హైదరాబాద్ : మెదక్ జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు శుక్రవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇప్పటివరకూ 120 స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్పెషల్ ఆపరేషన్ పేరుతో జరుపుతున్న ఈ తనిఖీల్లో రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా 45 బస్సులను సీజ్ చేశారు. మెహదీపట్నంలో రెండు, ఎల్బీనగర్లో 14 బస్సులు, మేడ్చల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్లలో 19 బస్సులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నిబంధనలు పాటించిన బస్సులను సీజ్ చేశారు.
ఇప్పటివరకూ 120 స్కూల్ బస్సులు సీజ్
Published Fri, Jul 25 2014 10:49 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM
Advertisement
Advertisement