rta raids
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి పండుగ సీజన్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. గాజువాక సమీపంలోని అగనంపూడి టోల్గేట్ వద్ద ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించారు. ప్రవేటు ట్రావెల్స్ బస్సులు నిబంధనలు పాటిస్తున్నాయా? లేదా? అన్నది తనిఖీ చేశారు. మొత్తం 59 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఐదు బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ కొరడా
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టి యథేచ్చగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పాపారావు ఆధ్వర్యంలో పలు బృందాలుగా ఏర్పడిన రవాణాశాఖ అధికారులు ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు జరిపారు. పాపారావు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు, బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు జరిగిన ఈ దాడుల్లో అధికారులు దాదాపు 200 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 44 బస్సులపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల వల్ల రవాణా శాఖకు రూ. 22 లక్షల ఆదాయం రావడం గమనార్హం. ఈ తనిఖీలకు సంబంధించి పాపారావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రవాణాశాఖ అధిక ఆదాయాన్ని చేకూర్చే వనరుగా ఉందన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై జరిమానాలు విధించి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచాలన్నారు. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ కొరడా
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులో ఆర్టీఏ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా అక్రమంగా తిరుగుతున్న 67 ప్రైవేటు బస్సుల యజమానులపై కేసులు నమోదుచేశారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న మూడు బస్సులను ఈ తనిఖీలలో భాగంగా సీజ్ చేశారు. అలాగే టాక్స్ చెల్లించకుండా సర్వీసులు నడుపుతున్న 13 బస్సులపై కేసులు నమోదుచేయడంతో పాటు రూ.6లక్షల రూపాయల జరిమానా వసూలుచేశారు. -
ఆర్టీఏ తనిఖీలు : 27 బస్సులపై కేసు నమోదు
హైదరాబాద్ : నగర శివారుల్లో జాతీయ రహదారిపైర ఆర్టీఏ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 27 బస్సులను అదుపులోకి తీసుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని నాగ్‌పూర్ జాతీయ రహదారిపరై ఆర్టీఏ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏడు ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే సరైన పత్రాలు లేని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. -
ఆర్టీఏ తనిఖీలు: ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ పరిధిలోని పెద్ద అంబర్ పేట సమీపంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అదుపులోకి తీసుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. -
ఆర్టీఏ తనిఖీలు : రెండు బస్సులు సీజ్
శంషాబాద్ : శంషాబాద్ మండలం గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సుమారు 100 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే రెండు బస్సులను సీజ్ చేశారు. -
ప్రైవేటు స్కూలు బస్సులపై ఆర్టీఏ దాడులు
► నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల సీజ్ - డీటీసీ ► 70 వాహనాలు సీజ్, రూ. 2.50 లక్షలు జరిమానా కడప: జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు డీటీసీ మల్లేపల్లె బసిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. కడప నగరంలోని బిల్టప్ సమీపంలో నిర్వహించిన దాడుల్లో డీటీసీ స్వయంగా పాల్గొన్నారు. ఎఫ్‌సీ లేని కారణంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో 70 వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి రూ.2.50లక్షలు జరిమానా విధించారు. ప్రధానంగా వీటిల్లో 16 వివిధ విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. 10 రిజిస్ట్రేషన్ లేని మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు. మిగిలిన 44 వాహనాల్లో ఒక పొక్లైనర్, ఆటోలు, ట్రాక్టర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 1051 విద్యాసంస్థల బస్సులు ఉంటే వాటిలో 606 బస్సులకు మాత్రమే ఎఫ్‌సీలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన 445 విద్యాసంస్థల బస్సులకు ఎఫ్‌సీలు, ఇతర రికార్డులు లేవన్నారు. వెంటనే విద్యాసంస్థల యాజమాన్యాలు స్పందించి తమ వాహనాలకు ఎఫ్‌సీలు చేయించుకోవాలన్నారు. ఈ దాడుల్లో ఎంవీఐ శ్రీనివాసులు, ఏ ఎంవీఐ జగదీష్ పాల్గొన్నారు. -
ఏపీలో స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు
-
ఎల్బీనగర్ లో ఆర్టీఏ దాడులు
హైదరాబాద్: ఎల్బీనగర్లో స్కూల్, కాలేజీ బస్సులపై ఆర్టీసీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న నాలుగు కాలేజీ బస్సులను సీజ్ చేశారు. మరో రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాక 60ఏళ్ల పైబడిన డ్రైవర్.. ఓ స్కూల్ బస్ ను నడుపుతుండగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. ఈ దాడులు కొనసాగుతాయని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారి తెలిపారు. వేలకు వేలు ట్రాన్స్పోర్ట్ ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలు... బస్సుల ఫిట్నెస్ గురించి కూడా ఆలోచించాలంటున్నారు అధికారులు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
ఏపీలో స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు
విజయవాడ: ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభమైన సందర్భంగా RTA అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తూ... కేసులు నమోదు చేస్తున్నారు. విజయవాడలో దాదాపు 500 బస్సులు ఫిట్నెస్ తీసుకోకుండా తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ బస్సులు అన్నింటినీ గుర్తించే వరకు దాడులు నిర్వహిస్తామంటున్నారు. కడపలోనూ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిట్నెస్ సరిగా లేని కారణంగా మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బస్సుల ఫిట్నెస్ను తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో ఆర్టీఏ దాడులు
కడప టౌన్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులను గుర్తించేందుకు జిల్లా ఆర్టీఏ విభాగం సిద్ధమైంది. ఈ చర్యల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా స్కూల్ బస్సులను నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కడప నగరంలో రెండు బస్సులను వారు గుర్తించి సీజ్ చేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. -
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం
హైదరాబాద్: వేసవి సెలవులు ముగియడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు శుక్రవారం ప్రారంభమైనాయి. దీంతో విద్యార్థులు బడి బాట పట్టారు. అయితే విద్యార్థులను తరలిస్తున్న స్కూల్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు దాడు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలకు ఆర్టీఏ అధికారులు జరిమాన విధించారు. అయితే రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో కేంద్రీయ విద్యాలయ తరహాలో విద్యావిధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. -
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడులు
హైదరాబాద్ : ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, కూకట్పల్లి, లక్డీకాపూల్‌లో శుక్రవారం అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు నిబంధనలు పాటించని 14 ట్రావెల్స్ సంస్థలపై కేసులు నమోదు చేశారు. వీటిలో కేశినేని, ఆరెంజ్, ఎస్వీఆర్ ట్రావెల్స్ తదితర సంస్థలు ఉన్నట్లు సమాచారం. -
కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రయివేట్ వాహనాలపై ఆర్టీఏ అధికారులు బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అధికారులు తెల్లావారుజాము నుంచే దాడులు చేపట్టారు. పరిగి-వికారాబాద్, ఉప్పల్-ఆరాంఘర్, మోహదీపట్నం-లింగంపల్లి, ఉప్పల్-కోఠి, ఉప్పల్-సంతోష్ నగర్, సికింద్రాబాద్-బోయిన్పల్లి, సికింద్రాబాద్-కూకట్పల్లి ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాలను అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేస్తున్నారు. -
27 ప్రైవేట్ బస్సులు సీజ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 27 బస్సులను సీజ్ చేశారు. గుంటూరు జిల్లాలో 10, విజయవాడలో 4, విశాఖపట్నం జిల్లాలో 3 తూర్పుగోదావరి జిల్లాలో 3 బస్సులను సీజ్ చేశారు. ఈ బస్సులు సరైన పత్రాలు లేకుండా ప్రయాణికులను తరలిస్తుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఆర్టీఏ అధికారుల దాడుల్లో 7 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేశాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు. దసరా పండగ సమయంలో రేట్టింపు ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. -
కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజు ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఆర్టీఏ అధికారులు కూకట్‌పల్లిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని 12 పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా రెండు బస్సులను సీజ్ చేశారు. ఫైర్ స్టేఫ్టీ లేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు లేని కారణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని పాఠశాల యాజమాన్యాలకు అధికారులు నోటీసులను పంపించారు. వనస్థలిపురంలో 11, కొంపల్లిలో 8 బస్సులను సీజ్ చేశారు. మెదక్ జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 14 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్లో 24 స్కూల్ బస్సులపై కేసు నమోదు చేశారు. -
ఇప్పటివరకూ 120 స్కూల్ బస్సులు సీజ్
హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు శుక్రవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇప్పటివరకూ 120 స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్ ఆపరేషన్ పేరుతో జరుపుతున్న ఈ తనిఖీల్లో రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా 45 బస్సులను సీజ్ చేశారు. మెహదీపట్నంలో రెండు, ఎల్బీనగర్లో 14 బస్సులు, మేడ్చల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్లలో 19 బస్సులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిబంధనలు పాటించిన బస్సులను సీజ్ చేశారు. -
చెక్ పోస్టులపై ఏసీబీ, ఆర్టీఏ అధికారులు దాడులు
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని చెక్పోస్టులపై ఏసీబీ, ఆర్టీఏ అధికారులు వేర్వేరుగా శనివారం తెల్లవారుజామున ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లోని తడ చెక్‌పోస్టుపై దాడి చేసి భారీగా నగదును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా కొందుర్గు చెక్‌పోస్టు నుంచి రూ.55 వేలను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తేటగుంట చెక్‌పోస్టుపై చేసిన దాడిలో రూ.25వేలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు అనంతపురం జిల్లా పెనుకొండ చెక్‌పోస్టుపై నిర్వహించిన దాడులలో రూ. రూ.39 వేల నగదుతోపాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ సమీపంలోని పాలమాకుల చెక్‌పోస్టుపై దాడి చేసి రూ.24 వేల నగదు సీజ్ చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్‌పోస్టుపై దాడులు నిర్వహించి రూ. 41 వేలు స్వాధీనం చేసుకున్నారు. -
