తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజు ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఆర్టీఏ అధికారులు కూకట్‌పల్లిలో...
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రెండోరోజు ఆర్టీఏ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఆర్టీఏ అధికారులు కూకట్‌పల్లిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని 12 పాఠశాల బస్సులపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా రెండు బస్సులను సీజ్ చేశారు. ఫైర్ స్టేఫ్టీ లేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు లేని కారణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా నిబంధనలు పాటించని పాఠశాల యాజమాన్యాలకు అధికారులు నోటీసులను పంపించారు. వనస్థలిపురంలో 11, కొంపల్లిలో 8 బస్సులను సీజ్ చేశారు. మెదక్ జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 14 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్లో 24 స్కూల్ బస్సులపై కేసు నమోదు చేశారు.