12 ప్రైవేట్ బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ | RTA Seize Private Buses in vijayawada - hyderabad highway | Sakshi
Sakshi News home page

12 ప్రైవేట్ బస్సులు సీజ్ చేసిన ఆర్టీఏ

Published Thu, Nov 14 2013 11:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:36 AM

RTA Seize Private Buses in vijayawada - hyderabad highway

ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలోని పాలెం సమీపంలో వోల్వా బస్సు దగ్ధమైంది. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులపై కొరడ ఝుళిపించారు. అందులోభాగంగా గతరాత్రి హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న 12 ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

 

మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం వద్ద బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది మరణించారు. దాంతో ఆర్టీఏ అధికారులు తనిఖీలను ముమ్మరం చేసింది. దాంతో ఆ ఘటన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు చేసిన దాడుల్లో  దాదాపు వెయ్యి బస్సులను సీజ్ చేశారు.

 

అయితే గత అర్థరాత్రి బెంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న వోల్వో ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement