ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభమైన సందర్భంగా RTA అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
విజయవాడ: ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభమైన సందర్భంగా RTA అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తూ... కేసులు నమోదు చేస్తున్నారు. విజయవాడలో దాదాపు 500 బస్సులు ఫిట్‌నెస్ తీసుకోకుండా తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ బస్సులు అన్నింటినీ గుర్తించే వరకు దాడులు నిర్వహిస్తామంటున్నారు. కడపలోనూ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిట్‌నెస్ సరిగా లేని కారణంగా మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బస్సుల ఫిట్‌నెస్‌ను తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.