రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి | President Pranab Mukherjee condoles deaths in Telangana accident | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

Published Fri, Jul 25 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

President Pranab Mukherjee condoles deaths in Telangana accident

సాక్షి, న్యూఢిల్లీ: రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంపై రాష్ట్రపతి విచారం వెలిబుచ్చుతూ.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఓ సందేశం పంపారు. మరోవైపు ప్రధాని మోడీ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలియజేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. ఈ ఘటనలో గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రమాదంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ విచారం వ్యక్తం చేశారు.

 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. ఎంతోమంది చిన్నారులు మరణించడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఘటనపై గవర్నర్ నరసింహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement