం
ప్రకాశం జిల్లా: ఒంగోలు బైపాస్‌లోని ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు దగ్ధమయ్యాయి. పార్క్ చేసి ఉన్న ట్రావెల్ బస్సులలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది బస్సులు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. -
ఆర్థిక కష్టాల్లో ప్రైవేటు బస్సుల యజమానులు
-
ప్రైవేట్ బస్సుల్లో అధిక చార్జీలకు బ్రేకులు
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గత వారం రోజులుగా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ 150 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు వెళుతున్నాయి. ఈ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తొలుత విజయవాడ–హైదరాబాద్ రూట్లో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ► టీఎస్ ఆర్టీసీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్రాష్ట్ర ఒప్పందం విషయంలో వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ వివాదం కొనసాగుతుండటం ప్రైవేట్ ఆపరేటర్లకు కలిసొచ్చింది. ► ప్రతి రోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో 4 వేల మంది వెళుతున్నారు. ప్రైవేట్ బస్సులే దిక్కు కావడంతో ప్రయాణికుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. ► హైదరాబాద్ నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. అదే ఆర్టీసీలో రూ.800. ► నాన్ ఏసీ టికెట్ ధర ఆర్టీసీలో రూ.400 వరకు ఉండగా, ప్రైవేట్ ఆపరేటర్లు రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. ► మరోవైపు ట్రావెల్స్ నిర్వాహకులు క్వార్టర్లీ ట్యాక్స్ చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే బస్సులు నడపాలి. ప్రయాణికుల అవసరాలను అవకాశంగా తీసుకుని అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్–విజయవాడ రూట్లో తనిఖీలు చేపడుతున్నాం. – ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ -
ప్రైవేట్ బస్సులు నడిపితే తగులబెడతాం
హన్మకొండ: ‘నీ ఫాంహౌజ్, ఇల్లు అమ్ముకో.. అంతే తప్ప ఆర్టీసీ నీ సొంత ఆస్తి కాదు.. అందులో కేంద్ర వాటా ఉంది. 31 శాతం కేంద్రం వాటా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటే ఊరుకుంటారా.? అని సీఎం కేసీఆర్‌కు సీపీఐ నేత కె.నారాయణ హెచ్చరించారు. కార్మికులకు విధుల్లో చేరడానికి నిర్దేశించిన సమయం కార్మికులకు డెడ్ లైన్ కాదు,. అది సీఎం కేసీఆర్‌కేనని ఉద్ఘాటించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రైవేట్ బస్సులు నడపలేరని, నడిపితే తగుల బెడుతామని నారాయణ హెచ్చరించారు. మంగళవారం హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలసి నారాయణ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంలో ఇంటి కొడుకు కంటే ఇంటి అల్లుడి పెత్తనం ఎక్కువైందని నారాయణ దుయ్యబట్టారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌ని పువ్వాడ అజయ్ అని పిలవలేకపోతున్నామని, పువ్వాడ అంటే సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు గుర్తుకువస్తారని నారాయణ అన్నారు. అలాంటి వంశంలో పువ్వాడ అజయ్ చెడ పుట్టారని విమర్శించారు. -
ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలు తరచూ సమ్మెలకు దిగడం వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని శాశ్వతంగా అధిగమించడానికి రాష్ట్రంలోని 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లోనే కేబినెట్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆర్టీసీ సమస్యను కార్మిక సంఘాలు న్యాయస్థానాలకు తీసుకెళ్లినందున, అది తేలేవరకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు ప్రజలకు మరింత అసౌకర్యం కలగనుంది. దీంతో ప్రత్యా మ్నాయాలు ఆలోచిస్తోంది. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ (అమెండ్మెంట్ యాక్టు)–2019 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు జారీ చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఈ చట్టం 2019 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం కల్పించిన అధికారాల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు 3 నుంచి 4 వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం వల్ల వారు ఆదాయం కోసం తమకు కేటాయించిన రూట్లలో ఎక్కువ ట్రిప్పులు నడుపుతారు. షిఫ్టుల గొడవ లేకుండా ఎక్కువ సమయం వాహనాలను ప్రజల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. అధిక రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. టెండర్లకు అనూహ్య స్పందన రూట్లకు పర్మిట్లు ఇస్తే నడపడానికి ప్రైవేటు వాహన యజమానులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం వెయ్యి రూట్లలో పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే, 21,453 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రైవేటు వాహన యజమానులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాహనాలు కూడా వచ్చే అవకాశం ఉందని రవాణా అధికారులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. విద్యార్థులకు పరీక్షలు ఉన్నప్పుడు, పండుగల సీజన్ ఉన్నప్పుడు.. ఇలా అదను చూసుకుని కార్మిక సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయి. ఇలా సమ్మె జరిగినప్పుడల్లా ప్రజలకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది. దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే తంతు నడుస్తున్నది. దీన్నుంచి శాశ్వతంగా విముక్తి కావడానికి వివిధ రూట్లలో బస్సులు నడిపేందుకు ప్రైవేటు వారికి అవకాశం కల్పించడమే ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని అధికారికంగా వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజిల్‌కు సైతం డబ్బుల్లేవ్.. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెపై వివిధ కేసులను హైకోర్టు విచారణ జరుపుతోంది. ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలియదు. హైకోర్టు తీర్పు వచ్చినా ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉందని, సమ్మె వల్ల వచ్చే ఆదాయం కూడా రావట్లేదని ప్రభుత్వం వాదిస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ చిక్కుకుంది. దీని ఫలితంగా బస్సులకు డీజిల్ పోసే పంపులకు బకాయిలు పేరుకుపోయాయి. ఏ క్షణమైనా బంకులు డీజిల్ పోయడం ఆపేయొచ్చు. దీనివల్ల ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు కూడా ఏ క్షణమైనా ఆగిపోయే అవకాశం ఉంది. మరోవైపు తీసుకున్న అప్పులకు కిస్తీలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ కూరుకుపోతోంది. ఏ క్షణమైనా ఆర్టీసీని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ)గా గుర్తించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
రూ. వెయ్యికి ఆశపడకండి!
సాక్షి, జనగామ: దండం పెడుతున్నం.. కాళ్లు మొక్కు తం.. రూ. వెయ్యికి ఆశపడి ఉద్యోగానికి రాకండి అప్పుడే ప్రభుత్వానికి శక తగులుతుందని ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక ఉద్యోగులకు వేడుకున్నారు. మా పోరాటం భవిష్యత్‌లో మీ కోస మే.. మా బాధను చూస్తున్నారు.. ఆగ్రహాన్ని చూస్తే డిపోలో కాలుకూడా పెట్టలేరని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీచేశారు. ఆర్టీసీ సమ్మె సోమవారం నాటికి 17వ రోజుకు చేరుకోగా కార్మికులు కుటుంబ సభ్యులతో జనగామ డిపో గేటు ఎదుట భైఠాయించారు. బస్సులను బయటకు రానివ్వకుండా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఏపీ ముఖ్య మంత్రి జగనన్న అచ్చాహై అంటూ నినాదాలు చేస్తూ కార్మికుల పిల్లలు నినదించారు. సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సైలు శ్రీనివాస్, రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టారు. కార్మికులు డిపోలోకి వెళ్లకుండా పోలీసులు ముందుగానే గేట్లు మూసేశారు. రెండు గంటల పాటు బైఠాయింపు ఆర్టీసీ కార్మికులు కుటుంబసభ్యులతో డిపో గేటు ఎదుట రెండు గంటల పాటు భైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. నియంత పాలనలో ఆర్టీసీని కనుమరుగు చేస్తున్నారని కార్మిక సంఘం నాయకులు ఆరోపణలు గుప్పించారు. ప్రైవేట్‌పరం చేస్తే టికెట్‌కు అడిగినంత డబ్బులు ఇచ్చుకోవాల్సిందేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు కలిసి వస్తుంటే.. కొంతమంది నిరుద్యోగులు డబ్బులకు కక్కుర్తి పడి తాత్కాలిక ఉద్యోగాలు చేస్తూ తమను ఆకలితో చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.వెయ్యా...లేక టికెట్‌పై అదనపు వసూళ్ల కోసం వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికీ మా మాట వినకుంటే కార్మిక కుటుంబాల ఉసురు తగిలిపోతారని శాపనార్దాలు పెట్టారు. డిపో నుంచి ర్యాలీగా బస్టాండు ఆవరణకు చేరుకుని మానవహారం నిర్వహించి అవుట్ గేట్ వద్ద కాసేపు ధర్నా నిర్వహించారు. వాగ్వాదం.. పలు డిపోలకు చెందిన బస్సు సర్వీసులు బస్టాండుకు రాగా తాత్కాలిక, ఆర్టీసీ కార్మికులకు మాటల యుద్ధం కొనసాగింది. కండక్టర్లు, డ్రైవర్లకు దండంపెట్టి.. ఉద్యోగాలకు రావద్దని వేడుకుంటుండగా.. మా ఇష్టం అంటూ మాట్లాడడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాత్కాలిక కండక్టర్ ఆర్టీసీ కార్మికులపైకి రావడంతో అంతా ఒక్కటయ్యారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని గొడవను సద్దుమణిగించారు. అక్కడి నుంచి ర్యాలీగా దీక్షా శిబిరానికి చేరుకున్నారు. నేడు ఆర్టీసీ కార్మికులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ముఖాముఖి చర్చలు కొనసాగించనున్నారు. -
ప్రైవేటు బస్సులపై ఏపీ ఫ్రభుత్వం నిఘా
-
ప్రైవేట్ స్కూల్ బస్సులనూ వినియోగించుకోండి
సాక్షి, కామారెడ్డి: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన క లెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ స్కూల్ బస్‌లను వినియోగించాలని, అందుకుగాను ఆన్లైన్ అనుమతులు ఇవ్వాలని సూచించారు. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. వీసీలో రవాణశాఖ జాయింట్ కమిషనర్ మమత ప్రసాద్, కామారెడ్డి నుంచి కలెక్టర్ సత్యానారాయణ, జేసీ యాదిరెడ్డి, ఎస్పీ శ్వేత, జిల్లా రవాణాశాఖ అధికారి వాణి, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రితో వీసీలో పాల్గొన్న కలెక్టర్, అధికారులు చర్యలు తీసుకుంటున్నాం.. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన జనహిత భవన్లో ఆయాశాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కామారెడ్డి, బాన్సువాడ బస్‌డిపోల నుంచి 160 బస్సులే కాకుండా మరో వంద స్కూల్ బస్సులను వినియోగిస్తున్నామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమిస్తామన్నారు. హెవీ వెహికల్ లైసెన్స్, ఆధార్‌కార్డు, ఎస్ఎస్సీ వర్జినల్స్, 18 నెలల అనుభవం కలిగిన సర్టిఫికెట్లతో తాత్కాలిక డ్రైవర్లను నియమించుకుంటున్నట్లు తెలిపారు. నిర్ణీత రూట్లలో సమయానికి బస్సులను నడిపిస్తామన్నారు. -
అక్కడ రద్దు.. ఇక్కడ స్పెషల్
సాక్షి, హైదరాబాద్: దసరా వేళ ఆర్టీసీకి కొత్తచిక్కొచ్చి పడింది. అటు ప్రయాణికులకు సరిపడా బస్సులు నడపలేక, ఇటు ఉన్న బస్సుల్ని సర్దలేక సతమతమవుతోంది. దసరా రద్దీ కోసం దాదాపు 4,900 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ప్రకటించింది. అందుకోసం రెగ్యులర్ సర్వీసుల్ని తగ్గించి, లేదా పూర్తిగా రద్దు చేసి దసరా స్పెషల్‌గా తిప్పేందుకు సిద్ధమైంది. వాస్తవానికి రాష్ట్రంలో సుమారు 850 గ్రామాలకు బస్సు వసతి లేదు. ఈ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాంటే ఆర్టీసీ ఇప్పటికిప్పుడు కనీసం 3 వేల బస్సులు సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. అదనపు చార్జీ వసూలు నిబంధన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ సర్వీసులకు 50% మేర అదనపు చార్జీ వసూలుకు అధికారికంగా వెసులుబాటు ఉంది. అసలే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితి లేదు. దీంతో డిమాండ్ తక్కువగా ఉన్న ప్రాంతాల సర్వీసులను కుదించి, కొన్నింటిని పూర్తిగా రద్దు చేసి స్పెషల్ బస్సులుగా తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. మరికొన్ని చోట్ల ట్రిప్పు వెళ్లి వచ్చిన తర్వాత, తదుపరి ట్రిప్పునకు సమయం ఉండి, కొన్ని బస్సులు ఖాళీగా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా దసరా స్పెషల్‌గా వేసేశారు. నగరం నుంచే దాదాపు 20 లక్షల మంది తెలంగాణలో దసరా రద్దీ అధికంగా ఉంది. బతుకమ్మతో కలసి వచ్చే పర్వదినాలు కావటంతో సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య భారీగా ఉంటుంది. వారిలో మూడొంతుల మంది బస్సులపైనే ఆధారపడతారు. ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు 20 లక్షల మంది పయనమవుతారు. ఇంతమందికి రెగ్యులర్ సర్వీసులు చాలనందున కచ్చితంగా స్పెషల్ సర్వీసులు తిప్పాల్సి ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోతుండటంతో అంతపెద్ద సంఖ్యలో స్పేర్ బస్సులు లేకుండా పోయాయి. గతంలో ఉన్న అదనపు బస్సుల్ని ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులుగా చేసేసింది. దీంతో వేరే ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి లేదా కుదిం చి స్పెషల్ బస్సులుగా తిప్పాల్సిన దుస్థితి ఇప్పుడు ఆర్టీసీకి నెలకొంది. గతేడాది కంటే 500 సర్వీసులు పెంచారు. ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు 1,200 సిటీ సర్వీసులు స్పెషల్ బస్సులుగా వాడుకుంటున్నారు. ప్రైవేటు బస్సులు ఇప్పటికే టికెట్ ధరలు రెట్టింపు చేసి అమ్ముతుండటంతో ఎక్కువమంది ఆర్టీసీ బస్సులవైపే చూస్తున్నారు. దీంతో ఈ అదనపు సర్వీసులు ఏర్పాటు తప్పనిసరి కావటం, బస్సులు చాలినన్ని లేకపోవటంతో అధికారులకు కత్తిమీద సాములాగా తయారైంది. -
బస్సులపై ఆర్టీఏ కొరడా
-
పల్లెకు పోదాం చలో చలో!
సాక్షి, హైదరాబాద్/ చౌటుప్పల్ /కట్టంగూర్: సంక్రాంతి సంబరాల కోసం నగరం పల్లెబాట పట్టింది. లక్షలాది మంది నగరవాసులు సొంతూళ్లకు తరలి వెళ్లారు. దీంతో సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్సులు, రైళ్లు, ప్రైవేట్ వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం నుంచే సెలవులు ప్రారంభం కావడంతో.. ప్రయాణికుల రద్దీ మరింత ఎక్కువైంది. దీనికి అనుగుణంగా ఆర్టీసీ శనివారం ఒక్క రోజే సుమారు 1,500 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రెగ్యులర్‌గా వెళ్లే రైళ్లతో పాటు, సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్, జనసాధారణ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో టికెట్ దోపిడీ తారస్థాయికి చేరింది. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ, డిమాండ్ భారీగా పెరిగిపోతుండటంతో సాధారణ చార్జీలను రెండు రెట్లు పెంచేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50% అదనంగా వసూలు చేస్తున్నారు. మొదట్లో దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అన్ని ప్రత్యేక బస్సుల్లోనూ ఈ పెంపు అమలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అటు, బస్సులు, ట్రావెల్స్, ప్రైవేటు వాహనాలతో టోల్‌ప్లాజాల వద్ద తీవ్రమైన రద్దీ నెలకొంది. ప్రయాణంలోనే సంబరాల ఆవిరి నగరవాసుల సంక్రాంతి సంబరాల ఆశలన్నీ ఈ పెరిగిన ధరలతో ప్రయాణంలోనే ఆవిరవు తున్నాయి. చార్జీల రూపంలోనే వేల రూపాయల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది. బస్సులు, రైళ్లే కాకుండా టాటా ఏస్, తూఫాన్లు, వ్యాన్లు, తదితర అన్ని రకాల వాహనాల్లోనూ జనం తరలి వెళుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది సొంత ఊళ్లకు వెళ్లినట్లు అంచనా. ఆది, సోమవారాల్లోనూ ఈ రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది. ఆ రెండ్రోజుల్లో మరో 10 లక్షల మంది ఊళ్లకు తరలే అవకాశం ఉంది. మరోవైపు పల్లెబాట పట్టిన వాహనాలతో హైవేలు కిక్కిరిశాయి. సంక్రాంతి రద్దీతో నగర శివారు కూడళ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. సొంతూళ్లకు వెళ్తున్న బస్సులు, వ్యక్తిగత వాహనాలతో రహదారులు స్తంభించాయి.ఉప్పల్, ఎల్బీ నగర్, మెహిదీపట్నం, జేబీఎస్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, ఏఎస్ రావునగర్, ఈసీఐఎల్, తదితర ప్రాంతాల్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు పడిగాపులు కాశారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంతూరికి వెళ్లే వ్యక్తిగత వాహనాలతో.. సిటీ రోడ్లపైన భారీ ట్రాఫిక్ రద్దీ నెలకొంది. రైల్వేస్టేషన్లకు, బస్స్టేషన్లకు తరలివెళ్లే ప్రయాణికులతో మెట్రోరైళ్లు సైతం కిటకిటలాడాయి. మియాపూర్–ఎల్బీనగర్, నాగోల్–అమీర్‌పేట్– మియాపూర్ మార్గంలో సుమారు 2.6 లక్షల మందికి పైగా పయనించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా 5,252 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన ఆర్టీసీ ఇప్పటి వరకు సుమారు 3 వేల బస్సులను నడిపింది. అలాగే ప్రతి రోజూ సుమారు 1,000 ప్రైవేట్ బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎల్బీనగర్లో.. ఒంటికాలిపై రైలు ప్రయాణం ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్ బెర్తులకు అవకాశం లేక పోవడంతో ప్రయాణికులు జనరల్ బోగీలపైనే ఆధా రపడాల్సి వచ్చింది. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి బయలుదేరిన అన్ని రైళ్లలోనూ సాధారణ బోగీలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా 60 జనసాధారణ రైళ్లను కూడా ఏర్పాటు చేసిన ప్పటికీ ప్రయాణికుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వయోధికులు తీవ్ర ఇబ్బందు లకు గురయ్యారు. బోగీల్లో ఒంటికాలిపైన గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ప్రచారం లేక ఫాస్టాగ్ ఫెయిల్ హైవేలపై గంటలతరబడి టోల్ ఛార్జీ చెల్లింపుల కోసం వేచి చూడకుండా సులువుగా వెళ్లగలిగే ఎన్హెచ్ఏఐ ఎలక్ట్రానికి టోల్ కలెక్టింగ్ సిస్టమ్ (ఈటీసీ)ని ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా ఫాస్టాగ్ అనే పరికరాన్ని కారు లేదా వాహనం ముందు వరుసలో అమరుస్తారు. ఇందులో ఆన్లైన్లో కొంతమొత్తాన్ని రీచార్జ్ చేసుకునేందుకు వీలు ఉంది. ఇవి టోల్గేట్ వద్దకు రాగానే పరికరంలోని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా రుసుము దానికదే కట్ అయి, గేట్లు పైకి లేస్తాయి. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ ప్రధాన టోల్గేట్ల వద్ద ఈ పరికరాలను విక్రయానికి అందుబాటులో ఉంచింది. కానీ సరైన ప్రచారం కల్పించలేకపోయింది. సంక్రాంతి సమయంలో రద్దీ కారణంగా టోల్గేట్లకు సమస్యలు తప్పవని సాక్షి ముందే హెచ్చరించింది. ఫాస్టాగ్ కార్డుల ప్రాధాన్యాన్ని కూడా వివరిస్తూ ఈనెల 10న కథనం కూడా ప్రచురితమైంది. కానీ, వీటిపై వాహనదారులు అంతగా ఆసక్తి చూపక పోవడంతో వీటి కొనుగోలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రవాణాశాఖ అధికారులు ఎక్కడ? తెలంగాణ రవాణా శాఖ గణాం కాల ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 8,000కుపైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిలో చాలామటుకు కాంట్రాక్టు కారియర్‌గా అనుమతులు తీసుకుని, స్టేజీ కేరియర్‌గా తిప్పుతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. వీటి కారణంగా ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వాటిల్లుతోంది. సంక్రాంతి, దసరా సందర్భంగా ఈ నష్టం రోజుకు రూ.2 కోట్లకుపైనే. ఇంత నష్టం జరుగుతున్నా.. రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పండుగ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడుతున్న బస్సులను తనిఖీలను చేపట్టాలని రవాణాశాఖ నిపుణులు, ఆర్టీసీ కార్మిక యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. టోల్‌ప్లాజా వద్ద భారీ క్యూ.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 65వ నంబర్ జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళ్లే మార్గంలో వాహనాలు వేలాదిగా తరలివెళ్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలకు పైగా వాహనాలు వెళ్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా నుంచి లింగోజిగూడెం గ్రామం వరకు వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాహనాలు గంట సేపట్లో పంతంగి టోల్‌ప్లాజాను దాటాల్సి ఉన్నా రద్దీ నేపథ్యంలో మూడు గంటలకు పైగా సమయం పట్టింది. జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించకుండా సివిల్, ట్రాఫిక్ పోలీసులతో పాటు జీఎమ్మార్ సిబ్బంది తగుచర్యలు తీసుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద మొత్తం 16 ద్వారాలు ఉండగా.. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో 12 ద్వారాలు తెరిచారు. కొర్లపహాడ్ ప్లాజా వద్ద పది ద్వారాలు తెరిచారు. సాధారణంగా.. విజయవాడ మార్గంలో 15–18వేల వాహనాలు పయ ణిస్తుండగా శనివారం ఒక్కరోజే సుమారు 40వేల వాహనాలు ప్రయాణించినట్లు జీఎమ్మార్ సిబ్బంది వెల్లడించారు. టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లింపులో ఆలస్యం కాకుండా సిబ్బందే నేరుగా వాహనదారుల వద్దకు వెళ్లి టోల్ సొమ్ము స్వీకరించారు. ట్రావెల్స్ దారి దోపిడీ పరిస్థితి చూస్తుంటే.. ప్రయాణికుల కన్నా.. ప్రైవేటు ట్రావెల్స్‌కే అసలైన సంక్రాంతి పండుగ వచ్చినట్లుంది. పండుగ రద్దీని సొమ్ము చేసుకుని.. ఇష్టానుసారంగా వ్యవ హరిస్తు న్నాయి. మోటారు వాహన చట్టాన్ని తుంగలో తొక్కినా.. భద్రతా నిబంధనలను గాలి కొదిలేసినా అధికారులు పట్టిం చుకోవడం లేదు. ఆర్టీసీ చార్జీల కన్నా 4 రెట్లు ఎక్కువగా వసూలుచేస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పండుగ సమయం..ఎలాగైనా సొంతూరికి వెళ్లాలన్న సామాన్యుడి ఆత్రుత వీరికి వరంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ 1,500, ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 2వేల బస్సులను ఏర్పాటు చేసింది. 150 వరకు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. అయితే, ఇవేవీ ఈ రద్దీకి సరిపోవడం లేదు. ఆకాశంలో ధరలు.. వాస్తవానికి టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలు టికెట్ చార్జీలపై 50% అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ, ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం ఏకంగా టికెట్ ధరలను 400%పైగా పెంచేశాయి. ఇందులో స్లీపర్, ఏసీ ధరలైతే.. ఏకంగా రూ.4000 దాటుతుండటం గమనార్హం. వీటికి టోల్‌ట్యాక్స్, జీఎస్టీ కలిపితే 4,400 వరకు ప్రయాణికుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదే ముందస్తుగా బుక్ చేసుకుంటే విమాన చార్జీలు కూడా రూ.2వేల లోపే ఉండటం గమనార్హం. అసలింత పెంపుపై ఓ విధానం అంటూ లేకుండా పోయిందని స్వయంగా ఆర్టీఏ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, దీనిపై చర్యలకు ఉపక్రమించకపోవడం గమనార్హం. టోల్గేట్ల వసూళ్ల రద్దు ఈ నెల 13, 16 తేదీల్లో అమలులో ఉంటుందని సీఎస్ ప్రకటన సంక్రాంతి సెలవుల సందర్భంగా జాతీయ రహదారులపై టోల్గేట్ల వసూళ్లను రద్దు చేస్తున్నట్టు సీఎస్ ఎస్కే జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ప్రక టన విడుదల చేశారు. సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు, పండుగ తర్వాతి రోజు (జనవరి 13, 16)న ఇది అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్– విజయవాడ (నం.07192/07193) ప్రత్యేక రైలు 13న సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 7.30కి విజయవాడ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో అదే రోజు రాత్రి 8.25కి విజయవాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 3 గంటలకు హైదరాబాద్ చేరు కుంటుంది. సికింద్రాబాద్– విజయవాడ (నం.07194/07195) ప్రత్యేక రైలు 13న రాత్రి 11.30కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి ఉదయం 8.35కి బయల్దేరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్– తిరుపతి (నం.07191) ప్రత్యేక రైలు కాకినాడ టౌన్ నుంచి 13న సాయంత్రం 6.45కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.45కి తిరుపతి చేరుకుంటుంది. విజయవాడ– విజయనగరం (నం.07184/07185) ప్రత్యేక రైలు 13న రాత్రి 09.10కి విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20కి విజయనగరం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ఉదయం 7.45కి బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.30కి విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఈ ప్రత్యేక రైళ్లల్లో చార్జీలు ఒక్కొక్కరికి సికింద్రాబాద్– విజయవాడ రూ. 130, విజయవాడ– హైదరాబాద్ రూ. 135, తిరుపతి– కాకినాడ టౌన్ రూ. 175, విజయనగరం– విజయవాడ రూ. 145గా నిర్ధారించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. -
ఊరెళ్తున్న నగరం
విశాఖసిటీ: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన వైజాగ్ నగరం.. పల్లెకు పరుగులెడుతోంది. సంక్రాంతి తర్వాత తెలుగు ప్రజలు అత్యంత ప్రాధాన్యమిచ్చే దసరా పండగ సందర్భంగా సొంతూళ్లలో సరదాగా గడిపేందుకు పయనమవుతున్నారు. విశాఖకు వచ్చే వారికంటే నగరం నుంచి గ్రామాలకు వెళ్లేవారే అధికంగా ఉండటంతో ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నగరానికి ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం వచ్చి నివాసముంటున్నారు. పండగ సెలవులు రావడంతో పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ నగరం నుంచి బయలుదేరి వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ‘ప్రత్యేక’ ఏర్పాట్లు చేసినా... దసరా సందర్భంగా ఆర్టీసీ, రైల్వే అధికారులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. దసరా సెలవులకు నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ బస్సులకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గత సంవత్పరంలో ఉన్న పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది విశాఖ రీజియన్ నుంచి 416 అదనపు బస్సులు నడపగా.. ఈ ఏడాది విశాఖ రీజియన్ నుంచి రెగ్యులర్‌గా తిరిగే బస్సులతో పాటు అదనంగా 500 బస్సులతో విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమలాపురం, నర్సాపురం, భీమవరం మొదలగు దూరప్రాంత బస్సులతో పాటు విజయనగరం, రాజాం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, సోంపేట, ఇచ్ఛాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటితో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాలైన నరసన్నపేట, టెక్కలి, పలాస తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. ఇదే మాదిరిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేకరైళ్లు నడుపుతోంది. ఇటీవల తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాతో పాటు ఒడిషా రాష్ట్రంలోనూ రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో.. వాటిని పునరుద్ధరించేందుకు సమయం పట్టింది. దీంతో చాలా మంది బస్సులను ఆశ్రయించారు. అయినప్పటికీ దసరాకు ముందు మూడు రోజుల పాటు రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఓవైపు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉండటంతో రైళ్లు బస్సులు ఖాళీ ఉండటం లేదు. ముఖ్యంగా రైళ్లలోని జనరల్ బోగీల్లో అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి ఉండటంతో ఫైన్లు కట్టి మరీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణాలు చేస్తున్నారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థమవుతోంది. ప్రైవేట్ బాదుడు ఇదిలా ఉండగా.. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి. ఎలాగైనా దసరా పండగను ఊరిలో చేసుకోవాలనే ప్రజల తాపత్రయాన్ని, సెంటిమెంట్‌ను ప్రైవేటు బస్సులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఆర్టీసీ, రైల్వే శాఖ బస్సులు ఏర్పాటు చేసినా.. డిమాండ్‌కు సరిపడా లేకపోవడంతో.. చాలా మంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఉదాహారణకు సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు రూ.700 నుంచి రూ.900 వరకూ ఏసీ సర్వీసులకు టికెట్ వసూలు చేసిన ప్రైవేటు బస్సులు.. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రూ.1800 నుంచి రూ.2000 వరకూ వసూలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు సైతం.. రెట్టింపు భారాన్ని మోస్తూ.. ఉసూరంటూ ఊళ్లకు వెళ్తున్నారు. -
చేయూతనివ్వని ప్రభుత్వం.. చెయ్యిచ్చిన జీహెచ్ఎంసీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలే అమలు కాకపోవటంతో ఆర్టీసీ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సీఎం ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ నుంచి నిధులు అందకపోవడంతో తీవ్ర సంకటాన్ని ఎదుర్కొంటోంది. డిసెంబర్ ముగిసే నాటికి రూ.406 కోట్ల నష్టాల్లో కూరుకుపోయి.. కార్మికుల జీతాల చెల్లింపులకూ దిక్కులు చూస్తోంది. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీకి తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. మరోవైపు కార్మికులు అడిగిన దానికంటే ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. వేతన సవరణ రూపంలో భారాన్ని మోపటంతో ఈ నష్టాలు మరింత పెరిగాయి. దీంతో నగరంలో వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ ద్వారా భర్తీ చేయనున్నట్లు గతంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఇప్పుడు ససేమిరా అంటున్న జీహెచ్ఎంసీ ఆర్టీసీకి చిల్లిగవ్వకూడా ఇవ్వబోమని తేల్చి చెప్పింది. మరోవైపు ప్రభుత్వం గ్రాంటు ఇచ్చేందుకు సిద్ధంగా లేకపోవటంతో ఎలా నెట్టుకురావాలో తెలియక ఆర్టీసీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ నేపథ్యంలో 2017–2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ ముగిసే నాటికి రూ.406 కోట్ల నష్టాల్లో ఉన్నట్లు తెలిసి బిత్తరపోతోంది. కార్మికులు తమ రుణాల కోసం వేతనాల నుంచి పొదుపు చేసుకున్న మొత్తాలను కూడా ఆర్టీసీ ఇప్పటికే వాడేసుకుంది. దీంతో కార్మికులకు రుణాలు అందని పరిస్థితి నెలకొంది. సాయం కోసం అభ్యర్థిస్తే ప్రభుత్వమూ మౌనం దాల్చింది. మరోవైపు వేతన సవరణ గడువు దాటిపోవటంతో కార్మిక సంఘాలు ఒత్తిడి మొదలుపెట్టాయి. తొమ్మిది నెలలు.. రూ.400 కోట్లు ఇదిగో ఖర్చు తగ్గింది.. అదిగో లాభమొచ్చిందంటూ ఇటీవల ఆర్టీసీ ప్రకటించుకుంటున్నా.. తాజా నష్టాలు బెంబేలెత్తిస్తున్నాయి. దూర ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించటం, నియామకాలు లేకపోవటంతో సిబ్బంది సంఖ్య తగ్గి కొంత వేతనాల భారం సడలటంతో కొన్ని డిపోల్లో లాభాలు కనిపించాయి. కానీ డిసెంబరు ముగిసే నాటికి మొత్తం నష్టాల లెక్కలేసిన అధికారులు అవాక్కవ్వాల్సి వచ్చింది. ఏకంగా రూ.406.04 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు తేలటంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. నష్టాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గ్రాంటు రూపంలో నయా పైసా వచ్చే వీలులేదన్న సంకేతాలు వచ్చేశాయి. తాము కూడా సాయం చేయబోమని జీహెచ్ఎంసీ తేల్చటంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. సాయం నిలిపేసిన జీహెచ్ఎంసీ ముంబై తరహాలో నగర పరిధిలో వచ్చే నష్టాలను నగర పాలక సంస్థ నిధులతో భర్తీ చేయనున్నట్టు గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2015–16కు సంబంధించి రూ.336 కోట్లను ఆర్టీసీకి జీహెచ్ఎంసీ కేటాయించింది. దీంతో కష్టాల నుంచి గట్టెక్కినట్టేనని ఆర్టీసీ భావించింది. కానీ ఆర్టీసీకి సాయం చేస్తే తమ అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్న జీహెచ్ఎంసీ ఇక సాయం చేయకూడదని నిర్ణయించుకుంది. దీంతో తర్వాత రావాల్సిన బకాయిలు, తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తాన్ని ఇవ్వద్దని తేల్చింది. దీనిపై ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు. ఇప్పటికే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం, ఎస్బీటీ స్కీంలకు సంబంధించి కార్మికులు జమ చేసిన నిధి కూడా కరిగిపోయింది. పదవీ విరమణ చేసిన తర్వాత ఇచ్చే మొత్తం, చనిపోయిన వారికి ఇచ్చే మొత్తం పోను మిగతా నిధిని కార్మికుల రుణాలకు వాడాల్సి ఉంది. కానీ ఆర్టీసీ ఆ మొత్తాన్ని వాడేసుకోవటంతో రుణాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది. ఈ తరుణంలో జీతాలు ఇవ్వటానికి దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొనటం ఆందోళన కలిగిస్తోంది. రూ.500 కోట్లకు నష్టాలు? రాష్ట్రంలో రైల్వే లైన్ల విస్తీర్ణం తక్కువ. ఇక్కడ ప్రైవేటు బస్సుల పోటీ కూడా నామమాత్రం. కొత్త బస్సుల కొనుగోలు అంతంతమాత్రమే కావటంతో ఆర్టీసీ నష్టాలు భారీగా తగ్గాల్సి ఉంది. కానీ తాజా లెక్కలు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని మిగతా మూడు నెలలు ముగిసే సరికి మొత్తం నష్టాలు రూ.500 కోట్లను దాటనున్నాయి. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ముందుకు సాగే పరిస్థితి లేదని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. -
15 లక్షల మంది.. పల్లె బాట
సాక్షి, హైదరాబాద్: పట్నం పల్లెకు తరలింది. సొంత ఊళ్లో సంక్రాంతి వేడుకలు చేసుకునేందుకు నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు గత నాలుగు రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. రెగ్యులర్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు రెట్టింపు ప్రయాణికులతో బయలుదేరుతున్నాయి. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులతో పాటు, మరో 3,650 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్స్ కార్లు, ఇతర రకాల వాహనాల్లో సైతం భారీ సంఖ్యలో ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాల యాలకు సైతం వరుసగా సెలవులు రావ డంతో నగర ప్రజలు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. ఈ నాలుగు రోజుల్లో వివిధ మార్గాల్లో సుమారు 15 లక్షల మందికి పైగా ప్రజలు తమ సొంత ఊళ్లకు వెళ్లారు. మరో రెండు రోజుల పాటు 5 లక్షల మందికి పైగా ఊళ్లకు తరలి వెళ్లనున్నారు. రైళ్లల్లో రిజర్వేషన్లు లభించక పోవడంతో చాలా మంది దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లల్లో, సాధారణ బోగీల్లో ఒంటికాలిపై ప్రయాణం చేయాల్సి వచ్చింది. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించారు. మరోవైపు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలకు సైతం అనూహ్య డిమాండ్ నెలకొంది. భారీ దోపిడీ... ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లు చేస్తోంది. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందుకేసి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. సంక్రాంతి వేడుకలను సొంత ఊళ్లో చేసుకోవాలనుకున్న తమ కోరిక కోసం నగర వాసులు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే చెల్లించు కోవలసి వచ్చింది. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి వివిధ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రోజువారి బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 50 ప్రత్యేక రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన చార్జీలు కూడా భారీగా పెరిగాయి. ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉండే అన్ని మార్గాల్లో చార్జీలు ఒకటి నుంచి రెండు రెట్లు అధికమయ్యాయి. ప్రయాణికుల రద్దీ మరో రెండు రోజుల పాటు ఇలాగే కొనసాగనుంది. -
పట్నం.. పల్లెకు పయనం
వరుస సెలవులతో పోటెత్తిన ప్రయాణికులు - సొంతూళ్లు, పర్యాటక ప్రాంతాలకు తరలివెళ్లిన హైదరాబాద్ వాసులు - రెండు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా ‘అదనపు’ ప్రయాణం సాక్షి, హైదరాబాద్: వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం మాన్సూన్ టూరేసింది. శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా 4 రోజుల పాటు సెలవులు రావడంతో నగరవాసులు పర్యాటక ప్రాంతాలకు, సొంతూళ్లకు తరలివెళ్లారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు కిక్కిరిసి పోయాయి. ప్రయాణికుల రద్దీతో బస్, రైల్వే స్టేషన్లు పోటెత్తాయి. వాహనాల రద్దీ కారణంగా వరంగల్, విజయవాడ, ముంబై జాతీయ రహదారు ల్లోని టోల్గేట్ల వద్ద భారీగా వాహనాలు స్తంభిం చాయి. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్) నుంచి రోజుకు 1,500 బస్సులు దూర ప్రాంతాలకు వెళ్తుండగా, తాజా గా 200 బస్సులు అదనంగా బయలుదేరాయి. విజయవాడ, తిరుపతి, బెంగళూరు, భద్రాచలం, కాకినాడ, కర్నూలు మార్గాల్లో పెద్ద సంఖ్యలో బస్సులు బయలుదేరాయి. రోజూ ఎంజీబీఎస్ నుంచి 1.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, శనివారం ఒక్క రోజే మరో 50 వేల మంది వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరం గల్, సిద్దిపేట, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు మరో యాభై వేల మంది ప్రయాణికులు బయ లుదేరి వెళ్లారు. వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుపైకి రావడంతో నగరంలోని రహదారులతోపాటు ఎల్బీనగర్, ఉప్పల్, మెహదీపట్నం, శివరాంపల్లి, జేబీఎస్, సాగర్‌రింగ్ రోడ్డులోని ప్రధాన కూడళ్లన్నీ రద్దీగా మారాయి. కిక్కిరిసిన రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరిన రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్లు లభించకపోవ డంతో ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయా ణించాల్సి వచ్చింది. 75 మంది వెళ్లాల్సిన జనరల్ బోగీలో 200 మందికిపైగా వెళ్తున్నారు. సాధారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రోజూ 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, వంద ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. 2.5 లక్షల మంది ప్రయాణిస్తారు. సికింద్రాబాద్ నుంచి 30 నుంచి 40 వేల మంది అదనంగా వెళ్లినట్లు దక్షిణ మధ్య రైల్వే అంచనా వేసింది. కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి సాధారణ రోజుల్లో 50 వేల మంది చొప్పున ప్రయాణిస్తుండగా, తాజాగా రెండు స్టేషన్లలో మరో 20 వేల మంది అదనంగా బయలుదేరినట్లు అంచనా. ‘ప్రైవేటు’ నిలువు దోపిడీ వరుస సెలవులను ప్రైవేటు బస్సులు సొమ్ము చేసుకున్నాయి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లభించని వారు ప్రైవేటు బస్సులను ఆశ్రయించారు. చార్జీలను రెట్టింపు చేసి ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులపై నిలువు దోపిడీకి దిగారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.450 ఉండగా, ఏకంగా రూ.800కి పెంచారు. వైజాగ్‌కు ఏసీ బస్సు చార్జీ రూ.950 కాగా, ఏకంగా రూ.1,850కిపైగా వసూలు చేశారు. అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. -
బస్సు ‘బేరం’ కుదిరింది
‘అరుణాచల్’ బస్సులకు రైట్‌రైట్! ‘ముఖ్య’నేతతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల మంతనాలు మంత్రి మధ్యవర్తిత్వం.. కుదిరిన బేరసారాలు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ‘ముఖ్య’నేత హామీ ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరైన బస్సులకు మళ్లీ అనుమతులు? త్రైమాసిక పన్ను కట్టించుకోవాలని రవాణా శాఖపై ఆపరేటర్ల ఒత్తిళ్లు సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ప్రైవేట్ బస్సులను మళ్లీ రోడ్డెక్కించేందుకు ప్రయ త్నాలు ముమ్మరమయ్యాయి. కీలక మంత్రితో జరిపిన మంతనాలు సఫలం కావడం, బేరసారాలు కుదరడంతో త్వరలో తమ బస్సులు స్టేజీ క్యారి యర్లుగా తిరుగుతాయంటూ ప్రైవేట్ ఆపరేటర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఉన్నతస్థాయిలో డీల్ కుదిరిందని, బస్సులకు త్రైమాసిక పన్ను(క్వార్టర్లీ ట్యాక్స్) కట్టించుకోవాలని రవాణా శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే, తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే పన్ను కట్టించుకుంటామని ఆయా జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 655 ప్రైవేట్ బస్సులు సీజ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న ప్రైవేట్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల్లో తిప్పుతున్నారని అక్కడి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్లను ఈ ఏడాది జూన్ మొదటి వారంలో రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై ఏపీలో తిరుగుతున్న బస్సులను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించిన 655 బస్సులను సీజ్ చేయడంతో ఆర్టీసీకి కొంత మేర ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో దాదాపు 2 నెలలుగా 655కు పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. మంత్రికి ముట్టిన తొలి విడత ముడుపులు రాష్ట్రంలో సీజ్ చేసిన 655 ప్రైవేట్ బస్సులు అధికార పార్టీకి చెందిన వారివేనని, దీనివల్ల వారు నెలకు రూ.80 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతున్నారని కీలక మంత్రి ఒకరు ‘ముఖ్య’నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 655 బస్సులకు గాను ప్రతి మూడు నెలలకోసారి క్వార్టర్లీ ట్యాక్స్ కింద రూ.9.50 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేవారని, ఆ బస్సులను సీజ్ చేయడంతో పన్నులు రాక ఖజానాకు నష్టం వాటిల్లుతోందని వివరించినట్లు తెలిసింది. సదరు కీలక మంత్రి ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తరపున వకాల్తా పుచ్చుకుని వ్యవహారం చక్కబెట్టినట్లు సమాచారం. ఆ మంత్రితో ముందుగానే బేరసారాలు కుదుర్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా తర్వాత నేరుగా ‘ముఖ్య’నేతను కలిసింది. ప్రభుత్వం సీజ్ చేసిన తమ బస్సులను రాష్ట్రంలో యథావిధిగా తిప్పుకునేందుకు అనుమతించాలని వేడుకోవడంతో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని ‘ముఖ్య’నేత అభయమిచ్చినట్లు సమాచారం. తొలి విడతగా మంత్రికి ట్రావెల్స్ మాఫియా భారీగా ముడుపులు చెల్లించినట్లు ప్రస్తుతం రవాణా శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది. రవాణా శాఖపై ఒత్తిడి కీలక మంత్రి రాయబారం సఫలం కావడం, ప్రభుత్వాధినేత హామీ ఇవ్వడంతో ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా రవాణా శాఖపై ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రంలో తమ బస్సులను ఎప్పటిలాగే తిప్పుతామని తేల్చిచెబుతుండడం గమనార్హం. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల జోరు చూస్తుంటే ప్రభుత్వం నుంచి త్వరలోనే అన్ని అనుమతులు రానున్నాయని ప్రచారం జరుగుతోంది. -
ప్రయాణికులపై లాఠీ‘చార్జి’!
ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ - ఆర్టీఏ దాడుల నేపథ్యంలో చార్జీలు రెట్టింపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బస్సుల దారి దోపిడీ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో రిజిస్టరై తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లేకుండా తిరుగుతున్న సుమారు 300 బస్సులను నిలిపేయడం, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మరో 50కిపైగా ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడంతో బస్ టికెట్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాలకు తగినన్ని సర్వీసులు లేకపోవడంతో ప్రైవేట్ ట్రావెల్స్ ఎడాపెడా చార్జీలు పెంచేశాయి. అరుణాచల్ బస్సులకు బ్రేక్.. పర్యాటక రాష్ట్రాలైన అరుణాచల్, నాగాలాండ్, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో జాతీయ పర్మిట్లకు అతి తక్కువ ఫీజులు అమలవుతున్న దృష్ట్యా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తమ బస్సులను ఆయా రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. వీటిలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు 300 వరకు ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు మరో 600 వరకూ ఉంటాయి. వీటిలో కొన్ని బస్సులు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుండగా.. మరికొన్ని బెంగళూరు, ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇటీవల అరుణాచల్‌లో ఈ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతో వాటిని పట్టుకునేందుకు రవాణా శాఖ కొరడా ఝళిపించింది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు ఎక్కడి బస్సులను అక్కడే నిలిపేశారు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదై స్టేజీ క్యారేజీలుగా నడుస్తున్న 50 బస్సులను అధికారులు సీజ్ చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు నిలిచిపోయాయి. అదనపు బస్సులు వేయని ఆర్టీసీ ప్రైవేట్ బస్సులపై దాడుల నేపథ్యంలో వంద బస్సులు అదనంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆర్టీసీ.. ఏఒక్క రూట్లోనూ ఒక్క బస్సునూ వేయలేదు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు.. బస్సుల కొరతను సాకుగా చూపి చార్జీలను రెట్టింపు చేశారు. దీంతో విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై, బెంగళూరు వంటి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు చార్జీలు భారమైనా ప్రైవేట్ బస్సులనే ఆశ్రయించాల్సి వస్తోంది. నిలిచిపోయిన అరుణాచల్ సర్వీసులు 300 ఆర్టీఏ సీజ్ చేసిన బస్సులు 50 -
ఢిల్లీలో ‘ప్రైవేటు’ చక్కర్లు
- ట్రావెల్స్ యాజమాన్యాల కొత్త ఎత్తులు - 2 ప్లస్ 1 బెర్తుల విధానానికి అనుమతించేలా పైరవీలు - అరుణాచల్ నుంచి బస్సుల రిజిస్ట్రేషన్ మార్పుకోసం యత్నం - ఈలోగా చర్యలు లేకుండా తెలుగు ప్రభుత్వాలపై ఒత్తిడి - రంగంలోకి రాజకీయ నేతలు సాక్షి, హైదరాబాద్: తమ రాష్ట్రంలో రిజిస్టరై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న తెలుగు రాష్ట్రాల ప్రైవేటు బస్సుల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను అరుణాచల్‌ప్రదేశ్ రద్దు చేయడంతో దిక్కుతోచని ట్రావెల్స్ నిర్వాహకులు ఢిల్లీ కేంద్రంగా పైరవీలకు దిగారు. ఆ బస్సులను తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు 2 ప్లస్ 1 బెర్తుల విధానానికి కూడా (36 బెర్తులకు) ఇక్కడ అనుమతులు తెచ్చుకునే దిశగా చక్రం తిప్పుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 24 బెర్తులకు మాత్రమే అనుమతి ఉంది. ఇటీవల కేంద్రప్రభుత్వం రవాణా చట్టానికి స్వల్ప సవరణలు చేసింది. దీని ప్రకారం ఈ బెర్తుల సంఖ్యలో మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో అది 2 ప్లస్ 1 బెర్తుల విధానంలాగే ఉండేలా ఆదేశాలు జారీ చేయించడానికి ప్రైవేటు ఆపరేటర్లు రింగ్‌గా ఏర్పడి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఆదేశాలు రాగానే తెలుగు రాష్ట్రాలనే కేంద్రంగా చేసు కుని ఎప్పటిలాగే బస్సులు తిప్పుకోవచ్చనేది వారి ఎత్తుగడ. ఆ వెంటనే అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా రద్దు చేయించుకుని తెలుగు రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనేది ఆలోచన. కిమ్మనని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు... నిబంధనలు బేఖాతరు చేస్తున్న వెయ్యి బస్సులపై అరుణాచల్‌ప్రదేశ్ కన్నెర్ర చేస్తే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కిమ్మనటం లేదు. స్థానికంగా నిబంధనల ఊసే లేకుండా యథేచ్ఛగా ఆ ప్రైవేటు బస్సులు తిరుగుతున్నా చిన్న చర్య కూడా తీసుకోవటం లేదు. దీన్ని ఆసరా చేసుకున్న ఆపరేటర్లు... ఢిల్లీలో లాబీయింగ్ ఫలించేవరకు తమ బస్సులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చక్రం తిప్పినట్టు సమాచారం. అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాలూకు ఆదేశాల కాపీ అందిన తర్వాత చర్యలు తీసుకుంటామంటూ రెండు రాష్ట్రాల రవాణాశాఖలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్ రవాణాశాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రతి అందుబాటులోకి వచ్చింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆదేశాలు ‘అధికారికంగా’అందాల్సి ఉందంటున్నాయి. ఎన్ఓసీతో తంటా... అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లను ఉపసంహరిం చుకుని తెలుగురాష్ట్రాల్లో నమోదు చేసుకోవాలంటే ఆ రాష్ట్రప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అరుణాచల్‌ప్రదేశ్ రవాణా శాఖ ఎన్ఓసీ ఇవ్వటం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల ద్వారా కథ నడిపిం చాలని వాటి నిర్వాహకులు యత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన బడా నేతలు కొందరు ఆ ‘భారం’భుజాలకెత్తుకున్నట్టు తెలిసింది. అరుణాచల్ కన్నెర్ర.... తమ రాష్ట్రంలో రిజిస్టర్ చేయించుకున్న బస్సులు నిర్ధారిత సమయంలో కచ్చితంగా తమ భూ భాగంలోకి రావాలన్న నిబంధనను ఉల్లంఘించటం తో అరుణాచల్‌ప్రదేశ్ వెయ్యి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కన్నెర్ర చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ట్రావెల్స్ నిర్వాహకులు తమ బస్సులకు టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజీ క్యారియర్లుగా తిప్పు తున్నారు. చట్టరీత్యా ఇది నేరం. కానీ ఇక్కడి ప్రభుత్వాలు కిమ్మనటం లేదు. తెలంగాణ ఆర్టీసీ వీటి మూలంగా సాలీనా రూ.800 కోట్లు నష్టపోతోంది. దీన్ని నివారించేందుకు రవాణాశాఖ–ఆర్టీసీకి సంయు క్తంగా ఓ నోడల్ అధికారిని స్వయంగా సీఎం కేసీఆరే నియమించినా లాభం లేకుండా పోయింది. అరుణా చల్‌ప్రదేశ్ ఉదంతం నేపథ్యంలో ఆర్టీసీ ముందుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా చర్యలు కనిపించటం లేదు. ఆ బస్సులు రిజిస్టర్ చేస్తే ఆందోళన.. అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో వేటుపడ్డ ప్రైవేటు బస్సులకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే ఆందోళనకు దిగు తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అటువంటి యోచనను విరమించుకోవాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు ఒక ప్రకటన చేశారు. ఏమిటీ 2 ప్లస్ 1? అరుణాచల్‌ప్రదేశ్, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో స్లీపర్ బస్సుల్లో 2 ప్లస్ 1 విధానంలో 36 బెర్తులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే బస్సులో ఆరు కంపార్ట్మెంట్లు... ఒక్కో దానిలో నాలుగు బెర్తులు ఏర్పాటు చేస్తారు. అంటే 24 బెర్తులు అవుతాయి. దీంతోపాటు మరోవైపు 12 సీట్లు ఏర్పాటు చేస్తారు. వాటిని కూడా స్లీపర్ సీట్లుగా పరిగణిస్తారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక్కో బస్సుకు పన్నురూపంలో ఏటా కేవలం రూ.18 వేలు చెల్లిస్తే సరిపోతుంది. అదే తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాంతో వారు అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. -
ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం
-
ప్రైవేటు జేబులోకి ఎర్రబస్సు ఆదాయం
ఆర్టీసీకి రోజూ రూ.8 కోట్ల నష్టం - నిబంధనలకు విరుద్ధంగా 2,174 ప్రైవేటు బస్సులు - కాంట్రాక్టు క్యారియర్ పర్మిట్లు.. స్టేజి క్యారియర్లుగా టూర్లు - దర్జాగా ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ - బస్టాండ్ల సమీపంలోనే ప్రైవేటు ట్రావెల్స్ దందా - అక్రమంగా 93 వేల ఆటోలు, ప్రైవేటు వాహనాలు - రూ. 4 వేల కోట్లకు చేరుకున్న ఆర్టీసీ నష్టాలు - యాజమాన్యం సర్వేలో బైటపడ్డ లెక్కలు - సంస్థ పరిరక్షణ కోసం సంఘాల ఆందోళనబాట సాక్షి,అమరావతి బ్యూరో: రోజుకు రూ.8 కోట్లు నెలకు రూ. 240 కోట్లు ఏడాదికి రూ. 2,880 కోట్లు అక్రమ రవాణా వాహనాల వల్ల ఆర్టీసీకి కలుగుతున్న నష్టం లెక్కలివి. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ఆర్టీసీ ఆదాయానికి ఏ మేరకు గండి కొడుతున్నాయో ఈ గణాంకాలే చెబుతాయి. రెండేళ్లపాటు ఈ అక్రమాలను అరికడితే చాలు ప్రజారవాణా వ్యవస్థ అప్పుల ఊబి నుంచి బైటపడి లాభాల బాట పడుతుంది. కానీ ప్రభుత్వ పాలకులకు ఎంతో చిత్తశుద్ధి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. రాష్ట్రంలో అక్రమ వాహనాల వల్ల ఆర్టీసీకి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ఈ నష్టం పరిమాణం ఎంత అనే దానిపై ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం ఓ సర్వే జరిపించింది. ఆ సర్వేలో నిర్ఘాంతపోయే నిజాలు బైటపడ్డాయి. అక్రమంగా నడుస్తున్న వాహనాల సంఖ్యతో పాటు వాటివల్ల ఆర్టీసీకి రోజుకు ఎంత మేర నష్టం వాటిల్లుతోందో లెక్కలన్నీ తేలిపోయాయి. ఆ వివరాలు.. ప్రైవేటు వాహనాలతో ఆర్టీసీకి భారీ నష్టం.. ఆర్టీసీ సంస్థకు నష్టం తెస్తున్న ప్రైవేటు వాహనాల అక్రమరవాణాపై యాజమాన్యం చేయించిన సర్వే ప్రకారం... రాష్ట్రంలో 2,174 ప్రైవేటు బస్సులు, 93 వేల ఆటోలు అక్రమంగా నడుస్తున్నాయని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులు, ఆటోల వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడి, నష్టాలు మిగులుతున్నాయి. రాజకీయ నేతల స్వార్థం, అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేటు అక్రమ రవాణా మాఫియా రెచ్చిపోతోంది. ప్రైవేటు బస్సులకు కాంట్రాక్టు క్యారియర్లుగా పర్మిట్లు తీసుకొని స్టేజి క్యారియర్లుగా నడుపుతూ, వాటికి ఆన్లైన్లో దర్జాగా టికెట్లు బుక్ చేస్తున్నారని వెల్లడైంది. ఆర్టీసీ బస్టాండ్ రెండు కిలో మీటర్ల దూరంలో మాత్రమే ప్రైవేటు వాహనాలను ఆపాలని మోటారు వాహనాల చట్టంలో నిబంధన ఉన్నా ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ట్రావెల్స్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకొని ఆర్టీసీకి రోజుకు రూ.4 కోట్లు ఆదాయానికి గండికొడుతున్నాయి. స్లీపర్ బస్సులకు ఆంధ్రాలో పర్మిట్లు బ్యాన్ చేశారు. గోవా, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో పర్మిట్లు పొంది మన రాష్ట్రంలో తిప్పుతున్నట్లు సర్వే బృందం గుర్తించింది. ప్రైవేటు బస్సుల వల్ల రూ. 4 కోట్లు నష్టం వాటిల్లుతుండగా ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల వల్ల రోజుకు మరో రూ. 4 కోట్లు నష్టం జరుగుతున్నట్లు సర్వేలో తేలింది. ఆర్టీసీ అప్పులు, నష్టాలు రూ.4 వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఒకప్పుడు దేశ రవాణా రంగానికే ఆదర్శంగా ఉంది. 12,500 బస్సులతో 58 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులతో నిత్యం 70 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రజారవాణా వ్యవస్థగా పేరుపొందింది. అయితే ప్రయివేటు వాహనాల అక్రమ రవాణా వల్ల సంస్థ నష్టాల బాటలో నడుస్తోంది. ఏ ఏటికాయేడు పెరుగుతున్న అప్పులతో ఆర్టీసీ మనుగడ కష్టంగా మారింది. రాష్ట్ర విభజనతో సుమారు రూ.1600 కోట్ల అప్పులు ఆర్టీసీకి గుదిబండగా మారాయి. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం ఎలాంటి చేయూతా ఇవ్వడం లేదు. దీంతో ఏటా నష్టాలు తప్పడంలేదు. 2016–17 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే సంస్థకు రూ.840 కోట్లు నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆర్టీసీ ప్రస్తుతం సుమారు రూ.4 వేల కోట్ల అప్పుల క్లబ్‌లోకి చేరింది. రోజుకు రూ.2 కోట్లు చొప్పున ఏడాదికి సుమారు రూ.750 కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోంది. అక్రమ రవాణాను కట్టడి చేయాలి.. అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రోజుకు కోట్లలో నష్టాలు వస్తున్నాయి. వేలాది బస్సులు, ఆటోలు చట్టవ్యతిరేకంగా నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. లక్షల మంది ప్రయాణికులలో మమేకమైన ప్రజారవాణా వ్యవస్థను అందరం కాపాడుకోవాలి. రవాణా శాఖలో ఖాళీలను భర్తీ చేసి వారికి స్వేచ్ఛనివ్వాలి. ఉద్యోగులకు రక్షణనిస్తే ప్రైవేటు అక్రమ రవాణాను కట్టడి చేస్తారు. – పలిశెట్టి దామోదరరావు, ఈయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ప్రభుత్వం తేల్చకుంటే ఆందోళన అక్రమ రవాణాపై ప్రభుత్వం స్పందించి కట్టడి చేయాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఆర్టీసీని అందరం కలిసి రక్షించుకోవాలి. వేలాది వాహనాలు, ఆటోలు చట్టవ్యతిరేకంగా నడుస్తున్నాయి. దీనివల్ల ఆర్టీసీకి నష్టాలు వాటిల్లి సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. వేలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్టీసీని కాపాడుకుందాం. – వై.వి.రావు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు -
ప్రైవేటు స్పీడుకు కళ్లెం!
► ప్రైవేటు బస్సులకు ఎస్‌ఎల్‌డీ ఏర్పాటు ► తొలుత కాంట్రాక్ట్ క్యారియర్, స్కూలు బస్సులకు ► ట్యాంపరింగ్‌కు పాల్పడితే వాహనం సీజ్ విజయనగరంఫోర్ట్: గాలికన్నా వేగంగా దుసుకుపోతూ హడలెత్తించే ప్రైవేటు బస్సుల జోరుకు ఇక బ్రేక్‌లు పడబోతున్నట్టే. ప్రమాదాలకు కారణమవుతున్న అతివేగానికి కళ్లెం వేయాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. కాంట్రాక్ట్ క్యారియర్, స్కూలు బస్సులకు స్పీడ్ లిమిట్ డివైజ్(ఎస్‌ఎల్‌డీ) పరికరాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ఆంక్షలు పెట్టారు. ప్రతీ బస్సులో దీనిని అమర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఎల్‌డీ పరికరాన్ని ఏర్పాటు చేయని బస్సులపై దాడులు చేయనున్నారు. మోటారు వాహనాల చట్టంలో ప్రతీ వాహనం గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించకుండా ప్రయాణించాలి. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అత్యా«ధునిక పరిజ్ఞానంతో తయారైన బస్సులు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న బస్సు ప్రమాదాలకు అతివేగమే కారణమనిరుజువైంది. దీంతో మోటారు వెహికల్ చట్టం అమల్లోకి వచ్చింది. బస్సులతో పాటు వివిధ రవాణా వాహనాలకు ఎస్‌ఎల్‌డీలు ఏర్పాటు చేయాలని నిబంధన ఉంది. 1997 నాటి నిబంధనల ప్రకారం బస్సులు గంటకు 80 కిమీ, కారు 100కిమీ, లారీలు 80కిమీ, స్కూలు బస్సులు 60 కిమీ వేగంతో ప్రయాణించాలి. విదేశీ పరిజ్ఞానంతో తయారైన కార్లు, బస్సులు గంటకు 120 కిలోమీటర్లు లేదా అంతకు మించి వేగంతో దూసుకుపోతున్నాయి. మన దేశంలో రహదారుల వ్యవస్థ ప్రకారం గంటకు 80 నుంచి 100 కిలో మీటర్లు కంటే మించి వెళ్లేందుకు అనుకూలం కాదు. అన్ని బస్సులకూ ఇక తప్పనిసరి గత నెల 21వ తేదీన కాంట్రాక్ట్ క్యారియర్ వాహనాల యజమానులతో రవాణాశాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం సమావేశమై ఎస్‌ఎల్‌డీల గురించి వివరించారు. నిజానికి 2015 ఆక్టోబర్ నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన బస్సులకు ఈ నిబంధన అమల్లో ఉంది. అంతకు ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాల్లోనూ అమర్చుకోవాలని కమిషనర్ సూచించారు. వేగ నియంత్రణకు దోహదం ఎస్‌ఎల్‌డీ పరికరం బస్సులకు అమర్చడం వల్ల కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులకు అయితే గంటకు 80 కిలోమీటర్లు, స్కూలు బస్సులకు అయితే 60కిలోమీటర్లకు వేగాన్ని నియంత్రిస్తుంది. దీనివల్ల డ్రైవర్ వేగంగా వెళ్లాలన్నా అవకాశం ఉండదు. అయితే ప్రభుత్వం గుర్తించిన ఆటోమేటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ సెంటర్ పర్ అటోమోటివ్ టెక్నాలజీ సంస్థల నుంచే వీటిని తీసుకోవాలని సూచించింది. వీటికి మినహాయింపు ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలు, 9 సీట్ల సామర్ధ్యానికి మించని ప్యాసింజర్ తరహా వాహనాలు, 3.5 టన్నుల లోపు సామర్థ్యం గల రవాణా వాహనా లు, అగ్నిమాపక వాహనా లు, అంబులెన్సు, పోలీస్ వాహనాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఎస్‌ఎల్‌డీ తప్పనిసరి ముందుగా కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులకు స్పీడ్ లిమిట్ డివైజ్ పరికరాన్ని అమర్చుకోవాలి. అలా కాని పక్షంలో రవాణా కార్యాలయం నుంచి సంబం«ధించిన కార్యకలాపాలు సాగవు. పర్మిట్, రెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ మంజూరులో ఎస్‌ఎల్‌డీ పరికరాన్ని పరిశీలిస్తాం. అమర్చకపోతే పనులు చేయం. వారం రోజుల తర్వాత బస్సులపై దాడులు చేస్తాం. ఎస్‌ఎల్‌డీ ఏర్పాటు చేయకపోతే చర్యలు తీసుకుంటాం. – ఎం.కనకరాజు, ఇన్చార్జ్ ఆర్టీఓ -
ఇష్టా రాజ్యం
♦ పండగకు బస్ చార్జీల బాదుడు ♦ రవాణాశాఖ మంత్రి హామీ నీటి మూటలే ♦ ప్రైవేటు బస్సుల్లో 200 శాతం పెంపు ♦ ఆర్టీసీలో 50శాతం అదనం ♦ హడలిపోతున్న ప్రయాణికులు పండగలకు ప్రయాణమంటేనే సామాన్య ప్రజలు హడలెత్తిపోతున్నారు. సంక్రాంతి పండగకు ఆర్టీసీ చార్జీలు పెంచబోమని సాక్షాత్తు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. అరుుతే మంత్రి హామీ ప్రకటనలకే పరిమితమైంది. ప్రైవేటు బస్సుల యజమానులు సాధారణ టికెట్‌పై 200 శాతం అదనంగా చార్జీని పెంచేశారు. మేము ఏమి తక్కువ కాదన్న చందంగా ఆర్టీసీ సాధారణ టికెట్‌పై స్పెషల్ బస్సుల పేరుతో అదనంగా 50 శాతం పెంచేసింది. నెల్లూరు(టౌన్): పండగకు బస్సు చార్జీలు అమాంతంగా పెరగడంతో దూర ప్రాంతాల నుం చి జిల్లాకు వచ్చే ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉపాధి కో సం సుదూర ప్రాంతాలకు వెళ్లి సంపాందించుకున్న మొత్తంలో కొంత మొత్తం బస్ టికెట్లకు పోతుందని పలువురు ప్ర యాణికులు వాపోతున్నారు. ఇతర ప్రాం తాల నుంచి నెల్లూరుకు ఈ నెల 10 నుం చి 12 తేదీ వరకు, మళ్లీ నెల్లూరు నుంచి ఇతర ప్రాంతాలకు 15 నుంచి 17వ తేదీ వరకు ప్రయాణానికి డిమాండ్ ఉంటుంది.ఇప్పటికే ఆయా ప్రాంతాలకు బస్సులు సీట్లు ఫుల్ అరుునట్లు చెబుతున్నారు. నెల్లూరు నుంచి ప్రైవేటు బస్సులు సుమారు 70కు పైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ తిరుగుతుంటారుు. వీటితో పాటు విజయవాడ, గుంటూరు, వైజాగ్ నుంచి చెన్నై, బెంగళూరులకు పదుల సంఖ్యలో బస్సులు ప్రయాణికులను చేరవేస్తుంటారుు. జిల్లా నుంచి ఉద్యోగం, వ్యాపారం, బతుకుదెరువు కోసం ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, చెన్నై తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రధాన పండగలకు సొం త గ్రామాలుకు రావడం పరిపాటిగా మా రింది. అరుుతే సంక్రాంతి మూడు రోజులు పండగ కావడంతో ప్రతి ఒక్కరూ సొంత ఊరికి రావాలన్న ఆశను ప్రైవేటు, ఆర్టీసీ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నారుు. ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సులు ఏసీ, స్లీపర్ పేరుతో సాధారణ టికెట్‌పై అదనంగా 200శాతం చార్జీలు పెంచగా, ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో టికెట్‌పై అదనంగా 50శాతం చార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి అడ్డంగా దోచేసుకుంటున్నారనే ఆరోపణలున్నారుు. చోద్యం చూస్తున్న అధికారులు ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు పెంచిన టికెట్ ధరలను ఆన్లైన్లో ఉంచినా చర్యలు తీసుకోవాల్సిన రవాణా అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నారుు. కాంట్రాక్టు పద్ధతిన పర్మిట్ పొందిన ప్రైవేటు యాజమాన్యం స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్నా చర్యలు నామమాత్రంగా ఉన్నారుు. నెలవారి అందుతున్న ముడుపులు కారణంగానే మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నారుు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే అధికశాతం ప్రైవే టు బస్సులను నడుపుతుండటంతో వాటి జోలికి వెళితే ఎలాంటి పరిస్ధితి ఎదుర్కొవాల్సి వస్తుందొనన్న భయంతో మామూళ్లతో సరిపుచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నారుు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అధిక చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. మార్గదర్శకాలు రావాల్సి ఉంది ఇటీవలే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులతో సమావేశం నిర్వహించి వారికి కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. కమిషనర్ నుంచి మాకు కూడా గైడ్లైన్స రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే వాటి ప్రకారం చర్యలు తీసుకుంటాం. నాలుగు రోజులక్రితం ప్రైవేటు బస్సులపై తనిఖీలు నిర్వహించి 30 కేసులు నమోదు చేశాం. - ఎన్.శివరాంప్రసాద్,ఉపరవాణా కమిషనర్, రవాణాశాఖ -
రెండు ప్రైవేట్ బస్సులు సీజ్
అనంతపురం సెంట్రల్ : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగానే అనంతపురం నగర సమీపంలోని తపోవనం, గుత్తి టోల్‌ప్లాజా వద్ద చేసిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 10 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు మోటర్ వెహికల్ ఇ¯Œ్సపెక్టర్ వరప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించకుండా బెంగుళూరు టూ హైదరాబాద్‌కు తిరుగుతున్న ఆరంజ్ ట్రావెల్స్, పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరుగుతున్న బీఎల్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. -
ఆర్టీసీ ఆదాయానికి ప్రై‘వేటు’
లాభదాయక రూట్లలో ఆటోలు, మినీబస్సులు ఏడాదికి రూ.24కోట్ల నష్టం –అధికారుల నిర్లప్తత ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఆదాయానికి ప్రైవేటు సర్వీసులు గండికొడుతున్నాయి. జిల్లాలోని లాభదాయక రూట్లలో వాహనాలను తిప్పుతూ కోట్లు కొల్లగొడుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన ఆర్టీసీ అధికారులు నిర్లప్తత ప్రదర్శిస్తున్నారు. ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల వల్ల ఆదాయాన్ని కోల్పోయిన ఆర్టీసీకి కొత్త పోటీ ఎదురైంది. కొన్ని ప్రధాన రూట్లలో ప్రైవేటు యాజమాన్యాలు మినీబస్సులను నడుపుతున్నాయి. ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఆటోలు, మినీబస్సుల వల్ల జిల్లావ్యాప్తంగా సంస్థ ఏడాదికి రూ.24కోట్లు నష్టపోతోంది. అయినా అధికారుల్లో చలనం లేదు. ప్రైవేటు వాహనాలను నియంత్రించలేకపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలోని ఆదాయం అధికంగా వచ్చే ప్రధాన రూట్లపైనే ప్రైవేటు యాజమాన్యాలు దృష్టిసారించాయి. కొన్ని రూట్లలో మినీబస్సులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం, ఏలూరు మధ్య మినీబస్సులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. ఈ బస్సులన్నీ నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నాయి.వాస్తవానికి జిల్లాలో సుమారు 300 మినీ బస్సులు, ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వీలున్న వాహనాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదానికీ స్టేజ్ కార్యిరియర్ పర్మిట్లు ఇవ్వలేదు. అయినా మినీబస్సులు స్టేజ్ క్యారియర్లుగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద నుంచే ప్రయాణికులను ఎక్కించుకుపోతున్నాయి. బస్టాండ్లకు సుమారు కిలోమీటర్ల దూరంలో నిలుపుకోవాలన్న నిబంధననూ తుంగలో తొక్కుతున్నాయి. ఆటోలదీ అదే తీరు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీని ఘోరంగా దెబ్బతిసిన ఆటోలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనికి ఆర్టీసీ ప్రజలకు సరైన సేవలు అందించకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఆర్టీసీ సర్వీసులు సమయపాలన పాటించకపోవడం, ఎక్కువ సర్వీసులను తిప్పలేకపోవడం వల్ల గ్రామీణులు ఆటోలపై ఆధారపడుతున్నారు. వాటిల్లో ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా తప్పక ప్రయాణిస్తున్నారు. కొందరు ఆటోవాలాలు నిబంధనలను మీరుతున్నారు. నిబంధనల మేరకు ఆటోలు జాతీయ రహదారులపై తిరగకూడదు. చిన్న ఆటోలో నలుగురిని, పెద్ద ఆటోలో ఏడుగురిని మాత్రమే ఎక్కించుకోవాలి. కానీ చిన్న ఆటోల్లో సుమారు 8 మందిని, పెద్ద ఆటోల్లో 12 మందిని ఎక్కించుకుంటున్నారు. నియంత్రణ కరువు ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న ప్రైవేటు వాహనాలను నియంత్రించే చర్యలను ఆ సంస్థ అధికారులు చేపట్టడం లేదు. . ప్రైవేటు వాహనాలను నిరోధించే నిమిత్తం రవాణా శాఖకు చెందిన ఒక ఎంవీఐ (బ్రేక్ఇన్స్పెక్టర్)కు ఆర్టీసీ జీతం ఇస్తూ సంస్థకు చెందిన జీపునూ ఇస్తోంది. ఆయన జిల్లా వ్యాప్తంగా దాడులు చేసి ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ దిశగా చర్యల్లేవు. ప్రతి మూడునెలలకోసారి ఆర్టీసీ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ, ఉపరవాణా కమిషనర్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సభ్యులుగా ఉంటారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకూ ఆ కమిటీ రెండుసార్లు మాత్రమే సమావేశమైంది. ఈ సమావేశాల్లో కలెక్టర్, ఎస్పీ ప్రైవేటు వాహనాల నియంత్రణకు సలహాలు, సూచనలు ఇస్తున్నా.. అధికారులు పాటించడం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. రూ. 24 కోట్లు నష్టం ఈ ఏడాది ఆర్టీసీ ఏలూరు రీజియన్ ఇప్పటి వరకూ రూ.24 కోట్ల నష్టాల్లో నడుస్తోంది. ప్రైవేటు వాహనాలను నియంత్రించడానికి పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరిస్తున్నారు. మా సంస్థ సిబ్బంది కూడా కొంత మంది ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. బస్టాండ్ల వద్ద ప్రైవేటు వాహనాలను నియంత్రించడానికి కూడా కొంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. ఎస్.ధనుంజయ రావు, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సిబ్బంది నియామకం అవసరం ఆర్టీసీకి నష్టాలు రావడానికి ప్రధాన కారణం ప్రైవేటు వాహనాలే. ఆ విషయం యాజమాన్యానికీ తెలుసు. కానీ ఎప్పుడూ కార్మికులే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవడం బాధాకరం. ప్రైవేటు వాహనాలను నియంత్రిస్తే మరో 50 శాతం పైగా ఆదాయం సంస్థకు వస్తుంది. దీనికోసం మరింత మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. సంస్థ ఉద్యోగులతోనే ప్రైవేటు వాహనాల నియంత్రణ సాధ్యమవుతుంది. టి.పట్టాభిరామ్ దొర, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజనల్ కార్యదర్శి. -
