School management
-
AP: ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ అవకాశం
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీనుంచి జరిగే ఇంటర్మీడియట్ (Intermediate) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు తత్కాల్ (Tatkal Scheme) కింద అవకాశం కల్పించారు. అభ్యర్థులు రూ.3 వేల ఆలస్య రుసుంతో మంగళవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంజనవరి నుంచి 1,48,923 మంది ఇంటర్ విద్యార్థులకు భోజనం పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం (Midday Meal) అందించేందుకు సమగ్ర శిక్ష విభాగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 475 కాలేజీల్లో 398 కాలేజీలకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిస్తున్న ఏజెన్సీలకు అప్పగించారు. మరో 77 కాలేజీలకు ఎన్జీవోల ద్వారా భోజనం సరఫరా చేయనున్నారు.రాష్ట్ర వర్సిటీలు, ప్రభుత్వ కాలేజీలకు రూ.100 కోట్లుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షాభియాన్ (పీఎం–ఉష)లో భాగంగా దేశంలోని పలు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించింది. వర్సిటీలకు అవసరమైన ల్యాబ్స్, మౌలిక సదుపాయాల కల్పన కోసం గత విద్యాసంవత్సరం (2023)లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పుడు నిధులు మంజూరుచేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కేంద్రం త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (పేరెంట్స్ కమిటీ)లకు ఒక్కరోజు శిక్షణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 45,124 పాఠశాలలకు సంబంధించి జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జిల్లా స్థాయిలోనూ, 31 నుంచి జనవరి 2 వరకు మండల స్థాయిలోనూ, 3 నుంచి 6వ తేదీ వరకు పాఠశాల స్థాయిలోనూ శిక్షణ నిర్వహించాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు డీఈవోలను ఆదేశించారు. కాగా, జిల్లా స్థాయిలో 3,765 మందికి, మండల స్థాయిలో 93,643 మంది శిక్షణకు గానూ రూ.1,92,80,070 నిధులు మంజూరు చేశారు. నాన్ టీచింగ్ సిబ్బందికి జేఎల్ పదోన్నతులుప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2024–25 విద్యా సంవత్సరం ప్యానల్ సంవత్సరానికి బోధనేతర సిబ్బందికి 10 శాతం కోటా కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జేఎల్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఆర్జేడీలను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అభ్యంతరాలను నమోదు చేయాలని సూచించారు. వీటిపై ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి తుది సీనియారిటీ జాబితాను పంపించాలన్నారు. కాగా, ఇదే కేటగిరీ కింద ఇటీవల 24 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. -
నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు..
ఆదిలాబాద్: విద్యార్థుల భవితకు బాటలు వేయాల్సిన కొంత మంది గురువులు ఆ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఆ బాధను భరించలేక కొందరు బయట పెడుతుండగా, మరికొంత మంది మౌనంగా భరించాల్సిన దుస్థితి. జిల్లాలో కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఆ కీచకులపై నామమాత్రపు చర్యలకే పరిమితం కావడంతో వక్రబుద్ధి ఉన్న మిగతా వారి తీరులో మార్పు కానరాని పరిస్థితి. సంఘటనలు బయటకు వచ్చినప్పుడు రాజకీయ పలుకుబడి, అధికారుల అండదండలతో బయటపడుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి పోయి వారిపై అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యాశాఖకే చెడ్డ పేరు వస్తోంది. ఇటీవల నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ కీచక గురువు విద్యార్థినులను వేధించడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. గతంలోనూ జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడు ఇటీవల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడడంతో వారు పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి కార్యదర్శి సైతం ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఈవోకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాలలో ఈ ఏడాది మార్చిలో ఓ కోచ్ విద్యార్థినులను వేధించడంతో ఆ విషయం బయట పడింది. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి అతడిని విధుల నుంచి తప్పించారు. వెకిలిచేష్టలకు పాల్పడినట్లు తేలడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. మావల మండలం వాఘాపూర్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతడిని అక్కడి నుంచి మరో పాఠశాలకు బదిలీ చేశారు. ఆ పాఠశాలలో సైతం ఆయన తీరు మారలేదు. విద్యార్థినులు ఆందో ళన చేపట్టినప్పటికీ విషయం బయట పొక్క కుండా విద్యాశాఖాధికారులు కప్పిపుచ్చారు. తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను విద్యార్థినులకు చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆయనను పాఠశాలలో బంధించారు. ఈ మేరకు విచారణ జరిపిన డీఈవో అతడిని మరో పాఠశాలకు పంపించారు. ఉట్నూర్ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అలాగే అతడిపై పోక్సో చట్టం కింద కేసు సైతం నమోదైంది. వక్రబుద్ధితో.. విద్యార్థులను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయులు కొంత మంది వక్రబుద్ధితో వారి ని వేధిస్తున్నారు. ముఖ్యంగా ఈఘటనలు ఉన్న త పాఠశాలల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పాఠశాలల్లో సాధికారత క్లబ్‌లు ఏర్పా టు చేసినప్పటికీ అవి నామామత్రంగానే మిగిలాయి. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడే ఉపాధ్యాయులకు తోటి టీచర్లు మద్దతు పలకడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠాలు బోధించే సమయంలో బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, వెకిలిచేష్టలకు దిగడంతో వారు చదువుపై ఆసక్తి చూపలేకపోతున్నారు. విషయాన్ని తల్లిండ్రులకు చెప్పలేక మదనపడుతున్నారు. ఒకవేళ విషయాన్ని బయట పెడితే తమ చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని వా రు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎవరి కై నా చెబితే సంగతి చూస్తామని ఈ గురువులే విద్యార్థినులను హెచ్చరిస్తు న్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ల మధ్య గొడవలు.. జిల్లాలోని కొన్ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగుచూస్తుండగా, మరెన్నో బహిర్గతం కావడం లేదన్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని పాఠశాలల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులను రెచ్చగొట్టి ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని చెప్పిస్తున్నట్లు కూడా చర్చ సాగుతోంది. వీరి మధ్య గొడవలు విద్యార్థుల భవితపై ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులు నిరసనకు దిగడంతో విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. దీంతో అక్కడ పాఠాలు బోధించే టీచర్ల కొరత ఏర్పడుతోంది. గొడవల కారణంగా ఉపాధ్యాయుల పరువు పోవడంతో పాటు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. కొరవడిన పర్యవేక్షణ.. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పాఠశాలల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పా టు తోటి మహిళ ఉపాధ్యాయులను కూడా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతంలో పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో ఒక్క రెగ్యులర్ ఎంఈఓ లేకపోవడం, అలాగు జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఇన్చార్జి కావడంతో కొంత మంది ఉపాధ్యాయులు వారి మాటలను పెడచెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఏవైన ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. తప్పు చేసిన వారికి కనీసం మెమోలు కూడా ఇవ్వకుండా మెతక వైఖరి వ్యవహరించడంతో తమను ఎవరేమి చేయలేదనే ధీమాతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి ఉపాధ్యాయులు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలి. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు ఉపాధ్యాయులు వారి భవితకు బాటలు వేయాలి. విద్యార్థినులను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. కొంత మంది తీరు వల్ల విద్యా శాఖకు చెడ్డ పేరు వస్తోంది. ఎవరైన ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – ప్రణిత, డీఈవో -
'పదో తరగతి పరీక్షల' పేరుతో విద్యార్థినిలపై అసభ్యకరంగా..
ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు వెకిలిచేష్టలకు పాల్పడుతున్నాడని నేరడిగొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం తరగతి గదులను విడిచి పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కొంతకాలంగా సీనియర్ ఉపాధ్యాయుడినంటూ పదో తరగతి పరీక్షలు నా చేతిలోనే ఉంటాయని విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వారు కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఏలేటి మహేందర్‌రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పాడు. దీంతో వారు అక్కడి నుంచి తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్న భోజనం సైతం సరిగ్గా అందించడం లేదని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాలపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మను వివరణ కోరగా ఈ విషయాలు తన దృష్టికి రాలేదని తెలిపారు. ఎంఈఓ భూమారెడ్డిని వివరణ కోరగా రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నానని, పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాల కారణంగా విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారులు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇవి కూడా చదవండి: ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు -
స్కూలు టాయిలెట్లో శిశు జననం.. మాయమైన తల్లి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలోగల కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ రాత్రి వేళ ఒక పాఠశాల టాయిలెట్లో ఆడ శిశువుకు జన్మనిచ్చి, అక్కడి నుంచి పరారయ్యింది. ఆ నవజాత శిశువు రాత్రంతా టాయిలెట్లో రోదిస్తూనే ఉంది. ఉదయం పాఠశాల తెరిచినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టాయిలెట్‌లోని నవజాత శిశువును చూసిన పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆ శిశువును స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ శిశువు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెత్కియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని మహిళ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత ఆ మహిళ నవజాత శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఆ శిశువు రాత్రంతా టాయిలెట్లో ఏడుస్తూనే ఉంది. అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వారికి వెంటనే ఈ విషయం తెలియలేదు. మర్నాటి ఉదయం పాఠశాల తెరిచినప్పుడు టాయిలెట్లో నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కొందరు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అక్కడ రక్తంతో తడిసిన శిశువు ఏడుస్తుండటాన్ని వారు గమనించారు. వారు వెంటనే ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు తెలిపారు. దీంతో ఈ విషయం కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నవజాత శిశువును స్థానిక రిషభదేవ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం శిశువును ఉదయ్‌పూర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఉదయ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో గుర్తు తెలియని మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ పోలీసులకు ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
‘ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు!’
బెంగళూరు: దేశ ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగని రాజ్యాంగబద్ధమైన పదవిని కించపరిచేలా మాట్లాడడమూ మంచిది కాదని తెలిపింది. ఈ మేరకు ఓ స్కూల్ యాజమాన్యంపై దాఖలైన కేసును కొట్టేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీదర్‌లోని షాహీన్ స్కూల్ మేనేజ్మెంట్పై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారనే అభియోగాల మీద దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. చెప్పుతో కొడతామంటూ ఓ నాటకంలో పిల్లలతో చెప్పించారని న్యూటౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తద్వారా మత సమూహాల మధ్య గొడవలు కలిగించేందుకు యత్నించారనే ఆరోపణలపై.. ఐపీసీ సెక్షన్ 153(ఏ) ప్రకారం దేశద్రోహం కేసు నమోదు చేశారు. అయితే ఇది దేశ ద్రోహం కిందకు రాదని కర్ణాటక హైకోర్టు కల్బుర్గి బెంచ్ స్పష్టం చేసింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొడతానని అనడం ఆ హోదాని అవమానించడం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యం కూడా. ఒక పద్దతి ప్రకారం చేసే విమర్శలకు సహేతుకత ఉంటుంది. అంతేగానీ.. ఇలా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదు. అలాగని ప్రధానిని కించపర్చడం దేశద్రోహం కిందకు రాదు అని జస్టిస్ హేమంత్ చందన్‌గౌడర్ తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.. అయితే ఈ కేసు ఇప్పటిది కాదు.. 2020 నాటిది. ఆ సమయంల సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్(NRC)లకు వ్యతిరేకంగా స్కూల్లో 4,5,6వ తరగతి విద్యార్థులతో ఓ నాటకం ప్రదర్శించారు. ఆ నాటకంలోనే ప్రధాని మోదీని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ డైలాగులు రాసి పిల్లలతో ప్రదర్శించారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) నేత నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. కాలేజీ మేనేజ్మెంట్లోని నలుగురిపై భారత శిక్షాస్మృతి(IPC) సెక్షన్ 504, 505(2), 124A(దేశద్రోహం), 153ఏ రీడ్ విత్ సెక్షన్ 34ల ఆధారగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రధాని వంటి రాజ్యాంగాధికారులను అవమానించవద్దని తీర్పు సమయంలో అభిప్రాయపడ్డ కోర్టు.. పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం సరికాదని, బదులుగా వాళ్ల అకడమిక్ ఇయర్‌కు సంబంధించిన అంశాలపై నాటకాలు వేయించడం మంచిదని స్కూల్ యాజమాన్యాన్ని సూచిస్తూ దేశద్రోహం కేసును కొట్టేసింది. ఇదీ చదవండి: రాజకీయాల్లో రాహుల్‌తో పోలికా? సరిపోయింది -
ఇక స్కూల్ కమిటీలకు ఎన్నికలు...
సాక్షి, విజయనగరం : ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యాకమిటీల(ఎస్ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలకు దసరా తరువాత కమిటీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర డైరెక్టర్ చిన్న వీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన విధి విధానాలు రూపొం దించి రెండురోజుల వర్క్‌షాపు ఇటీవల నిర్వహించారు. ఎస్ఎంసీ ఎన్నికల అధి కారులుగా ఎంఈఓ, సీనియర్ ఉపాధ్యాయులు వ్యవహరిస్తారు. ఇంతవరకు ఉన్న ఎస్ఎంసీ సభ్యుల కాలపరిమితి గతేడాది ఆగస్టుతో ముగిసింది. అప్పటి ప్రభుత్వం ఎన్నికలు జరిపేందుకు ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విద్యాశాఖపై సారిస్తున్న ప్రత్యేక దృష్టి నేపథ్యంలో వాటి అభివృద్ధికి కీలకపాత్ర వహించాల్సిన ఎస్ఎంసీలను సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 2,717 ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాం గం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ ఇలా... విద్యాకమిటీ సభ్యులను విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నుకుంటారు. వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా ఉంటారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాధమిక పాఠశాలలో గరిష్టంగా 15 మంది సభ్యులుండాలి. ఈ ఎన్నికల విధానంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి లో ఎస్ఎంసీలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తు తం అమ్మ ఒడి పథకం అమలు జరుగుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులచే బ్యాంకు అకౌంట్లు ప్రారంభించేలా చూడాల్సి ఉంటుంది. కమిటీ సభ్యులకు శిక్షణ ఎన్నికైన కమిటీలకు మండల కేంద్రాలలో శిక్షణ నిర్వహించనున్నారు. తర్వాత ప్రతినెలా ఈ కమిటీ సమావేశమవ్వాలి. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులతోపాటు ఇతర సదుపాయాలు కల్పించడానికి వీలుగా తీర్మానాలు చేసి అమలు చేయాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పాఠశాల నిర్వహణ, ఇతర గ్రాంట్లను ఖర్చు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయునితో జాతీయ బ్యాంకులో ఉమ్మడి ఖాతాను ప్రారంభించాలి. బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పిల్లల హాజరు, విద్యా ప్రమాణాలు పెంపుదల వంటి పలు అంశాలను ఈ కమిటీలు చూడాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉన్న కమిటీలు నామమాత్రంగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని పాఠశాలల్లో అయితే మొక్కుబడిగా హాజరై సంతకాలు లేదా వేలిముద్రలు వేసి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పింది విని వెళ్లేవారు. అంతకుమించి పాఠశాలల అభివృద్ధిలో ఎస్ఎంసీలు క్రయాశీలకంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రస్తుత ఎస్ఎంసీలను మరింత బాధ్యతాయుతంగా రూపొందించాలని ప్రభుత్వ ఆలోచన. ఎన్నికైన వెంటనే వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికైన సభ్యులకు శిక్షణ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల ఎన్నిక నిర్వహణకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి.తాజాగా జి ల్లాలోని పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రుల వివరాలను క్రోడీకరిస్తున్నాం. ఎన్ని కల నిర్వాహణకు అవసరమైన చర్యలపై సమీక్షిస్తున్నాం. ఎస్‌ఎంసీల ఎన్నికలను అక్టోబర్‌లో ముగించి ఎన్నికైన కమిటీ సభ్యులకు మండల కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తాం. – ఎం.కృష్ణమూర్తి నాయుడు, ఎస్ఎస్ఏ పీఓ -
ఆడుకుంటూ.. అనంతలోకాలకు..
సాక్షి, పెందుర్తి: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయి మృతి చెందిన ఘటన పెందుర్తి సమీపంలోని పాపయ్యరాజుపాలెంలో చోటుచేసుకుంది. ఫిట్స్ కారణంగా విద్యార్థి మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే అనారోగ్యానికి గురైన తమ బిడ్డను ఆసుప్రతికి తరలించడంతో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించగా... తాము సకాలంలోనే స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించామని పాఠశాల యాజమన్యం చెబుతుంది. ఈ విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లాకు చెందిన పంచం సతీష్, సుమిత్ర దంపతులు 2002లో విశాఖ వచ్చి పాపయ్యరాజుపాలెంలో స్థిరపడి అక్కడే టైల్స్ వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి హితేష్(13), శుభం అనే ఇద్దరు కుమారులు. పిల్లలిద్దరూ ఇంటికి సమీపంలో ఉన్న ఆక్స్ఫర్డ్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం హితేష్ 8వ తరగతికి వచ్చాడు. కాగా సోమవారం ఆటల సమయంలో పాఠశాల ఆవరణలో హితేష్ తోటి పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పగా వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడిని గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే హితేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజుకున్న వివాదం మరోవైపు హితేష్ మరణంపై వివాదం రాజుకుంది. పాఠశాల యాజమాన్యం సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేవాడని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాల వద్దకు విద్యార్థి మృతదేహాన్ని తీసుకొచ్చి ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెందుర్తి సీఐ వెంకునాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి స్పందిస్తూ విద్యార్థి మృతికి తమ నిర్లక్ష్యం కారణం కాదని స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
లెక్క తేలాల్సిందే!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు మంజూరైన నిధుల వినియోగంపై లెక్క తేల్చేందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు సంబంధించిన రికార్డులను పరిశీలించనున్నారు. రాష్ట్రీయ మాధ్యమిక విద్యా విభాగానికి చెందిన ప్రత్యేక అధికారులతో కూడిన బృందం ఇందుకోసం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ యాజమాన్యాల కింద 3,157 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 500 వరకు సెకండరీ పాఠశాలలు (హైస్కూల్ స్థాయి) ఉన్నాయి. సాక్షి, మచిలీపట్నం: పాఠశాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి ఏటా వివిధ రకాలుగా నిధులు మంజూరు చేస్తోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వ శిక్షాభియాన్ విభాగం నుంచి, ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ విభాగం నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. వీటితో పాటు స్కూల్ కాంప్లెక్స్(పాఠశాల సముదాయం)గా గుర్తించిన వాటికి ప్రత్యేకంగా ఏడాదికి సుమారుగా రూ. 20 వేల వరకు నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో స్కూల్ గ్రాంట్, మెయింటినెన్స్ రూపేణా వేర్వేరుగా నిధులు విడుదల చేయగా, 2017–18 విద్యా సంవత్సరంలో ఈ రెండింటినీ కలిపి, విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న సెక్షన్లను పరిగణనలోకి తీసుకుని స్కూల్ గ్రాంట్ రూపేణా నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ. 12,500, ఉన్నత పాఠశాలలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఇచ్చారు. అదేవిధంగా మండల స్థాయిలోని విద్యా వనరుల కేంద్రాల నిర్వహణ కోసం రూ. 34 వేల నుంచి రూ.50 వేల వరకు మంజూరు చేశారు. ఇవే కాకండా పాఠశాలల్లో స్వచ్ఛభారత్ పేరిట, టీఎల్ఎం మేళా, సైన్స్‌ఫేర్ నిర్వహణ, విద్యార్థులను ఎక్స్కర్షన్ ట్రిప్‌కు తీసుకువెళ్లేందుకు ఇలా వివిధ రకాలుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. వీటిని ఎలా వినియోగించారనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం అధికారులు పరిశీలనకు సిద్ధమయ్యారు. షెడ్యూల్ ఇలా.. జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ, నూజివీడు. నందిగామ డివిజన్ల వారీగా ఆర్‌ఎంఎస్‌ఏ బృందం సభ్యులు పర్యటించనున్నారు. డివిజన్ కేంద్రాల్లోని ఒక చోట అందుబాటులో ఉంటారు. ఆయా డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తగిన రికార్డులు, నివేదికలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నెల 20న గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ హైస్కూల్, 21న నూజివీడులోని డెప్యూటీ డీఈఓ కార్యాలయం, 22న విజయవాడ, నందిగామ డివిజన్లకు చెందిన పాఠశాలల రికార్డులను పరిశీలించనున్నారు. రెండు డివిజన్లకు చెందిన ఉపాధ్యాయులంతా విజయవాడలోని పటమట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. 24న మచిలీపట్నంలోని ఆర్సీఎం హైస్కూల్లో బృందం అందుబాటులో ఉండి డివిజన్లోని పాఠశాలల నివేదికలను పరిశీలించనున్నారు. సమగ్ర పరిశీలన బ్యాంక్ స్టేట్మెంట్, 2019 మార్చి 31 వరకు జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ పాస్ పుస్తకం, నిధుల మంజూరీకి సంబంధించిన అనుమతి పత్రాలు, ఇతర ఉత్తర్వులు సిద్ధం చేసుకొని తీసుకువెళ్లాలి. అదేవిధంగా లావాదేవీలకు సంబంధించిన పుస్తకం, నగదు నిల్వ పుస్తకం, ఇందుకు సంబంధించిన పత్రాలు, బ్యాంకులో కాకుండా చేతిలో ఉన్న నగదు, ఎందుకు నగదు ఉంచుకున్నారనే దానిపై తగిన ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో చేసిన సివిల్ వర్క్స్ వివరాలు, వాటికి వెచ్చించిన నిధులు, మెజర్మెంట్ (ఎంబుక్) పుస్తకం, పాఠశాల అభివృద్ధి కమిటీ తీర్మానాల పుస్తకం, మిగులు నిధులు బ్యాంకులో చెల్లిస్తే, వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విచారణ బృందానికి అందజేయాల్సి ఉంటుంది. వీటిని సమగ్రంగా పరిశీలన చేసి ఆర్‌ఎంఎస్‌ఏ బృందం విద్యా శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే మళ్లీ పాఠశాలలకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధుల వినియోగానికి సంబంధించి సమగ్ర నివేదికలతో ఆడిట్ బృందం ముందు హాజరుకావాలని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి జిల్లాలోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలను ఆదేశించారు. -
క్యాం'పెయిన్'..!
సార్..మీ అమ్మాయి/అబ్బాయిని మా స్కూల్లో చేర్పించండి. మీ పిల్లల్ని చేర్పించకుంటే మీ ద్వారా ఎవరైనా ఉంటే చెప్పండి సార్..ప్లీజ్. పదిమందిని చేర్చాలని యాజమాన్యం టార్గెట్ విధించింది. లేకుంటే మా జీతం కట్ అవుతుంది. కనీస టార్గెట్‌కు చేరుకోకపోతే వచ్చే సంవత్సరం ఉద్యోగం నుంచి తొలగిస్తారు. గ్రామాల్లో ప్రైవేటు టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రుల ముందు ప్రాధేయపడుతున్న దయనీయ దుస్థితిది. తూర్పుగోదావరి , రాయవరం (మండపేట): ప్రైవేటు/కార్పొరేట్ పాఠశాలల్లో చిరుద్యోగుల బతుకులు చిత్తవుతున్నాయి. జూన్ నెలలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థుల కోసం అడ్మిషన్ల వేట మొదలైంది. ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు పెట్టే నిబంధనలకు ఆ పాఠశాలల్లో పని చేయాలో? లేక బయటకు రావాలో... తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగులు పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 1700 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపుగా 30 వేల మంది వరకూ సిబ్బంది పని చేస్తున్నారు. టార్గెట్ చేరుకుంటేనే జీతాలు..: ప్రైవేట్/కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు గత నెల నుంచే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గ్రామాలు, పట్ట ణాల్లోకి పంపిస్తున్నారు. ఓట్ల ప్రచారం, ఇంటింటి సర్వేలు చేసే వాళ్లలా ఉపాధ్యాయులు ప్రతి ఇంటికీ వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా..ఏం చదువుతున్నారని అడిగి వారిని తమ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను బతిమాలుకుంటున్నారు. ఓసారి మా పాఠశాలలో వసతులు చూడండి..ఫీజులు పరిశీలించండి...ఫలితాలు చూడండంటూ ఏకరువు పెడుతున్నారు. కొందరు టీచర్లు వారి దగ్గర చదువుకునే పిల్లల్ని, వారి తల్లిదండ్రుల్ని కూడా వదలడం లేదు. ఆ వీధిలో ఉండేవారినో, బంధువుల పిల్లలనైనా మా స్కూల్లో, లేదా కళాశాలలో చేర్పించాలంటూ ప్రాధేయపడుతున్నారు. ఎలాగోలా వారికి ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్ పూర్తి చేస్తేనే మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు ఇస్తామని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు పెట్టాయి. ఒక్కొక్కరు 10–15 మంది పిల్లలను కచ్చితంగా పాఠశాలలో చేర్పించాలి. అలా చేర్పిస్తేనే జీతాలు ఇస్తారు. లేకుంటే జీతం రాదు. ఆ తర్వాత ఆ పాఠశాలలో ఉద్యోగం ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ఆకర్షణలతో మోసపోతున్న తల్లిదండ్రులు... పాఠశాలల ప్రత్యేకతలను గ్రాఫిక్స్‌లో చూపించడంతో తల్లిదండ్రులు ఆకర్షణకు లోనవుతున్నారు. ప్రభుత్వ, స్థానిక ప్రైవేటు పాఠశాలలకు మించి తమ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తున్నారు. రోజువారీ టెస్ట్‌లు, ప్రతి రోజూ స్టడీ అవర్స్, కంప్యూటర్, లైబ్రరీ, ల్యాబ్, ప్రతి పండుగ సెలబ్రేషన్, ఆటపాటలతో పాటు కరాటే, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగులు బదిలీ అయితే అదేచోట బ్రాంచ్‌కు విద్యార్థుల బదిలీ సౌకర్యం కల్పిస్తామని కార్పొరేట్ స్కూల్ సిబ్బంది వివరిస్తున్నారు. విద్యార్థులను పాఠశాలలో చేర్పించుకొని అడ్మిషన్ ఫీజు కట్టించుకునే వరకూ కేవలం పాఠశాల ఫీజు మాత్రమే చెబుతారు. ఫీజు చెల్లించిన తర్వాత బస్సు ఫీజు, యూనిఫామ్, బుక్స్ ఫీజు అంటూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్లో ఫిక్స్ చేసిన ఫీజులని చెబుతున్నారు. దీంతో ముందుగా క్యాంపైన్ తిరిగి పిల్లలను చేర్చిన ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల ఒత్తిళ్లు పెరుగుతుండడంతో మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై జిల్లా విద్యాశాఖ దృష్టి పెట్టి ఉపాధ్యాయులపై వేధింపులు నిరోధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు తీరుతాయనే ఆశతో ఉన్నామని పలువురు ఉపాధ్యాయులు ‘సాక్షి’తో చెప్పారు. -
అనపర్తిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన స్కూల్ యాజమాన్యం
-
