హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రయివేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అధికారులు తెల్లావారుజాము నుంచే దాడులు చేపట్టారు. పరిగి-వికారాబాద్, ఉప్పల్-ఆరాంఘర్, మోహదీపట్నం-లింగంపల్లి, ఉప్పల్-కోఠి, ఉప్పల్-సంతోష్ నగర్, సికింద్రాబాద్-బోయిన్పల్లి, సికింద్రాబాద్-కూకట్పల్లి ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేస్తున్నారు.
కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్
Published Wed, Oct 29 2014 9:45 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM
Advertisement
Advertisement