ఎల్బీనగర్ లో ఆర్టీఏ తనిఖీలు
-
ఎల్బీనగర్ లో ఆర్టీఏ తనిఖీలు
-11 బస్సులు సీజ్ హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాల తీరు మారటం లేదు. సరైన పత్రాలు లేకుండా, లెసైన్స్ లేని డ్రైవర్లు తో ట్రావెల్స్ బస్సులను నడుపుతున్నారు. ఆర్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఎల్బీ నగర్లో శుక్రవారం అధికారులు తనిఖీలు చేపట్టారు. సుమారు 100 ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. అందులో 11 బస్సులకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. టాక్స్ చెల్లించని బస్సులకు జరిమానాలు విధించారు. -
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వాలి
వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి - క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున సహాయం చేయాలి - ప్రైవేటు బస్సు ప్రయాణికులని వదిలేయొద్దు - టీడీపీ నాయకులే ప్రైవేటు బస్సులు నడుపుతున్నారు - జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని ట్రావెల్స్ బస్సులే ఎక్కువ - ఖమ్మంజిల్లా బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున చెల్లించి ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న బస్సు దారి మధ్యలో ప్రమాదానికి గురై 10 మంది చనిపోవడం, మిగిలిన వాళ్లకు గాయాలు కావడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. అది మా బస్సు కాదు, మాకు సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకోకుండా... ఈ ప్రమాదంలో నష్టపోయిన వారికి, చనిపోయిన ప్రతి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు నాయకన్‌గూడెం చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, స్థానికులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుల్లో ఎనిమిదిమంది ఆంధ్రప్రదేశ్, మరో ఇద్దరు తెలంగాణవారున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న వారిని ఓదార్చారు. అందరికీ భరోసానిస్తూ, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మణ్‌రావు, డీసీహెచ్ ఆనందవాణితో చర్చించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని మమత ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. అనంతరం మృతదేహాలను సందర్శించారు. తిరిగి 3.30 గంటలకు ఆయన హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు... నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వరకు, అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లేవరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి వైఎస్.జగన్మోహన్రెడ్డితో కలిసి బాధితులను పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణ నిధి, వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి చెలమలశెట్టి సునీల్, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు బి.వి.రమణ, కాపా వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తిమ్మలపల్లి భాస్కర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు జిల్లేపల్లి సైదులు, మందడపు వెంకట్రామిరెడ్డి, ఆలస్యం సుధాకర్, సహాయ కార్యదర్శి బండ్ల సోమిరెడ్డి, కుర్సం సత్యనారాయణ, సంపెట వెంకటేశ్వర్లు, జమలాపరం రామకృష్ణ, అన్నపూర్ణ, దీపక్, ఉదయ్ కుమార్, ఫిరోజ్, మేడిశెట్టి యాదగిరి తదితరులున్నారు. టీడీపీ నాయకులవే ప్రైవేటు బస్సులు.. ప్రైవేటు బస్సులు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయని, వాటికి రక్షణ లేకుం డా పోవడానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని జగన్ ధ్వజమెత్తారు. ఆస్పత్రి ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ప్రైవేటు బస్సుల వ్యాపారాలు చేస్తున్నందువల్లే వాటిని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. తరచూ జరుగుతున్న ప్రమాదాలకు ఇదే కారణమని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జేసీ దివాకర్‌రెడ్డి, కేశినేని నానికి చెందిన ట్రావెల్స్ బస్సులే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయంలో తాను రాజకీయాలు చేయదల్చుకోలేదని, మానవతా దృక్పథంతో ఆలోచించి ముందుకొచ్చి బాధితులను ఆదుకోవాలని జగన్ విజ్ఞప్తిచేశారు. బాధితులను పరామర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు వచ్చినా, రాకపోయినా ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రుల గాయాలు మానేవరకు వారి కుటుంబాలకు రూ.50 వేలు ఇవ్వాలన్నారు. ప్రైవేటు బస్సులో ప్రయాణించే ప్రతీ వారికి థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుందని, ఈ బస్సుకు సంబంధించిన బీమా త్వరితగతిన ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అదే బ్రిడ్జి వద్ద జూన్ 24వ తేదీన బస్సు ప్రమాదం జరిగి ఒక చిన్నపాప నీళ్లల్లో పడి చనిపోయిన ఘటనను గుర్తుచేశారు. రెండు నెలలు గడవకముందే మరోసారి అదే బ్రిడ్జి వద్ద మరో బస్సు ప్రమాదానికి గురికావడం విచారకరమన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, బ్రిడ్జికి మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. -
15 ప్రైవేట్ బస్సులపై కేసులు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ సమీపంలోని ముంబై హైవేపై బుధవారం తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులను, ఏడు లారీలపై కేసులు నమోదు చేశారు. -
వనస్థలిపురంలో నాలుగు బస్సులు సీజ్
అక్రమార్కులపై అధికారులు కొరడా విదిల్చారు. మంగళవారం ఉదయం వనస్థలిపురం పరిధిలోని చింతల్ కుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. -
కూకట్‌పల్లిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు
కూకట్‌పల్లిలో మంగళవారం ఉదయం ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 7 ప్రైవేటు స్కూలు బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. మూడు బస్సులను సీజ్ చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ప్రయివేటు బస్సుల దోపిడీ
► పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన ప్రయాణికుల రద్దీ ► విజయవాడ - హైదరాబాద్ బస్సులకు డిమాండ్ ► డబల్ చార్జీ వసూలు చేస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ ► ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ సర్వీసు పేరిట బాదుడు విజయవాడ : పెళ్లిళ్ల సీజన్లో ప్రయివేటు బస్సులకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ప్రయివేటు ఆపరేటర్లు అమాంతం రేట్లను పెంచేసి పయాణికులను నిలువునా దోచేస్తున్నారు. ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ప్రయివేటు బస్సుల్లో ఆదివారం చార్జీలను రెట్టింపునకు పైగా పెంచారు. ఈ నెల 25వ తేదీన వివాహాలు, ఇతర శుభకార్యాలు అధికంగా ఉండటంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణికుల రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రోజూ 187 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుం టాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీ నుంచి కూడా 50 బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఆదివారం విజయవాడ నుంచి అదనంగా 82 ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు పూర్తిగా బుక్ కావడంతో ప్రయాణికులు ప్రయివేటు బస్సుల వైపు ఎగబడ్డారు. దీంతో నగరం నుంచి ైహైదరాబాద్ వెళ్లే ప్రయివేటు బస్సుల చార్జీలను హైస్పీడులో పెంచేశారు. సాధారణ రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ మధ్య 500 నుంచి 700 ప్రయివేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. మామూలు రోజుల్లో 10 నుంచి 50 శాతం వరకు ఆన్లైన్లో చార్జీ తగ్గించి ఆఫర్లు ప్రకటిస్తున్న ప్రయివేటు ఆపరేటర్లు పెళ్లిళ్ల సీజన్లో జబర్దస్తీగా టికెట్ల ధరలు పెంచేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు సాధారణ రోజుల్లో ఏసీ బస్సుల్లో రూ.500 నుంచి రూ.600 చొప్పున చార్జీ వసూలు చేసేవారు. రద్దీ పెరగడంతో ఆదివారం ఏసీ ప్రయివేటు బస్సు చార్జీ రూ.1500 వరకు పలికింది. అదే స్లీపర్ కోచ్‌ల్లో రూ.2,200 వసూలు చేశారు. ప్రయివేటు ఆపరేటర్లు అందరూ ఇదే తరహాలో అధిక చార్జీలు వసూలు చేశారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య నాన్ ఏసీ బస్సుల్లో రూ.400 చొప్పున ఉండే చార్జీని రూ.700 వరకు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం అధిక చార్జీ ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధికంగా చార్జీ వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే సూపర్ లగ్జరీ సర్వీసు చార్జీ రూ.269. అయితే ప్రత్యేక సర్వీసుల్లో రూ.404 చొప్పున వసూలు చేశారు. ఏసీ ప్రత్యేక సర్వీసుల్లో కూడా టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు పెంచారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే గరుడ చార్జీని రూ.559 నుంచి రూ.839కి పెంచారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన సర్వీసులు సిటీ బస్సులు, పల్లె వెలుగు సర్వీసుల్లో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతూ హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు సాగించారు. -
అక్రమంగా తిరుగుతున్న రెండు బస్సులు సీజ్
ఎలాంటి అనుమతులు, రూట్ పర్మిట్ లేకుండా తిరుగుతున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను నల్గొండ జిల్లా భువనగిరిలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి మంగళవారం పట్టుకున్నారు. బ్లూమూన్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ప్యాసింజర్లను తరలిస్తుండగా భువనగిరిలో పట్టుకున్నారు. వీరిపై కేసులు బుక్ చేసి.. బస్సులను సీజ్ చేశారు. -
ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని ఎల్బీనగర్లో శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహిస్తున్న అధికారులు నిబంధనాలను అతిక్రమించి రాకపోకలు సాగిస్తున్న బస్సులను సీజ్ చేశారు. మరో 5 బస్సులపై కేసులు నమోదు చేశారు. -
టెక్కలిలో 5 బస్సులు సీజ్
నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5 ప్రైవేటు ట్రాన్స్‌ఫోర్ట్ బస్సులను రవాణాశాఖాధికారులు టెక్కలి సమీపంలో సీజ్ చేశారు. వీటిపై గతంలో కూడా ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
ప్రైవేట్ బస్సుల దారి దోపిడీ
హైదరాబాద్: రవాణా రంగంలో మాఫియాగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున దారి దోపిడీకి పాల్పడుతున్నారని, ఏటా రూ. 1,500 కోట్ల నుంచి రూ. రెండు వేల కోట్ల వరకు అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలంగాణ ఉద్యమ వేదిక నేత చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్టీసీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొట్టడమే కాకుండా ప్రజలను నిలువునా దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బచావో తెలంగాణ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ ఆనందరావులతో కలసి ఆయన మాట్లాడారు. వివిధ పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేందుకు సుమారు 830 బస్సులు 33 రూట్లలో అధికారికంగా పర్మిట్లు తీసుకున్నప్పటికీ.. అనధికారికంగా రెండు వేల బస్సులు తిరుగుతున్నాయని ఆరోపించారు. ఒకే నంబర్‌పైన 2 నుంచి 4 బస్సులు అక్రమంగా తిరుగుతున్నాయన్నారు. ప్రైవేటు బస్సుల వల్ల ఆర్టీసీకి ఏటా రూ. 420 కోట్ల నుంచి రూ. 450 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందన్నారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన బస్సులు స్టేజీ క్యారేజీలుగా ప్రతి ఊళ్లో ఆగుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 6 రకాల ఆన్లైన్ సంస్థలు ప్రైవేట్ సంస్థలకు బుకింగ్ ఏజెన్సీలుగా పని చేస్తున్నాయని, ఇవి కాకుండా పలు ట్రావెల్స్ సైతం అక్రమంగా ప్రయాణికులను బుక్ చేసి తరలిస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వీటిపై వెంటనే ప్రభుతం చర్యలకు ఉపక్రమించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. -
ఆర్టీఏ అధికారుల తనిఖీలు: 10 బస్సులు సీజ్
మెదక్ : మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి వద్ద బుధవారం రవాణాశాఖ అధికారులు (ఆర్టీఏ) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 ప్రైవేట్ బస్సులను సీజ్ అధికారులు చేశారు. అలాగే సరైన అనుమతి పత్రాలు లేకుండా నడుస్తున్న బస్సులకు అధికారులు అపరాధ రుసుం వసూలు చేశారు. ఆర్టీఏ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ ఆకస్మిక దాడులు
-
వాయువేగానికి కళ్లెం
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి బెంగళూరులో బయలుదేరే ప్రైవేటు బస్సులు తెల్లారేసరికి హైదరాబాద్ చేరుకుంటున్నాయి. ఎంత తొందరగా వాహనదారులను గమ్యస్థానానికి చేరిస్తే అంత డిమాండ్ పెరుగుతుందనేది ట్రావెల్స్ నిర్వాహకుల ఆలోచన. ఈ క్రమంలోనే భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బెంగళూరు నుంచి వేగంగా వస్తున్న బస్సు ప్రమాదానికి గురై 45 మంది సజీవదహనమైన దుర్ఘటన ఈ కోవలోదే. అయినా వాహనాలు ఇప్పటికీ రయ్‌మని దూసుకుపోతూనే ఉన్నాయి. ఇక వీటి జోరుకు కళ్లెం పడబోతోంది. వాయువేగంతో దూసుకెళ్లే అలాంటి వాహనాలు ఇక గంటకు గరిష్టంగా 80 కి.మీ.కు మించి వెళ్లకుండా అడ్డుకట్టపడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ వాహనాల వేగానికి పరిమితి విధిస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. 2015 అక్టోబరు 1న, ఆ తర్వాత తయారైన వాహనాలు కచ్చితంగా స్పీడ్ గవర్నర్ (వేగాన్ని నియంత్రించే పరికరం) కలిగి ఉండాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డంపర్లు, ట్యాంకర్లు, పాఠశాల బస్సులు, ప్రమాదకర రసాయనాలు, వస్తువులు తరలించే వాహనాలకు మా త్రం ఈ వేగ పరిమితి 60 కి.మీ.గా నిర్ధారించింది. వాహనం తయారీవేళలోనే వేగాన్ని అదుపు చేసే వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2015 అక్టోబరు 1 నుంచి రిజిస్టర్ అయిన వాహనాల్లో ఈ స్పీడ్ గవర్నర్ వ్యవస్థ లేకపోతే వాటి యజ మానులు 2016 ఏప్రిల్ 1 నాటికి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వీటికి మినహాయింపు: స్పీడ్ గవర్నర్ నిబంధన నుంచి ద్వి, మూడుచక్రాల వాహనాలు, ప్రయాణికులు, వారి వస్తువులు తరలించే చక్రాల వాహనాలు (8 మందికి మించని సామర్థ్యం), ఫైర్టెండర్స్(ఫైరింజన్లు), అంబులెన్సు లు, పోలీసు వాహనాలను మినహాయించారు. గందరగోళ నిబంధన: కొన్ని ప్రైవేటు లారీ యజమానుల సంఘాల ప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితులు ఇప్పుడు గందరగోళంగా మారాయి. వేగ నియంత్రణ పరికరాన్ని ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి తయారైన వాహనాలకే పరిమితం చేయడంతో... పాత వాహనాలు వేగంగా వెళ్లొచ్చనే సంకేతాలి చ్చినట్లయింది. ప్రమాదాల నియంత్రణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం నీరుగారుతుందనే విమర్శలున్నాయి. ఇప్పటికే రోడ్డు మీద పరుగుపెడుతున్న వాహనాలు అమిత వేగంతో వెళ్లడం, కొత్త వాహనాలు 80 కి.మీ. వేగంతో వెళ్లడం.. వెరసి ఈ నిర్ణయం గందరగోళంగా మారింది. -
ఆర్టీసీ ఆదాయానికి ప్రైవేటు గండి
పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల లోపు ప్రైవేట్ బస్సులుంటే.. ఉపేక్షించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు చేపడతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్న మాటలు నీటిపై రాతలుగా మారుతున్నాయి. నిత్యం బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ బస్సులు దందా చేస్తున్నా..పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ దోపిడీకి అంతులేకుండా పోతోంది. వివరాల్లోకి వెళితే... నగరంలోని ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్‌కు నిత్యం లక్ష మందికి పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరేందుకు వస్తుంటారు. ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచక పోవడం వల్ల నిత్యం వందలాది ప్రైవేటు వాహనాలు నగరం నుంచి ప్రయాణికులను తీసుకెళ్తున్నాయి. నగరంలో 250కి పైగా ట్రావెల్స్ కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో 30 ట్రావెల్స్ వరకు ఆర్టీసీ బస్టాండ్‌కు అతి సమీపంలోనే ఉన్నాయి. ఆర్టీసీ టిక్కెట్ ధరల కంటే ప్రైవేటు వాహనాలు అధిక ధర వసూలు చేస్తున్నా ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో తరలి వెళ్తున్నారు. రోజూ 200కు పైగా బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు నడుస్తున్నాయి. తద్వారా ఆర్టీసీకి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఎన్టీఆర్ బస్టాండ్ ఎదుటే ప్రయాణికులను ఎక్కించుకువెళ్లడం మామూలైపోయింది. రాత్రి సమయంలో ట్రావెల్స్ వాహనదారులు బస్టాండ్‌లోకి వెళ్లి మరీ పలు ప్రధాన ప్రాంతాలకు వెళ్లే ప్లాట్‌ఫాంలపై ఉన్న ప్రయాణికులను ఎక్కించుకెళ్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ‘‘డబ్బుల్’’ ధ మాకా.... ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు బస్టాండ్‌కు వచ్చి సమయానికి బస్సు లేకపోవడమో, ఉన్నా సీట్లు లేకపోవడమో జరిగితే ట్రావెల్స్ వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రావెల్స్ వాహనాల్లో ఆర్టీసీ టిక్కెట్‌తో పోలిస్తే రెట్టింపు వసూలు చేస్తున్నారని, అదేమని అడిగితే ఆ బస్సులకీ ఈ బస్సులకీ తేడా ఉంది.. ఇష్టమైతే ఎక్కండి.. లేకపోతే లేదంటూ డిమాండ్ చేస్తుంటారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్ధాయి సౌకర్యాలు లేకపోవడం ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తే ఎట్టిపరిస్ధితుల్లోనూ ఉపేక్షించం. పూర్తి స్ధాయిలో సిబ్బందితో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్సులు నిలవకుండా చర్యలు చేపడుతున్నాం. పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి మరింత దృష్టి సారిస్తాం. రవాణా, పోలీసు శాఖ అధికారులకు ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరంపై ఫిర్యాదు చేయనున్నాం. ఆర్టీసీ యూనియన్ నేతలతో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్‌కు అడ్డుకట్ట వేస్తాం. - జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్ఎం -
ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల కొరడా
ఎల్బీనగర్ (హైదరాబాద్): ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝుళిపించారు. బుధవారం తెల్లవారుజామున ఎల్బీనగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఐదు ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేయగా, మరో ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. -
ఆర్టీఏ అధికారులు తనిఖీలు: ప్రైవేట్ బస్సులు సీజ్
హైదరాబాద్ : నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట వద్ద జాతీయ రహదారిపై అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ట్యాక్స్ చెల్లించని నాలుగు ప్రైవేట్ వాహనాలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం బస్సులను ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. -
హైదరా బాదుడే
రాజమండ్రి :రాజధాని హైదరాబాద్ ప్రయూణం జిల్లావాసులకు అదనపు భారం కాబోతోంది. తెలంగాణ ప్రభుత్వం వాహనాల ప్రవేశపన్ను విధించడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై మోపేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే టిక్కెట్ రేటును రూ.100 వరకు పెంచనున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన జరిగినా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అంతే కాక జిల్లాలో దాదాపు ప్రతి ఊరూ ఆ నగరంతో అనుబంధం కలిగి ఉంది. అందుకే అక్కడికి నిత్యం వేలాది మంది వెళుతుంటారు. ఇక వేసవి సెలవుల్లో అరుుతే చెప్పనక్కర లేదు. పరిమిత సంఖ్యలో ఉన్న రైళ్లు, ఆర్టీసీ బస్సులు జిల్లా నుంచి రాజధానికి వెళ్లే వారి అవసరాలు తీర్చలేకపోవడంతో 70 శాతం మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైనే ఆధారపడుతున్నారు. జిల్లాలో ఆర్టీసీ కూడా సర్వీసులు వేయని మారుమూల ప్రాంతాల నుంచి సైతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ సర్వీసులు నడుపుతున్నారుు. జిల్లా నుంచి హైదరాబాద్‌కు రోజుకు 150 నుంచి 170 వరకు బస్సులు వెళ్తుంటాయి. ఆర్టీసీ అమలాపురం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు 12 బస్సులు నడుపుతుంటే, 20 పైగా ప్రైవేట్ సర్వీసులున్నాయి. పన్ను బరువు.. ప్రయూణికులపైనే.. తెలంగాణ ప్రభుత్వం ఈనెల ఒకటి నుంచి వాహనాలపై ప్రవేశ పన్ను విధించడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇలా అయితే బస్సులు తిప్పలేమని మూడొంతుల సర్వీసులు నిలిపివేశారు. కోర్టు సైతం పన్ను కట్టాలని చెప్పడంతో విధిలేక ఇప్పుడిప్పుడే పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అయితే తమపై పడుతున్న పన్నుభారాన్ని ప్రయాణికులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు. టిక్కెట్ ధర రూ.100 వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. అమలాపురం నుంచి హైదరాబాద్‌కు ఇప్పటి వరకు రూ.500 నుంచి రూ.550 వరకు ఉం డగా త్వరలో ఇది రూ.600 నుంచి రూ.650 వరకు, కాకినాడ నుంచి రూ.650 నుంచి రూ.700 వరకు ఉన్న చార్జిలు రూ.750 నుంచి రూ.800 వరకు, రాజమండ్రి నుంచి రూ.610 నుంచి రూ.660 వరకు ఉన్న చార్జిలు రూ.710 నుంచి రూ.760 వరకు, తుని నుంచి రూ.650 -రూ.700 మధ్య ఉన్న ధరలు రూ.750 నుంచి రూ.800 వరకు పెరగనున్నారుు. ఈ పెంపు రెండు మూడు రోజుల్లోనే విధించే అవకాశముందని ప్రైవేట్ ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రత్యేక బస్సులు, రైళ్ల సంఖ్య పెంచాలి.. వేసవి సెలవుల్లో జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ఎక్కువ. ఇప్పటికే ఇంటర్, పది, డిగ్రీ పరీక్షలు పూర్తికాగా, పాఠశాలల్లో మిగిలిన తరగతుల పరీక్షలు కూడా పూర్తి కావస్తున్నాయి. జిల్లాలో ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నారు. దీనితో కుటుంబమంతా కలిసి హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది. జిల్లా మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే రైళ్లలో రిజర్వేషన్లు దాదాపు నెలరోజుల వరకూ ఇప్పటికే భర్తీ అయిపోయూయి. గౌతమి, గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్ వంటివే కాక నాగావళి వంటి వారానికి మూడుసార్లు నడిచే రైళ్లలో సైతం మే 25 వరకు ఖాళీలు లేవు. అదే రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో సైతం టిక్కెట్లు దాదాపు రిజర్వ్ అరుుపోరుున పరిస్థితి ఉంది. దీనితో అనేకులకు ప్రైవేట్ బస్సులే శరణ్యమవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలు పెంచడంతో సరదాగా సెలవులు గడిపేందుకు హైదరాబాద్ వెళ్లాలనే వారికి ప్రయూణం భారంగా మారనుంది. దీనికి విరుగుడుగా వేసవిలో ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు, రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేలా ప్రభుత్వం పూనుకోవాలి. -
రాబడి చక్రాలపై రయ్ రయ్
ఏపీఎస్ఆర్టీసీకి వరంగా మారిన ఎంట్రీ ట్యాక్స్ 30 శాతాన్ని దాటిన ఆక్యుపెన్సీ ప్రైవేటు బస్సుల జోరుకు కళ్లెం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ ట్యాక్స్ (ప్రవేశ పన్ను)... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ)కి వరంగా మారింది. మూడు రోజులుగా రాబడి పెరిగింది. ఎంట్రీ ట్యాక్సుతో స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల జోరు కూడా తగ్గింది. దీంతో అత్యధికశాతం మంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ఆక్యుపెన్సీ రేటు 30 శాతాన్ని మించుతోంది. ఇదిలాగే కొనసాగితే ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ నడిపే సూపర్ డీలక్స్, హైటెక్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వల్ల ఆర్టీసీ ఆదాయం రూ.కోటి దాటుతుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ... హైదరాబాద్ నగరానికి సుమారు 800 బస్సులను నడుపుతోంది. మరోవైపు అన్ని ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యి బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతున్నారు. గతంలో ప్రైవేటు బస్సులు పెద్దసంఖ్యలో ప్రమాదాలకు గురైనపుడు...ముఖ్యంగా షిర్టీ సమీపంలో ప్రమాదం జరిగిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్న ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ అధికారులు కట్టడి చేశారు. దీంతో అప్పట్లో ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగింది. మళ్లీ ప్రైవేటు బస్సులపై ఎంట్రీ ట్యాక్స్ ప్రభావం కారణంగా ఆ పరిస్థితి పునరావృతమైంది. నిబంధనలు గాలికి: ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు క్యారియర్లుగా తిరగాల్సిన ప్రైవేటు బస్సులను ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటూ స్టేజి క్యారియర్లుగా నడుపుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండడంతో రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాన్ని కాగ్ తప్పు పట్టినా ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రైవేటు బస్సుల విషయమై రవాణా శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిపైనా ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల మేరకు ప్రైవేటు బస్సులను నడుపుకునే అనుమతి ఇవ్వాలని, అప్పుడే ఆర్టీసీకి మనుగడ ఉంటుందని యూనియన్ నేతలు కోరుతున్నారు. -
రైట్ రైట్..
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు {పైవేట్ బస్సులకు కాస్త ఊరట రోడ్డెక్కిన ప్రైవేట్ బస్సులు ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు సరుకు వాహనాలకు తప్పని పన్ను పోటు విశాఖపట్నం: తెలంగాణవైపు వాహనాలు ఎట్టకేలకు బుధవారం కదిలాయి. ప్రయాణికులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తెలంగాణలో ప్రవేశం కోసం అంతరాష్ట్ర పన్ను చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి ఏపీ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రైవేట్ బస్సులను ఆపివేశారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వాహన యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన ఆపరేటర్లు పన్నులు చెల్లిస్తామని హామీ పత్రాలు ఇస్తే సరిపోతుంది. ఈనెల 7న విచారణ అనంతరం పన్ను చెల్లింపుపై ప్రకటన ఉంటుందని కోర్టు తెలపడంతో బస్సుల ఆపరేటర్లు విశాఖలో బుకింగ్‌లు తెరిచారు. సరుకు వాహనాలపై ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో లారీలు, ట్రాలర్లు, ఆయిల్ ట్యాంకర్లు విశాఖ నుంచి తెలంగాణాలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపడం లేదు. విశాఖ నుంచి ఆయా ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల నుంచి వేలాది టన్నులుగా స్టీల్ ప్లాంట్ ఐరన్, ఎరువులు, బొగ్గు, పోర్టుల నుంచి ముడి సామాగ్రి తెలంగాణా జిల్లాలకు సరఫరా అవుతోంది. తెలంగాణాలోని వివిధ సిమెంట్ ఫ్యాక్టరీలకు స్లాగ్, తదితర సామాగ్రి వెళ్తోంది. సరుకు రవాణా గణనీయంగా తగ్గింది. టన్ను కిరాయిలో మార్పులేకపోవడంతో పన్ను అదనపు భారంగా భావిస్తోన్న యజమానులు వాహనాలను పంపించడంలేదు. దరలు ఇలా ఉండవచ్చు... నేషనల్ పర్మిట్ ఉన్న లారీలు, భారీ తరహా వాహనాలకు అనుమతి ఉంటుంది. రాష్ట్ర పరిధి గల పర్మిట్లకు తెలంగాణాలోకి ప్రవేశం కోసం పర్మిట్ రుసుం చెల్లించాలి. కాంట్రాక్ట్ క్యారియర్ బస్సులకు ప్రస్తుతం ఒక్కో సీటుకు రూ.2,650 ఉండగా ఇకపై అదనంగా దాదాపు వెయ్యి రూపాయలు పెరగనుంది. లారీలకు టన్నుల సామర్థ్యం, యాక్సిల్ సంఖ్యను బట్టి కనిష్టంగా పది టన్నుల లారీకి రూ.1,500 గరిష్టంగా ఐదు యాక్సిల్ వాహనాలకు రూ.6,500 తెలంగాణాలో పన్ను విధించవచ్చు. నేషనల్ పర్మిట్ కలిగి ఉంటే రాష్ట్రంలో ప్రవేశం కోసం మెకానికల్, యూజర్, సర్వీస్ ఛార్జీలుగా రూ.500 నుంచి రూ.1,500 వసూలు చేయవచ్చు. త్రైమాసిక పన్నుల చెల్లింపు వాహనం రిజిస్ట్రేషన్ కాబడ్డ రాష్ట్రానికి పరిమితం కాగా అంతరాష్ట్ర వాహనాలకు ఆయా రాష్ట్రాల నిబంధనల ప్రకారం సరిహద్దులలో ఛార్జీలు వసూలు చేస్తారు. ఆర్టీసీకి పెరిగిన గిరాకీ... విశాఖ నుంచి హైద్రాబాద్‌కు ప్రైవేట్ టావెల్స్ ద్వారా దాదాపు 40 సర్వీసులు నడుస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు రాకపోకలకు వెనక్కి తగ్గడంతో మంగళ, బుధవారం ఆర్టీసీకి గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం హైద్రాబాద్‌కు మూడు వాల్వో, మూడు ఐదు లగ్జరీ, సెమి లగ్జరీ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఆర్టీసీ నడుపుతోంది. బుధవారం అదనంగా ఒక వాల్వో, మూడు లగ్జరీ బస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది. టికెట్ ధరలో ఎటువంటి మార్పులు లేకుండా ఆర్టీసీ ప్రయాణికులను ఆహ్వానించింది. నేషనల్ పర్మిట్‌తో కాస్త ఊరట... \సరుకులతో ప్రయాణించే నేషనల్ పర్మిట్ వాహనాలకు కాస్త ఊరట లభిస్తోంది. నేషనల్ పర్మిట్ కలిగి ఉన్న వాహనాలు ఆయా రాష్ట్రాలలోకి ప్రవేశించవచ్చు. కొన్ని రాష్ట్రాలలో మెకానికల్ ఛార్జీలు నామమాత్రంగా చెల్లించి రాకపోకలు చేయవచ్చు. తెలంగాణాలో పర్మిట్ కోసం పన్నులు చెల్లించాలని ఆంక్షలు ఉండటంతో నేషనల్ పర్మిట్ గల వాహనాలను అనుమతిస్తారు. లారీ ఆపరేటర్ల ఖండన తెలంగాణా ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశం కోసం ప్రవేశపెట్టిన పన్నుల విధానం విరమించుకోవాలని ది విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పీలా అప్పలరాజు, కోరుకొండ అర్జున్ డిమాండ్ చేశారు. పెరిగిన టోల్ ఛార్జీలు, వాహన పన్నులు, భీమా, ఇంధనం ధరలతో రవాణా రంగం ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైద్రాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండగా తెలంగాణా ప్రభుత్వం వాహనాలకు పన్నులు విధించడం సబబుగా లేదన్నారు. వాహనాల నుంచి పన్నులు రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించడాన్ని విమర్శించారు. -
జనం లేక...
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలపై పన్ను విధింపు వివాదం నేపథ్యంలో రెండో రోజైన బుధవారం కూడా నగరంలో కొన్ని ప్రైవేటు బస్సులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మరికొన్ని సర్వీసులు నడిచినా... ప్రయాణికులు లేక వెలవెలబోయాయి. -మన్సూరాబాద్ -
అప్పుడే వేయాల్సింది... కొత్త రాష్ట్రమని టైమిచ్చాం..
హైదరాబాద్ : నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలకు రోడ్డు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి వాహనాలకు ట్యాక్స్ వేయాల్సిందని అయితే కొత్త రాష్ట్రం కావటంతో కొంత సమయం ఇచ్చామన్నారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టే అక్కడి వాహనాలకు ట్యాక్స్ వేస్తున్నామన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన ఎంట్రీ ట్యాక్స్(ప్రవేశ పన్ను)తో రాకపోకలు స్తంభించాయి. మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాదుకు ఆగిన ప్రైవేటు బస్సులు
చిత్తూరు (అర్బన్): ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లే వాహనాలపై అంతర్రాష్ట్ర పన్నులు వసూలు చేయనుండటంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు బస్సులను వాటి నిర్వాహకులు నిలిపివేశారు. జిల్లా నుంచి హైదరాబాదుకు వెళ్లే దాదాపు 35 బస్సులు ఒక్కసారిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలకు మార్చి 31 అర్ధరాత్రి నుంచి పన్నులు వసూలు చేయాలని అక్కడి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటే జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు వెళ్లే బస్సులు పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఆలిండియా పర్మిట్ ఉన్న బస్సు ఒక సీటుకు రూ.3,675, రాష్ట్ర పర్మిట్ ఉన్న బస్సు ఒక సీటుకు రూ.2,625 చొప్పున తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్నులు తప్పనిసరిగా చెల్లించాలి. దీంతో ప్రైవేటు బస్సుల్ని వాటి నిర్వాహకులు అర్ధాంతరంగా ఆపేశారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటానికి ఆర్టీసీ అదనపు సర్వీసుల్ని ఏర్పాటు చేస్తోంది. -
ప్రైవేటుకు ‘ఎంట్రీ’ బ్రేకు
తెలంగాణ సర్కారు ప్రవేశ పన్ను విధింపుతో ఉభయ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సుల రాకపోకలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ఎంట్రీ ట్యాక్స్ సరిహద్దుల్లో పన్ను వసూలు కేంద్రాలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మూడు నెలల మొత్తాన్ని చెల్లిస్తేనే అనుమతి పన్నుపై కోర్టుకెక్కనున్న ఆపరేటర్లు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ప్రైవేటు బస్సులకు ట్యాక్స్ బ్రేక్ పడింది! తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చిన ఎంట్రీ ట్యాక్స్(ప్రవేశ పన్ను)తో రాకపోకలు స్తంభించాయి. మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీలోని 13 జిల్లాల్లో సుమారు 32 లక్షల లారీలు, 800కిపైగా ప్రైవేటు బస్సులున్నాయి. వీటిలో చాలావరకూ నిత్యం తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి రోజుకు 300 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. ఏపీ సరిహద్దుల్లోని గరికపాడు, తిరువూరు సమీపంలోని గంపలగూడెంలో తెలంగాణ ప్రభుత్వం.. రవాణా పన్నుల కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రతి లారీ తాత్కాలిక పర్మిట్ (నెలకు) కింద సుమారు రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆపరేటర్లు తమ తమ వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించారు. దీనిపై ప్రెవేట్ ఆపరేటర్లు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు విన్నవించారు. అయితే సీఎం చంద్రబాబు అందుబాటులో లేకపోవటంతో ప్రెవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లకు ఎలాంటి హామీ లభించలేదు. ఫలితంగా తెలంగాణ వైపు నడిపే బస్సుల్ని నిలిపివేస్తున్నారు. కృష్ణా జిల్లాలో టూరిస్ట్ ఆపరేటర్లుకు చెందిన బస్సులు 200 వరకు ఉన్నాయి. వీటిలో విజయవాడలోనే 150 దాకా ఉన్నాయి. గతంలో పెళ్లిళ్లులాంటి కార్యక్రమాల కోసం రాష్ట్రం నుంచి ఓ ప్రైవేటు బస్సు కోదాడకు వెళ్లాలంటే అద్దె కింద బస్సు యజమానులు రూ.12 వేలు తీసుకునేవారు. కానీ ఇప్పడు మూడు నెలల్లో ఒక్కసారి వెళ్లినా పర్మిట్కే రూ.14 వేలు చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వాహనాలకు ప్రస్తుతం ఎలాంటి ట్యాక్సులు లేవు. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక నిర్ణయం తీసుకొని దీనిపై ఓ ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు తెలంగాణ విధించిన ఎంట్రీ టాక్స్‌పై ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కోర్టుకు వెళ్లనున్నారు. ప్రయాణికుల ఇక్కట్లు... హైదరాబాద్ నుంచి ఏపీ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి రోజూ వివిధ ప్రాంతాలకు 500కు పైగా ప్రైవేట్ బస్సులు బయలుదేరుతాయి. పన్ను నేపథ్యంలో 85 శాతానికిపైగా బస్సులు రద్దయ్యాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మంగళవారం రాత్రి 10 గంటల వరకు 16 బస్సులే వెళ్లాయి. దీంతో ప్రయాణికులు వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ విఫలమైంది. -
బస్సులు ఖాళీ
హైదరాబాద్‌కు తగ్గిన రాకపోకలు ఆరుశాతం తగ్గిన ఆక్యుపెన్సీ ప్రైవేట్ బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఆదివారమూ అంతే సంగతులు రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌కు అంతరం పెరిగింది. విజయవాడ నుంచి భాగ్యనగరికి రాకపోకలు తగ్గిపోతున్నాయి. గతంలో నిత్యం వేలాదిమంది వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. తుళ్లూరును రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నారుు. హైదరాబాద్ బస్సులు ఖాళీగా తిరుగుతుండటంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం తగ్గడమే కాదు..ఆదాయానికీ భారీగానే గండి పడుతోంది. విజయవాడ : నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు రోజూ 240 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నారుు. రాత్రివేళల్లో సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు వెళ్తున్నారుు. వీటిద్వారా సుమారు 12వేల నుంచి 14వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వారాంతాల్లో మరో 20 శాతం ప్రయాణికులు అదనంగా ఉంటారు. ఇవికాకుండా వివిధ రైళ్లలో నిత్యం మరో రెండువేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో నగరం నుంచి హైదరాబాద్‌కు రోజుకు సగటున వెళ్లే వారి సంఖ్య మూడువేలకు తగ్గింది. ప్రజల్లో పొరుగు రాష్ట్రం అనే భావన రావడం, హైదరాబాద్‌కు వెళ్లకుండానే ఇక్కడే సాధ్యమైనంత వరకు పనులు పూర్తిచేసుకునే యత్నాలు చేస్తున్నారు. దీంతో రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇటు ఆర్టీసీకి, అటు ప్రైవేట్ ట్రావెల్స్ ఆదాయానికీ గండిపడింది. ఆరు శాతం తగ్గిన ఆక్యుపెన్సీ విజయవాడ బస్టాండ్ నుంచి రోజూ రాష్ట్రంలోని 13 జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు సుమారు 2,500 వరకు సర్వీసులు నడుస్తారుు. ఇవికాక జిల్లాలోని 14 డిపోల నుంచి నుంచి పల్లెవెలుగు బస్సులతో కలిపి 1,200 వరకు సర్వీసులు ఉన్నాయి. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్, ఏసీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో కచ్చితంగా 65 శాతంపైన, పల్లెవెలుగు బస్సులకైతే 50 శాతంపైన ఉండాలి. హైదరాబాద్ బస్సులకు రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆక్యుపెన్సీ ఉంటున్నప్పటికీ గతం కంటే కొంత తగ్గిందనే చెప్పొచ్చు. గడిచిన రెండు నెలల్లో 80 నుంచి 77 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ ఈ నెలలో 72 శాతానికి పడిపోయింది. ఆదివారాలు అయితే గతంలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉండేది. ఇప్పుడు ఆదివారాల్లో కూడా 80 నుంచి 85 శాతానికి మించి ఉండట్లేదు. నవంబర్ నుంచి ఆక్యుపెన్సీ సగటున నాలుగు శాతం నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఆరు శాతంగా ఉంది. దీనివల్ల ఆర్టీసీకి ప్రత్యక్షంగా సుమారు మూడు లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే 240 బస్సుల్లో జిల్లా, నగరంలోని డిపోల నుంచే అత్యధికంగా 175 వరకు వెళుతున్నాయి. ప్రత్యామ్నాయం దిశగా ఆర్టీసీ ఆర్టీసీ అధికారులు తగ్గిన ఆక్యుపెన్సీని భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పండుగ రోజుల్లో స్పెషల్ బస్సులు ఏర్పాటుచేసి ఒకటిన్నర రెట్లు చార్జీ వసూలు చేస్తున్నారు. ఆక్యుపెన్సీ తగ్గడంతో రాకపోకలు తగ్గాయనేది సుస్పష్టం. మరోవైపు ప్రైవేట్ బస్సులదీ ఇదే పరిస్థితి. హైదరాబాద్‌కు రద్దీ తగ్గిపోవడంతో ప్రైవేట్ బస్సులను బెంగళూరు, చెన్నైకు రూట్ మార్చి తిప్పుతున్నారు. గతంలో అయితే సుమారు 150 వరకు ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ వెళ్లేవి. ఇప్పుడు వాటిలో 10 నుంచి 20 బస్సులు తగ్గాయి. -
ప్రైవేట్ బస్సుల్లో చెలరేగిన మంటలు
కడప: కడప నగరంలోని గ్రూప్ థియేటర్ సమీపంలో శనివారం ఉదయం ఆగి ఉన్న రెండు ప్రైవేట్ బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రయివేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అధికారులు తెల్లావారుజాము నుంచే దాడులు చేపట్టారు. పరిగి-వికారాబాద్, ఉప్పల్-ఆరాంఘర్, మోహదీపట్నం-లింగంపల్లి, ఉప్పల్-కోఠి, ఉప్పల్-సంతోష్ నగర్, సికింద్రాబాద్-బోయిన్పల్లి, సికింద్రాబాద్-కూకట్పల్లి ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేస్తున్నారు. -
ఆ బస్సుల రూటే సెపరేటు!