ఢిల్లీలో మరో దారుణం : చిన్నారిపై అఘాయిత్యం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. తాను చదువుకుంటున్న స్కూల్లోనే మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఓ వైపు వైద్య పరీక్షలు లైంగిక దాడి జరిగినట్టు ధృవీకరించినప్పటికీ, స్కూల్ యాజమాన్యం మాత్రం అసలేం జరగలేదంటూ వాదిస్తోంది. పాపపై జరిగిన అఘాయిత్యంపై తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ, వారు సైతం బెదిరింపులకు దిగారు. దీంతో తల్లిదండ్రులు తన కూతురికి జరిగిన అన్యాయంపై సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా పోరాటం చేస్తున్నారు. గత వారం స్కూల్లో తన కూతురిపై అత్యాచారం జరిగిందని, ఎవరూ తమకు న్యాయం చేయడం లేదని ఫేస్బుక్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో ‘ప్లీజ్ మాకు సాయం చేయండి’ అని పాప తల్లి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటోంది. స్కూల్ నుంచి వచ్చిన తన కూతురి పాంటీస్లో రక్తపు మరకలు కనిపించాయని, వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్తే, ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తెలిసిందని తల్లి చెప్పారు. తన కూతురు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుందని తెలిపారు. స్నానానికి తీసుకెళ్లినప్పుడు కూడా ప్రైవేట్ పార్ట్‌ల్లో నొప్పి వస్తుందని ఏడుస్తుందన్నారు. ఈ విషయంపై పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఈ విషయం బయటకు పొక్కనీయద్దంటూ పోలీసులు తమల్ని బెదిరించారని తెలిపారు. తాము ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. అంతేకాక స్కూల్‌కు పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారని, స్కూల్ ముగిసే సమయం వరకు అలాంటి సంఘటనలేమీ జరుగలేదని తేల్చారు. ఏం జరిగినా అది ఇంటి వద్దనే జరిగిందంటూ తమపైనే నిందలేసినట్టు ఈ వీడియోలో తండ్రి తెలిపారు. స్కూల్లో ఉన్న అన్ని సీసీటీవీలను తాము పరిశీలించామని, అలాంటి సంఘటనలేమీ వాటిలో నమోదు కాలేదని పోలీసులు చెప్పినట్టు పేర్కొన్నారు. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్యంపై పాప తల్లిదండ్రులు, వారి బంధువులు, చుట్టుపక్కల వారు స్కూల్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సంఘటనపై న్యాయమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ సైతం తమ పాఠశాలలో అలాంటి సంఘటనేమీ జరుగలేదంటూ వాదిస్తున్నారు. అంతకముందు ఈ స్కూల్లో ఇలాంటివే రెండు సంఘటనలు జరిగాయి.‘ప్లీజ్ మాకు సాయం చేయండి. మేము చాలా ఆందోళన చెందుతున్నాం. మాకు ఏమొద్దు కానీ న్యాయం చేయండి. మాపై బెదిరింపులకు కూడా దిగుతున్నారు’ అని వీడియోలో తల్లిదండ్రులు చెప్పారు. ‘ఈ రోజు మా కూతురికి జరిగింది, రేపు మీకు ఇదే జరగవచ్చు’ అంటూ పాప తల్లి కన్నీరుమున్నీరైంది. -
సీఎం పర్యటన.. ప్రైవేట్ స్కూళ్లకు సెలవు
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ద్వారకాతిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లా పర్యటనకు రానుండడంతో అధికారులు జనసమీకరణకు పూనుకున్నారు. చింతలపూడిలో సీఎం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు జనాన్ని తరలించేందుకు అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులను సమీకరిస్తున్నారు. అందుకోసం ఏకంగా ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలోని ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి అధికారికంగా ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం స్కూళ్లకు సెలవు ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా మండిపడుతున్నారు. గ్రామదర్శినికి సుమారు 150 బస్సులు చింతలపూడిలో నిర్వహించనున్న గ్రామ దర్శిని కార్యక్రమానికి జనాన్ని తరలించడానికి సుమారు 150 బస్సులు కావాలని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో రవాణా శాఖ అధికారులు ఏలూరు డివిజన్ పరిధిలోని ఏలూరు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం, కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల తదితర ప్రాంతాలతో పాటు జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లోని ప్రైవేట్ స్కూళ్లకు చెందిన బస్సులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జనాన్ని తరలించే బాధ్యతను అధికారులకు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. వచ్చిన వారికి స్నాక్స్ వంటి వాటికి అయ్యే ఖర్చులను కూడా గ్రామ సంఘాలే భరించాలని ఆదేశించారు. దీంతో డ్వాక్రా మహిళలు ఇదెక్కడి గోలరా బాబు.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. -
సెలవు ఇవ్వని ప్రభుత్వం
ఉలవపాడు: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారి వాజ్‌పేయి మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం సెలవుదినంగా ప్రకటించింది. కానీ నిన్నటి వరకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇక్కడ సెలవు ప్రకటించలేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం మిత్రపక్షం కాకపోయినా సంతాపదినంతో పాటు అన్ని కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ఇచ్చింది. దీనిని బట్టి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటో అర్థం అవుతుందని ప్రజలంటున్నారు. ఓ వ్యక్తి మరణించిన తరువాత కూడా పార్టీల మధ్య ఉన్న విభేదం వల్లే ఇలా చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు పాఠశాలలు మొత్తం మూసివేసి విద్యార్థులను తరలించారు. కార్యాలయాల్లోని అధికారులందరూ అక్కడే మకాం వేసి ఏర్పాట్లు చేశారు. కానీ ఓ మాజీ ప్రధానికి విలువ ఇవ్వలేకపోయారు. కేంద్ర ప్రభుత్వ శాఖల ఆధీనంలో కార్యాలయాలు తక్కువగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఎక్కువగా ఉంటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందని ఉద్యోగులు ఆశించారు. కానీ అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేశాయి. -
ఆశయం మంచిదే...ఆచరణ ఏదీ?
విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు, ప్రభుత్వ పాఠశాలల్లో పనితీరు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసింది. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న టీడీపీ కార్యకర్తలను కమిటీ చైర్మన్లుగా ఎంపిక చేసి సంబరాలు జరుపుకొన్నారు. పాఠశాల అభివృద్ధి, పనితీరు విద్యాప్రమాణాలు పెంపు, మౌలిక వసతి సదుపాయాలు కల్పనకు కృషి చేయాల్సి ఉన్న కమిటీలు వాటిని గూర్చి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆశయం మంచిదే అయినా ఆచరణ శూన్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. మాచవరం(గురజాల): పాఠశాల అభివృద్ధికి కృషి చేయాల్సిన పాఠశాల యాజమాన్య కమిటీలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో సమష్టి కృషితో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు పాఠశాల యాజమాన్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములు చేస్తూ కమిటీలను ఎంపిక చేశారు. కమిటీలను సమన్వయం చేసుకుంటూ సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆయా పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. పాఠశాల పనితీరు విద్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చిస్తూ, తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఎస్ఎంసీ కమిటీల పనితీరు ప్రశ్నార్థకంగా మారాయి. జిల్లాలో మొత్తం 4300 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1050 ప్రాథమికోన్నత, 3250 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గతేడాది సుమారు 18.80 లక్షల మంది విద్యార్థులు విభ్యనభ్యసించారు. పాఠశాలల పనితీరును పర్యవేక్షిస్తూ, విద్యాభివృద్ధికి కమిటీ సభ్యులు నిరంతరం తనిఖీలు చేస్తూ విద్యార్థుల ఇబ్బందులను కమిటీ సమావేశంలో చర్చించాలి. అయితే ఎక్కడా అలాంటి సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. మెరుగైన విద్యకోసం తనిఖీలు,అభివృద్ధి పథకాలు, నిధుల ఖర్చులు పలు అంశాలపై కమిటీ సభ్యులకు అవగాహన కలిగిఉండాలి. సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల కల్పన, వసతులు, మధ్యాహ్న భోజనం, తరగతి గదులు నిర్వహణ, పిల్లల హాజరుశాతం సమగ్ర సమాచారం అందుబాటులో ఉండే విధంగా చూడాలి. ప్రతి నెల మూడో శనివారం విధిగా సమావేశం నిర్వహించాలి. పాఠశాలల అభివృద్ధికి సంబందించిన అంశాలపై తీర్మానించాలి. శిక్షణ ఏదీ? ఎస్ఎంసీలను నియమించిన ప్రభుత్వం సభ్యులకు శిక్షణ ఇవ్వడం విస్మరించింది. నేటికీ సభ్యులకు పూర్తి స్థాయి అవగాహన లేదు. సభ్యుల బాధ్యతలు ఎవరికీ తెలియదు. ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను సంరక్షకులుగా ఎన్నుకోవాలి. ప్రతి సమావేశానికి గ్రామ సర్పంచ్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్లు తప్పనిసరిగా హాజరవ్వాలి. కానీ ఎవరూ హాజరు కాకుండానే సమావేశాలు జరిగినట్టు రికార్డులు చూపించి సరిపెడుతున్నారు. ప్రయోజనాలు ఎస్ఎంసీ కమిటీ పనితీరు వలన ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుంది. ఉపాధ్యాయుల్లోనూ, హెచ్‌ఎంల్లోనూ జవాబుదారీతనం పెరుగుతుంది. నిధుల వినియోగం సక్రమంగా జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కూడా సక్రమంగా జరుగుతుంది. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడుతుంది. గ్రామస్తుల్లో ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం ఏర్పడుతుంది. హాజరుశాతం పెరుగుతుంది. సమావేశాలు నిర్వహించేలాచర్యలు తీసుకుంటాం అన్ని పాఠశాలల్లో ఈఏడాది తప్పనిసరిగా ఎస్ఎంసీ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. పాఠశాలల స్థితిగతులుపై చర్చించి వాటి అభివృద్ధికి, పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించి, హాజరుశాతం పెంచేందుకు కృషి చేస్తాం.–ఎస్.గోపాలరావు, ఎంఈవో -
సీఎం వస్తున్నారు సెలవులిచ్చేయండి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తుంటే ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులకు పండుగగా మారుతోంది. జన సమీకరణ కోసం స్కూల్ బస్సులన్నింటినీ తెలుగుదేశం నేతలు, అధికారులు బలవంతంగా తీసుకుంటుండటంతో వారికి సెలవు ప్రకటించడం ఆనవాయితీగా మారుతోంది. తాజాగా జిల్లా కేంద్రమైన ఏలూరులో మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తుండటంతో మరోసారి ఏలూరు కార్పొరేషన్, రూరల్, దెందులూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో స్కూళ్లకుసెలవు ప్రకటించారు. ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో డీఈఓ ఆదేశాల మేరకు సెలవు ప్రకటిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. సొసైటీలపై భారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు శతవసంతాల సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులతో ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం భారీగా రైతులను సమీకరించాలని నిర్ణయించారు. జిల్లాలో మూడు సెంటర్లలో బ్యాంక్ చైర్మన్ సమావేశాలు నిర్వహించి, ఆయా సొసైటీ బాధ్యులు, బ్యాంకు బ్రాంచిలకు జనసమీకరణ బాధ్యత అప్పగించారు. దీనిలో భాగంగా ప్రైవేటు స్కూల్ బస్సులతో పాటు 170 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏ సొసైటీ నుంచి ఎన్ని బస్సుల్లో రైతులను సమీకరించి పంపితే ఆ సొసైటీపై అంత భారం పడనుంది. ఎన్ని బస్సులు పెడితే అన్ని బస్సులకు సంబంధించిన ఖర్చును ఆయా సొసైటీలే భరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో బస్సు కోసం 18 నుంచి 21 వేల రూపాయల వరకూ ఖర్చు అవుతుందని, బ్యాంకు శతవసంతాల కార్యక్రమం కోసం తాము ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని ఆయా సొసైటీల అధ్యక్షులు ప్రశ్నిస్తున్నారు. తాము తమ సొంత వాహనాలలో వస్తామని చెప్పినా తాము బస్సులు బుక్ చేసేశామని మీరు అందులోనే రావాలని చెబుతున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం సీటు నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న డీసీసీబీ చైర్మన్ ముత్యా ల రత్నం తన బల ప్రదర్శనకు బ్యాంకు వందేళ్ల పండుగను వాడుకుంటున్నారని సొసైటీ అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. ప్ర జలు దాచుకున్న సొమ్ములను ఉత్సవాల పేరుతో భారీగా ఖర్చు చేయడం కూడా విమర్శలకు దారితీస్తోంది. సుమారు 15 వేల మందికి భోజనాల ఏర్పాటుతో పాటు ఈ ఏడాది ఉత్సవాల కోసం కోటి రూపాయల వరకూ ఖర్చు చేయాలని నిర్ణయించడం వివాదానికి దారితీస్తోంది. -
పాఠశాలలకు 3 రోజులు సెలవులు
సాక్షి, హైదరాబాద్ : అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం 3 రోజులు సెలవు ప్రకటించింది. జూన్ 19 నుంచి 21 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతవరణ శాఖ సూచనల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలు కూడా తప్పని సరిగా సెలువుల ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. -
సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్చల్
మడికొండ:సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్ చేసిన సంఘటన మడికొండలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మడికొండ గ్రామానికి చెందిన తాటి బద్రి అనే వ్యక్తి మడికొండ శివారులో ఉన్న రామన్ స్కూల్లో పని చేస్తూ జీవిస్తున్నాడు. గత నెల రో జుల క్రితం పాఠశాల యజమాన్యం పనిలో నుంచి తీసివేయడంతో మానసికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చె ప్పారు. గురువారం ఎవరికి చెప్పకుండా మడికొండ జాతీ య రహదారి పక్కన లోతుకుంట వద్ద ఉన్న సెల్ టవర్ ఎ క్కడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అం దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బద్రిని తాళ్లతో కట్టి కిందకు దించారు. తిరిగి గంట తర్వాత మళ్లీ టవర్ పైకి ఎక్కి నాకు ఉద్యోగం ఇప్పించాలని, లేదంటే కిందకు దూకుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో మడికొండ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని టవర్ పైకి ఎందుకు వెళ్లావని బద్రిని అడగటంతో స్కూల్ నుంచి తనను తీసివేశారు, మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బద్రి చెప్పాడు. దీంతో రామన్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి మాట్లాడించి కిందకు దింపారు. -
వందలాది ఫోన్లను తగలబెట్టేశారు!
ఢాకా: ఫోన్ల వినియోగం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అవి లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు మాత్రం ఫోన్ వినియోగించడంపై నిషేధం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇలాగే బంగ్లాదేశ్‌లోని ఢాకాలోగల హథాజారీ బర్హా మదర్సాలో రెసిడెంట్ విద్యార్థులుగా చదువుతున్నవారు కూడా ఫోన్ వాడొద్దనే నిబంధన ఉంది. అయితే కొందరు విద్యార్థులు దొంగచాటుగా ఫోన్లు వాడుతున్నారని, మ్యూజిక్ వింటున్నారని, వీడియోలు చూస్తున్నారని తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం వారి నుంచి వందలాది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వాటన్నింటిని ఒకచోట వేసి తగులబెట్టేసింది. -
ఎమ్జీఎమ్ స్కూల్ నిర్వాకం
-
విద్యార్థినిపై స్కూల్లో గ్యాంగ్‌రేప్
జైపూర్(రాజాస్థాన్): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాద్యాయులే ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని శికార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. షాపురా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న బాలికపై అదే స్కూలు డైరెక్టర్ జగదీస్ యాదవ్, ఉపాద్యాయుడు జగత్ సింగ్ గుర్జార్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అదనపు క్లాసులు ఉన్నాయంటూ సాయంత్ర సమయంలో బాలికను పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. దీంతో వారు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. అది వికటించటంతో బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. బాలికకు తెలియకుండానే గర్భస్రావం చేయటంతోపాటు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన వైద్యులు రజినీష్ శర్మ, ఆయన భార్య కానన్లపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నింధితుల కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకుంటామని అజీత్ఘడ్ ఎస్‌హెచ్‌వో మంగళ్‌రాం ఓలా తెలిపారు. -
విద్యార్థులకు హెయిర్ కట్.. స్టాఫ్ అరెస్ట్
ముంబై: పాఠశాల నిబంధనలు పాటించలేదన్న కారణంగా విద్యార్థులకు ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది హెయిర్ కట్ చేసి తీవ్ర విమర్శల పాలైంది. ఈ వివాదానికి సంబంధించి ముగ్గురు పాఠశాల సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబై శివారులోని విఖ్రోలిలో జరిగింది. బాధిత విద్యార్థుల్లో 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న వారు ఉన్నారు. పాఠశాల నిబంధన ప్రకారం విద్యార్థులంతా పొట్టి జుత్తుతో ఉండాలని కొద్ది రోజుల కిందట పీఈటీ ఆదేశించారు. దాదాపు 25 మంది విద్యార్థులు రూల్స్ పాటించకుండా.. పొడవైన జుత్తుతో పాఠశాలకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన పాఠశాల డైరెక్టర్ గణేష్ బాతా, వ్యాయామ ఉపాధ్యాయుడు మిలింద్ జంకె, ఆఫీసు అసిస్టెంట్ తుషార్ గోరె వీరికి బలవంతంగా జుత్తు కత్తిరించారని పోలీసులు తెలిపారు. ఈ సామూహిక జుత్తు కత్తిరింపులో కొందరు బాలురు కత్తెర కారణంగా గాయాలపాలయ్యారు. ఈ సంఘటనపై కొంతమంది తల్లిదండ్రుల ఫిర్యాదుపై శుక్రవారం అర్ధరాత్రి పాఠశాల డైరెక్టర్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు చెప్పారు. -
స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పు
12 నుంచి 16 వరకు సెలవులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ప్రకటించిన సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈనెల 12 నుంచి 16 వరకు సెలవులుగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన అకడమిక్ కేలండర్ ప్రకారం ఈనెల 11 నుంచి 15 వరకు సెలవులుండగా, వాటిని మారుస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి. -
వసతులు లేని పాఠశాలల గుర్తింపు
పూర్తయిన జియోగ్రాఫికల్ ఇంటిగ్రేటేడ్ సర్వే పాఠశాలల స్థితిగతులు ఇక ఆన్లైన్లోనే.. వసతులు లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలకు ఆదేశం? వీణవంక : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల స్థితిగతులపై ఇటీవల విద్యాశాఖ ప్రారంభించిన జియోగ్రాఫికల్ ఇంటిగ్రేటేడ్ సర్వే (జీఐఎస్)జిల్లావ్యాప్తంగా పూర్తయ్యింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని వసతుల వివరాలను వేర్వేరుగా ఆన్లైన్లో నమోదు చేశారు. గత ఏప్రిల్‌లో ప్రారంభమైన జీఐఎస్ సర్వే.. జిల్లాలోని 3102 ప్రభుత్వ, 600 ప్రైవేటు పాఠశాలలో కొనసాగింది. ఆ వివరాలు సేకరించి ప్రత్యేక సాఫ్ట్వేర్ కలిగిన మోబైల్ ద్వారా ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేశారు. పాఠశాలలో కనీస వసతులు ఉన్నాయా..? లేదా..? తెలుసుకునేందుకు విద్యాశాఖ జీఐఎస్ సర్వే ద్వారా ఆన్లైన్లో పొందుపర్చింది. వసతులు లేని కొన్ని ప్రైవేటు పాఠశాలలను విద్యాశాఖ అధికారులు గుర్తించినట్లు సమాచారం. త్వరలో ఆ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ 30 శాతం వరకు మరుగుదొడ్లు లేవని సర్వేలో వెల్లడైందని సమాచారం. ఆన్లైన్లో నమోదు ఇలా జిల్లాలో కేజీబీ, ఉన్నత పాఠశాలలు 721, ప్రాథమికోన్నత పాఠశాలలు 339, ప్రాథమిక పాఠశాలలు 1995, మోడల్ స్కూల్లు 47, ప్రైవేటు పాఠశాలలు 600వరకు ఉన్నాయి. జీఐఎస్ సర్వే కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ కలిగిన మోబైల్‌ను విద్యాశాఖ రూపొందించింది. ఆ మోబైల్ ద్వారా పాఠశాల భవనం, మంచినీటివసతి, మరుగుదొడ్లు, కరెంట్ సౌకర్యం, సైన్స్‌ల్యాబ్, మూత్రశాలలు, ప్రహరీ, క్రీడామైదానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మోబైల్ ద్వారా ఫొటోలు తీసి వేర్వేరుగా గూగుల్స్కు అనుసంధానం చేశారు. దీని ద్వారా ఏయే పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయో.. విద్యాశాఖ ఆన్లైన్లో గుర్తిస్తుంది. అలాగే మానిటరింగ్ చేసేటప్పుడు ఈ ఆన్‌లైన్‌తో సులభంగా తనిఖీ చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. వసతులు లేని పాఠశాలల గుర్తింపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో కనీస వసతులు లేని పాఠశాలలను జీఐఎస్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలో ప్రహరీ, మూత్రశాలలు, క్రీడామైదానం లేవని సర్వేలో తేలినట్లు సమాచారం. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా.. వసతులు కల్పనలో వెనుకంజ వేయడం విమర్శలు తావిస్తోంది. కొన్ని పాఠశాలలో కనీసం ప్రేయర్ చేయడానికీ స్థలం లేదని నిర్ధరణ కావడం యాజమాన్యాల దోపిడీకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జీఐఎస్ ద్వారా సర్వే చేసిన విద్యాశాఖ అధికారులు వసతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
12 నుంచి సెలువులు రద్దు
అనంతపురం ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 12, 13, 14 తేదీల్లో అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలలకు ఎలాంటి సెలవులు లేవని యథావిధిగా నిర్వహించాలని అంజయ్య ఓ ప్రకటనలో ఎంఈవోలు, హెచ్ఎంలను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా 12 అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తించని పేర్కొన్నారు. -
బడి ఎన్నికల్లో పచ్చ రుబాబు
ఎస్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ నేతల దౌర్జన్యం 85 స్కూళ్లలో మళ్లీ వాయిదా అనంతపురం ఎడ్యుకేషన్ : స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బరి తెగించారు. విద్యా శాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులను సైతం బెదిరిస్తున్నారు. తమ వాళ్లనే గెలిపించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి మా వాళ్లనే ఎస్ఎంసీ చైర్మన్లుగా నియమించాలి. మా వారు గెలిచేందుకు అవకాశం లేకపోతే ఏదో సాకు చూపి వాయిదా వేయండి..’ అంటూ మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశిస్తున్నారు. ఫలితంగా గతంలో పలు స్కూళ్లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాంటి చోట్ల సోమవారం మళ్లీ నిర్వహించారు. ఇప్పుడూ అదే సీన్ పునరావృతమైంది. జిల్లాలో మొత్తం 3,866 పాఠశాలలు ఉన్నాయి. ఈ నెల ఒకటిన 3,670 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు 196 చోట్ల వాయిదా పడ్డాయి. వీటిలో సోమవారం 111 చోట్ల తిరిగి నిర్వహించారు. వీటిలో ఎక్కువగా తమ ప్రత్యర్థులు చైర్మన్లుగా గెలుస్తారనే ఉద్దేశంతో 85 చోట్ల ఎన్నికలు జరగకుండా అధికార పార్టీ నేతలు వాయిదా వేయించారు. లేపాక్షి మండలం మైదుగోళం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆదేశాలతో కిందిస్థాయి కార్యకర్తలు దౌర్జన్యానికి దిగి ఎన్నిక వాయిదా వేయించారు. చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లిలోనూ ఇదే పరిస్థితి. ఆత్మకూరు మండలం బి.యాలేరులో కోరం లేక వాయిదా పడింది. -
స్కూల్ డైరెక్టర్ విద్యార్ధినిలపై లైంగిక వేధింపులు
-
వామ్మో.. ఇవేం బడులు!
♦ ప్రమాదపుటంచున ప్రభుత్వ పాఠశాల భవనాలు ♦ కూలడానికి సిద్ధంగా గదులు ♦ వాన నీటికి తడిసిన గోడలు ♦ పెచ్చులూడుతున్న పైకప్పులు ♦ వానొస్తే బడులకు సెలవే.. ♦ ఆందోళనలో విద్యార్థులు సర్కార్ బడులు అనగానే విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. శిథిల భవనాల్లో తరగతులు నిర్వహిస్తోండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందోనని బెంబేలెత్తిపోతున్నారు. పైగా వర్షాకాలం కావడంతో భవనాలు మరింత ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నాయి. వానల కారణంగా గోడలు తడిసి ముద్దయ్యాయి, భవనం పైకప్పు పెచ్చులూడిపడుతున్నాయి. చిన్నపాటి వానకే తరగతి గదుల్లోకి నీరు చేరుతుంది. అయినప్పటికీ అధికారులు అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వానొచ్చిన రోజు సెలవు ప్రకటిస్తున్నారు. జోగిపేట: అందోలు బాలుర ఉన్నత పాఠశాల భవనాన్ని వందేళ్ల క్రితం నిర్మించడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కురిస్తే చాలు గదుల పైకప్పుల నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోడల్లో తడిసిముద్దయ్యాయి. అందులో నుంచి నీరు చిమ్మడంతో గురువారం విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ పురాతన భవనంలో 8,9,10వ తరగతులను నిర్వహిస్తున్నారు. 200కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ మూడు గదులతోపాటు ప్రధానోపాధ్యాయుడి గది, ఒకేషనల్ కోర్సు గది, స్టాఫ్‌రూం మొత్తం ఆరు గదులు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చినప్పుడల్లా భయంతో విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నారు. నర్సాపూర్: నర్సాపూర్‌లో శిథిల భవనంలో పాఠశాల నిర్వహణ భయాందోళనలకు గురి చేస్తుంది. గదుల పైకప్పులు పగిలి వర్షం నీరు లోపలికి రావడంతో గదుల్లో నీరు నిలవడంతో కూర్చోవడానికి వీలు లేకపోవడంతో పిల్లలు వర్షం కురిసినపుడల్లా ఇంటి ముఖం పడుతున్నారు. నర్సాపూర్‌లోని సెకండ్ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఇందులో తెలుగు, ఉర్దూ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో 244 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండంతస్తుల భవనంలో పైకప్పు రేకుల షెడ్డు ఉన్న భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు. పైకప్పు రేకులు పగలడంతో వర్షం కురిసినప్పుడల్లా రేకుల రంధ్రాల్లోంచి కిందకు నీరు పడడంతో గదులన్నీ నీటితో నిండిపోతున్నాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తరగతి గదుల్లో నీరు నిండడంతో పిల్లల్ని ఇంటికి పంపారు. పక్షం రోజుల క్రితం ఈ భవనాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు. అద్దె భవనంలోకి మారాలని హెచ్ఎంను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అద్దె రాదని జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చడంతో పురాతన భవనంలోనే కొనసాగిస్తున్నారు. శిథిల భవనంలో తరగతులు నిర్వహించడంపై పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ సంతోష, వైస్ చైర్పర్సన్ నసీంబేగం ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఈ పాఠశాలను ఎంఈఓ జెమిని సందర్శించారు. పాఠశాల దుస్థితిని డీఈఓకు నివేదిస్తానని తెలిపారు. పాఠశాల భవనానికి పగుళ్లు శివ్వంపేట: స్థానిక ప్రాథమిక పాఠశాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పైకప్పుపై చెట్టు పెరుగుతుండడంతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. చెట్టు చిన్నగా ఉన్నప్పుడే తొలగించాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం.. పాఠశాల దుస్థితిని స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆరు గదులు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పిల్లలు కూడా ఈ భవనంలో చదువుకోవడానికి భయపడుతున్నారు. వర్షం కురిస్తే చాలు నీళ్లు గదుల్లోకి వస్తున్నాయి. – రమేశ్, హెచ్ఎం, అందోలు -
స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు వాయిదా
హైదరాబాద్ : స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రక్రియ 26 నుంచి మొదలు కానుంది. విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దృష్టిలో వుంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22, 23, 24 తేదీలలో జరగనున్న విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దృష్టిలో వుంచుకొని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులకు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో చోటు ఉంటుందని, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్లు ఆరుగురు, కో-అపటెడ్ సభ్యులు ఇద్దరు ఉంటారని పేర్కొంది. ఎక్స్ అఫిషియో మెంబర్లలో హెడ్మాస్టర్ కన్వీనర్ గా ఉంటారని, ఒక అదనపు ఉపాధ్యాయుడు, వార్డు లేదా కౌన్సిలర్, అంగన్ వాడీ వర్కర్, ఒక ఎ.ఎన్.ఎమ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో ఉంటారని స్పష్టం చేసింది. -
ఒక చోట విద్యార్థులు లేరు మరో చోట టీచర్లు లేరు
ప్రభుత్వ పాఠశాలల తీరిది.. జిల్లాలోని సర్కారు బడులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేకపోవడం.. టీచర్లు ఎక్కువగా ఉన్న చోటకు విద్యార్థులు రాకపోవడంతో పాఠశాలల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం. వందకు ఒక్కడు జామతండా (నెల్లికుదురు) : మండలంలోని జామతండా ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉన్నారుు. ఈ పాఠశాలలో వంద మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. పాఠశాలకు ఒకే గది ఉండడంతో కొందరిని వరండాలో, మరి కొందరిని గదిలో కూర్చోబెట్టి ఉపాధ్యాయుడు లింగమూర్తి తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 2012-13లో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ పట్టింపులేనితనంతో పనులు నత్తనడకన సాగుతున్నారుు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని తండావాసులు కోరుతున్నారు. 84 మందికి ఇద్దరు ఉపాధ్యాయులు మహబూబాబాద్ : విద్యార్థులు లేక కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చుం టుండగా.. మరికొన్ని బడుల్లో టీచర్ల కొరత పట్టిపీడిస్తుంది. మానుకోట పట్టణ పరిధిలోని నందమూరినగర్కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో 1 నుంచి 5 తరగతుల్లో 84 మంది విద్యార్థులుండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాలకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరవుతున్నప్పటికీ ఉపాధ్యాయులు తగినంత మంది లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. పాఠశాలలో మూడు తరగతి గదులు ఉం డగా, అందులో ఒక గదిని స్టాఫ్‌రూంకు కేటారుుంచగా మిగిలిన గదుల్లోనే 5 తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాల పక్కనే ఉన్న మునిసిపాలిటీ బావికి జాలి ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీర్చి పిల్లలకు మెరుగైన బోధన అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖాళీగా కొర్రతండా ప్రాథమిక పాఠశాల జనగామ : విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం కారణంగా మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలపోతున్నారుు. మండలంలోని గానుగుపహాడ్ శివారు కొర్రతండా ప్రాథమిక పాఠ శాలకు కొన్ని నెలల నుంచి విద్యార్థులు రావడం లేదు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో ఐదుగురు విద్యార్థులు చేరారు. అరుుతే పాఠశాల పునఃప్రారంభం రోజు నుంచి విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో బడిబాటలో పేర్లు నమోదు చేసుకున్న ఐదుగురిలో ముగ్గురు విద్యార్థులు గానుగుపహాడ్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. దీంతో ఉన్న ఇద్దరు విద్యార్థులు కూడా కొద్ది రోజులుగా గైర్హాజరవుతుండడంతో తరగతి గదులు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యార్థులు లేని కారణంగా ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో వెంకటేశ్వర్లు అనే టీచర్‌ను డిప్యూటేషన్‌పై పెదరామన్‌చర్ల పాఠశాలకు పం పించారు. మరో ఉపాధ్యాయుడు ఖదీర్ రోజు పాఠశాలకు వచ్చి ఖాళీగా కూర్చుని వెళ్తున్నారు. కాగా, తరగతి గదుల్లో సొసైటీ అధికారులు గన్నీ బ్యాగులను నిల్వ చేయడం గమనార్హం. ఎర్రగొల్లపహాడ్లోనూ అంతే.. మండలంలోని ఎర్రగొల్లపహాడ్ పెద్దతండా పరిధిలోని పీఎస్‌కు ఒక్క విద్యార్థి కూడా రావడం లేదు. అడవికేశ్వాపూర్ శివారు దోనాబాయి తండా పాఠశాలకు విద్యార్థులు రావడం లేదనే కారణంతో ఇక్కడ పనిచేస్తున్న ఏకైక ఉపాధ్యాయురాలు సెలవుపై వెళ్లడంతో బుధవారం పాఠశాలకు తాళం పడింది. అడవికేశ్వాపూర్ శివారు బాకర్నగర్ తండా పాఠశాలకు కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తుంది. దోనాబాయి తండాలో విద్యార్థులు రావడంలేదని ఉపాధ్యాయురాలు కవిత సెలవుపై వెళ్లినట్లు ఎంఈఓ భద్రొద్దీన్ తెలిపారు. 73 మందికి అంతే.. దుగ్గొండి : మండలంలోని రేకంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2013-14లో విద్యార్థులు లేక మూతపడింది. దీంతో 2014-15లో గ్రామస్తులు తమ ఊరికి చెందిన విద్యార్థులు సుమారు 54 మందిని చేర్పించి పాఠశాలకు ప్రా ణం పోశారు. అరుుతే 54 మందికి ఒకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండటంతో గ్రామస్తులు మరో ముగ్గురు ప్రైవేట్ ఉపాధ్యా యులను నియమించుకున్నారు. వారికి తలాకొంత చందాలు వేసుకుని వేతనాలు చెల్లించారు. ఈ క్రమంలో పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు 5వ తరగతిలో తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఎంట్రెన్స్ రాసి సీట్లు సాధించారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 73కు చేరినా ప్రభుత్వం అదనపు ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో ఒక్క ఉపాధ్యాయుడే అంతమంది విద్యార్థులకు పాఠాలు బోధించడం కష్టంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు. టీచర్లు ఎక్కువ.. విద్యార్థులు తక్కువ మండల పరిధిలోని చాపలబండ ప్రభుత్వ పాఠశాల కొన్ని నెలల క్రితం 8వ తరగతి వరకు అప్‌గ్రేడ్ అయింది. ఈ పా ఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అరుుతే విద్యార్థుల సంఖ్యను 58గా రికార్డుల్లో చూపుతున్నప్పటికి వాస్తవంగా ఇక్కడ 8 తరగతులకు 34 మందే హాజరువుతున్నట్లు సమాచారం. ‘వెంకటాపురం’ వెలవెల తొర్రూరు : మండలంలోని వెంకటాపురం హరిజనకాలనీ లో కొన్నేళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశా రు. ఇందులో 1 నుంచి 5 తరగతులు ఉన్నారుు. రెండేళ్ల నుంచి ఇక్కడి పాఠశాలకు విద్యార్థులు రావడంలేదు. దీంతో పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరిని వేరే స్కూల్‌కు బదిలీ చేశారు. ఇటీవల బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టినప్పటికీ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాకపోవడం గమనార్హం. కాగా, పాఠశాల పునః ప్రారంభంలో ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్ పొందినప్పటికీ వారు ఒక్క రోజు హాజరుకాలేదని ఉపాధ్యాయురాలు రత్నకుమారి తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఉందని.. అందుకే తమ పిల్లలను అక్కడికి పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆరుగురు విద్యార్థులు.. ఇద్దరు టీచర్లు కేసముద్రం : ప్రభుత్వ పాఠ శాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కేసముద్రంస్టేషన్ శివారు బ్రహ్మంగారితండా ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ పాఠశాలకు సొంతభవనం లేకపోవడంతో తండాలోని ఓ అద్దె ఇంటిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ధన్నసరి శివారు బోడతండాలోని ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండడం గమనార్హం. బుధవారం మధ్యాహ్నం పాఠశాలను ‘సాక్షి’ సం దర్శించగా ఆ సమయంలో ఉపాధ్యాయులు కనిపించలేదు. ఒక ఉపాధ్యాయుడు రాలేదని, మరొకరు వచ్చి మధ్యాహ్నమే వెళ్లిపోవడంతో పిల్లలు ఇంటికి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇటు కొంచెం.. అటు కొంచెం సంగెం : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయులు లేరు. టీచర్లు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థులు లేకపోవడంతో విద్యాభివృద్ధి కుంటుపడుతోంది. మండలంలో 42 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. వీటన్నింటిలో 102 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. 3,343 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గవిచర్ల ప్రాథమిక పాఠశాలలో 160 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులే పాఠాలు బోధిస్తున్నారు. తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా, నల్లబెల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు, ఆశాలపల్లి ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు 4గురు టీచర్లు, నల్లబెల్లి శివారు బాలునాయక్ తండాలో 12 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యార్థుల కోసం ఎదురుచూపులు మహబూబాబాద్ రూరల్ : మండలంలోని పలు పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడంతో వెలవెలబోతున్నారుు. మండలంలోని శనిగపురం శివారు కుమ్మరికుంట్ల తండా ప్రాథమిక పాఠశాలకు కొన్ని నెలల నుంచి విద్యార్థులు హాజరుకావడంలేదు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పిల్లల కోసం నిత్యం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చుంటున్నారు. వేంనూరు శివారు చిన్నకిష్టాపురం ప్రాథమిక పాఠశాలకు కూడా విద్యార్థులు రావడం లేదు. ఈ గ్రామానికి చెందిన విద్యార్థులను తల్లిదండ్రులు వేంనూర్ యూపీఎస్‌కు పంపిస్తున్నారు. అయోధ్య పం చాయతీ పరిధిలోని వెంక్యాతండా ప్రాథమిక పాఠశాలలో, లక్ష్మీపురం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం తండా పీఎస్‌లో కూడా విద్యార్థులు లేరు. వీఎస్ లక్ష్మీపురం శివారు దేవులతండా, ఎర్రబోడు తండా పాఠశాలల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులు ఉండడం గమనార్హం. బేతోలు ఉర్దూ మీడియం పాఠశాలలో కూడా విద్యార్థులు లేరు. మల్యాల శివారు దేవులతండా పాఠశాలకు తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు రావడం లేదని తెలిసింది. రామోజీ తండా, మాధవాపురం శివారు తేజావత్తండా, సీసీ తండా, తూర్పుతండా, రెడ్యాల శివారు టేకులతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేరు. 200 మంది.. ఐదుగురు టీచర్లు మడికొండ : నగర శివారులోని మడికొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే బోధనలు చేస్తున్నారు. ఈ పాఠశాలలో గత ఏడాది 70 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంతో 130 మంది ఆడ్మిషన్లు పొందారు. మడికొండ సమీపంలోని ధర్మసాగర్ మండల కేంద్రం నుంచి కూడా 10 మంది విద్యార్థులు స్కూల్‌కు వస్తున్నారు. పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు, తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే ఉపాధ్యాయుల నియూమకం చేపట్టి విద్యార్థులకు మెరుగైన బోధనలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. 60 మందికి సింగిల్ టీచర్ నర్సింహులపేట : మండలంలోని బొజ్జన్నపేట పీఎస్‌లో 60 మంది విద్యార్థుల కు ఒక్క ఉపాధ్యాయురాలు మా త్రమే పాఠాలు బోధిస్తున్నారు. యూపీఎస్గా ఉన్న బొజ్జన్నపేట స్కూల్‌ను ఉపాధ్యాయుల కొరతతో కారణంగా పీఎస్‌కు కుదించారు. దీంతో 1 నుంచి 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు పాఠాలు చెబుతోంది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఈ నెల 21నుంచే విద్యాసంవత్సరం ఆరంభం
ఏప్రిల్ 23 వరకు నడవనున్న పాఠశాలలు విద్యారణ్యపురి :జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఈ నెల 21వ తేదీ నుంచే 2016-2017 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈమేరకు బుధవారం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఆదేశాలు జారీచేశారు. 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు (సమ్మిటివ్-2) వార్షికపరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఉపాధ్యాయులు ఈనెల 17, 18 తేదీల్లో ఆ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి విద్యార్థులకు ఫలితాలు ప్రకటించి వారికి ప్రోగ్రెస్‌కార్డులు కూడా అందజేయాలి. బుధవారం పరీక్షలు ముగిసినా గురువారం యధావిధిగా పాఠశాలలు నడపాల్సి ఉంటుంది. ఫలితాలు వెల్లడించాక విద్యార్థులను పైతరగతుల్లోకి తీసుకొంటారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూటబడులే కొనసాగుతాయి. 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 13నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత పాఠ్యపుస్తకాలు వస్తున్నా యి. బుధవారం వరకు జిల్లా కేంద్రంలోని గోదాంలోకి 35 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. జిల్లాకు 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు 15,22,811 పాఠ్యపుస్తకాలు కావాలని అధికారులు ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 5,20,800 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. మొత్తం 81 టైటిల్స్‌లో 30 టైటిల్స్ చేరుకున్నాయి. కాగా, పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి మండలాలకు సరఫరా చేసేందుకు టెండర్లు పిలవగా ఎవరూ ముందుకురాలేదు. దీంతో గతంలో మాదిరిగా ఎం ఈఓలే పుస్తకాలు తీసుకెళ్లాలని డీఈఓ బుధవారం ఆదేశించారు. -
ఆత్మహత్యకు యత్నించిన నాగార్జునరెడ్డి మృతి
హుజూర్నగర్(నల్లగొండ): మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి నాగార్జునరెడ్డి ఆస్పత్రిలో కన్నుమూశాడు. వివరాలివీ... నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నాగార్జునరెడ్డి దొంగతనం నేరం మోపారని మనస్తాపం చెంది ఈనెల 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తోటి విద్యార్థుల వేధింపులను తట్టుకోలేక తాను పురుగు మందుతాగి చనిపోతానంటూ సూసైడ్‌నోట్ పెట్టాడు. శనివారం కృష్ణా జిల్లా చిల్లకల్లు సమీపంలో తీవ్రంగా కాలినగాయాలతో ఉండగా స్థానికులు జగ్గయ్యపేట ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారటంతో కుటుంబసభ్యులు విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని న్యాయమూర్తికి అతడు వాగ్మూలం ఇవ్వటం గమనార్హం. కాగా, అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నాగార్జున రెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశాడు. పాఠశాల యాజమాన్యమే తమ కుమారుడి మరణానికి కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
సెలవు కోసం పాఠశాలకు మూడు రోజులు తాళాలు వేసిన హెచ్ఎం
విధులకు గైర్హాజరు అనధికారికంగా పాఠశాలకు మూడురోజులు సెలవు ప్రకటన గ్రామస్తులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగుచూసిన వైనం ఎంఈవో నివేదికతో చర్యలు నక్కపల్లి: సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరుతోపాటు మూడు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించి తాళాలు వేసిన హెచ్ఎంను జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేసినట్టు ఎంఈవో పద్మావతి తెలిపారు. వివరాలిలావున్నాయి. చందనాడ పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ విధులు సక్రమంగా రావడంలేదని గ్రామస్తులు పలుసార్లు మండల విద్యాశాఖాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులునారు. హెచ్ఎం, ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు బుధవారం సెలవు పెట్టారు. హెచ్ఎం శ్రీనివాస్, మరో ఉపాధ్యాయుడు హాజరుకావాలి. పాఠశాలకు వచ్చిన హెచ్ఎం మధ్యాహ్నం వరకు ఉండి, మూడు రోజులు సెలవంటూ విద్యార్థులకు చెప్పి వెళ్లిపోయారు. మధ్యాహ్నం నుంచి పాఠశాల మూసివేయడంపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, గ్రామపెద్దలు వెంకటేశ్వరరావు, భార్గవ్, పి. రమణ ఈ విషయాన్ని ఎంఈవో పద్మావతి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆమె పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులంతా ఆడుకుంటూ కనిపించడంతో ఆరాతీశారు. ఉపాధ్యాయులు ఎక్కడని ప్రశ్నించగా హెచ్ఎం శ్రీనివాస్ ఒక్కరే వచ్చి మధ్యాహ్నం వరకు ఉండి వెళ్లిపోయారని, మూడు రోజులు పాఠశాలకు సెలవని చెప్పారని విద్యార్థులు వివరించడంతో ఆమె కంగుతిన్నారు. పాఠశాలకు తాళాలు వేసి ఉన్నందున హాజరుపట్టీ పరిశీలించేందుకు అవకాశం లేకపోయింది. వివరణ కోరేందుకు ప్రయత్నించినా హెచ్ఎం స్పందించలేదని తెలిపారు. మరో టీచర్ విధులకు గైర్హాజరు అయ్యారా, సెలవుపై వెళ్లారా అనేది అటెండెన్స రిజిస్టర్ ఆధారంగా నిర్థారిస్తామన్నారు. ఈ విషయం డీఈవో దృష్టికి తీసుకెళ్లగా హెచ్ఎంను సస్పెండ్ చేశారని ఎంఈవో తెలిపారు. -
స్కూళ్లు తెరిచాక చూడాలి.. అసలు సంగతి!
రాజధాని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రారంభించిన సరి-బేసి కార్ల ఫార్ములా గురించి ఢిల్లీ తొలి మహిళా పోలీసు కమిషనర్ కిరణ్ బేడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉన్నాయని, జనవరి ఒకటో తేదీ కూడా కావడంతో జనం ఇంకా సెలవు మూడ్‌లోనే ఉన్నారని ఆమె అన్నారు. దానివల్ల ట్రాఫిక్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చని, అయితే స్కూళ్లు తెరిచిన తర్వాత కూడా దీన్ని సమర్థంగా అమలు చేయగలిగితే మంచిదని అన్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరి-బేసి పద్ధతిలో కార్లను అనుమతిస్తున్న సందర్భంగా ఈ 15 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో స్కూలు బస్సులను డీటీసీ తన ఆధీనంలోకి తీసుకుని, సిటీబస్సులుగా నడిపిస్తుంది. ప్రస్తుతం ఎవరూ సరి-బేసి వ్యవస్థను విజయవంతం అయ్యిందని గానీ, విఫలం అయ్యిందని గానీ చెప్పకూడదని, అందరూ దీనికి సహకరించాలనే చెప్పాలని అన్నారు. సరి బేసి ప్లాన్‌కు అసలైన పరీక్ష మాత్రం స్కూళ్లు తెరిచిన తర్వాతే ఎదురువుతుందని, అప్పుడే ఢిల్లీవాసులు అందరూ నిజంగా రోడ్లను ఉపయోగిస్తారని ఆమె అన్నారు. అలాగే, ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయని, వాటి గురించి కూడా ఆలోచించాలని చెప్పారు. కిరణ్ బేడీ ఢిల్లీలో పనిచేసినప్పుడు రోడ్లమీద అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసిన కార్లు, ఇతర వాహనాలను క్రేన్లతో టోయింగ్ చేయించి, అక్కడినుంచి తరలించేవారు. అందుకే ఆమెను అప్పట్లో 'క్రేన్ బేడీ' అని కూడా పిలిచేవాళ్లు. Monday is the real test to be achieved to begin with for #OddEvenPlan as we are right now into school holiday holiday season & a weekend.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 The 2nd real test for #OddEvenPlan to succeed will b when d school holidayseason ends.It's then when all Delhites r truly back using roads.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 Huge problem on Delhi-UP border--Commuters stranded. Tackling Delhi Pollution needed a Comprehensive-Co-option,which did not happen.. — Kiran Bedi (@thekiranbedi) January 1, 2016 -
రూ.20కోట్లు లాగేశారు
స్కూల్ మేనేజ్మెంట్ ఖాతాలు..ఖాళీ కమిటీలకు తెలియకుండా మళ్లింపు మౌలిక సదుపాయాల కల్పనకు ఆటంకం లబోదిబోమంటున్న ప్రధానోపాధ్యాయులు సర్కారు తీరుపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం గుంటూరు : అభివృద్ధి పనులకు నిధుల్లేవని ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఖాతాల్లోని నగదును ప్రభుత్వం వెనక్కు లాక్కుంది. మరుగుదొడ్ల నిర్వహణ, చాక్‌పీస్‌లు తదితరాల కొనుగోలుకు విడుదల చేసిన రూ.20 కోట్లను ఆ కమిటీ సభ్యుల ప్రమేయం లేకుండానే ఈ నెల 13వ తేదీన మళ్లించుకుంది. దీంతో జిల్లాలోని 3,600 ఎస్ఎంసీ కమిటీల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యాయి. ఇది తెలుసుకున్న కమిటీ సభ్యులు పాఠశాలల మౌలిక సదుపాయాలకు నగదు చెల్లించే అవకాశం లేక ఆ సౌకర్యాలను నిలిపివేస్తుండటంతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ ఏటా నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులను మౌలిక సదుపాయాల కల్పన, స్టేషనరీ, ఆట వస్తువుల కొనుగోలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు, చిన్న చిన్న మరమ్మతులకు కమిటీ సభ్యులు వినియోగించు కోవాలి. అరకొరగా విడుదలవుతున్న ఈ నిధులను ముఖ్యంగా మరుగుదొడ్ల క్లీనింగ్, తాగునీటి సరఫరా, చాక్‌పీసుల కొనుగోలు, విద్యుత్ చార్జీల చెల్లింపులకు కేటారుుస్తున్నారు. పాఠశాలల స్థాయిని బట్టి ఈ నిధుల కేటాయింపు ఉంటుంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ గ్రాంట్ కింద రూ. 5 వేలు, మెయింటెనెన్స్ గ్రాంటు కింద రూ. 5 వేలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు స్కూల్ గ్రాంటు కింద రూ. 7 వేలు, మెయింటెనెన్స్ గ్రాంటు కింద రూ. 10 వేల చొప్పున ప్రతి ఏటా సర్వశిక్షా అభియాన్ ఎస్ఎంసీ ఖాతాలకు జమ చేస్తుంటుంది. వీటిని ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా (మార్చి) ఖర్చు చేయాలి. ఈ నిధులు డ్రా చేయాలంటే కచ్చితంగా ఎస్ఎంసీ చైర్మన్‌తోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతకం చేయాల్సి ఉంటుంది. ఎంఈవోలు, హెచ్ఎంలే చైర్మన్ సభ్యులుగా ... 2014 జూన్‌లో ఎస్ఎంసీ కమిటీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి కమిటీలను ఏర్పాటు చేయకపోవడంతో ఎంఈవోలు కమిటీలకు చైర్మన్, ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ఖర్చులకు నిధులు చెల్లిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ఎస్ఎంసీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును సర్వశిక్షాఅభియాన్ అధికారులు ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల ప్రమేయం లేకుండానే వెనక్కు మళ్లించుకున్నారు. కొన్ని బ్యాంకు ఖాతాల్లో పాత నిల్వతో పాటు ఈ ఏడాది విడులైన నిధులూ వెనక్కు తీసుకోవడంతో ప్రధానోపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ప్రతి నెలా మొదటి వారంలోనే మరుగుదొడ్ల క్లీనింగ్, తాగునీటి సరఫరా, చాక్ పీసులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కనీసం రూ.3 వేలకుపైగా ఖర్చు అవుతుందని, వీటిని ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. మార్చికి మరో నాలుగు నెలల సమయం ఉండగానే నిధులను వెనక్కు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. గురువారం యూటీఎఫ్ నాయకులు ప్రాజెక్టు అధికారిని కలిసి నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి ఏ. రమేష్‌కుమార్‌ను వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, మళ్లించిన నిధులను సివిల్ వర్క్‌లకు వినియోగిస్తామని చెప్పారు. కనీస సౌకర్యాలు కల్పించ లేరు ... ఎస్ఎంసీ ఖాతాల్లోని నగదును వెనక్కు తీసుకోవడం దారుణం. దీంతో బడుల్లో కనీసం చాక్ పీసులు కూడా కొనుక్కోలేని దుస్థితి ఏర్పడుతుంది. మరుగుదొడ్ల నిర్వహణకూ ఆటంకమే. బ్యాంకుల్లో సున్నా నిధులు ఉంటే పాఠశాల నిర్వహణ ఎలా సాధ్యపడుతుంది. బడుల్లో సాధారణ సౌకర్యాలూ తీర్చుకోలేని దుస్థితి ఎదురవుతుంది. - కె. బసవలింగారావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
సార్ పెళ్లికి స్కూల్‌కి సెలవు
-
ఈ పాఠశాలలో విద్యార్థులే టీచర్లు!
♦ నలుగురు ఉపాధ్యాయులకు ఒక్కరూ రాని వైనం ♦ అధ్వానంగా మారిన సయ్యద్‌పల్లి పాఠశాల నిర్వహణ పరిగి : ఓ పక్క పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుండగా.. ఉన్న ఉపాధ్యాయులు సైతం నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారు. దీంతో మండలంలోని సయ్యద్‌పల్లి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులే ఉపాధ్యాయుల అవతారమెత్తారు. వివరాలు.. సయ్యద్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులకు నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఒకరు ఇటీవల బదిలీపై వచ్చి అక్కడ టీచర్ల కొరత ఉండటంతో తిరిగి అదే స్థానానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు. మరో టీచర్ తన భార్య డెలివరీ అయ్యిందని 15 రోజుల లీవ్‌పై వెళ్లారు. మరొకరు స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి వెళ్లగా.. రావాల్సిన ఒక్క టీచర్ కూడా సమయానికి రాలేదు. ఉదయం 11 గంటలు అవుతున్నా ఆయన రాకపోవటంతో పెద్ద తరగతుల విద్యార్థులే చిన్న తరగతులకు బోధించాల్సి వచ్చింది. ఈ విషయంలో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాకమిటీ చైర్మన్ అక్కడికి వచ్చి గురువారం కూడా ఇదే పరిస్థితి ఉందని ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులే బోధిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల తీరు వల్లే పాఠశాలలో రోజురోజుకు విద్యార్థు ల సంఖ్య తగ్గిపోతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 గంటల తర్వాత వచ్చిన ఓ ఉపాధ్యాయుడు మార్గంమధ్యలో కలిసి విద్యార్థుల చేత ర్యాలీ తీయించటానికి రాపోల్ పాఠశాలలో ఫ్లకార్డులు తీసుకు వచ్చేందుకు వెళ్లానని అందుకే ఆలస్యం అయ్యిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. నలుగురు ఉపాధ్యాయులున్న ఈ పాఠశాలే ఇలా ఉంటే సింగిల్ టీచర్లున్న పాఠశాలల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై డిప్యూటీ డీఈఓ హరిశ్చందర్‌ను వివరణ కోరగా.. ఎంఈఓను పంపించి విచారణ చేయిస్తామన్నారు. -
ఫిట్ లెస్ బస్సులు
- 800 బస్సులకు ముగిసిన కాలపరిమితి - ఆర్టీఏకు చిక్కకుండా విద్యార్థుల తరలింపు - పాఠశాల యాజమాన్యాలకు రవాణాశాఖ నోటీసులు - కాలం చెల్లిన బస్సులను స్వాధీనం చేసుకొనేందుకు సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో : ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులే కాదు. కాలం చెల్లిన వాటిలో సైతం విద్యార్థులను తరలిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గత పదిహేను రోజులుగా స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీఏ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 800లకు పైగా కాలం చెల్లిన స్కూల్ బస్సులు ఉన్నట్లు గుర్తించింది. కొన్ని పాఠశాలల నిర్వాహకులు రవాణా చట్టాలను బేఖాతరు చేస్తూ 15 ఏళ్ల కాలపరిమితి ముగిసి, రవాణాకు పనికి రాని బస్సులను పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో రెండోశ్రేణి, పదిహేనేళ్ల గడువు సమీపించిన బస్సులను తక్కువ ధరలకు కొనుగోలు చేసి నగరంలో నడుపుతున్నారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇలాంటి బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రవాణాశాఖ గణాంకాల ప్రకారం గ్రేటర్ పరిధిలో 10 వేలకు పైగా స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. అయితే ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు స్కూల్ బస్సుల నిబంధనలను కఠినతరం చేశారు. ఏటా విధిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, ఆర్టీఏ అనుమతి పొందాలనే నిబంధనను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 800కు పైగా బస్సులు చాలా ఏళ్లుగా ఫిట్నెస్ పరీక్షలకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు రవాణాశాఖ పరిశీలనల్లో వెల్లడయ్యింది. ఈ నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. విద్యాసంస్థలకు నోటీసులు నగరంలో కాలంతీరిన బస్సులు 300 ఉండగా, శివారు ప్రాంతాల్లో మరో 500లకు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే ఇవి లెక్కల్లో తేలినవి మాత్రమే. రికార్డులకు అందకుండా ఎక్కువ సంఖ్యలోనే ఉండవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు విద్యాసంస్థలకు నోటీసులు సైతం జారీ చేశారు. అంతేగాకుండా అధికారులు స్వయంగా ప్రతి స్కూల్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఎంవీఐ తన పరిధిలోని 8 నుంచి 10 స్కూళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి కాలం చెల్లిన బస్సులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోలు, వ్యాన్లపైనా తనిఖీలు : ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను తీసుకెళ్లే ఆటోలు, మారుతీ ఓమ్నీ వాహనాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. 8 సీట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యాన్లలో మాత్రమే పిల్లలను తీసుకెళ్లాలనే నిబంధనను ఉల్లంఘిస్తూ, ఆటోల్లోనూ పరిమితికి మించి తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాటిని సీజ్ చేయనున్నట్లు తెలిపారు. -
ఏపీలో స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు
-
ఎల్బీనగర్ లో ఆర్టీఏ దాడులు
హైదరాబాద్: ఎల్బీనగర్లో స్కూల్, కాలేజీ బస్సులపై ఆర్టీసీ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న నాలుగు కాలేజీ బస్సులను సీజ్ చేశారు. మరో రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. అంతేకాక 60ఏళ్ల పైబడిన డ్రైవర్.. ఓ స్కూల్ బస్ ను నడుపుతుండగా ఆర్టీసీ అధికారులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. ఈ దాడులు కొనసాగుతాయని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ అధికారి తెలిపారు. వేలకు వేలు ట్రాన్స్పోర్ట్ ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలు... బస్సుల ఫిట్నెస్ గురించి కూడా ఆలోచించాలంటున్నారు అధికారులు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
ఏపీలో స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు
విజయవాడ: ఏపీలో స్కూళ్లు పునఃప్రారంభమైన సందర్భంగా RTA అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తూ... కేసులు నమోదు చేస్తున్నారు. విజయవాడలో దాదాపు 500 బస్సులు ఫిట్నెస్ తీసుకోకుండా తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆ బస్సులు అన్నింటినీ గుర్తించే వరకు దాడులు నిర్వహిస్తామంటున్నారు. కడపలోనూ ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిట్నెస్ సరిగా లేని కారణంగా మూడు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా స్కూల్ బస్సుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. బస్సుల ఫిట్నెస్ను తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు. -
స్కూల్‌కి ఆలస్యంగా వస్తారా ?