ఐదు ప్రైవేట్ బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ
పాలెం బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. నగర శివారుల్లోని పటాన్చెరువు ఔటర్ రింగ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఐదు బస్సులను ఆర్టీఏ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. అలాగే కర్నూలు జిల్లాలో పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆర్టీఏ తనిఖీలు నిర్వహించింది. ఆ తనిఖీలలో ఏడు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమైయ్యారు. అప్పటి వరకు నిద్ర మత్తులో జోగుతున్న రవాణ శాఖ ఆ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాకుండా ఆ దుర్ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణ శాఖ చర్యలకు ఉపక్రమించింది. -
అనంతపురంలో 8 ప్రైవేటు బస్సులు సీజ్
-
అనంతపురంలో 8 ప్రైవేటు బస్సులు సీజ్
అనంతపురం : ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా ఝళిపించారు. సోమవారం ఉదయం అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాట్ -బెంగళూరు మధ్య నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 8 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. నగర శివార్లలో ఎన్‌హెచ్ 44 జాతీయ రహదారిపై బస్సులను ఆపి తనిఖీ చేశారు. ప్రైవేటు బస్సుల్లో ఉన్న ప్రయాణికులను ఆర్టీసి వారి సహకారంతో గమ్యస్థానాలకు తరలించారు. బస్సులను సీజ్ చేసిన సమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తోందని, వారు ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణించాలని అధికారులు విజ్ణప్తి చేస్తున్నారు. -
ఎల్బీనగర్లో 8 ప్రైవేట్ బస్సులు సీజ్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్లో విజయవాడ నుండి వస్తున్న వాహనాలను ఆర్టీఎ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఆపి తనిఖీలు నిర్వహించారు. పర్మిట్, ఫిట్నెస్ లేని 8 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. ఇందులో ఎస్వీఆర్, తిరుమల, కావేరి, భాను, మార్నింగ్‌స్టార్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ప్రయాణికులను మార్గ మాధ్యలోనే దింపేసి బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఎ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మెదక్ జిల్లా జహీరాబాద్ చెక్‌పోస్ట్ వద్ద పర్మిట్ లేని 5 బస్సులను ఆర్టీఎ అధికారులు సీజ్ చేశారు. -
13 ప్రయివేట్ బస్సులను సీజ్ చేసిన ఆర్టీఏ
హైదరాబాద్ : నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్న ప్రయివేట్ బస్సు యాజమాన్యాలపై ఆర్టీఏ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 13 ప్రయివేట్ బస్సులను సీజ్ చేశారు. అయితే ఈసారి ఆర్టీసీకి చెందిన రెండు గరుడ బస్సులను కూడా సీజ్ చేయడం విశేషం. రాష్ట్రంలో పేరు మోసిన కేశినేని, కాళేశ్వరి, కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఏ అధికారులు నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని టోల్గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పర్మిట్లు లేకపోవడంతో పాటు ఫైర్ సేఫ్టీ పాటించకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టుబడ్డ వాహనాలను హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. ఇకపై కూడా దాడులు కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు చెప్పారు. కాగా ప్రయివేట్ ట్రావెల్స్ ఆగడాల కారణంగా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న సహారా ట్రావెల్స్ బస్సును జహీరాబాద్ చెక్ పోస్ట్ వద్ద ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో బస్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రయాణీకుల రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా సహారా ట్రావెల్స్ యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. -
రాష్ట్రవ్యాప్తంగా 32 బస్సులు సీజ్
మహాబూబ్‌నగర్ జిల్లాలో కొత్తకోట మండల పాలెం వద్ద బస్సు అగ్నికి ఆహుతి అయిన నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొరడా ఝుళిపించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారుల మంగళవారం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు నిర్వహించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 32 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ప్రైవేట్ బస్సులన్ని నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. అయితే నల్గొండ జిల్లాలో అత్యధికంగా 16 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. రంగరెడ్డి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 5, ఖమ్మం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2 బస్సులను సీజ్ చేసినట్లు వివరించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ, అమాయక ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్న ప్రైవేట్ బస్సులపై దాడులు కొనసాగుతాయని ఆర్టీఏ అధికారులు మంగళవారం స్పష్టం చేశారు.