శ్రీకాకుళం: దసరా రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు సొమ్ము చేసుకుంటున్న తీరు దారుణంగా ఉంది. ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నా రవాణా శాఖ అధికారులకు చీమ కుట్టినట్లయినా లేదు. పండుగల సీజనులో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుందన్నది తెలి సిందే. ఆర్టీసీ, రైల్వే శాఖలు ఎన్ని అదనపు సర్వీసులు నడుపుతున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు ప్రయాణికుల ముక్కుపిండి కాసుల పంట పండించుకుంటున్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏ రోజు ఏ రేటు వసూలు చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. దసరా సెలవుల సందర్భంగా బస్సులకు తీవ్ర గిరాకీ ఉండడంతో గత పది రోజులుగా కొన్ని ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు డిమాండ్‌ను బట్టి ఏ రోజుకు ఆ రోజు రేటు నిర్ణయించి వసూలు చే స్తున్నాయి. సాధారణంగా శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు గానీ, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళానికి గానీ ఏసీ బస్సుకు రూ.900, నాన్ ఏసీకి రూ.600 రేటు వసూలు చేస్తుంటారు. దసరా రద్దీ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, విజయవాడలకు సాధారణ రేటుపై రూ. 50 నుంచి 100 వరకు అదనంగా వసూలు చేస్తుండగా.. అటునుంచి అంటే హైదరాబాద్, విజయవాడల నుంచి శ్రీకాకుళం వచ్చే బస్సులకు వసూలు చేస్తున్న రేటు మాత్రం బెదరగొడుతోంది. హైదరాబాద్ నుంచి ఏసీ బస్సుకు 2,500 నుంచి రూ. 3 వేల వరకు ఒక్కొక్కరికీ వసూలు చేస్తుండగా, నాన్ ఏసీ బస్సుకు రూ. 1200 నుంచి 1500 వరకు వసూలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు వేల సంఖ్యలో హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో విద్య, ఉద్యోగం వంటి వ్యాపకాల్లో స్థిరపడ్డారు. వారంతా పండుగకు స్వగ్రామాలకు రావడం సహజం. దాంతో అటువైపు నుంచి ఉండే డిమాండ్‌ను దాదాపు మూడింతలు రేటు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న అధికారులు దీన్ని పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ రేట్లను ఆన్లైన్లో ప్రకటించి మరీ బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా సరుకు రవాణా ఇక ప్రైవేట్ బస్సుల్లో సరుకులను రవాణా చేస్తే కఠినచర్యలు తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే ప్రతిరోజూ ఈ బస్సుల ద్వారా సుమారు రూ. 15లక్షల విలువైన వస్తువులు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటువంటి సరుకుల్లో 60 నుంచి 70 శాతానికి బిల్లులే లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. తమకు మామూళ్లు ముడుతుండటంతో అధికారులు ప్రభుత్వ ఆదాయం పోతున్నా పట్టించుకోవడం లేదు. అనుమతి లేని రూట్లలో.. రూట్ పర్మిట్‌లో నిర్దేశించిన మార్గంలోనే ప్రైవేట్ బస్సులు ప్రయాణించాల్సి ఉంది. అయితే జిల్లాలో ప్రైవేట్ బస్సులు అనుమతి రూట్లలో పయనిస్తున్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళం ఆస్పత్రి జంక్షన్లో బయలు దేరే బస్సులు కొత్తరోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే దాదాపు ఈ బస్సులు డేఅండ్‌నైట్ జంక్షన్ మీదుగా పయనిస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాగే ఓ రోజు విశాఖపట్నం వెళ్లకుండా ఆనందపురం, పెందుర్తి మీదుగా వెళ్తుంటే.. మరో రోజు విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి గాజువాక మీదుగా వెళుతూ.. తమ అవసరాన్ని బట్టి మార్గాన్ని మార్చేసుకుంటున్నాయి. పరిమిట్లు లేకుండానే.. దసరా కావడంతో ప్రైవేటు బస్సులకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు పర్మిట్ ఉన్న బస్సుల ముసుగులో పర్మిట్లు లేని బస్సులను తిప్పుతున్నాయి. ఈ విధంగా కూడా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఇటువంటి బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు మాత్రమే రవాణా, పోలీసు, ఇతర శాఖలు హడావుడి చేస్తుంటాయి. మిగతా సమయాల్లో ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు కొమ్ముకాస్తుండడంతో అక్రమాలకు పాల్పడుతున్న వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. -
వామ్మో..బస్సులు
నెల్లూరు (దర్గామిట్ట): ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం మత్తు వెరసి ప్రయాణికుల పాలిట శాపమవుతోంది. గతంలో ఎక్కువగా లారీల వల్లే ప్రమాదాలు జరిగేవి. అప్పట్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం అంటే సురక్షితమనే భావన ఉండేది. పస్తుతం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. జిల్లా పరిధిలోని కోమిట్ల ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం మత్తును ప్రయాణికులు గుర్తించి బోదనం టోల్గేట్ వద్ద పోలీసులకు అప్పగించారు. అలాగే మద్యం మత్తులో బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్‌ను సంగం వద్ద పోలీసులకు అప్పగించిన ఘటనలను పరిశీలిస్తే ప్రయాణికులు ఎలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారో అర్థమవుతుంది. రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ఆదాయం పెంచడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, ప్రమాదాలను జీరోస్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక చేపట్టింది. ఈ నెల 7 నుంచి ఆర్టీసీ అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా ఆయా డిపోల్లో పరిశుభ్రత కొంత కనిపించినా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. జిల్లాలో అన్ని డిపోల్లో కలిపి దాదాపు 860 బస్సులు ఉన్నాయి. దూరపు సర్వీసుకు డ్రైవర్‌గా వెళ్లేవారి ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించాల్సి ఉంటుంది. అలాగే డ్యూటీకి ఎక్కేటప్పుడు బ్రీత్ ఎన్‌లైజర్‌తో పరీక్షించినా దారిలో ఎక్కడా తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో బస్సు డ్రైవర్ రోడ్డు మార్గంలో దాబాల్లో ఎంచక్కా మద్యం సేవించి బస్సు నడుపుతున్నారు. దీంతో ప్రయాణంలో ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. రవాణా, పోలీసు, ఆర్టీసీ చెకింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలు నామమాత్రంగా ఉండటంతో డ్రైవర్లు మద్యం తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనేది వాస్తవం. కఠినంగా లేని శిక్షలు: మద్యం మత్తులో బస్సు నడిపారని రుజువైనా శిక్షలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం సస్పెండ్ చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. గత మూడేళ్లలో జిల్లాలో దాదాపు 70 మందికిపైగా డ్రైవర్లు మందు తాగి బస్సులు నడిపినట్టు అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించారని రుజువైతే డ్రైవర్ లెసైన్స్ రద్దుతో పాటు జైలుశిక్ష పడేలా చట్టాలు ఉన్నట్టైతే తప్పు చేసేందుకు భయపడతారనేది వాస్తవం. ప్రైవేటు బస్సుల్లోనూ ఇంతే.. : ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు కూడా మద్యం మత్తులోనే నడుపుతూ ప్రమాదాలకు గురి చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో కనీస నిబంధనలు కూడా పాటించడంలేదు. ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్‌ను నియమించాలి. దూరపు ప్రాంతాలకు వెళ్లే బస్సులో రెండో డ్రైవర్ తప్పకుండా ఉండాలి. డ్రైవర్‌కు తప్పని సరిగా బెర్త్‌ను ఏర్పాటు చేయాలి. బస్సు కండీషన్, డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని ట్రావెల్స్ యజమానులు ఎప్పటికప్పుడు తప్పని సరిగా పరీక్షించాలి. ఇవేవీ పట్టని యజమానులు స్వలాభం కోసం బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారు. అధికారుల నిఘా అంతంత మాత్రమే : ప్రైవేటు బస్సుల ఆగడాలను నియంత్రించాల్సిన రవాణా అధికారులు ఆమ్యామ్యాలతో మిన్నకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్సులు కండీషన్లో లేన్నా, డ్రైవర్‌కు లెసైన్స్ లేకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బెంగళూరు వెళ్తున్న కోమటిట్రావెల్స్ బస్సును మద్యం మత్తులో డ్రైవర్ నడుపుతూ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ డ్రైవర్‌కు కనీసం లెసైన్స్ కూడా లేక పోవడం గమనార్హం. మద్యం సేవించినట్టు గుర్తించాం సంగం వద్ద ప్రయాణికులు పట్టించిన డ్రైవర్ మద్యం సేవించినట్టు గుర్తించాం. బ్రీత్ ఎన్‌లైజర్‌తో ఆయన్ను పరీక్షించాం. ఆయన్ను సస్పెండ్ చేసి, ఆ తర్వాత విచారణ చేపడతాం. చంద్రశేఖర్, ఆర్టీసీ, సీటీఎం -
ప్రైవేట్ బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ
హైదరాబాద్ నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కూకట్పల్లి మలేషియా టౌన్షిప్ వద్ద రెండు బస్సులను సీజ్ చేశారు. అలాగే మన్నెగూడలో పర్మిటీ లేకుండా నడుస్తున్న 9 స్కూల్ బస్సులతోపాటు ఓ ప్రైవేట్ బస్సును అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బస్సులన్ని నిబంధనలకు విరుద్దంగా నడుస్తుని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. తమ శాఖ మరిన్ని తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శుక్రవారం ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో రెండు స్కూల్ బస్సులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లాలో రవాణాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్న 7 స్కూల్ బస్సులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
‘కోట్ల’ కిరికిరి
ప్రైవేట్ బస్సుల అక్రమదందా సర్కారు ఆదాయానికి కేశినేని గండి ఆయనో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి ... ఈ టికెట్ చేజిక్కించుకోవడానికి చంద్రబాబుతోనే తలపడటమే కాకుండా పత్రికలకెక్కి నానా రాద్ధాంతం చేశారు. కోట్ల రూపాయలు వెదజిమ్మగలనని అధిష్ఠానాన్ని బలవంతంగా ఒప్పించి ఎన్నికల బరిలోకి దిగారీయన. ఈయన గతాన్ని ఓసారి పరిశీలిస్తే అడుగడుగునా అవినీతిమయం. చిత్తశుద్ధితో సాగే సమైక్య ఉద్యమాన్ని కూడా తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు. సాక్షి, విజయవాడ : కేశినేని నాని వ్యవహారం గురివింద గింజ సామెతలా ఉంది. ప్రచారపర్వంలో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్న ఆయన తాను చేస్తున్న అక్రమ ట్రావెల్స్ వ్యాపారం గురించి అస్సలు మాట్లాడరు. టూరిస్టు పర్మిట్ తీసుకుని నిబంధనలకు వ్యతిరేకంగా స్టేజి కేరియర్లుగా బస్సులను తిప్పుతూ ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో గండి కొడుతున్నారు. సమైక్య ఉద్యమ సమయంలో పైకి మద్దతు ఇచ్చినట్లు నటించి.. దొంగచాటుగా బస్సులను తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు జనం నుంచి దోచేశారు. అడ్డదారుల్లో బస్సులు నడిపింది ఇలా.. పాలెం దుర్ఘటనతో అప్పట్లో ప్రైవేటు బస్సులు కొంతకాలం నడవలేదు. కేశినేని నాని మాత్రం తన బస్సులను డొంకదారుల్లో తిప్పారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సులను కంచికచర్ల నుంచి ఖమ్మం జిల్లా మీదుగా రాజధానికి నడిపారు. ప్రయాణికులను విజయవాడ నుంచి ఇన్నోవాలో కంచికచర్ల వరకు తీసుకువెళ్లి అక్కడ వారిని బస్సులు ఎక్కించారు. కొన్ని బస్సుల్ని ఇక్కడి నుంచి ఖాళీగా తీసుకువెళ్లి గుంటూరు మార్గంలో చెక్‌పోస్టు దాటిన తర్వాత ప్రయాణికులను ఎక్కించారు. విశాఖపట్నం వెళ్లే బస్సులను పామర్రులో నిలిపి అక్కడి నుంచి హనుమాన్‌జంక్షన్ మీదుగా తీసుకువెళ్లారు. హైకోర్టు స్టేతో దందా మళ్లీ మొదలు.. ప్రభుత్వ అధికారులు ఒత్తిడి తెచ్చినా నాని మాత్రం తన దందా మానలేదు. పలు బస్సులను సీజ్ చేశారు. కొన్నింటి పర్మిట్లను సస్పెండ్ చేశారు. దీనిపై కేశినేని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బస్సులను మార్గం మధ్యలో సీజ్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేశినేని ట్రావెల్స్ దందా మళ్లీ మొదలైంది. నెల రోజులుగా అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడంతో కేశినేని ట్రావెల్స్ నుంచి అక్రమ సర్వీసులను నడుపుతున్నారు. దొంగ పర్మిట్లు, నకిలీ నంబర్లతో బస్‌లను దొంగట్రిప్పులు వేసి సొమ్ముచేసుకుంటున్నారు. 70 బస్సులను స్టాపేజి చూపించి వాటిని నడుస్తున్న బస్సుల నంబర్లతో తిప్పుతున్నట్లు సాటి ట్రావెల్స్ యాజమాన్యాలే ఆరోపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు కొన్ని బస్సులను తాత్కాలికంగా ఆపినట్లు చూపిస్తారు. ఆపిన బస్సులకు ఆ త్రైమాసికానికి ఒక్కో బస్సుకు లక్షన్నర రూపాయల పన్ను ఎగ్గొడుతున్నారు. స్టాపేజి చూపించిన బస్సులకు ప్రస్తుతం తిరుగుతున్న బస్సు నంబర్లు వేసి ఒక బస్సును హైదరాబాద్‌కు పంపితే, మరో బస్సును విశాఖపట్నం పంపుతారు. ప్రతి టోల్గేట్ వద్ద బస్సు నంబర్లు నమోదు అయినా, రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతున్న వాహనాల డేటాను క్రోడీకరించే అవకాశం లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దొంగ నంబర్లతో బస్సులను తిప్పుతున్నారు. బినామీపేర్లతో.. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖ, షిర్డీ మధ్య సుమారు 140 బస్సులను నాని తిప్పుతున్నారు. ఈ బస్సులన్నీ కేశినేని ట్రావెల్స్ పేరుతో కాకుండా కేశినేని నాని, ఆయన భార్యతో పాటు సిబ్బంది బినామీ పేర్లతో నడుస్తున్నాయి. ఆలిండియా పర్మిట్ సీటుకు ప్రతి మూడు నెలలకు రూ. 3650, స్టేట్ పర్మిట్‌కు రూ. 2650 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. పది బస్సులకు పర్మిట్ తీసుకుంటే ఆ నంబర్లతో వీటికి రెట్టింపు బస్సులు నడపుతారు. పర్మిట్ నిబంధనల ప్రకారం ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణీకులను తీసుకువెళ్లవచ్చు. అదికూడా విడివిడిగా ప్రయాణికులకు టికెట్లు ఇవ్వకూడదు. అయితే ఎలాంటి నిబంధనలు పాటించరు. ఆర్టీసీకి పోటీగా సమాంతర వ్యవస్థను నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఆర్టీసీ ఉండటంతో స్టేజి కేరియర్‌గా బస్సులు తిప్పేందుకు అనుమతి లేదు. తనకున్న ధన బలంతో బస్సులను యథేచ్ఛగా తిప్పుతున్నారు. పగలు ఉద్యమం... రాత్రి వ్యాపారం సమైక్య ఉద్యమం జరిగినన్ని రోజులు నాని సమైక్యవాది ముసుగులో ఉదయం బంద్‌లు చేయించారు. రాత్రి అయ్యేసరికి కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్ని యథావిధిగా నడిపించారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు, బెంగ ళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తిప్పి వ్యాపారం చేశారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రవేటు దందా నడిపారు. విజయవాడ నుంచి బెంగళూరుకు రూ.1000 నుంచి రూ.1200 చార్జీ ఉంటే, ప్రైవేటు బస్సుల్లో రూ.3000 వరకు వసూలు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఓల్వో బస్సు చార్జీ రూ.1000 వరకు వసూలు చేశారు. -
అనుమతుల్లేని 665 ప్రైవేట్ బస్సులు సీజ్ : డీటీసీ రమేష్
మూసాపేట, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ల్లో అనుమతులు లేని మొత్తం 665 ప్రైవేట్ బస్సులు సీజ్ చేశామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ తెలిపారు. బుధవారం కూకట్‌పల్లిలోని ఆర్టీసీ డిపోలో సికింద్రాబాద్ రీజనల్ ఇంధన పొదుపు పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 11 డిపోల ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై, ఇతర రాష్ట్రాల కన్నా ఏపీఎస్ఆర్టీసీ ఎక్కువ 5.3 కేఎంపీఎల్ తీసుకువస్తుందని అన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజల జీవన విధానంలో ఆర్టీసీ మమేకమైందని, గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం 6వేల బస్సులు నడుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ, అశోక్ లేలాండ్ సంస్థ సీనియర్ మేనేజర్ సూర్యనారాయణ, సనత్‌నగర్, సికిం ద్రా బాద్ డీవీఎం రాజారాం, విమల, కూకట్పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్, కూకట్పల్లి మెకానికల్ ఫోర్‌మెన్ కె.కె.కుమార్, అసిస్టెంట్ మోటా ర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వాసు, ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీ కేఎంపీఎల్ అవార్డు డ్రైవర్లు వీరే.... కూకట్పల్లి డిపో నుంచి పి.ఎస్. రెడ్డి, సయాజు ద్దీన్, అంజయ్య, రాణిగంజ్ డిపో-1 నుంచి ఎస్.మల్లయ్య, పి.గోపాల్, ఎం.ఎం రెడ్డి, మి యాపూర్-డిపో నుంచి యాదగిరి, అబ్ధుల్ఖా న్, రాజిరెడ్డి, జీడిమెట్ల డిపో నుంచి వైఎస్ సుం దర్, మహేందర్, వెంకటేశ్వర్లుకు అవార్డులు అందజేశారు. -
ప్రైవేటు బస్సులు సీజ్
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :కోనసీమలో రవాణా శాఖ అధికారులు శనివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. రావులపాలెం, అంబాజీపేటల్లో తనిఖీలు చేశారు. విజయవాడ నుంచి వైజాగ్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కాంట్రాక్ట్ పర్మిట్‌తో స్టేజ్ క్యారేజ్ సర్వీసుగా నడుపుతున్నట్టు గుర్తించి, దానిని సీజ్ చేశామని అమలాపురం ఆర్టీఓ అశోక్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. రావులపాలెంలో హైదరాబాద్ నుంచి అమలాపురం వస్తున్న ప్రైవేటు బస్సును తనిఖీ చేసి, పర్మిట్ లేనట్టు గుర్తించామన్నారు. సీజ్ చేసిన రెండు బస్సులను అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌కు తరలించామని ఆర్టీఓ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు జీవీ నరసింహారావు, ప్రసాద్ పాల్గొన్నారు. మండపేటలో.. మండపేట : నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తీసుకువెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును శనివారం రాత్రి మండపేట రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మండపేటలో అధికారులు తనిఖీ చేశారు. కాంట్రాక్ట్ క్యారేజ్ అనుమతితో స్టేజి క్యారేజ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించామని ఎంవీఐ వి.శ్రీనివాస్ తెలిపారు. బస్సును సీజ్ చేసి రామచంద్రపురం ఆర్టీసీ డిపోకు తరలించినట్టు చెప్పారు. అందులో ప్రయాణిస్తున్న సుమారు 36 మంది ప్రయాణికులను రామచంద్రపురం డిపో నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. -
ఒక్కసారి ఊరువెళ్లి రా...
ఒక్కసారి ఊరువెళ్లి రా... పచ్చని పల్లెల కోసం... అనుభూతుల మల్లెల కోసం... సాక్షి, సిటీబ్యూరో : నగరం పల్లె‘టూరు’కెళ్లింది. స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లారు. పండగ ప్రయాణాల దృష్ట్యా గత మూడు రోజులుగా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడాయి. కార్లు, సొంత వాహనాలపై కూడా పలువురు సిటీజనులు ఊళ్లకు పయనమయ్యారు. మొత్తంగా ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు వివిధ మార్గాల్లో సుమారు 20 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లలో రిజర్వేషన్లు లభించకపోవడంతో చాలామంది ‘వస్తే రాని కష్టాల్.. బాధల్..’ అనుకుంటూ దూరప్రాంతాలకు సైతం కిక్కిరిసిన రైళ్లలో బయలుదేరారు. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. కానీ ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లకు పాల్పడింది. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందుకేసి డబుల్ చార్జీలు వసూలు చేశాయి. పైగా ఒక ట్రావెల్స్‌కు, మరో ట్రావెల్స్‌కు మధ్య పొంతన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాయి. దీంతో చాలామందికి పండగ ప్రయాణం నరకప్రాయంగా మారింది. పిల్లలు, పెద్దలు, మహిళలు మరింత ఇబ్బందికి గురయ్యారు. అయినప్పటికీ వారు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు అదనపు చార్జీల మోత భారీగా మోగింది. రోజువారీ బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా.. సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 43 రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో పలు ప్రధాన రైళ్లకు పెద్దసంఖ్యలో అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌ను ఈ రైళ్లు పూర్తి చేయలేకపోయాయి. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు సాగించే 3500 బస్సులకు ఈ ఏడాది 4960 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. వీటిలో శనివారం నాటికి 3400 ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆ సంస్థ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు కాకుండా వెయ్యి ప్రైవేట్ బ స్సులు బయలుదేరాయి. మరో లక్షకు పైగా కార్లు, ఇతర వాహనాల్లో సైతం ప్రజలు తమ సొంత ఊళ్లకు బయలుదేరారు. పొటెత్తిన ఎంజీబీఎస్ అఫ్జల్‌గంజ్ : సంక్రాంతి పండుగ సమీపించడంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ శనివారం పొటెత్తింది. సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో సంతోషంగా కుటుంబ సమేతంగా నిర్వహించుకునేందుకు నగర నలుమూలల నుంచి ఉదయం నుంచే వివిధ జిల్లాలకు తరలి వెళ్లే ప్రయాణికుల తాకిడి అధికమైంది. ఆర్టీసీ అధికారుల అంచనాలను మించి ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ఎటుచూసినా జనంతో కిటకిటలాడింది. ఈయే డు ప్రైవేట్బస్సుల సంఖ్య తగ్గడం, ఆర్టీఏ అధికారుల విస్తృతదాడులతో పండుగకు ఊరెళ్లే ప్రయాణికులంతా ఆర్టీసీ వైపు మొగ్గుచూపడంతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. షె డ్యూల్డ్ బస్సుల రిజర్వేషన్ ప్రక్రియ ఈనెల 7వ తేదీన పూర్తి కావడంతో 8వ తేదీ నుంచి అదనపు బస్సులకు డిమాండ్ మరింత పెరిగింది. శనివారం ఒక్క రోజే 3557 షెడ్యూల్డ్ బస్సులకు అదనంగా రాత్రి 7 గంటల వరకు ఆర్టీసీ అధికారులు సుమారు 700 అదనపు బస్సులను నడిపారంటే ప్రయాణికుల రద్దీ ఎంతగా ఉందో ఇట్టే ఊహించవచ్చు. పేరుకే అదనపు రైళ్లు అదనపు రైళ్లని అధికారులు పేరుకే ప్రకటనలు చేశారు. ప్రయాణికుల సంఖ్యకు అదనపు రైళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. బయట బస్సుల్లో ఒక్క సీటు కోసం నాలుగింతలు వసూలు చేస్తున్నారు. ఇక్కడికొస్తే ఏ రైలులోనూ అడుగుపెట్టే పరిస్థితి లేదు. - చిన్నారావు, శ్రీకాకుళం ఉదయం నుంచి క్యూలోనే వేలాది మందికి జనరల్ టికెట్లు ఇస్తున్నారు. బోగీలు నాలుగుకు మించి ఉండడం లేదు. జనరల్ బోగీలో నరకం చూడాల్సి వస్తుంది. సాయంత్రం రైలుకు వెళ్లేందుకు ఉదయం స్టేషన్‌కు చేరుకుని క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. -దోరయ్య, రాజమండ్రి సమాచారం ఇచ్చేవారేరీ? ఏ రైలు ఎప్పుడు వస్తుందో సమాచారం అందించేవారు లేరు. రైల్వేస్టేషన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునేవారే లేరు. -శ్రీను, విజయవాడ నరకం చూస్తున్నాం ప్రతీపండగ సెలవులకు రైలుప్రయాణం నరకం చూపిస్తుంది. నెల ముందు రిజర్వేషన్ చేయించుకున్నా బెర్త్ కన్ఫర్మ్ కావడం లేదు. కనీసం జనరల్ ప్రయాణం చేద్దామంటే బోగీలో ఊపిరాడే పరిస్థితి లేదు. రైల్వే అధికారుల తీరు మారాలి. -వాసుదేవరావు ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నా రు. టికెట్ చార్జిల్లో ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సులు కాస్త బెటర్. - ప్రభు(బక్కన్న), మోతీనగర్ అదనపు చార్జీలు దారుణం ఆర్టీసీ అధికారులు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి అదనపు బస్సుల పేరిట 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం దారుణం. పండగ సంతోషాన్నికుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవాలన్న ఆనందాన్ని ఆర్టీసీ చార్జిల పెంపు తుడిచిపెట్టేస్తుంది. - రాజు, మెహిదీపట్నం ‘ప్రైవేట్’ ఆగడాలకు అడ్డేదీ ప్రైవేట్ బస్సుల నిర్వాహకుల ఆగడాలను అడ్డూ అదుపూ లేకుండాపోయింది. మదనపల్లికి సాధారణంగా రూ.630 టికెట్ చార్జికి ప్రైవేట్ బస్సు నిర్వాహకులు రూ.1500లు వసూలుచేస్తున్నారు. - శ్రీనివాస్, గౌలిగూడ ఆర్టీసీ బస్సులు లేవు విజయవాడ వెళ్లేందుకు ఎల్బీనగర్ రింగురోడ్డుకు ఉదయం వచ్చాము. ఆర్టీసీ బస్సులు లేవు పిల్లలతో పడిగాపులు కాసి చివరకు ప్రైవేటు వాహనాన్ని ఆశ్రయించాం. -ప్రకాశ్, విజయవాడ సౌకర్యాలేవీ? సదూర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ అధికారులు సరైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారుల తీరు మారాలి. -కిరణ్వెస్లీ, పాలకొల్లు -
ప్రైవేటు బస్సు ఆపరేటర్లతో సర్కారు లాలూచీ
సాక్షి, హైదరాబాద్: నేను కొట్టినట్టు నటిస్తా.. నువ్వు ఏడ్చినట్టు నటించు... అన్నట్టుగా తయారైంది రాష్ట్రప్రభుత్వం, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల వ్యవహారం. సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రభుత్వంతో ఓ ‘అవగాహన’కు వచ్చారు. ఆ మేరకు పైకి.. ప్రైవేటు బస్సుల నియంత్రణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. లోలోన మాత్రం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరింది. ఇందుకోసం రవాణాశాఖ పెద్దలు, ప్రైవేటు ఆపరేటర్లు ఓ ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. ఈ ప్రణాళికను అనుసరించి.. - ప్రైవేటు బస్సులపై దాడులు, బస్సుల సీజ్, టికెట్ బుకింగ్ ఏజెంట్లపై కేసులు.. రోజూ యధా ప్రకారం మీడియాలో వార్తల కోసం జరుగుతూనే ఉంటాయి. - ప్రైవేటు బస్సుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేజి క్యారేజీలుగా తిరగనివ్వబోమంటూ రవాణామంత్రి ప్రకటనలు చేయడానికి, 1,700 బస్సులపై దాడులు చేసి కేసులు పెట్టామని లెక్కలు ఘనంగా చెప్పడానికి ఈ దాడులు ఉపయోగపడతాయి. కానీ, అధికారులు చేసే దాడులేవీ బస్సు ఆపరేటర్లకు ఇబ్బంది కలిగించేలా ఉండవు. - దాడులు కూడా ప్రయాణికులు లేని బస్సుల మీదే జరుగుతుంటాయి. - దాడులు చేయడానికి వీలుగా ప్రైవేటు ఆపరేటర్లే కొన్ని బస్సులను ఏర్పాటుచేస్తున్నారు. ఈ ప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. - ఈ మేరకు ప్రభుత్వ పెద్ద ఒకరికి భారీగా సొమ్ము ముట్టజెప్పారని, ఫలితంగా ఆపరేటర్లు ‘సంక్రాంతి’ని సొమ్ముచేసుకోవడానికి సదరు నేత అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. యథేచ్ఛగా తిరుగుతున్న స్టేజి క్యారేజీలు రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు స్టేజి క్యారేజీలుగా యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తూ రవాణా కమిషనర్ కార్యాలయం ముందు నుంచే పెద్ద సంఖ్యలో తిరుగుతున్నా.. అధికారులకు కనిపించవు. పికప్ పాయింట్ల వద్ద మినీ బస్సుల్లో ప్రయాణికులను ఎక్కించుకుని నగర శివార్లలో బస్సుల వద్దకు తరలిస్తున్నా.. పట్టించుకోరు. అంతేకాదు.. ఆన్లైన్లో టికెట్లు కొనండంటూ మినీ బస్సులు, బస్సులపైన రాసుకుని తిరుగుతున్నా అధికారులు చూడనట్లే వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అన్ని ట్రావెల్స్ సంస్థలూ ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నాయి. అధికారులు చొరవ తీసుకుని కేసు నమోదు చేస్తే సైబర్ నేరం కింద పోలీసులు దర్యాప్తు చేపడతారు. కానీ ఈ కేసును నేరుగా యాజమాన్యంపైనే పెట్టాల్సి ఉండడంతో అధికారులు టికెట్ బుకింగ్ ఏజెంట్లు కొందరిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. -
‘ఆమ్నీ’స్పీడుకు బ్రేకులు
సాక్షి, చెన్నై : ఆమ్నీ బస్సుల అతివేగానికి బ్రేక్ వేయడానికి రవాణా శాఖ చర్యలు చేపట్టింది. మితి మీరిన వేగానికి పంచ సూత్రాల ఆంక్షలు విధిం చింది. ప్రతి 150 కి.మీ దూరానికి ఒక డ్రైవర్ మారాలన్న షరతు పెట్టింది. రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో అతి పెద్ద బస్ టెర్మినల్‌గా కోయంబేడు ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు నిత్యం ఉరకలు తీస్తుంటాయి. ఈ టెర్మినల్‌కు కూత వేటు దూరంలో ఆమ్నీ(ప్రైవేటు) బస్టాండ్ ఉంది. రాష్ట్రంలోని అన్ని నగరాలకు, పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు, పక్క రాష్ట్రాలైన బెంగళూరు, మైసూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కర్నూలు వంటి నగరాలకు ముంబై వంటి ఉత్తరాది నగరాలకు ఇక్కడి నుంచి ప్రతి రోజు బస్సులు వెళుతుంటాయి. ఓల్వో, హైటెక్, డీలక్స్, సూపర్, సెమి డీలక్స్ ఇలా ప్రైవేటు హంగులతో ఉండే ఈ బస్సుల్లో చార్జీలు వసతులకు తగ్గట్టుగానే ఉంటాయి. ఈ బస్సుల్ని ఆశ్రయించే వారి సంఖ్యా ఎక్కువే. మితిమీరిన వేగం సాయంత్రం సరిగ్గా ఏడు గంటలు దాటితే చాలు ఆమ్నీ బస్సులు రోఢ్డెక్కుతాయి. దక్షిణాది జిల్లాల వైపుగా వెళ్లే బస్సులు వండలూరు దాటితే చాలు వేగానికి అడ్డూ అదుపూ ఉండ దు. బెంగళూరు, పూందమల్లి హైవే మీద ఈ బస్సులు మెరుపు తీగల్లాగా ప్రయూణిస్తుంటా యి. ఉదయాన్నే గమ్యస్థానాలకు ప్రయాణికుల్ని చేర్చడం లక్ష్యంగా దూసుకెళ్లే ఈ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో ప్రయాణికులకు భద్రత కరువు అవుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ వద్ద, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో ఓల్వో బస్సులు ప్రమాదానికి గురి కావడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనం అయ్యూరు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ ముందస్తు చర్యల్లో పడింది. ప్రమాదాల నివారణా లక్ష్యంగా ఆమ్నీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది. బస్సుల్లో, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. స్పీడ్‌కు బ్రేక్ ఆమ్నీ వేగాన్ని కట్టడి చేస్తూ ప్రధానంగా నిర్ణ యం తీసుకున్నారు. పంచ సూత్రాలతో కూడిన చిట్టాను రవాణా శాఖ వర్గాలు ప్రకటించాయి. గంటకు 80 కి.మీ మించి వేగంతో బస్సును నడిపేందుకు వీలు లేదు. బస్సు బయలు దేరేందు కు ముందుగా బస్సులోని సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్ల గురించి లఘు చిత్రాన్ని ప్రయాణికులకు ప్రదర్శించాలి. బస్సుల్లో ఎమర్జన్సీ డోర్లు ఎక్కడున్నాయో, అగ్నినిరోధక పరికరాలు ఉన్న ప్రదేశాలు, ఏ డోర్‌ను సుల భంగా పగుల కొట్టవచ్చో ప్రయాణికులకు వివరించాలి. ప్రమాదం జరిగిన పక్షంలో ఎలా తప్పించుకోవాలో తెలి యజేయూలి. డ్రైవర్లు మద్యం తాగి ఉన్నారా లేదా..? అని టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల్లో తని ఖీలు చేయించుకుని, అక్కడి సిబ్బంది సంతకం తీసుకోవాలి. ప్రతి 150 కి.మీ దూరానికి ఒక డ్రైవర్ మారాలి. 150 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయూణించే ప్రతి బస్సులోనూ ఇద్దరు డ్రైవర్లు తప్పని సరిగా ఉండాలి. రవాణా శాఖ నిబంధనల్ని ఏ ఒక్క ట్రావెల్స్ ఉల్లంఘించినా, బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. ఓల్వో బస్సులకు ప్రత్యేక ఆంక్షలు విధించారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో డీజిల్ ట్యాంక్ పేలడం ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నారుు. దీంతో ఓల్వో బస్సుల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయాణికుల భద్రతకు తగ్గట్టుగా బస్సుల్ని తీర్చిదిద్దాలని సూచించారు. అమలు సాధ్యమే రవాణా శాఖ నిబంధనల్లో కొన్నింటిని ఇది వరకు ఆమ్నీ బస్సుల్లో పాటిస్తూ వస్తున్నామని ఆ బస్సుల యజమానుల సమాఖ్య నాయకుడు అఫ్జల్ పేర్కొన్నారు. మూడు నుంచి నాలుగు నిమిషాలతో కూడిని వీడియో టేపును అధికారులు తమకు ప్రదర్శించారన్నారు. ఇందులో భద్రతా చర్యల్ని వివరించారని, వీటిని తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. అన్ని బస్సుల్లో ఇద్దరు చొప్పున డ్రైవర్లు ఇప్పటికే ఉన్నారని పేర్కొంటూ, ఇక అన్ని బస్సుల్లోనూ ప్రభుత్వ నిబంధనలు పాటించి తీరుతామన్నారు. -
కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు, 52 బస్సులు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ చేస్తున్న దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. బెంగళూరు జాతీయ రహదారిపై నిర్వహించిన దాడుల్లో నిబంధనలు పాటించని 52 బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ డీటీసీ టీ రఘునాథ్ పాత్రికేయులకు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు దాడుల్లో పాల్గొన్నారని, పట్టుబడిన బస్సులు స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్నవేనని ఆయన వివరించారు. -
12 ప్రైవేట్ బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ
ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలెం సమీపంలో వోల్వా బస్సు దగ్ధమైంది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై కొరడ ఝుళిపించారు. అందులోభాగంగా గతరాత్రి హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న 12 ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. దాంతో ఆర్టీఏ అధికారులు తనిఖీలను ముమ్మరం చేసింది. దాంతో ఆ ఘటన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు చేసిన దాడుల్లో దాదాపు వెయ్యి బస్సులను సీజ్ చేశారు. అయితే గత అర్థరాత్రి బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న వోల్వో ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
15 ప్రైవేట్ బస్సులు సీజ్
ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై తనిఖీలను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరువులో సోమవారం తనికీలు చేపట్టారు. అనుమతులు, రికార్డులు సరిగా లేని పది ప్రైవేట్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. కృష్ణా జిల్లాలోనూ దాడులు నిర్వహించారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు ఐదు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ బస్సు ప్రమాద దుర్ఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ బస్సులను తనిఖీలు చేసి పెద్ద సంఖ్యలో సీజ్ చేశారు. -
ప్రైవేటు బస్సులను నిషేధించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టు క్యారేజీ బస్సులను ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ప్రజలే తిరగబడి ప్రైవేటు బస్సులను భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. ప్రైవేటు ఆపరేటర్లే ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని, రవాణా శాఖ అధికారులపై దౌర్జన్యం చేసే పరిస్థితి నెలకొందని.. వారి ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని పలు రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. ‘రహదారి ప్రమాదాలు-ప్రైవేటు బస్సుల ఆగడాలపై’ ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో అఖిలపక్ష సమావేశం నారాయణ అధ్యక్షతన జరిగింది. దీనికి వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), ప్రేంసింగ్ రాథోడ్(బీజేపీ), రాంబాబు(టీడీపీ), నరేందర్‌రెడ్డి, దయానంద్ (ఫార్వర్డ్‌బ్లాక్), గోవింద్(ఆర్ఎస్పీ), కె.రామకృష్ణ, జి.ఓబులేసు, అజీజ్‌పాషా, ఆర్.వెంకయ్య(సీపీఐ) సహా పలు కార్మిక, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. నారాయణ మాట్లాడుతూ.. వేగంతోపాటు భద్రత, నిఘా వ్యవస్థలను పటిష్టం చేయాలన్నారు. ప్రైవేటు బస్సులవల్ల ఆర్టీసీకి ఏటా రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రైవేటు క్యారేజీలన్నింటినీ నిషేధించాలన్నారు. ప్రమాదాలన్నింటికీ కారణం మానవ తప్పిదాలేననడం సరికాదని సీపీఎం నేత వై.వెంకటేశ్వరరావు అన్నారు. రవాణా వ్యవస్థే ప్రైవేటు మాఫియా చేతుల్లో ఉందన్నారు. ప్రమాదాల నివారణకు స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బస్సు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లపైగాక యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని, ప్రైవేటు ఆపరేటర్ల ఆగడాల నియంత్రణకు స్వతంత్ర నిఘావ్యవస్థ ఉండాలని, దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో శిక్షణ, అనుభవం ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించాలని, రవాణాను వ్యాపారంగాకాక సామాజిక సేవాదృక్పధంతో చూడాలనే తీర్మానాలు ఇందులో ఉన్నాయి. అంతకుముందు సమావేశం ప్రారంభంలో మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు ప్రమాద మృతులకు నేతలు సంతాపం తెలిపారు. బస్సు ప్రమాదంలో తమవారిని కోల్పోయిన ఆశిష్, మొయినుద్దీన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలను నిషేధించాలని, నూటికి 90 శాతం ప్రమాదాలు మద్యం వల్లే జరుగుతున్నాయని వీరు పేర్కొన్నారు. అక్రమ వాహనాలను నియంత్రించాలి: ఎన్ఎంయూ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు బస్సులపై రోజుకు 50 చొప్పున చేస్తున్న దాడులు.. కంటితుడుపు చర్యగాగాక నిరంతరం కొనసాగించాలని ఆర్టీసీ ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మహమూద్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీఏ అధికారులు కేవలం బస్సులపై దాడులు చేస్తేనే సరిపోదని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అన్నిరకాల వాహనాలనూ నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. -
'ప్రైవేటు బస్సుల దూకుడుకు కళ్లెం వేయాలి'
హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు బస్సుల దూకుడుకు కళ్లెం వేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సుల ఆగడాలను వెంటనే నియంత్రించాలని అన్నారు. రోడ్డుప్రమాదాలు, ప్రైవేట్ బస్సుల ఆగడాలపై సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకే నంబరుపై 4 బస్సులు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. చట్టవిరుద్దంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను ప్రభుత్వం నియంత్రించలేకపోతే తాము కల్పించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒకపక్క ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రైవేటు బస్సుల నియంత్రణ విషయంలో ప్రభుత్వ అధికారుల స్పందన సరిగా లేదని నారాయణ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. -
అక్రమ బస్సులు మరెన్నో..