హైదరాబాద్: నగరంలో కృష్ణా నగర్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్‌కి ఆలస్యంగా వచ్చిన 25 మంది చిన్నారులపై బుధవారం స్కూల్ యాజమాన్యం ఆగ్రహం ప్రకటించింది. స్కూల్‌కు ఆలస్యంగా వస్తారా అంటూ చిన్నారులతో గుంజీలు తీయించింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దంటూ చిన్నారి విద్యార్థులను టీచర్లు తరగతి గది బైట మూడు గంటలపాటు నిలబెట్టారు. దీంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో విద్యార్థులు కాళ్ల వాపు, జర్వంతో బాధపడుతున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని స్కూల్ యాజమాన్యంతో వాదనకు దిగారు. -
ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
ఖమ్మం: ఐదో తరగతి చదివే విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసిన ఘటన ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం చేటుచేసుకుంది. పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినితో అదే పాఠశాలలో ఆరేళ్లుగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ద్వందంద్ధంలో మాట్లాడాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తన రోజురోజుకూ మితిమీరుతుండడంతో సదరు విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బంధవులు, కుటుంబసభ్యులు బుధవారం పాఠశాలకు వచ్చి.. ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నించడంతో పాటు దేహశుద్ది చేశారు. పాఠశాల యాజమాన్యం అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
వేతన వ్యత్యాసంపై టీచర్ల ఆందోళన
హైదరాబాద్:స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉండడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలోని దాదాపు 80 వేలమంది ఎస్జీటీల వేతన వ్యత్యాసం భారీగా ఉంది. స్కూల్ అసిస్టెంట్లతో పోల్చితే ప్రతి పీఆర్సీకి పెద్ద మొత్తంలో అంతరం ఏర్పడుతోందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.ఒకే రకమైన పని చేస్తున్న టీచర్ల వేతనాల్లో భారీ వ్యత్యాసం పెరుగుతుండటాన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పదో పీఆర్సీలోనైనా ఈ వేతన వ్యత్యాసాలను తొలగించాలని పీఆర్టీయూ-తెలంగాణ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం పీఆర్సీ హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలసి వేతన వ్యత్యాసాలను తగ్గించాలని డిమాండ్ చేశారు. -
ఫీజు చెల్లించలేదని..
* విద్యార్థులను ఇంటికి పంపించిన స్కూల్ యాజమాన్యం * మండల కేంద్రంలో ఘటన డిచ్పల్లి : ఫీజు చెల్లించలేదన్న కారణంలో ఓ పాఠశాల యాజ మాన్యం విద్యార్థులను బడినుంచి ఇంటికి పంపించింది. వివరాలిలా ఉన్నాయి. మీడియా విజన్ చానల్లో వీడి యో జర్నలిస్ట్‌గా పనిచేసే ఘన్‌పూర్‌కు చెందిన అప్సర్ పిల్లలు అమేర్ పాషా(9వ తరగతి), అస్రా జబిన్ (6వ), ఒవెస్(3వ) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హైస్కూల్ లో చదువుతున్నారు. సోమవారం అర్ధవార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు రాయడానికి వెళ్లిన ముగ్గురినీ పాఠశాల యాజమాన్యం ఫీజు కట్టలేదన్న కారణంతో ఇంటికి పంపించింది. జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) శ్రీనివాసాచారి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మొత్తం ఫీజు చెల్లిం చాల్సిందేనని పేర్కొన్నారని అప్సర్ తెలిపారు. డీఈఓ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపించినా నిర్లక్ష్యంగా మాట్లాడారన్నారు. ఈ విషయాన్ని ఎంఈఓ సాయిలు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. డీఈఓ ఉత్తర్వులను అమలు చేయకుండా, ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థులను బయటికి పంపించిన పాఠశాల యాజమాన్యంపై డీఈఓకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
విశాఖ జిల్లాలో స్కూల్ హెడ్మాస్టర్ దారుణహత్య
విశాఖ: జిల్లాలో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ స్కూల్ హెడ్మాస్టర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలం అమృతాపురం శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. హెడ్ మాస్టర్ మృతదేహం అమృతాపురం శివారు ప్రాంతంలో లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ అనే స్కూల్ హెడ్మాస్టర్గా గుర్తించారు. మృతుడు నంగనవరంపాడు పాఠశాల ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
కుట్టు లోగుట్టు
అనంతపురం ఎడ్యుకేషన్ : స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) నిర్లిప్తతతో ఆయా పాఠశాలల్లో యూనీఫాం ‘కుట్టు' దారితప్పుతోంది. తమ పిల్లలు ఆయా పాఠశాలల్లో చదువుతున్నా...ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా కారణాల వల్ల చాలామంది ఎస్ఎంసీ సభ్యులు పాఠశాలల వైపు చూడడం లేదు. హెచ్ఎంలు ఇంటికో.. లేక ఎక్కడైనా పని చేస్తున్న చోటుకు పేపర్లు పంపితే సంతకాలు చేయడంవరకే వారి బాధ్యత. ఎందుకోసం సంతకాలు చేస్తున్నామని ప్రశ్నించని సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. దీంతో యూనీఫాం కుట్టే పని ఒకరిద్దరికే కేటాయించవద్దన్న ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు. 5.97 లక్షల యూనిఫాం జతలు ఇవ్వాల్సి ఉంది జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటిలో 1-8 తరగతుల విద్యార్థులకు సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ప్రతి ఏడాది రెండు జతల యూనీఫాం పంపిణీ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,98,632 మంది విద్యార్థులు 1-8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,97,264 జతల యూనీఫాం అవసరం. 1-7 తరగతుల బాలురకు చొక్కా, నిక్కర, బాలికలకు చొక్కా, స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనీఫాం పంపిణీ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికి స్కూళ్లు ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా...నేటికీ యూనీఫాం అందలేదు. నేటికీ సుమారు 200 స్కూళ్లకు యూనీఫాం జాడలేదు. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పోస్టల్ ద్వారా క్లాత్ పంపడం కూడా ఆలస్యానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. కుట్టులో కమీషన్లకే పెద్దపీట కుట్టుపై కొందరి గుత్తేదారుల కన్నుపడింది. నిబంధనలు తుంగలో తొక్కి కమీషన్లకు కక్కుర్తిపడుతూ కుట్టు విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులకు కమీషన్ల ఎరచూపి గంపగుత్త పేరుతో నిధులు బొక్కేందుకురంగం సిద్ధం చేశారు. అనుకున్నట్లే కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు క్షేత్రస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు అనంతపురం బళ్లారి రోడ్డులో ఉన్న ఓ సంస్థకు కుట్టు బాధ్యతను అప్పగిస్తూ ఎంఈఓలు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలపై ఒత్తిడి తెచ్చి మరీ ఒప్పించినట్లు తెలిసింది. అనంతపురం నగరం, ధర్మవరం, తాడిపత్రి, లోనూ ఇదే పరిస్థితి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కమీషన్ ఎరచూపి కుట్టు బాధ్యతను తీసుకున్న సంస్థ ఈప్రభుత్వంలోనూ అదే కమీషన్ల ఎరచూపి కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు పదుల సంఖ్యలో మండలాల కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఇలా చేయాలి.. ఎక్కడా గంపగుత్తగా ఒకే సంస్థకు యూనిఫాం కుట్టేందుకు ఇవ్వకూడదు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) సిఫార్సు మేరకు వారికి ఇష్టం వచ్చిన వారితో కుట్టించుకోవచ్చు. టైలరు పాఠశాలకు వచ్చి ప్రతి విద్యార్థి నుంచి కొలతలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత ఎస్‌ఎంసీలదే. ఇదీ ప్రభుత్వ ఉత్తర్వు. జరుగుతోందిలా ‘యూనిఫాం కుట్టే బాధ్యతను స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి ఫలానా సంస్థకు ఇవ్వమని చెప్పాడు. ఈ విషయంలో ఎవరైనా కాదు గీదంటే మీఇష్టం. మీరే ఇబ్బంది పడతార’ంటూ కొందరు మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ ప్రధానోపాధ్యాయులకు చెబుతున్న మాటలివి. అధికారులే పట్టించుకోనప్పుడు తమకు ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుంటూ వారు కూడా ఎంఈఓలు చెప్పినవారికి కుట్టు బాధ్యత అప్పగిస్తున్నారు. ఎస్‌ఎంసీలదే బాధ్యత గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి యూనీఫాం విషయంలో ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. నేరుగా స్కూల్ పాయింట్‌కే క్లాత్ పంపిణీ చేసింది. హెచ్ఎం, ఎస్ఎంసీ ఆమోదం మేరకు స్థానికంగా ఉండే టైలర్లతో యూనీఫాం కుట్టించాలి. ప్రతి విద్యార్థి నుంచి కొలతలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే హెచ్ఎం, ఎంఈఓలు ఇబ్బంది పడతారు. - మధుసూదన్‌రావు ఎస్ఎస్ఏ పీఓ -
విషాహారం తిని 150 విద్యార్థులకు అస్వస్థత
ఒడిస్సా: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్కూలు యాజమాన్యం పంచిన మిఠాయిలు తినడం విద్యార్థుల పాలిట శాపమైంది. కలుషితమైన స్వీట్లు తినడంతో 150 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన ఒరిస్సాలోని సోరో పోలీస్ స్టేషన్ పరిధిలో 40కిలోమీటర్ల దూరంలో ఉన్న బనాభిషన్పూర్ స్కూల్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని జాతీయా పతకాన్ని ఎగురవేసినా అనంతరం విద్యార్థులకు ఆ స్కూలు యాజమాన్యం మిఠాయిలను పంచింది. మిఠాయిలు తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు వాంతులు, వికారం కలిగి తీవ్ర అస్వస్థకు గురైయ్యారు. కొందరి విద్యార్థుల పరిస్థితి విషమించడంతో వారి తల్లిదండ్రులు బాలసోర్ ఆస్పత్రికి తరలించారు. స్కూలు యాజమాన్యం పంచిన స్వీట్లు తినడంవల్లే పిల్లల పరిస్థితి ఇలా అయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను పరిశీలించిన అక్కడి వైద్యులు అనూప్ ఘోష్ విషపూరితమైన మిఠాయిలు తినడంవల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు చెప్పారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు చెప్పారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి పూర్తిగా విషమించడంతో వారిని ప్రథమ చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యబృందాన్ని స్కూలుకు పంపినట్టు అనూప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
యాజమాన్య నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం
-
కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
-
కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిలల్లాడుతున్నారు. ఉక్కపోత ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఉడికించేలా వేడిగాలులు ఊపిరాడకుండా చేస్తున్నాయి.మూడు రోజులుగా అనూహ్యంగా వాతావరణంలో మార్పులతో బెంబేలెత్తిపోతున్నారు. రోడ్ల మీదకు రావాలంటే భయపడుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. విపరీతమైన వడగాలులు, ఉక్కపోతతో తూర్పు గోదావరి జిల్లాలో 13మంది, విశాఖలో 8మంది మృతి చెందారు. వడగాల్పులు, పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విశాఖ జిల్లాలో పాఠశాలను ఒక్కపూటే నడపాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో శుక్రవారం, శనివారం పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో సెలవు ప్రకటించారు. -
విశాఖలో లెక్కల మాస్టారి తిక్కవేషాలు
విశాఖపట్నం: చిన్నారులపై కీచకల పరంపర కొనసాగుతోంది. విద్య నేర్పాల్సిన గురువులే దారితప్పి ప్రవర్తిస్తున్నారు. కీచక టీచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా విశాఖ జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని లెక్కల మాస్టారు వేధింపులకు పాల్పడుతున్న ఘటన ఊర్వశి జంక్షన్‌లోని న్యూటన్ స్కూల్లో చోటుచేసుకుంది. విద్యార్థిని కీచక మాస్టర్ వేధింపులు భరించలేక చివరికి మాస్టర్ గారి తిక్కవేశాల గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, స్థానికుల సహాయంతో కీచక టీచర్‌కు దేహశుద్ధి చేశారు. విద్యార్ధులపై వేధింపులకు గురిచేసిన టీచర్‌పై చర్య ఎందుకు తీసుకోలేదంటూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. అయినా స్కూలు యాజమాన్యం పట్టించుకోవటం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. -
డీఈవోకు టీచర్ల సరెండర్
మర్రిపల్లి హెచ్ఎం సంచలన నిర్ణయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ సమాచారం ఉలిక్కిపడిన విద్యాశాఖ అధికారులు విచారణ జరిపిన డెప్యూటీ డీఈవో సాక్షి, కరీంనగర్ : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లను డీఈవోకు సరెండర్ చేయడం విద్యాశాఖలో కలకలం సృష్టించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా మండల విద్యాధికారి, మండల అభివృద్ధి అధికారి, ఉపవిద్యాధికారితోపాటు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికే కాకుండా ఏకంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి కూడా సమాచారాన్ని పంపడం ఉపాధ్యాయవర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఈ ఘటనపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపారు. వేములవాడ మండలం మర్రిపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్రం బోధించే లచ్చిరెడ్డి, భౌతికశాస్త్రం చెప్పే లక్ష్మీనారాయణ అనే స్కూల్ అసిస్టెంట్లు సరిగా పనిచేయడం లేదని, పాఠాలు చెప్పడంలేదని, ప్రశ్నపత్రాలను దిద్దడంలేదని పేర్కొంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యాంసుందర్ వారిని డీఈవోకు సరెండర్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు డీఈవోకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రస్థాయి అధికారులకు ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా పంపించారు. పనిచేయని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే విచక్షణాధికారం ప్రధానోపాధ్యాయులకు ఉంటుందని, ఆ అధికారంతోనే తాను ఈ చర్యకు పూనుకున్నానని శ్యాంసుందర్ అధికారులకు వివరించినట్టు తెలుస్తోంది. తమ పాఠశాలలో పనిచేసే వారిపై ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవచ్చా లేదా అన్న అంశం అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటి ఉదంతం గతంలో ఎక్కడా జరగకపోవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ వ్యవహారంపై సిరిసిల్ల ఉపవిద్యాధికారి కిషోర్ విచారణ జరిపారు. విచారణలోనూ తన విచక్షణాధికారం మేరకే వ్యవహరించానని శ్యాంసుందర్ చెప్పినట్టు తెలుస్తోంది. నివేదిక ఇచ్చా : డెప్యూటీ డీఈవో సరెండర్ వ్యవహారంపై మర్రిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి స్టేట్మెంటును తీసుకుని డీఈవోకు నివేదిక ఇచ్చినట్టు సిరిసిల్ల డెప్యూటీ డీఈవో కిషోర్ తెలిపారు. ఇద్దరు ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేదని పేర్కొంటూ ఆయన సరెండర్ ఉత్తర్వులు ఇచ్చారని, ఆయనకు సరెండర్ చేసే అధికారాలు ఉండవని అన్నారు. ఉపాధ్యాయులు సరిగా పనిచేయకపోతే డీఈవోకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డ స్కూల్ డైరెక్టర్ అరెస్టు
జైపూర్: విద్యార్థినులపై మృగాళ్ల ఆకృత్యాలు అంతకంతకూ శృతి మించితూనే ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులుతో పాటు వారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన స్కూల్ డైరెక్టర్ తప్పుదారి పట్టాడు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ, చివరకు క్రిమినల్ కేసులో చిక్కుకున్నాడు . ఓ విద్యార్థినిపై లైంగిక వేధించాడనే ఆరోపణలతో జోబ్నగర్ పట్టణంలోని ఠాగూర్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ భన్వర్ లాల్ చౌదరినీ సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఠాగూర్ పబ్లిక్ స్కూల్ లో హాస్టల్ లో ఉండి సీనియర్ సెకెండరీ చదువుతున్న విద్యార్థినిని డైరెక్టర్ భనర్వాల్ లైంగిక వేధించసాగాడు. ఆ క్రమంలోనే డి సెంబర్ 13 వ తేదీన విద్యార్థినిపై అత్యాచారం చేయడానికి కూడా యత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అతన్ని అరెస్టు చేసిన పోలీసులు సోమవారం జైపూర్ స్థానిక కోర్టులో ప్రవేశ సెట్టారు. -
వైఎస్ భిక్షతోనే రాజకీయాల్లోకి వచ్చా
సాక్షి, గుంటూరు: విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఆరు నుంచి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు తప్పనిసరి విద్యను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చిన్నారులను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రుల సహకారం కూడా తప్పనిసరి. తల్లిదండ్రులకు బాధ్యతతో పాటు వారిని భాగస్వామ్యం చేసేందుకు రాజీవ్ విద్యా మిషన్ అధికారులు తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపిక చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా మేనేజ్మెంటు కమిటీలను ఏర్పాటు చేసింది. వీరికి శిక్షణనిచ్చేందుకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవగాహన కల్పించేందుకు మెటీరియల్ ముద్రించి ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితేఈ నిధులు అధికభాగం దుర్వినియోగమవుతున్నాయే తప్ప లక్ష్యం నెరవేరడం లేదు. ఇటు రాజీవ్ విద్యామిషన్ అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు స్పందన కరువైంది. జిల్లాలో 3,693 స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి తరగతికి ముగ్గురు పేరెంట్స్‌తో ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్లలో కలిపి మొత్తం 3,693 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు రాజీవ్ విద్యామిషన్ నుంచి ఫండ్ సమకూరుస్తున్నారు. హైస్కూల్ కమిటీకి రూ.17 వేలు, ప్రాథమికోన్నత పాఠశాల కమిటీకి రూ.10 వేలు, ప్రాథమిక పాఠశాలకు రూ.5 వేలు ఇచ్చారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పేరుతో కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. గతేడాది రూ.కోటి ఖర్చు చేశారు. ఈ ఏడాది విద్యాహక్కు చట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఈ తరగతుల నిర్వహణకు బిల్లులు సమర్పించనందున ఖర్చు ఎంతో తేలలేదు. హాజరైన విద్యార్ధుల తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.130 వెచ్చించారు. స్కూల్ మేనేజ్మెంటు కమిటీల శిక్షణ తూతూ మంత్రంగా జరుగుతుందని విద్యా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొక్కుబడిగా శిక్షణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐదేళ్లు నిండిన బాలబాలికలు జిల్లాలో 76,252 మంది గుర్తింపు.. ఐదేళ్లు నిండిన బాలబాలికలు జిల్లాలో 76,252 మందిని గుర్తించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. వారిలో 76,057 మందిని పాఠశాలల్లో చేర్పించినట్లు విద్యాశాఖ అధికారుల చెప్పే లెక్కలు విస్మయం గొలుపుతున్నాయని పలువురు పేర్కొనడం గమనార్హం. బడి బయట బాలలు జిల్లాలో ఇంకా వేల సంఖ్యలోనే ఉంటారని అంచనా. ఏది ఏమైనా విద్యాహక్కు చట్టం అమలు మాత్రం బాలా రిష్టాలు దాటడం లేదనేది విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచే వినిపిస్తున్న మాట. -
ఉచితం అడ్రస్సేది?
అధికారుల అనుచిత చర్యల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకాలంలో ఉచిత దుస్తులు అందడంలేదు. కుట్టుపని తమకు కిట్టుబాటు అవుతుందో లేదో చూసుకుని, జేబుల్లోకి వెళ్లే నోట్లను బేరీజువేసుకుని మరీ యూనిఫారాలు కుట్టించే పనిని అధికారులు చేపడుతుండడంతో పిల్లలు పాత, చిరిగిపోయిన దుస్తులతో పాఠశాలకు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడుతోంది. విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఉచిత యూనిఫాం పంపిణీ జిల్లాలో ప్రహసనంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) అధికారులకు, ఎంఈఓలకు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల మధ్య సమన్వయం లోపం వల్ల సకాలంలో దుస్తుల పంపిణీ కావడంలేదు. దీంతో జిల్లాకు మంజూరైన నిధులు బ్యాంకులో మూలుగుతున్నాయి. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యాసంవత్సరం ప్రారంభంలో ఏనాడూ పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. గత ఏడాది ఇవ్వవలసిన దుస్తులను ఈ విద్యా సంవత్సరంలో ఆరు నెలలు గడిచిన తరువాత ఇటీవల పంపిణీ చేశారు. ఇలా ప్రతి ఏడాదీ దుస్తులను ఆలస్యంగా ఇస్తున్నారు. దీన్ని సరిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఏడాది (2013-14)కి సరిపడా దుస్తులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రాజీవ్ విద్యామిషన్ నిధులు విడుదల చేసింది. గత ఏడాది డైస్ ప్రకారం 1-8వ తరగతుల మధ్య ఉన్న 1,75,927 మంది విద్యార్థుల దుస్తుల కోసం రూ. 7.03 కోట్లు ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. అక్టోబర్ చివరి నాటికి ఆప్కో నుంచి వస్త్రాన్ని తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు దాని అడ్రెస్స్లేదు. నవంబర్ ఒకటో తేదీ నుంచి దుస్తులు కుట్టడం ప్రారంభించి డిసెంబర్ మొదటి వారంలోపువిద్యార్థులకు సరఫరా చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదు. ఆప్కో సరఫరా చేసే వస్త్రానికి సంబంధించిన తీర్మానాలను ఎస్‌ఎంసీల నుంచి ఎంఈఓల ద్వారా జిల్లా కేంద్రానికి పంపించాల్సి ఉండగా, చాలా మండలాల నుంచి ఇప్పటి వరకు తీర్మానాలు చేరలేదు. చాలా పాఠశాలల్లో ఎస్ఎంసీలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో సుమారు 90 పాఠశాలల్లో ఇప్పటి వరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఎస్‌ఎంసీల నుంచి ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత వస్త్రం కొనుగోలు చేస్తామని, ఆ తరువాత దుస్తుల కుట్టించే బాధ్యతను ఎస్‌ఎంసీలే వహిస్తాయని ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు. దీని కోసం ఆర్వీఎం రాష్ట్రస్థాయి అధికారులు పెట్టిన గడువు డిసెంబర్ మొదటి వారంతో పూర్తయింది. అయితే ఇంకా 10 మండలాల నుంచి ఎస్ఎంసీ తీర్మానాలు రావాల్సి ఉంది. ఎస్ఎంసీలను ఎప్పుడు నియమిస్తారో, తీర్మానాలు ఎప్పుడు చేస్తారో, వస్త్రాన్ని ఎప్పుడు కొనుగోలుచేస్తారో, ఎప్పుడు కుట్టిస్తారో, యూనిఫాంలు ఎప్పుడు పంపిణీ చేస్తారో పైవాడికే తెలియాలి. గత ఏడాది పరిస్థితి యూనిఫాంలు కుట్టించడంలో గత ఏడాది కూడా తీవ్ర జాప్యం నెలకొంది. కొంతమంది ఎంఈఓలు తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు యూనిఫాం కుట్టే పనిని అప్పగించి అరకొరగా సరఫరా చేయడంతోపాటు పంపిణీలో జాప్యం నెలకొంది. తొలుత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ఆప్కోకి ఇచ్చిన తీర్మానాలను ఎంఈఓలు, జిల్లా అధికారులు తిరస్కరించారు. రాజకీయ ఒత్తిడితో స్థానిక ప్రైవేటు ఏజెన్సీకి దుస్తుల పంపిణీని అప్పగించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో ద్వారా వస్త్రం తెప్పించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా గత ఏడాది కొంతమంది ఎంఈఓలు స్థానిక దుకాణదారులతో కుమ్మక్కై వారి ద్వారా వస్త్రాన్ని తెప్పించారు. దీంతో దుస్తుల సరఫరాలో సహజంగానే జాప్యం జరిగింది. వాటిని ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో పంపిణీ చేశారు. -
సీమాంధ్రలో స్కూళ్లకు సెలవుల్లేవు!
సమ్మెకాలం సర్దుబాటు కోసం ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైద రాబాద్: పాఠశాలలకు ఈసారి క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ప్రాంతాల వారీగా వేరువేరుగా ఉండబోతున్నాయి. సీమాంధ్రలోక్రిస్‌మస్, సంక్రాంతి సెలవులు రద్దుకాగా, తెలంగాణలో డిసెంబర్ 24 నుంచి క్రిస్మస్ సెలవులు ఉంటాయి.సీమాంధ్రలో మాత్రం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 25న (క్రిస్మస్ రోజున) మాత్రమే సెలవు ఇస్తారు.మిగతా రోజుల్లో స్కూళ్లు పనిచేస్తాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక నాన్ మిషనరీ స్కూళ్లకు జనవరి 8 నుంచి 17 వరకు ఇచ్చే సంక్రాంతి సెలవులను కూడా సీమాంధ్రలో ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం పండుగ రోజే సెలవు ఉంటుంది. తెలంగాణ జిల్లాల్లో మాత్రం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు, మిగతా స్కూళ్లకు సంక్రాంతి సెలవులు యథావిధిగా వర్తిస్తాయని విద్యాశాఖ తెలిపింది. సమ్మెకాలాన్ని పనిదినాలుగా సర్దుబాటు చేయడంతో సీమాంధ్రలో సెలవులు రద్దయ్యాయని విద్యాశాఖ పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లోనే అర్ధవార్షిక పరీక్షలు సీమాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి సెల వులు రద్దు చేసినందున జనవరి 8 నుంచి 17 మధ్యలో అర్ధవార్షిక పరీక్షలు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. తెలంగాణ జిల్లాల్లో మాత్రం డిసెంబర్ 16 నుంచి 21 వరకు యథావిధిగా అర్ధవార్షిక పరీక్షలు జరుగుతాయి. జూ.కాలేజీలకు జనవరి 11 నుంచి సెలవులు జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. అయితే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో మాత్రం 13, 14, 15 తేదీల్లో మాత్రమే సెలవులుంటాయి.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లెక్చరర్లు సమ్మె చేసినందున నష్టపోయిన పనిదినాలను సెలవు దినాల్లో సర్దుబాటు చేస్తున్నారు. దీంతో సెలవులను మూడు రోజులకే ఇంటర్ బోర్డు కుదించింది.