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: అక్రమంగా రాకపోకలు సాగిస్తున్న ప్రైవేటు బస్సుల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. అయితే పట్టుబడిన బస్సులు కొన్నేనని, పెద్ద సంఖ్యలో బస్సులు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని సమాచారం. జిల్లాలో రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు నాలుగు బస్సులనే సీజ్ చేశారు. ఉదయం రెండు గంటల పాటు మాత్రమే తనిఖీలు నిర్వహిస్తుండటం అక్రమంగా బస్సులు నడుపుతున్న వారికి అనుకూలంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధమైన ఘటనలో 45 మంది సజీవ దహనం కావడంతో జిల్లాలోని రవాణా శాఖ అధికారులు మేలుకున్నారు. గురు,శుక్రవారాల్లో జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారు. గురువారం కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఒక బస్సును కోవూరు వద్ద సీజ్ చేశారు. ఈ బస్సుకు స్టేజి క్యారియర్‌గా పర్మిట్ పొంది ఊరూరా ప్రయాణికులను ఎక్కించుకుంటున్నట్లు గుర్తించారు. శుక్రవారం కోవూరు వద్ద కామాక్షి ట్రావెల్స్, కేఎంబీ ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు. రూట్ పర్మింట్ లేకుండా రాకపోకలు సాగిస్తున్న బస్సు (ఆరెంజ్ ట్రావెల్స్) తడ మండలం భీమునివారిపాళెం చెక్‌పోస్టు వద్ద అధికారులకు చిక్కింది. ఇప్పటివరకు దొరికింది ఈ నాలుగు బస్సులు మాత్రమే. మరెన్నో బస్సులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై దూసుకుపోతున్నాయి. రవాణా శాఖ అధికారులు తనిఖీల ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తే అక్రమంగా సాగిపోతున్న మరిన్ని బస్సుల అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నెల్లూరు నుంచి వివిధ ప్రాంతాలకు సాగిస్తున్న బస్సుల ఫిట్నెస్, ఇతర పత్రాలు తదితర అంశాలపై ప్రజల్లో అనుమానాలు నెలకొనివున్నాయి. అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నడుస్తున్న బస్సులను పూర్తిగా అడ్డుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
ప్రతి పనికిసెప ‘రేటు’
సాక్షి, సిటీబ్యూరో : అక్రమార్జనే లక్ష్యంగా మోటారు వాహన తనిఖీ అధికారులు, దళారులు కుమ్ముక్కై సాగిస్తున్న ఫిట్నెస్ పరీక్షల్లో నూటికీ 80 శాతం బోగస్ తనిఖీలతో రోడ్డెక్కుతున్నాయి. వాహనాల కండీషన్, నాణ్యతలపై ఎలాంటి శాస్త్రీయమైన పరీక్షలు నిర్వహించకుండా అధికారుల జేబులో డబ్బులు పడితే చాలు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు, ఆటోరిక్షాలు, క్యాబ్‌లు వంటి రవాణా వాహనాలన్నింటికి ఏడాదికోసారి ఆర్టీఏ తనిఖీలు తప్పనిసరి. ఆ వాహనాల పనితీరు సక్రమంగా ఉంటేనే రోడ్డుపై తిరిగేందుకు అనుమతించాలి. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా, నామమాత్రపు తనిఖీలు నిర్వహించి బ్రోకర్లు ఇచ్చే మామూళ్ల మాయలో పడి రోడ్డు భద్రతను విస్మరిస్తున్నారు. బస్సులోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందిన అనంతరమే ఇవ్వాల్సిన ఫిట్నెస్ సర్టిఫికెట్లను రవాణా అధికారులు దళారుల చేతుల మీదుగా వాహనదారులకు విక్రయించేస్తున్నారు. ఇందుకోసం ఆటోరిక్షాలు, క్యాబ్‌లు వంటి వాహనాలను రూ.1000 నుంచి రూ.1500 చొప్పున, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులకు రూ.5000 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఏ విధమైన తనిఖీలు లేకుండా, భద్రతా నిబంధనలు పాటించకుండా రహదారులపై తిరిగే వాహనాలు ప్రజల పాలిట మృత్యుశకటాలుగా మారుతున్నాయి. నిలువు దోపిడీ సాధారణంగా లర్నింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల చిరునామా బదిలీ, యాజమాన్య బదిలీ వంటి సేవల కోసం వాహన వినియోగదారులు రవాణా కార్యాలయాలను సంప్రదిస్తారు. రవాణా వాహనాలకు సంబంధించిన పన్నులు, పర్మిట్లు, జరిమానాలు వంటి కార్యక లాపాలు మినహాయించి రవాణాశాఖ నిర్దేశించిన అన్నిరకాల పౌరసేవలపైన ప్రభుత్వం విధించిన ఫీజు సాధారణంగా రూ.వంద నుంచి రూ. 600 వరకు ఉంటుంది. కానీ వాహనదారులు, అధికారులకు నడుమ మధ్యవర్తులుగా వ్యవహరించే దళారులు ఈ ఫీజులకు నాలుగు రెట్లు చొప్పున పెంచేసి వాహనదారులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా వచ్చిన అక్రమార్జనలో సింహభాగం అధికారుల ఖాతాల్లో జమ అవుతుందనేది అక్షర సత్యం. మిగతా సొమ్ము దళారుల జేబుల్లోకి వెళుతుంది. కొరవడిన పర్యవేక్షణ రవాణా శాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో జరిగే అక్రమ కార్యకలాపాలను నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పర్యవేక్షణ లోపం కారణంగా వాహనదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కింది నుంచి పై స్థాయి వరకు వసూల్ రాజాల స్వైరవిహారం, ఆర్టీఏ అధికారుల పనితీరు స్పష్టంగా తెలిసిన ప్పటికీ ఉన్నతాధికారులు దళారీ వ్యవస్థను నిరోధించకపోవడం గమనార్హం. జరుగుతున్నదిదీ.. వాహన వినియోగదారులు ప్రాథమికంగా తీసుకొనే లర్నింగ్ లెసైన్స్ కోసం చెల్లించవలసిన ఫీజు రూ.90. ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని, సమీప ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించి నేరుగా పరీక్షకు హాజరు కావొచ్చు. కానీ ఇలా వచ్చేవారిని సంబంధిత మోటారు వాహన తనిఖీ అధికారులు నిరుత్సాహపరుస్తారు. టెస్ట్‌లో ఫెయిల్ చేస్తారు. ఆ విషయం ముందే తెలుసు కాబట్టి వినియోగదారులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చే వారి నుంచి లర్నింగ్ లెసైన్స్ కోసం రూ. 500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లించవలసిన ఫీజు రూ. 550 మాత్రమే. కానీ దళారుల ద్వారా ఆర్టీఏ వసూలు చేస్తున్న మొత్తం రూ.1500. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేందుకు ఇచ్చే తాత్కాలిక లర్నింగ్ లెసైన్స్, పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ రెండింటి కోసం వచ్చే వారి నుంచి రూ. 3000 నుంచి రూ.3500 వరకు వసూలు చేస్తారు. శాస్త్రీయమైన శిక్షణ లేకుండా డబ్బులు ఇచ్చి డ్రైవింగ్ లెసైన్స్ పొందే డ్రైవర్లు రవాణా వాహనాలను ఎలా నడుపుతారో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, తదితర కార్యకలాపాలపైనా ఇదే స్థాయిలో కాసుల పంట పండించుకుంటున్నారు. -
ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా
=పర్మిట్ లేకుండా తిరుగుతున్న 8 బస్సుల సీజ్=వేకువజాము నుంచే తనిఖీలు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఎనిమిది ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుంచి జిల్లాలో రవాణా శాఖ అధికారులు మూడు ప్రాంతాలలో ముమ్మరంగా ఈ తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారిపై వెళ్లే బస్సులను ఆపి ఫిట్నెస్ పరిశీలించారు. డ్రైవర్ల ఫిట్నెస్ను కూడా తనిఖీ చేశారు. కొన్ని బస్సులు పర్మిట్ కూడా లేకుండా తిరుగుతున్నట్టు ఈ సందర్భంగా వెల్లడైంది. సీజ్ చేసిన బస్సులను గన్నవరంలోని ఫిట్నెస్ సెంటర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. కేశినేని ట్రావెల్స్, సాయిశ్రీకృష్ణ ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్, ధనుంజయ్ ట్రావెల్స్, భాగ్యలక్ష్మి ట్రావెల్స్, వీఆర్ఎన్ ట్రావెల్స్, ఆర్పీ ట్రావెల్స్, మూన్లైట్స్కు చెందిన బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. ప్రయాణికులు ఇబ్బందిపడకుండా వారిని గమ్యస్థానాలకు చేర్చి వచ్చి స్వాధీనం చేయాలని ఆర్టీఏ అధికారులు ఆ బస్సుల డ్రైవర్లకు ఉత్తర్వులిచ్చారు. ఈ బస్సులకు కాంట్రాక్టు క్యారియర్స్‌గా తక్కువ మొత్తం ట్యాక్స్ కట్టి, స్టేజ్ క్యారియర్స్‌గా వినియోగిస్తూ రవాణా శాఖను మోసగిస్తున్నారు. ఈ బస్సులలో రెండు కర్నాటకకు చెందినవి. గురువారం తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల వరకు గన్నవరం, ఇబ్రహీంపట్నం, విజయవాడ వారధి వద్ద తనిఖీలు చేశారు. డీటీసీ సీహెచ్ శివలింగయ్య పర్యవేక్షణలో 17 మంది ఇన్స్పెక్టర్లు తనిఖీలలో పాల్గొన్నారు. డీ టీసీ శివలింగయ్య ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలో బస్సుల ఫిట్‌నెస్‌పై తరచూ తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో రిజిస్టరైన 498 బస్సుల ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ప్రైవేటు బస్సులపై కొరడా
సాక్షి, సంగారెడ్డి: మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై 45 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో రవాణా శాఖ మేల్కొంది. గురువారం ఉదయం 04 - 08 గంటల మధ్య రవాణా శాఖ అధికారులు జిల్లాలో ప్రైవేటు బస్సులపై అకస్మిక దాడులు జరిపారు. జహీరాబాద్, చిరాగ్పల్లి, కంది చెక్‌పోస్టుల వద్ద బస్సులను నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రవాణా పర్మిట్లు, ఇన్స్యూరెన్స్, ప్రయాణికుల సంఖ్య, డ్రైవర్ లెసైన్స్ తదితర అంశాలను పరిశీలించారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మమతా ప్రసాద్ నేతృత్వంలో 15 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ దాడుల్లో పాల్గొన్నారు. సుమారు 70 బస్సులను తనిఖీ చేశారు. అధికారుల కన్నుగప్పి తనిఖీలను తప్పించుకోవడానికి జహీరాబాద్ చెక్‌పోస్టు మీద నుంచి కాక చిరాగ్పల్లి మీదుగా ఎక్కువగా ప్రైవేటు బస్సులు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిపిన సోదాల్లో పరిమితికి మించిన ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న అక్బర్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సును అధికారులు సీజ్ చేశారు. ప్రయాణీకులను పటాన్చెరువద్ద దింపేసి ఆ బస్సును సంగారెడ్డి మండలం కందిలోని డీటీసీ కార్యాలయానికి తరలించారు. బస్సు సీటింగ్ సామర్థ్యం డ్రైవర్‌తో సహా 37 ఉండగా మరో 5 మంది ప్రయాణీకులను అధికంగా కలిగి ఉన్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రయాణికుల వివరాలను సైతం రిజిస్టర్లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో బస్సు యజమానిపై క్రిమినల్ కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. డ్రైవర్ యూనిఫాం వేసుకోకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం లాంటి స్వల్ప ఉల్లంఘనలతో పట్టుబడిన మరో రెండు బస్సులపై జరిమానాలు విధించి వదిలేశారు. ఇకపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తామని డీటీసీ మమతా ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. -
అనంతపురంలో ఐదు ప్రైవేట్ బస్సులపై కేసు
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద దుర్ఘటన అనంతరం ప్రభుత్వం కళ్లు తెరిచింది. ఆర్టీఏ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులపై సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో ప్రైవేట్ బస్సుల లైసెన్స్‌లను అధికారులు పరిశీలించారు. రికార్డులు సరిగా లేని ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, విజయవాడ శివార్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిలో మూడు బస్సులను అధికారులు సీజ్ చేశారు. విజయవాడలో పర్మిట్లు లేని పలు ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను జప్తు చేశారు. -
చట్టాల్లో మార్పులవసరం: బొత్స సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బస్సుల దూకుడుకు కళ్లెం వేసేందుకు పటిష్టమైన ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అవసరమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర మోటారు వాహన చట్టాల్లో మార్పులు అవసరమని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధం ఘటనపై మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో ఆయన బుధవారం రవాణా కమిషనర్ కార్యాలయంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి లక్ష్మీపార్థసారథి, కమిషనర్ అనంతరాం, అదనపు కమిషనర్ శ్రీనివాస్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. కల్వర్టు దాటే క్రమంలో డ్రైవర్ తన ముందున్న కారును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడని, అదే సమయంలో ముందు టైర్ పేలిందని, దాంతో బస్సు కల్వర్టుకు ఢీకొని డీజిల్ ట్యాంకర్ పగిలిందని చెప్పారు. క్షణాల్లో మంటలంటుకొని బస్సు పూర్తిగా కాలిపోయిందని, ఈ ఘటనలో మొత్తం 45 మంది అక్కడికక్కడే చనిపోయారని చెప్పారు. గాయపడిన మరో ఐదుగురు డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బస్సుసీటింగ్ సామర్ధ్యం 43 మాత్రమేనని, ఇద్దరు డ్రైవర్లతో కలుపుకుని 45 మంది ప్రయాణించవలసి ఉండగా, ఐదుగురు ఎక్కువగా ఉన్నారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. రవాణా అధికారులు తనిఖీలు చేయకపోవడమే ఓవర్ లోడింగ్‌కు కారణమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్ట్ క్యారేజీలుగా తిరగాల్సిన బస్సులు స్టేజీ క్యారేజీలుగా ఎందుకు తిరుగుతున్నాయన్న ప్రశ్నకు.. ప్రయాణికుల డిమాండ్‌ను ఆర్టీసీ భర్తీ చేయలేకపోతోందని, దీంతో స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోలేకపోతున్నామని మంత్రి చెప్పారు. బస్సులకు వేగ నియంత్రణ పరికరాలు(స్పీడ్ గవర్నర్స్) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కోర్టుల జోక్యం వల్ల ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. కాగా దివాకర్ ట్రావెల్స్ రోడ్ లైన్స్‌కు చెందిన ఈ బస్సు(ఏపీ 02 టీఏ 0963) బెంగళూరుకు చెందిన జబ్బార్ ట్రావెల్స్‌కు 2011 అక్టోబర్‌లో బదిలీ అయిందని మంత్రి చెప్పారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు, అలాగే గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా అందించే విషయంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించాక ప్రకటిస్తామని బొత్స తెలిపారు. -
భద్రత డొల్లే!
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: ధనార్జనే ధ్యేయంగా దూరప్రాంతాలకు ప్రైవేటు బస్సులు నడుపుతున్న పలు సంస్థలు ప్రయాణికుల భద్రతను గాలికొదిలేశాయి. అరకొర అనుభవం ఉన్న సిబ్బందితో రాత్రి వేళలో వందలాది కిలోమీటర్ల దూరం బస్సులు నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నిషేధిత వస్తువులను సైతం యథేచ్ఛగా రవాణా చేస్తూ నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నాయి. ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా వారిలో మార్పు కరువైంది. ఏదేని ఘటన జరిగిన సమయంలో నాలుగు రోజుల పాటు తనిఖీల పేరుతో హడావుడి చేసే అధికారులు అనంతరం మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోరప్రమాదంలో 45 మంది సజీవదహనమైన నేపథ్యంలో ప్రైవేటు బస్సుల్లోని భద్రతాలోపం మరోసారి బయటపడింది. ఈ ప్రమాదంతో అందరిలో మరోసారి ఆందోళన మొదలైంది. జిల్లా వాసులు సైతం వివిధ ప్రాంతాలకు పయనించేందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. రైళ్లలో రిజర్వేషన్ దొరకడం కష్టమవుతుండటంతో అధిక చార్జీలు చెల్లించైనా ఈ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. నెల్లూరు నుంచి రోజూ హైదరాబాద్‌కు 40, బెంగళూరుకు 11 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవిగాక విజయవాడ-బెంగళూరు, విశాఖపట్టణం-బెంగళూరు, చెన్నై- హైదరాబాద్, చెన్నై-విశాఖపట్టణం బస్సులు నెల్లూరు మీదుగా నడుస్తున్నాయి. వీటిలో నిత్యం మూడు వేల మంది వరకు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సుల్లో పైపై సోకులు చేస్తున్న పలు ప్రైవేటు సంస్థలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులోని మినీబైపాసురోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్డు ప్రైవేటు వాహనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు ప్రైవేటు బస్సుల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిస్తున్నారు. నిబంధనల ప్రకారం దూరప్రాంతాలు, ఘాట్రోడ్డుల్లో రాకపోకలు సాగించే బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. 12 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లతోనే బస్సులు నడపాలి. బస్సులు బయలుదేరే సమయంలో కచ్చితంగా బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష నిర్వహించారు. ఒక వేళ డ్రైవర్ మద్యం సేవించి ఉంటే విధుల్లోకి అనుమతించకూడదు. 24 గంటల పాటు బస్సులో గడిపిన డ్రైవర్‌కు తర్వాత రోజూ పూర్తిగా విశ్రాంతినివ్వాలి. అయితే ప్రస్తుతం ప్రైవేటు బస్సుల్లో పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. అరకొర అనుభవం ఉన్న డ్రైవర్లతోనే దూరప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. యజమానుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది సంపాదనే ధ్యేయంగా నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. రూ.200 సమర్పిస్తే బైక్‌లను సైతం బస్సులో రవాణా చేస్తున్నారు. అందులో పెట్రోలు ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. టూల్ బాక్సుల్లో లగేజీ రవాణా కాసులకు కక్కుర్తిపడుతున్న ట్రావెల్ సంస్థల మేనేజర్లు, సిబ్బంది భారీగా లగేజీని ఓల్వో బస్సుల టూల్ బాక్సుల్లో రవాణా చేస్తున్నారు. వీటిలో నిషేధిత వస్తువులు ఉండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు కెమికల్స్, టైర్లు, టూర్ ప్యాకేజీలకు వెళ్లినప్పుడు గ్యాస్ సిలిండర్లు, వంటసామగ్రిని అనుమతిస్తున్నారు. ఏదేని ప్రమాదం జరిగిన సమయంలో వీటి కారణంగా ప్రమాదతీవ్రత పెరుగుతోంది. అత్యవసర సమయాల్లో ఉండాల్సిన ప్రథమచికిత్స పెట్టె, ఫైర్ ఎగ్జ్వింషర్, అత్యవసర ద్వారా వద్ద ఉండాల్సిర రబ్బరు సుత్తులు ఏ బస్సులోనూ కనిపించవు. లోపించిన పర్యవేక్షణ ప్రైవేటు బస్సుల రాకపోకలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గతంలో షిరిడీకి వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అధికారులు కొద్దిరోజుల పాటు హడావుడి చేశారు. అనంతరం తనిఖీలు మానేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అటు రవాణా శాఖాధికారులతో పాటు ఇటు పోలీసులు తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూసి ప్రమాదాలను నిరోధించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
ప్రైవేట్‌కు పండుగ
సెలవుల వారం .. =సొంత ఊర్లకు నగర వాసులు =ప్రైవేట్ బస్సుల నిలువు దోపిడీ =పండుగ సీజన్లో చార్జీలు రెండింతలు =ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యం =10 శాతం అధికంగా చార్జ చేస్తున్న కేఎస్ ఆర్టీసీ =‘ప్రత్యేకం’ పేరుతో వడ్డన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దసరా పండుగ సీజన్‌ను ప్రైవేట్ బస్సులు చక్కగా ‘సద్వినియోగం’ చేసుకుంటున్నాయి. పండుగలకు ఊర్లకు వెళ్లాలని తహతహలాడుతున్న ప్రయాణికుల నుంచి రెండింతల చార్జీలను వసూలు చేస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ మాత్రం ఎప్పటిలాగే రద్దీ సీజన్లో అదనంగా పది శాతం వసూలు చేస్తోంది. దసరా సెలవులతో పాటు బక్రీద్, వాల్మీకి జయంతి కలసి రావడంతో ప్రయాణికుల రద్దీ అధికమైంది. రెండో శనివారం, ఆదివారం, విజయ దశమి (సోమవారం), బక్రీద్ (మంగళవారం)తో పాటు మరో మూడు రోజులు ప్రభుత్వోద్యోగులు ప్రైవేట్‌కు పండుగ సెలవు పెడితే వచ్చే వారం అంతా ఊర్లలోనే గడపవచ్చు. చాలా మంది పర్యాటక స్థలాల సందర్శనకు వెళుతున్నారు. దీని వల్ల ఆర్టీసీ ఎన్ని అదనపు బస్సులు నడిపినా చాలడం లేదు. శుక్రవారం రాత్రి దాదాపుగా ప్రయాణికులందరూ గమ్య స్థానాలకు బయలుదేరారు. మంగళూరుకు ఆర్టీసీ వోల్వో మల్టీ-యాక్సిల్ బస్సులో చార్జీ రూ.740 కాగా ప్రైవేట్ బస్సులో రూ.1,100 వసూలు చేశారు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే గోవా (పనాజీ)కు ప్రైవేట్ బస్సులో చార్జీ రూ.2,500 కాగా ఆర్టీసీలో రూ.840. రద్దీ దృష్ట్యా గోవాకు ఆర్టీసీ 17 ప్రత్యేక వోల్వో బస్సులను నడుపుతోంది. ఇందులో ఛార్జీ రూ.1,304గా నిర్ణయించారు. ఆర్టీసీ ఈ పండుగ సీజన్‌కు గాను రిజర్వేషన్ సౌకర్యంతో 300 బస్సులను, రిజర్వేషన్ లేకుండా 700 బస్సులను నడుపుతోంది. ఇవి కాకుండా మైసూరు దసరా కోసం 200 అదనపు బస్సులను నడుపుతున్నారు. ఆదివారం వరకు వివిధ గమ్య స్థానాలకు అదనపు బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మెజిస్టిక్ బస్ స్టేషన్లో మెట్రో రైలు పనులు జరుగుతున్నందున, అదనపు బస్సులను విజయనగర టీటీఎంసీ, నవరంగ్, మైసూరు రోడ్డు శాటిలైట్ బస్ స్టేషన్, బనశంకరి టీటీఎంసీ, మల్లేశ్వరం 18వ క్రాస్, జయనగర నాలుగో బ్లాక్, గంగా నగరల నుంచి నడపనున్నట్లు వివరించారు. బస్సును ఎక్కడ ఎక్కాలో టికెట్‌పై నిర్దేశించారు. రిజర్వేషన్ లేకుండా నడుపుతున్న బస్సులన్నీ మెజిస్టిక్ నుంచి బయలుదేరుతాయి. -
ఆర్టీసీ చక్రాలకు బ్రేక్
సాక్షి, విశాఖపట్నం: సకల జనుల సమ్మె ప్రభావం ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం తొలి షెడ్యూల్ నుంచే బస్సులు కదల్లేదు. నాలుగు సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. కిందిస్థాయి ఉద్యోగులూ విధులు బహిష్కరించారు. ఫలితంగా విశాఖ రీజియన్ పరిధిలో సుమారు 1060 బస్సులు తొమ్మిది డిపోలకు పరిమితమైపోయాయి. ఇందులో 240అద్దె బస్సులూ ఉన్నాయి. కొన్నిచోట్ల ప్రైవేట్ బస్సుల హడావుడి కనిపించినా నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సమ్మె కారణంగా విశాఖ రీజియన్‌లో సుమారు రూ.70లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అద్దె బస్సుల ద్వారా వాహనాల్ని నడిపేందుకు అధికారులు ప్రయత్నించినా ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు అడ్డు చెప్పడంతో రోడ్లుపై బస్సులు కనిపించలేదు. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఎన్జీవో సంఘం సభ్యులు సమ్మె ప్రతిపాదన విరమించేవరకూ ఆర్టీసీకీ సమ్మె ప్రభావం తప్పదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి, సీమాంధ్ర సమితి కన్వీనర్ పలిశెట్టి దామోదర్‌రావు తెలిపారు. మద్దిలపాలెం, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో సంఘం నాయకులు అల్లు సురేష్‌నాయుడు, కేజే శుభాకర్, రామకృష్ణ, ఆర్జీ నాయుడు, ఎం. త్రిమూర్తులు తదితరులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదించారు. మరోవైపు ఆర్టీసీ కాంప్లెక్సులో ఉద్యోగులు క్రికెట్ ఆడి తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికి బంద్ కారణంగా ఆర్టీసీ చక్రాలకు బ్రేకులు పడ్డాయి. -
‘రవాణా’పై ఆరా
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేక రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో మహా నగరంలోని అన్ని ప్రభుత్వ విభాగాలపై ‘ఎఫెక్ట్’ పడుతోంది. కేంద్రం వివిధ ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రధానంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వ శాఖ అయిన రవాణాపై కేంద్ర ఉన్నతాధికారులు వివరాలను సేకరించారు. ఇప్పటికే దీనిపై రవాణా అధికారులు నివేదికలను కూడా అందజేసినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల పన్నుల రూపంలో రవాణా శాఖ నుంచి సర్కార్‌కు లభించే ఆదాయాన్ని అంచనా వేయడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి లభించే ఆదాయంపైనా ప్రధానంగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల కంటే ఈ రెండు జిల్లాల్లోనే వాహనాలు భారీ సంఖ్యలో ఉండటం, ఏటా లక్షల్లో వాహనాల అమ్మకాలు, వాటిపైన వచ్చే జీవితకాల పన్ను, రవాణా వాహనాలపై లభించే త్రైమాసిక పన్ను వంటి వివిధ ఆదాయ మార్గాల ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఏటా ఎంత మేరకు వసూలవుతోందనే దానిపై అధికారులు కేంద్రానికి నివేదిక సమర్పించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయాలు, నిర్వహణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో హైదరాబాద్‌తో కలిసి ఈ రెండు జిల్లాల్లో అన్ని రకాల వాహనాలు ప్రస్తుతం 38 లక్షలకు చేరుకున్నాయి. ఏటా 2 లక్షల వాహనాలు కొత్తగా చేరుతున్నాయి. ఈ క్రమంలో ఆదాయం మరింత పెరిగే అవకాశాలపై అంచనా వేస్తున్నారు. భారీగా పెరగనున్న అంతర్రాష్ట పన్నులు రాష్ట్ర విభజన ఖాయమైన పక్షంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వస్తు, ప్రయాణికుల రవాణా వాహనాల ఇంటర్‌స్టేట్ (అంతర్రాష్ట్ర) పన్నులు కూడా భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం ఒకే రాష్ట్రంలో తిరుగుతున్న ఈ వాహనాలు కూడా రెండు రాష్ట్రాలుగా విడిపోనున్నాయి. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు, అక్కడి నుంచి ఇక్కడకు రాకపోకలు సాగించే వాహనాలు ఆల్ ఇండియా పర్మిట్లను తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులపై ఈ భారం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. మరో 500 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్లపైన ముంబయి, షిరిడీ, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆల్ ఇండియా పర్మిట్లపై ఈ బస్సులు ఒక్కో సీట్‌పైన రూ.3600 చొప్పున చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత ప్రస్తుతం రాష్ర్ట స్థాయి పర్మిట్ల కింద ఒక్కో సీట్‌పై రూ.2600 చొప్పున 1500కు పైగా బస్సులు సైతం ఆల్ఇండియా పర్మిట్లను తీసుకోవలసి ఉంటుంది. అంటే వీటిపై ఒక్కో సీట్‌కు రూ.వెయ్యి చొప్పున అదనపు భారం పడనుంది. అంతర్రాష్ర్ట వాహనాల వివరాలను కేంద్రం సేకరించినట్లు తెలిసింది. పాలనాపరమైన అంశాల్లో... ప్రస్తుతం రవాణాశాఖలో ఐఏఎస్ స్థాయి అధికారి కమిషనర్‌గా ఉన్నారు. మరొక అదనపు రవాణా కమిషనర్, హైదరాబాద్ ఆర్టీఏతో కలుపుకొని నలుగురు జేటీసీలు ఉన్నారు. అదనపు కమిషనర్‌తో పాటు ముగ్గురు సీమాంధ్ర అధికారులు కాగా, ఇద్దరు జేటీసీలు తెలంగాణకు చెందినవారు. వీరు కాక మెదక్, గుంటూరు, కరీంనగర్ జిల్లాల్లో మరో ముగ్గురు సీమాంధ్రకు చెందిన అధికారులు ఉపరవాణా కమిషనర్లుగా పని చేస్తున్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు చెందిన అదనపు రవాణా కమిషనర్ స్థాయి అధికారిని ఇన్చార్జి కమిషనర్‌గా నియమించవచ్చని ఆ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అదనపు రవాణా కమిషనర్‌గా పనిచేసిన మల్యాద్రి రెండున్నరేళ్ల పాటు ఇన్చార్జి కమిషనర్‌గా పనిచేసిన అనుభవాన్ని అధికారులు ఉదహరిస్తున్నారు.